బాక్సాఫీస్‌ వద్ద 'డ్రాగన్‌'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు! | Pradeep Ranganathan Latest Movie Dragon Collections in ten Days | Sakshi
Sakshi News home page

Dragon Movie Collections: ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్‌.. వంద కోట్ల మార్క్ దాటేసింది

Published Sun, Mar 2 2025 7:56 PM | Last Updated on Sun, Mar 2 2025 7:56 PM

Pradeep Ranganathan Latest Movie Dragon Collections in ten Days

లవ్‌ టుడే మూవీతో తెలుగు వారికి  దగ్గరైన యంగ్‌ హీరో ప్రదీప్‌రంగనాథన్‌. ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు  దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, కాయదు లోహర్‌ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన  మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.

తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్‌ను షేర్ చేశారు.

డ్రాగన్‌ మూవీ కథేంటంటే..

డి.రాఘవన్‌(ప్రదీప్‌ రంగనాథన్‌)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులతో పాస్‌ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్‌ బాయ్స్‌ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్‌ చేస్తుంది. దీంతో రాఘవన్‌ బ్యాడ్‌ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్‌ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్‌ అని పేరు పెడతారు.  ప్రిన్సిపల్‌(మిస్కిన్‌)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్‌ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్‌)(Ashwath Marimuthu) బ్రేకప్‌ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.

దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్‌ కావాలని ఫేక్‌ సర్టిఫికేట్స్‌ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా  ఫిక్స్ అవుతుంది. లైఫ్‌ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్‌ సర్టిఫికెట్స్‌ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్‌ అవ్వాలని కండీషన్‌ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్‌. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్‌ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement