కర్ణాటకకు డ్రాగన్‌? | NTR Dragon first schedule in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు డ్రాగన్‌?

Published Sun, Jan 5 2025 12:51 AM | Last Updated on Sun, Jan 5 2025 2:52 AM

NTR Dragon first schedule in Karnataka

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల మూడో వారంలో ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

కర్ణాటక లొకేషన్స్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేశారని టాక్‌. ఇక విదేశాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను పూర్తి చేసుకుని, ఆల్రెడీ హైదరాబాద్‌ చేరుకున్నారు ఎన్టీఆర్‌. సో... ఈ నెలాఖర్లో ‘డ్రాగన్‌’ మూవీ కోసం ఎన్టీఆర్‌ కర్ణాటకకు వెళ్తారని ఊహించవచ్చు. మరోవైపు ఎన్టీఆర్‌ హిందీలో ‘వార్‌ 2’ అనే మూవీ చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్‌ డ్రామా ‘వార్‌ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement