
లవ్ టుడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Movie)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ప్రదీప్ రంగనాథన్. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డ్రాగన్ మూవీ కథేంటంటే..
డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
#Dragon Opening pic.twitter.com/BJyckrx1FA
— Pradeep Ranganathan (@pradeeponelife) February 24, 2025
Comments
Please login to add a commentAdd a comment