dragon
-
ఎన్టీఆర్ డ్రాగన్‌లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి. -
కర్ణాటకకు డ్రాగన్?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల మూడో వారంలో ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.కర్ణాటక లొకేషన్స్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని టాక్. ఇక విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను పూర్తి చేసుకుని, ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు ఎన్టీఆర్. సో... ఈ నెలాఖర్లో ‘డ్రాగన్’ మూవీ కోసం ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తారని ఊహించవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ హిందీలో ‘వార్ 2’ అనే మూవీ చేస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చలో మెక్సికో
మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nuclear test: డ్రాగన్‌పై అణుమానాలు!
డ్రాగన్ దేశం మళ్లీ అణు పరీక్షలకు సిద్ధపడుతోందా? అందుకోసం చాపకింద నీరులా కొన్నేళ్లుగా క్రమంగా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తోందా? ఏ క్షణంలోనైనా భారీ స్థాయిలో అణు పరీక్షలు చేపట్టనుందా? అంటే అవుననే అంటోంది తాజా పరిశోధన ఒకటి. అణు నిరాయు«దీకరణ చర్యలను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయతి్నస్తున్న ఈ తరుణంలో చైనా తాజా చర్యలు కలకలం రేపుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ పోటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి... అది వాయవ్య చైనాలోని మారుమూల జిన్జియాన్ అటానమస్ ఏరియా. అక్కడి ఓ ప్రాంతంలో కొన్నేళ్లుగా పలురకాలుగా హడావుడి పెరుగుతూ వస్తోంది. రకరకాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొండల్ని తొలిచి సొరంగాల్లాంటివి వేసే పనులూ సాగుతున్నాయి. ఇంకోవైపు కొత్త వైమానిక స్థావరం నిర్మాణంలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్నపాటి శాటిలైట్ టౌన్ పుట్టుకొస్తోంది. బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఈ కార్యకలాపాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్ రెనీ బాబియార్జ్ బయట పెట్టిన ఉపగ్రహ చిత్రాలతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇవన్నీ జరుగుతున్నది 1964లో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపిన లోప్‌నూర్ ప్రాంతంలో కావడమే అందుకు కారణం! త్వరలో భారీ ఎత్తున అణు పరీక్షలకు చైనా సిద్ధమవుతోందనేందుకు ఇవన్నీ తిరుగులేని ఆధారాలని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాజీ విశ్లేషకుడు కూడా అయిన రెనీ లోప్‌నూర్‌లో కార్యకలాపాలకు సంబంధించి కొన్నేళ్లుగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను లోతుగా పరిశీలించారు. ఆ మీదట ఆయన అందజేసిన సాక్ష్యాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. పక్కాగా ఏర్పాట్లు...!: న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని అభూత కల్పనగా చైనా కొట్టిపారేసింది. ఏదేదో ఊహించుకుని రాసిన నిరాధార కథనంగా దాన్ని అభివరి్ణంచింది. కానీ ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసిన విషయాలు మాత్రం చైనా కచి్చతంగా ఏదో దాస్తోందనేందుకు ఊతమిస్తున్నాయి. ఎందుకంటే ఒకట్రెండు శిథిల భవనాలు తప్ప 2017 దాకా నిద్రాణావస్థలోనే ఉన్న లోప్‌నూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లలో అత్యాధునిక భవనాల భవన సముదాయాలు పుట్టుకొచి్చన వైనం ఆ చిత్రాల్లో స్పష్టంగా కని్పస్తోంది. అంతేగాక నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన ఓ పటిష్టమైన బంకర్ కూడా ఉందక్కడ. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు తదితరాలు కూడా కొట్టొచ్చినట్టు కని్పస్తున్నాయి. వీటితో పాటు ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్ పైపులు కూడా ఉన్నాయి. దాని సాయంతో బహుశా నేలలోకి నిలువుగా కనీసం పావు మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారన్నది బాబియార్జ్ అంచనా. లోప్నూర్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మలాన్ ప్రాంతంలో కూడా ఓ అత్యాధునిక శాటిలైట్ సిటీ నిర్మాణంలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అక్కడ కూడా రిగ్గింగ్ యంత్రాలు తదితర సెటప్ కనబడుతోంది. ఇదంతా బహుశా లోప్‌నూర్ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో ముందస్తు శిక్షణ కోసమని భావిస్తున్నారు. ప్రాంతీయ భద్రతకు ముప్పే చైనా అణు దూకుడు ఆసియాలో ప్రాంతీయ భద్రతను కూడా ప్రమాదంలో పడేసే పరిణామమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇది మరీ ఇబ్బందికర పరిణామమే కానుంది. 1998 ఫోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం వాటిపై భారత్ స్వీయ నిషేధం విధించుకోవడం తెలిసిందే. అణు పరీక్షలు ఎందుకంటే... చైనా అణు పరీక్షలకు దిగనుండటమే నిజమైతే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకు రక్షణ నిపుణులు పలు కారణాలను చూపుతున్నారు.... ► అణు కార్యకలాపాల విషయంలో కొద్దికాలంగా చైనా దూకుడు పెంచింది. ► దశాబ్దం క్రితం దాకా దానివద్ద కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి. ► వాటిని 2028 కల్లా ఏకంగా 1,000కి పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవలే పెంటగాన్ వార్షిక నివేదిక వెల్లడించింది. ► వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా చైనా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. ► ఈ దిశగా కొంతకాలంగా పలు అత్యాధునిక అణు వార్హెడ్లను చైనా తయారు చేస్తోంది. ► వాటిని అధునాతన ఖండాంతర, క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది. ► ఆ వార్హెడ్లను పూర్తిస్థాయిలో పరీక్షించి సరిచూసుకునే ఉద్దేశంతో డ్రాగన్ దేశం ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అనుమానిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్లూ సీ డ్రాగన్! అందంగా ఉందని టచ్ చేస్తే అంతే!
బ్లూసీ డ్రాగన్లు(గ్లాకస్ అట్లాంకస్) ఒక రకమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని బీచ్ తీరానికి సమీపంలో కనిపించాయి. ఇవి చూడటానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తునంది. కానీ టచ్ చేశారో ఇక అంతే. చెన్నైని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను బీభత్సానికి బీచ్‌కి కొట్టుకొచ్చి ఉండవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువుగా సముద్రం ఉపరితలంపైనే సంచరిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవని. ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా మారుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్‌కుమార్ ఈ జీవులను బీచ్‌లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జి సమీపంలో ఈ బ్లూసీ డ్రాగన్ సముహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరూ వీటి కారణంగా బాధతో విలవిల లాడి ఉన్నారని, మరికొందరు ఇసుకలో చనిపోయిన ఉండటాన్నికూడా చూసినట్లు వెల్లడించారు వత్సన్. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుపాను సమయాల్లోనే ఒడ్డుకు నెట్టబడటంతో కనిపించడం జరుగుతుందని శాస్త్రవేత్త కిజాకుడన్ అన్నారు. ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవని, బీచ్‌ల వద్దకు వచ్చేవాళ్లకు ఇవి ప్రమాదం కలిగిస్తాయని అన్నారు. అంతేగాదు బీచ్‌ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరించారు కూడా. ఈ బ్లూ సీ డ్రాగన్(నీలిరంగు డ్రాగన్)ని పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ (ఫిసాలియా ఫిసాలిస్), మ్యాన్-ఆఫ్-వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ' వార్ లేదా బ్లూబాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజాకుడన్ వెల్లడించారు. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారత నగరాలు ఇవే!) -
చైనా ముంగిట మాంద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై?
చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తేనుందా? చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? ఇటువంటి ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా తన ఉనికిని నేపాల్ నుండి శ్రీలంక వరకు విస్తరించడం, ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహ హస్తాన్ని కూడా చాచుతోంది. ఆర్థికవృద్ధికి ఇంతలా తాపత్రయ పడుతున్న చైనా విజయం సాధిస్తుందా? చైనా ప్రాపర్టీ రంగంలో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా మాజీ సీనియర్ ఎన్బిఎస్ అధికారి హె కెంగ్ తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో మూడు వందల కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అన్నారు. డాంగ్-గ్వాన్ చైనాలోని ఒక నగరం. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య చైనా జనాభా కంటే రెట్టింపులో ఉందని కెంగ్ తెలిపారు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్థితిలో ఉన్నాయి. అంటే 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ డేటా ఆగస్టు 2023 నాటిది. ఈ ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదని అన్నారు. ఇలాంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదకలు చెబుతున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 21.3 శాతం మంది యువత ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చైనాకు చాలా నష్టం వాటిల్లింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పు కూడా భారీగానే ఉంది. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నది. మరోవైపు దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీలపై నిబంధనల కఠినతరం మొదలైనవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. తాజాగా చైనా తన విధానాలలో మార్పు కోరుకుంటుంది నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఏడు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు అర్థమైవుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. అయితే చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
డ్రాగన్ ఫ్రూట్ లో అధికపోషకాలు ఉంటాయి
-
డ్రాగన్ ఫ్రూట్ కు ఫుల్ డిమాండ్...!
-
డ్రాగన్ ఫ్రూట్ సాగులో పెట్టుబడి, శ్రమ రెండూ తక్కువే
-
83 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తున్న సంగారెడ్డి రైతు
-
నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు
యూఎస్‌లోని ఓ నైట్ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షోని నిలపేసి ప్రేక్షకులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది నిర్వాహణ సంస్థ. ఈ ఘటన కాలిపోర్నియాలోని చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో జరిగిన నైట్ షోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో టామ్ సాయర్ ద్వీపం సమీపంలోని థీమ్ పార్క్ వద్ద జరిగే ఫ్యాంటాస్మిక్ ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపేశారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది నిర్వాహక సంస్థ. శనివారం సాయంత్రం డిస్నీల్యాండ్ పార్క్‌లో ఫ్యాంటాస్మిక్ చివరి ప్రదర్శన సమయంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆకర్షణగా ఉండే 24 అడుగుల జెయింట్ డ్రాగన్ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అనుహ్య ఘటనతో నిర్వాహకులు ప్రదర్శనను నిలిపేసి ప్రదర్శనలిచ్చే నటీనటులందర్నీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ద్వీపం అంతా హుటాహుటినా ఖాళీ చేయించారు. ఐతే ఈ ఘటనలో ఎవరూ ఎలాంటి గాయాల బారిన పడలేదు కానీ ఎంతమేర అగ్నిప్రమాదం సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ప్రదేశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఫ్యాంటాస్మిక్ అనేది 27 నిమిషాల ప్రత్యక్ష ప్రదర్శన. దీన్ని 1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాణసంచా, రంగురంగుల నీటి ప్రదర్శన తోపాటు లైవ్లోన నటులు పైరోటెక్నిక్‌లు, లేజర్లు, సంగీతం వంటి ప్రదర్శనలిస్తారు. Fantastic Fantasmic fail - wow! #fantasmic #disneyland pic.twitter.com/MZhNJhEXrB — JessicaT (@Ms_JessicaT) April 23, 2023 (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!) -
వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా!
...వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా! -
Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా?
బిర్యానీ, దోశ, స్వీట్స్.. ఇలా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం.. హా ఇంట్లో వండుకొని తింటాం అంటారా.. కానీ ఇప్పుడంతా ఏమంటున్నారో తెలుసా..? వండుకునేంత టైం లేదండీ ఆన్లైన్లో ఫుండ్ ఆర్డర్ చేసుకొని లాగించడమే అని అంటున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ప్రిపరేషన్, డెలివరీ బాయ్ పికప్, ఆర్డర్ డెలివరీ ఎప్పుడు అవుతుందో ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా డెలివరీ ట్రాకింగ్ ఇంటర్ ఫేస్‌లో బైక్‌పై వ్యక్తి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్లు చూపిస్తుంది. తాజాగా స్విగ్గీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్‌ను తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాకింగ్‌లో డెలివరీ పార్ట్నర్ బైక్ ప్లేస్‌లో స్విగ్గీ డ్రాగన్‌గా మార్చింది. చదవండి: Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. స్విగ్గీలో ఆర్డర్ ట్రాకింగ్‌లో ‘ఆకలితో ఉండకండి. మా డ్రాగన్ మీ ఫుడ్‌ను డెలివరీ చేస్తాడు’ అనే ట్యాగ్‌లైన్‌తో కనిపిస్తోంది. అంటే మన ఆర్డర్‌ను డ్రాగన్ డెలివరీ చేస్తున్నట్లు కస్టమర్లు ఫీల్ అయ్యేలా ఆలోచన చేసింది. ఇక స్విగ్గీలో కొత్తగా హౌజ్ ఆఫ్ డ్రాగన్ థీమ్ కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆర్డర్ ట్రాకింగ్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్విగ్గీ క్రియెటివిటీని మెచ్చుకుంటున్నారు. చదవండి: చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
Ram Gopal Varma: అందుకే అమ్మాయి టైటిల్ పెట్టాం
‘‘హాలీవుడ్ వాళ్లు తీసిన సినిమాలను మనం ఇక్కడ చూశాం. కానీ వాళ్లు ఎప్పుడూ పాన్ వరల్డ్ అని చెప్పుకోలేదు. ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు హిట్ అయితే మనం పాన్ ఇండియా అంటున్నాం. నార్త్, సౌత్ అని కాదు. సినిమా సినిమాయే. ఏడాదికి మనం వెయ్యి సినిమాలు తీస్తే అందులో ఫ్లాప్ అయిన పెద్ద సినిమాలు కూడా ఉంటున్నాయి’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లడ్కీ’ చిత్రం తెలుగులో ‘అమ్మాయి: డ్రాగన్ గర్ల్’ అనే టైటిల్‌తో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు. ►‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాను 27 సార్లు చూశాను. దీంతో ‘బ్రూస్ లీ’ ప్రభావం నాపై పడింది. మార్షల్ ఆర్ట్స్ అనగానే మనవాళ్లు డూప్‌లు, వీఎఫ్ఎక్స్లు వాడతారు. కానీ ‘అమ్మాయి’ చిత్రంలో అలాంటివి ఏవీ లేవు. పూజలాంటి ఓ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయి ఏం చేయగలదో అదే సినిమాలో చేయించాను. ►ఒక మార్షల్ ఆర్ట్స్ అమ్మాయికి బ్రూస్ లీ అంటే పిచ్చి. ఓ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ప్రేమ. బ్రూస్ లీ మీద ఆ అమ్మాయికి ఉన్న పిచ్చి అభిమానం ఆమెకే ప్రమాదం అని గ్రహించిన ఆ యువకుడు ఆమెను బ్రూస్ లీ మాయలో నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది కథలోని ఒక భాగం. ►ఓ ఆరడుగుల అబ్బాయిని ఓ అమ్మాయి కొట్టిపడేసిందంటే అందరూ ఓ అమ్మాయి ఇలా చేసిందా? అని ఆశ్చర్యపోతారు. అమ్మాయి అంటే మగాడి మీద ఆధారపడుతూ, సిగ్గు పడుతూ ఉండాలి కదా అన్నట్లుగా కొందరు ఆలోచిస్తారు. కానీ అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరు అని చెప్పడానికే ఈ సినిమాకు ‘అమ్మాయి’ టైటిల్ పెట్టాం. ►‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమాను కాపీ కొట్టి ‘శివ’ సినిమా తీశాను. ఈ సినిమాలోని రెస్టారెంట్ ప్లేస్‌లో నేను కాలేజీ పెట్టి ‘శివ’ అనే సినిమా తీశాను. సేమ్ స్క్రీన్ ప్లే. ►నా తర్వాతి చిత్రంగా అల్‌ఖైదా ఉగ్రవాది మమ్మద్ ఆట్టా బయోపిక్ తీయనున్నాను. -
డ్రాగన్.. ‘ఫల’కరింపు
సాక్షి, తుని(తూర్పుగోదావరి): అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనుకోలేదాయన.. ఫ్రూట్‌ఫుల్‌గా ఉండే డ్రాగన్ సాగుపై దృష్టిసారించారు. ఔషధగుణాలు అధికంగా ఉండే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్లి అక్కడ సాగవుతున్న పంటను వారం రోజుల పాటు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకుని ఎస్.అన్నవరంలో తనకున్న 2.40 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయనే తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రామారావు (టైల్స్ రామారావు). ఒకసారి నాటితే మూడేళ్ల నుంచి 25 ఏళ్లు ఏకధాటిగా (ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు) డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయాన్ని పొందవచ్చని ఆయన చెబుతున్నారు. దీని సాగుకు మెట్ట ప్రాంత నేలలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. సాగు ఇలా.. ఆరు అడుగులు ఎత్తులో చక్రాకారంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లభించిన మట్టల నుంచి సేకరించిన విత్తనాన్ని సిమెంట్ స్తంభాల చట్టూ నాలుగైదు నాటుకోవాలి. మూడు నెలల్లో సిమెంట్ స్తంభాలకు విస్తరిస్తుంది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయం లభిస్తుంది. విస్తారంగా ఫలసాయాన్ని పొందేందుకు నవంబరు, ఫిబ్రవరి మధ్యకాలంలో వచ్చే పూతను రైతులు ఎప్పటికప్పుడు తొలగించడం ఉత్తమం. దీంతో ఫిబ్రవరి నుంచి అధికంగా ఫలసాయం లభించనుంది. తొమ్మిది నెలల్లో ఎకరాకు నాలుగు నుంచి పది టన్నులు డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తాయి. చీడపీడలు ఆశించకపోవడంతో రసాయనక ఎరువులు, మందులు వాడాల్సిన పనిలేదు. విస్తారంగా పంట విరబూసేందుకు గో మూత్రం, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాల పిచికారీ, కలుపు నివారణ, వేసవిలో రెండు రోజులకు డ్రిప్ పద్ధతిలో ఒక తడుపు వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎండవేడిమిని అదుపు చేసేందుకు డ్రాగన్ ఫ్రూట్ చక్రాకార సిమెంట్ స్తంభాలను ఆనుకుని సీతాఫలం మొక్కలు వేసుకోవడం మంచిది. ఫ్రూట్ తొలగించిన రెబ్బలు (మట్టలు) నుంచి రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. విత్తనాన్ని విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అబ్బురపరిచే ఔషధ గుణాలు పుచ్చకాయ మాదిరిగా తియ్యని రుచి కలిగిన డ్రాగన్ ఫ్రూట్స్‌లో అబ్బుర పరిచే ఎన్నోపోషక విలువలు ఉన్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణ, తెల్లరక్త కణాలు, ప్రేగుల్లో మంచి చేసే 400 రకాల బ్యాక్టీరియాల వృద్ధి, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, మలబద్ధకాన్ని నివారించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణాశయ రుగ్మతలు తొలగించే పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డ్రాగన్ ప్రూట్స్కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. రూ.15 లక్షల పెట్టుబడి డ్రాగన్ ఫ్రూట్స్‌కు ఉన్న డిమాండ్‌తో సాగు చేయాలన్న ఆసక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో వారం రోజులు పంటను పరిశీలించి, సాగు, సంరక్షణ, సస్యరక్షణ తదితర విషయాలపై అవగాహన వచ్చింది. సీజన్లో ఎకరానికి నాలుగు నుంచి పది టన్నులు దిగుబడి, రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాను. ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకువచ్చాను. 2.40 ఎకరాల్లో 12 వందల వలయాకార సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి రూ.15 లక్షలు పెట్టుబడితో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాను. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నాను. తొలి పంట ఫలసాయం 2022 ఫిబ్రవరిలో లభించనుంది. డ్రాగన్ ఫ్రూట్స్ రుచులను స్థానికులకు అందించాలన్న ఆలోచనతో వ్యాపారులతో ఒప్పందాలకు అంగీకరించలేదు. – పోలిశెట్టి రామారావు, అభ్యుదయ రైతు, తుని -
ఈ విషయం తెలిస్తే చైనా ఆగుతుందా
సాక్షి, నూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన, అబ్బురపరిచే విషయాల గురించి అందరికి తెలుస్తున్నాయి. ట్విటర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తెలిసే ఉంటారు. అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సుశాంత నంద. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు చేసే కామెంట్స్ చూస్తే.. విరగబడి నవ్వుతారు. ఇంతకు ఆయన షేర్ చేసిన ఫోటో.. ఆ వివరాలు.. (చదవండి: వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు) సుశాంత నంద తన ట్విటర్లో శనివారం ఓ ఫోటోని షేర్ చేశారు. సడెన్‌గా చూస్తే.. అది డ్రాగన్ ఫోటోనో, పెయింటింగో అనిపిస్తుంది. కానీ కాదు. అది పోర్చుగల్‌లో ప్రవహిస్తున్న ఓ నది. ఆకాశం నుంచి చూస్తే.. అది అచ్చాం డ్రాగన్ మాదిరే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజనులు చేసే కామెంట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. (చదవండి: ‘ఒకే ఫ్రేమ్‌లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్‌గా ఉన్నారు’) ‘‘ఈ ఫోటోని చైనా వాడు చూస్తే.. మా డ్రాగన్లకు పోర్చుగల్ సంతోనోత్పత్తి కేంద్రంగా ఉంది. కనుక ఆ దేశం కూడా మాకు చెందినదే అంటుంది’’.. ‘‘ఇప్పటి నుంచి పోర్చుగల్ కూడా మా దేశంలో భాగమే. వారిని మాలో కలుపుకుంటాం అంటుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!) When river look like a dragon... From Portugal. 🎬Faces in Things pic.twitter.com/0NWYPsXLQZ — Susanta Nanda (@susantananda3) November 27, 2021 -
పురాతన మనిషికి, మనకు మధ్య ‘డ్రాగన్ మ్యాన్’
ఆరేడు అడుగులకుపైనే ఎత్తు.. పెద్ద పెద్ద కళ్లు.. పెద్ద మెదడు.. బలమైన శరీరం.. అతనో ‘డ్రాగన్ మ్యాన్’. ఇప్పుడున్నట్టు పూర్తి స్థాయి మనిషి కాదు.. అలాగని ఒకనాటి అడవి జీవి వంటివాడూ కాదు. మనకు, పురాతన మానవులకు మధ్యలో వారధి అతడు. మొదట్లో మనుషులు ఎలా ఉండేవారు? ఏం చేసే వారు అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సినిమాటిక్‌గా దొరికాడు. ఈ ‘డ్రాగన్ మ్యాన్’ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ‘డ్రాగన్ మ్యాన్’ వెనుక చాలా కథ ఉంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్లో చరిత్ర ఉంది. 1933లో చైనాలో చాలా భాగం జపాన్ ఆక్రమణలో ఉండేది. జపాన్ పరిశోధకులు చైనా ఉత్తర ప్రాంతంలో హేలోంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లోని హర్బిన్ పట్టణం వద్ద పురావస్తు తవ్వకాలు చేపట్టారు. చైనాకు చెందిన ఒకాయన (పేరును వెల్లడించలేదు)ను లేబర్ కాంట్రాక్టర్‌గా పెట్టుకున్నారు. ఆయన స్థానిక పనివాళ్లను తెచ్చుకుని తవ్వకాలు జరిపేవాడు. ఈ సందర్భంగా ఓసారి పురాతన పుర్రె ఒకటి బయటపడింది. ఆక్రమణదారులకు దానిని ఇవ్వడం ఇష్టం లేని చైనా కాంట్రాక్టర్.. పుర్రెను తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు. సంపదను అలా పాతి దాచుకోవడం చైనాలో ఓ సాంప్రదాయం. అలా ఆ పుర్రె 85 ఏళ్లు బావిలోనే ఉండిపోయింది. ఆయన చనిపోయే ముందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు ‘నిధి’ వేటకు బయలుదేరారు. చాలా ఏళ్లు గడిచిపోవడంతో.. ఆయన చెప్పిన ఆనవాళ్లను, మారిన పరిస్థితులను లింక్ చేసుకుంటూ వెతకడం మొదలుపెట్టారు. చివరికి 2018లో ఆ పుర్రెను తవ్వి తీశారు. కొద్దిరోజుల తర్వాత చైనాలోని హెబీ జియో యూనివర్సిటీ మ్యూజియానికి అందజేశారు. పుర్రె ‘చరిత్ర’ను తెలుసుకున్న అధికారులు.. శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వడంతో దాని ప్రాధాన్యత ఏమిటో బయటపడింది. పెద్ద కనుబొమ్మలు.. పెద్ద మెదడు కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు తెచ్చిన పుర్రెను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా గుర్తించని కొత్త జాతికి చెందినదని తేల్చి పరిశోధన చేపట్టారు. మానవ జాతికి చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాతికి ‘హోమో లోంగి’అని.. ముద్దుగా ‘డ్రాగన్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ స్ట్రింగర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘మానవ జాతికి పూర్వీకులుగా ఇప్పటివరకు భావిస్తున్న అన్ని జాతుల్లోనూ మెదడు, కళ్లు బాగా చిన్నగా ఉంటాయి. కానీ ఈ కొత్త జాతిలో మెదడు ఆధునిక మానవుల కంటే కాస్త పెద్దగా ఉంది. కళ్లు, ముక్కు, దవడలు, దంతాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముఖం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంది. దవడ ఎముకల నిర్మాణం కూడా ఆధునిక మానవుల తరహాలో ఉంది. తల నిర్మాణాన్ని బట్టి ఆరేడు అడుగుల ఎత్తుతో, బలిష్టమైన శరీరంతో ఉండి ఉండొచ్చు. అయితే కనుబొమ్మల ప్రాంతంలో పుర్రె ఉబ్బెత్తుగా ఉంది. ఇది చాలా విచిత్రం. అది వానరాల నుంచి మనుషులు అభివృద్ధి చెందడం మొదలైన పురాతన కాలం నాటి లక్షణం’’ అని తెలిపారు. ఎవరీ డ్రాగన్ మ్యాన్..? ఈ డ్రాగన్ మ్యాన్ పుర్రెను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అది లక్షా 46 వేల సంవత్సరాల కిందటిదని తేల్చారు. సుమారు 50 ఏళ్ల వయసులో మరణించిన మగవాడి పుర్రెగా అంచనా వేశారు. ఆధునిక మానవులకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉండటంతోపాటు ప్రిమిటివ్స్ (కోతులు, చింపాంజీల వంటి మూల జాతుల) లక్షణాలు కూడా ‘డ్రాగన్ మ్యాన్’ పుర్రెలో గుర్తించారు. ఈ జాతివారు జంతువులను, పక్షులను వేటాడేవారని, పండ్లు, కూరగాయలను కూడా ఆహారంగా తీసుకునే వారని పరిశోధనలో పాల్గొన్న హెబీ జియో యూనివర్సిటీ శాస్త్రవేత్త క్సిజెన్ ని వెల్లడించారు. పుర్రె దొరికిన ప్రాంతం, పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఈ జాతివాళ్లు కఠినమైన, చలి ఎక్కువగా ఉండే వాతావరణాన్ని కూడా తట్టుకునే వారని అంచనా వేస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ మనుషులకు సోదర జాతి నియండెర్తల్ మానవులే అన్న అంచనాలు ఉన్నాయని.. ఇప్పుడీ డ్రాగన్ మ్యాన్ వల్ల మానవ జాతి పరిణామక్రమంలో మార్పులు చేయాల్సి రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులంతా కూడా హోమో సెపియన్స్ అనే ఆధునిక జాతికి చెందినవారని వివరించారు. పరిణామక్రమంలో సుమారు 70 లక్షల ఏళ్లనాటి నుంచి 40 వేల ఏళ్ల కిందటి వరకు సుమారు 21 జాతుల మానవులు జీవించారని తెలిపారు. -
క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది
స్పేస్ ఎక్స్ ‘క్రూ–3’ మిషన్‌కు నాసా మహిళా వ్యోమగామి కేలా బ్యారన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి దశ నిర్మాణంలో ఉన్న ‘డ్రాగన్’ అనే వ్యోమనౌకలో కేలా, మరో ముగ్గురు పురుష వ్యోమగాములు వచ్చే అక్టోబర్ 23 న అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయల్దేరి వెళ్తారు. అక్కడ కనీసం ఆరు నెలల పాటు పరిశోధనలు జరిపి భూమిని చేరుకుంటారు. ‘క్రూ–3’ కి కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్. నిన్న గాక మొన్న నాసాలోకి వచ్చిన కేలా తన ప్రతిభతో స్పేస్‌లోకి స్పేస్ సంపాదించారు! ‘నాసా’ ప్రభుత్వానిదైతే, ‘స్పేస్ ఎక్స్’ ప్రైవేటు సంస్థ. నాసా వాషింగ్టన్లో ఉంటే, స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండిటి పనీ అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష ప్రయాణాలు. స్పేస్ ఎక్స్‌కి ఇప్పటివరకైతే సొంత వ్యోమగాములు లేరు. నాసా నుంచి, లేదంటే మరో దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుశిక్షితులైన వ్యోమగాములను తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ అనే బిలియనీర్ స్థాపించిన సంస్థ స్పేస్ ఎక్స్. మార్స్‌లోకి మనిషిని పంపేందుకు ప్రయోగాత్మకంగా స్పేస్ ఎక్స్ వేస్తున్న మెట్లే ఈ స్పేస్ షటిల్స్. ఆ మెట్లలోని మూడో మెట్టే ‘క్రూ–3’. ఇందులో నాసా నుంచి కేలా, రాజాచారి (మిషన్ కమాండర్), టామ్ మార్ష్‌బర్న్ (మిషన్ పైలట్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మథియాస్ మారర్ (మిషన్ స్పెషలిస్ట్ 1) ఉంటారు. కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్ 2. స్పేస్ ఎక్స్ ఇలా మార్స్‌కి ఎన్ని మెట్లు కట్టుకుంటూ వెళుతుంది? తెలియదు! మార్స్‌లోకి మనిషిని పంపి, మెల్లిగా మార్స్‌లో మానవ కాలనీలను నిర్మించే ధ్యేయంతోనే ఎలాన్ మస్క్ 2002 లో ఈ సంస్థను నెలకొల్పారు. వ్యోమగాములతో అతడు వేయించే ప్రతి అడుగు, గమ్యమూ చివరికి అంగారక గ్రహమే. వాస్తవానికి స్పేస్ ఎక్స్ వల్ల నాసాకు ఖర్చు, భారం తగ్గాయి. పరిశోధనలకు సమయమూ కలిసివస్తోంది. అందుకే స్పేస్ ఎక్స్‌కి సహాయపడుతోంది. అంతే తప్ప తనకు పోటీ అనుకోవడం లేదు. ∙∙ ఇప్పటికి స్పేస్ ఎక్స్ పంపిన రెండు ‘క్రూ’ మిషన్లలోనూ ఒక్కో మహిళా వ్యోమగామి ఉన్నారు. వారిద్దరి కన్నా వయసులో చిన్న.. ఇప్పుడు ‘క్రూ–3’లో సభ్యురాలిగా ఉన్న కేలా బ్యారన్. ‘క్రూ–1’లో అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగామి షానన్ వాకర్ వయసు 55. ‘క్రూ–2’లో వెళ్లిన మహిళ మెగాన్ మెకార్తర్ వయసు 49 ఏళ్లు. కేలా బ్యారెన్ వయసు 33 ఏళ్లు. షానన్ వాకర్ భూమి మీదకు తిరిగి వచ్చేశారు. మెగాన్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతున్న కేలా బ్యారన్ వాషింగ్టన్లో పుట్టారు. యు.ఎస్. నేవల్ అకాడమీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం యుద్ధ నౌకల్ని కమాండ్ చేసే సబ్‌మెరైన్ ఆఫీసర్‌గా శిక్షణ తీసుకున్నారు. యు.ఎస్.ఎస్. మెనీలో డివిజన్ ఆఫీసర్‌గా, నేవల్ అకాడమీలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2017లో నాసాకు ఎంపిక అయ్యారు. వ్యోమగామి గా రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడీ స్పేస్ ఎక్స్ ప్రయాణానికి అవకాశం పొందారు. మిషన్ ఆఫీసర్‌గా ఆమె అంతరిక్షంలో ఉన్నంత కాలం కమాండర్, పైలట్, మరొక మిషన్ స్పెషలిస్టుతో అనుసంధానం అయి ఉండాలి. క్రూ యాక్టివిటీ ప్లానింగ్, పర్యవేక్షణ ఆమె విధులే. ఇక ప్రయోగాలు ఎలాగూ ఉంటాయి. వ్యోమగామిగా నాసా శిక్షణలో ఉన్నప్పుడు కేలా బ్యారన్ -
అంగారకుడిపై అరుణ పతాకం
బీజింగ్: డ్రాగన్ దేశం ప్రయోగించిన జురోంగ్ రోవర్ అంగారక గ్రహంపై శనివారం విజయవంతంగా దిగింది. అరుణ గ్రహంపై రోవర్‌ను దింపిన రెండో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. 9 నిమిషాల ఉత్కంఠ పరిస్థితుల తర్వాత తమ రోవర్ మార్స్‌పై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చైనా పురాణాల్లోని అగ్నిదేవుడి పేరు జురోంగ్. 320 మిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ముందే నిర్దేశించినట్లుగా మార్స్‌పై ఉటోపియా ప్లానిటియా దక్షిణ ప్రాంతంలో జురోంగ్ చైనా కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అడుగు మోపింది. రోవర్ మార్స్‌పై దిగాక తన సోలార్ ప్యానెళ్లను, యాంటెనాను విప్పుకొని, సిగ్నల్స్ పంపించగానే చైనా స్పేస్ సైంటిస్టులు హర్షాతిరేకాలు చేశారు. అంగారకుడిపై విజయవంతంగా ఎర్రజెండా పాతి, స్పేస్ ప్రాజెక్టుల్లో తాను ముందంజలో ఉన్నానన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు చైనా పంపించింది. ప్రాజెక్టును విజయవంతం చేసిన తమ స్పేస్ సైంటిస్టులకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ఆరు చక్రాలున్న జురోంగ్ రోవర్ సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. తనకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రోవర్ బరువు 240 కిలోలు. తన వెంట ఆరు శాస్త్ర సాంకేతిక పరికరాలను మార్స్‌పైకి మోసుకెళ్లింది. ల్యాండర్ నుంచి వేరుపడిన తర్వాత మూడు నెలల పాటు విధులు నిర్వర్తిస్తుంది. అరుణ గ్రహం ఉపరితలంపై జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తుంది. -
దశాబ్ద కాలం తరువాత అంతరిక్షకేంద్రంలో రద్దీ...!
కేప్ కెనావెరల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వ్యోమగాములతో కలకలలాడుతుంది. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఉన్న వారి సంఖ్య 10కు పెరిగింది. ఇది దశాబ్ద కాలంలో ఈ సంఖ్యలో ఉండడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 23 శుక్రవారం ఉదయం 5.49 గంటలకు అమెరికా ఫ్లోరిడా స్టేట్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ -9 రాకెట్‌ను ఉపయోగించి స్పేస్ ఎక్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్లను పంపిన విషయం తెలిసిందే. వారు శనివారం రోజున ఐఎస్ఎస్ డ్రాగన్ క్యాప్సూల్ ఉదయం 5 గంటలకు చేరుకుంది. వీరి రాకతో ఒక్కసారిగా ఐఎస్ఎస్లో ఉన్నవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పంపిన ఈ మిషన్ లో నాసాకు చెందిన షేన్ కింబ్రో, మేగన్ మెక్ ఆర్థర్, జపాన్‌కు చెందిన హోషిడే, ఫ్రాన్స్ కు చెందిన పీస్కెట్ ఉన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో బాధ పడుతున్న ఈ సమయంలో మాకు ఒక్కింతా ధైర్యాన్ని, ఆశను ఇస్తార’ని జపనీస్ స్పేస్ ఏజెన్సీ ప్రెసిడెంట్ హిరోషి యమాకవా ఐఎస్ఎస్ సిబ్బందితో తెలిపారు. నాసా స్పేస్ షటిల్ చరిత్రలో అంతకుముందు ఐఎస్ఎస్లో 13 మంది వ్యోమగాములు ఉండి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఆరుగురు అమెరికన్లు, ఇరువురు రష్యన్లు, ఇరువురు జపాన్ శాస్త్రవేత్తలు, ఒక ఫ్రెంచి దేశానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో నలుగురు శాస్త్రవేత్తలు వచ్చే బుధవారం రోజున భూమి మీదకి రానున్నారు. కాగా ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రెండు డ్రాగన్ క్యాప్సూల్స్ ఐఎస్ఎస్తో కలిసి ఉన్నాయి. డ్రాగన్ క్యాప్సూల్‌ను తిరిగి ఈ మిషన్‌కు వాడటం రెండోసారి. రి యూసబుల్ రాకెట్లను వాడటంలో స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
Dragon Fruit: ఎంటర్ ది ‘డ్రాగన్’
డ్రాగన్ ఫ్రూట్. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫల సేద్యం కృష్ణా జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు అక్కడక్కడా సాగుచేస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమైంది. నూజివీడు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉపాధి హామీ పీడీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మామిడి, నిమ్మ, జామ, సపోట తదితర పండ్లతోటలకు సర్కారు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇక నుంచి డ్రాగన్ ఫ్రూట్నూ ఈ జాబితాలో చేర్చింది. ఆసక్తికల రైతులు ఉపాధి హామీ పథకం ఏపీఓలను సంప్రదించి డ్రాగన్ సాగు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోనూ పైలెట్ ప్రాజెక్టుగా.. ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టేందుకు రాష్ట్రంలో పలు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో కృష్ణా జిల్లా కూడా ఉంది. పథకం అమలుకు మార్గదర్శకాలూ విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు అర ఎకరా విస్తీర్ణంలో సాగుకు అనుమతిస్తారు. దీనికి ముందుకు వస్తే రైతుకు రూ.1.86 లక్షలను ఇస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులనూ చెల్లిస్తారు. మొక్కల ఖరీదులోనూ సగం రైతులు పెట్టుకుంటే మిగిలిన సగం ప్రభుత్వం భరిస్తుంది. అర ఎకరాకు దాదాపు 350 మొక్కలు అవసరమవుతాయి. డిమాండ్ ఎక్కువ మంచి పోషకాలు కలిగిన డ్రాగన్‌ఫ్రూట్‌కు మార్కెట్లోనూ డిమాండ్ బాగా ఉంది. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్‌లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది. ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.100 పలుకుతోంది. ఈ ఫలంలో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకానికి లోపలి భాగం తెలుపురంగులో మరో రకానికి ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఫలానికే డిమాండ్ ఎక్కువ. వీటిల్లో విటమిన్–సీ, విటమిన్–బీ3తో పాటు ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధి నియంత్రణకు దోహదపడుతుంది. ఏడాదికల్లా కాపు మొక్కలు నాటిన తరువాత ఏడాది కల్లా కాపు వస్తుంది. 30 ఏళ్లు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ప్రారంభంలో ఒక్కొక్క చెట్టుకు పది కాయలు కాస్తాయి. రానురాను దిగుబడి మరింత పెరుగుతుంది. డ్రాగన్ ఎడారి మొక్కైన నాగజెముడు, బ్రహ్మజెముడులాగా నీరు తక్కువగా ఉన్నా బతుకుతుంది. చౌడు భూములు మినహా మిగిలిన నేలల్లో దీనిని సాగుచేసుకోవచ్చు. రైతులు ఆసక్తి చూపాలి డ్రాగన్‌ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. అర ఎకరం వరకు సాగు చేసుకుంటే ఉపాధిహామీ పథకం నుంచి నిధులను ఇస్తుంది. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకుని ముందుకు రావాలి. – జీవీ సూర్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా -
డ్రాగన్ ఫ్రూట్ కాదు కమలం పండు
పట్నా : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’గా మార్చిన తరువాత డ్రాగన్ పండు దేశం దృష్టిని ఆకర్షించిన మాట నిజమేగానీ ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా తక్కువ కాలరీలున్న డ్రాగన్ ఫ్రూట్ గిరాకీని పెంచింది. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ గత కొన్నేళ్ళుగా బిహార్‌లోని రైతులకు మంచి జీవనోపాధిని కల్పిస్తోంది. సాంప్రదాయ వ్యవసాయానికి దూరంగా ఉంటూ ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని భావించే బిహార్‌లోని కోసి, సీమాంచల్ రైతాంగం డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక హెక్టార్ భూమిపై తొలుత 6 నుంచి 8 లక్షలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 8 నుంచి 10 లక్షల ఆదాయాన్ని సులభంగా సంపాదిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వైభవానికో చరిత్ర బిహార్‌లో డ్రాగన్ ఫ్రూట్ వైభవానికి ఓ చరిత్ర ఉంది. ఆ కథే కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కి ఉందని అంటారు హార్టికల్చర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ సింగ్. ఆ కథేంటో తెలుసుకోవాలంటే 2014వ సంవత్సరానికి వెళ్ళాల్సిందే. 2014లో కిషన్ గంజ్‌లో డ్రాగన్ ఫ్రూట్ విజయగాథ ప్రారంభం అయ్యింది. నాగరాజ్ నఖ™Œ అనే ఔత్సాహిక రైతు సింగపూర్ నుంచి 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తీసుకొచ్చాడు. మొదట 5 హెక్టార్ల భూమిలో 100 మొక్కలతో పని ప్రారంభించారు. అవి పెరిగి పెద్దవై 15,000 నుంచి 20,000 మొక్కలకు పెరిగాయి. పెట్టుబడి ఎంత? ప్రారంభంలో ఒక హెక్టారుపై 6 నుంచి 8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదు అడుగుల పొడవున్న పోల్స్, వాటిపైన రింగులుగా టైర్లు, బిందు వ్యవసాయం కోసం వాడే వ్యవసాయ పరికరాలను అమర్చుకోవడం కోసం ఈ పెట్టుబడిని వినియోగించాల్సి ఉంటుంది. మూడేళ్ళ తరువాత మనం పెట్టే పెట్టుబడిపై రాబడిరావడం మొదలౌతుంది. ఆ తర్వాత రైతులు ఏడాదికి సులువుగా 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదించగలుగుతారు. డ్రాగన్ వైపు మొగ్గు చూపుతున్న జిల్లా రైతాంగం కిషన్ గంజ్‌తో సహా పొరుగు జిల్లా ప్రజల్లో డ్రాగన్ ప్రూట్ పంటపై అవగాహన కల్పిస్తోన్న హేమంత్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘సమీప జిల్లాల్లోని రైతులు పూర్ణియా, సుపాల్, అరారియాలు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై తరచూ ఆరాతీసేవారు. ఆ తరువాత మెల్లిగా వారి వారి ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని సాగుచేయడం ప్రారంభించారు’ అని చెప్పారు. కేవలం ఒక్క కిషన్ గంజ్‌లోనే 12 ఎకరాల భూమిలో రైతులు డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలైన కోసి, సీమాంచల్ జిల్లాల్లో రైతులు కూడా డ్రాగన్‌ఫ్రూట్‌ని సాగుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే విషయంలో సమస్యలెదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్‌ని కొనుగోలుచేసేందుకు వ్యాపారులు వస్తున్నారు. కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ 300 నుంచి 400 రూపాయలు ధర పలుకుతున్నాయి. ప్రోత్సహిస్తే రైతు పంట పండినట్లే.. సంప్రదాయక పంటల విషయంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి. ‘రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పి)పైనే ఆధారపడాల్సి ఉంటుందని ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్‌ని పరిచయం చేసిన నాగరాజ్ అంటారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ విషయంలో తాను కనీసం స్థానిక మార్కెట్ అవసరాలకు సరిపోయే పంటను అందించలేకపోతున్నాను అంటారాయన. అందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తే, రైతులు లాభదాయకమైన డ్రాగన్ ఫ్రూట్ పంటలవైపు మొగ్గుచూపుతారని నాగరాజ్ అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్లను ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పించేందుకు కిషన్ గంజ్ క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) 500 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. ఎర్రటి పండులో ఎరుపు గుజ్జు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ అత్యంత ప్రాచుర్యం పొందిన రకం అని హేమంత్ కుమార్ సింగ్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ పంటలపై అవగాహనకు బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సాబోర్, డ్రాగన్ ఫ్రూట్స్ పండించే విధానంపై ఓ వీడియో పోస్ట్ చేసింది. దీన్ని రైతులు విస్తృతంగా చూశారు అని యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ఆర్.కె.సోహానే తెలిపారు. 50 శాతం రాయితీతో.. డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని వివరిస్తూ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ కుమార్, ఈ యేడాది నుంచి, వైశాలి జిల్లాలోని దేశ్రీ వద్ద 0.4 ఎకరాల భూమిలో డ్రాగన్ పండ్ల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. మొక్కకు 20 రూపాయల చొప్పున 50 శాతం రాయితీతో ఈ మొక్కలను రైతులకు అందిస్తారు. ‘కిషన్ గంజ్‌లో డ్రాగన్ పంట ఫలవంతమైన తరువాత ప్రభుత్వం ఈ పంటను విస్తృతపరిచే విషయంపై దృష్టి సారించింది. దక్షిణ బిహార్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అని రాకేష్ కుమార్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ కాదుకమలం పండు ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’ అని మార్చి గుజరాత్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘కమలం’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ప్రకటించారు. డ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని, ధర రీత్యా విలువైనదేనని రూపాని అన్నారు. కమలం ఉపయోగాలు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. -
కాసులు కురిపించే డ్రాగన్ ప్రూట్స్..
శృంగవరపుకోట రూరల్: విదేశాల్లో సంపన్నులు తినే డ్రాగన్ ఫ్రూట్స్ మన ప్రాంతంలో కనిపించవు. అలాంటి అరుదైన పంటను బొండపల్లి, డెంకాడ, లక్కవరపుకోట మండలాల్లో ఔత్సా హిక రైతులు సాగుచేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా యువ రైతులు పండ్ల తోట లు సాగుచేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధిక దిగుబడులు వస్తుండడంతో సంతోసపడుతున్నారు. మన ప్రాంతంలో విస్తారంగా సాగుచేయవచ్చని చెబుతున్నారు. ఎర్రగా, నల్లని గింజలతో డ్రాగన్ పండు లోపలిభాగం.. అన్ని రకాల నేలలు అనుకూలం.. డ్రాగన్‌ఫ్రూట్స్ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు మరింత శ్రేష్టం. ఈ పంటను అధికంగా వియత్నాం, థాయ్‌లాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక వంటి విదేశాల్లో పండిస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3–4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంట పండించుటకు, మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. సిమెంట్/కాంక్రీట్ స్తంభాలను ఎకరానికి 500 వరకు అవసరమవుతాయి. ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాలి. స్తంభానికి పైన టైర్/ఇనుప చక్రం ఉంచాలి. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా, జారిపోకుండా ఊతం అందిస్తుంది. ఎకరానికి సుమారుగా 2, 000 మొక్కలు నాటాలి. 20 సంవత్సరాల వరకు దిగుబడి.. ఈ పంట ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, 1 అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో రెండు సార్లు (జూన్ మరియు జనవరి లో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమా న్ని పిచికారీ చేయాలి. సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. తోటలో కోత దశకు చేరువలో ఉన్న డ్రాగన్ పండ్లు జూన్–అక్టోబర్ నెలల్లో.. డ్రాగన్‌ఫ్రూట్ పూత, కాయ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. పంట పొలంలో విద్యుత్ లైట్లను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు. డ్రాగన్ సాగుకు ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు దిగుబడి 6–8 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో డ్రాగన్‌ఫ్రూట్ కేజీ ధర రూ.150–200 వరకు పలుకుతోంది. సాగు బాగుంది... డ్రాగన్ పండ్ల మొక్కలను నాలుగు ఎకరాల్లో సాగుచేశాను. ఎకరాకు మొదటి క్రాప్‌లో 4–5 టన్నుల దిగుబడి వచ్చింది. పండ్లను విశాఖలో అమ్ముతున్నాం. మార్కెట్ బాగుంది. ఎకరాకు సుమారు రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి మినహాయిస్తే రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు మిగులుతోంది. – జస్టిన్, కిత్తన్నపేట, ఎల్.కోట మండలం పూత దశలో ఉన్న డ్రాగన్‌ఫ్రూట్ తోట సాగుపై ఆసక్తి చూపాలి రైతులు కొత్తగా ఆలోచించాలి. పండ్ల తోటల సాగుతో పాటు మార్కెటింగ్ వ్యూహాన్ని పసిగట్టాలి. పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్న పెద్ద రైతులు డ్రాగన్ పండ్ల మొక్కల సాగుపై ఆసక్తి చూపాలి. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలను ఆర్జించవచ్చు. డ్రాగన్‌ఫ్రూట్‌ను తెలుగులో సిరి జమ్మెడ చెట్టు అంటారు. ఇది ఎడారి జాతికి చెందిన పండ్ల మొక్క. తక్కువ నీటితో సాగుచేయవచ్చు. ఈ పండ్లలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండును తినడం ద్వారా బరువు నియంత్రణ, ఆస్తమా, చెడు కొలెస్ట్రాల్ తగ్గటం, డయాబెటిస్ నియంత్రణ లాంటి ఎన్నో ఉపయోగాలు చేకూరుతాయి. అందుకే పండ్లకు ఎప్పుడూ ధర ఉంటుంది. – బండారు దీప్తి, ఉద్యానవన శాఖ అధికారి, ఎస్.కోట డ్రాగన్ తోటల సాగును పరిశీలిస్తున్న జిల్లా ఉద్యాన అధికారులు