100 Crores Movie
-
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
లవ్ టుడే మూవీతో తెలుగు వారికి దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్‌ను షేర్ చేశారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025 -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్‌లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు. -
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘100 క్రోర్స్’. 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విరాట్ చక్రవర్తి. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.‘100 క్రోర్స్ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అన్నారు దామోదర ప్రసాద్. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి’ అన్నారు వీర శంకర్.‘2016లో జరిగిన యథార్థ కథ. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాత సాయి కార్తీక్. ఈ మూవీకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు.