
కొలంబో వెళ్లనున్నాడట డ్రాగన్. ఎన్టీఆర్(Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గత నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలోప్రారంభమైంది.
కానీ ఈ షూటింగ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనలేదని తెలిసింది. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలోని కొలంబోలో జరగనుందట. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment