
కోలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్‌నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. బక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ. 150కోట్ల వరకు రాబట్టింది .
కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్ రంగనాథన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'ఎల్‌కే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం.
మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్, సీరియల్ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment