ఆపరేషన్‌ సిందూర్‌ అప్‌డేట్స్‌.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం | Indian Army Operation Sindoor At PoK Over Pahalgam Terror Attack Live Updates, News Headlines And Viral Videos | Sakshi
Sakshi News home page

Operation Sindoor Live Updates: ఆపరేషన్‌ సిందూర్‌ అప్‌డేట్స్‌.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం

Published Wed, May 7 2025 6:57 AM | Last Updated on Wed, May 7 2025 2:33 PM

Indian Army Operation Sindoor POK Over Pahalgam Live Updates

Indian Army Operation Sindoor Updates.. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యవసర సమీక్ష
సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు హాజరు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు, లడఖ్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ హాజరు
 

రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం

  • వివరాలు వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
  • రేపు ఉదయం 11 గంటలకు  పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
  • ఆపరేషన్ సిందూర్ వివరాలు అఖిలపక్షానికి వివరించనున్న కేంద్రం
  • భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు వివరించనున్న కేంద్రం

 

ముగిసిన కేబినెట్ సమావేశం..

  • పాక్‌ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ గురించి కేబినెట్‌ సహచరులకు వివరించిన ప్రధాని
  • కేబినెట్‌లో భద్రతా బలగాలను కీర్తించిన ప్రధాని మోదీ
  • రాష్ట్రపతి నిలయానికి ప్రధాని మోదీ.
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించనున్న ప్రధాని. 
  • ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయిన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ 

 మోదీ విదేశీ పర్యటనలు రద్దు.. మీడియా సమావేశం..

  • ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.
  • మూడు దేశాల పర్యటన రద్దు అయ్యింది.
  • నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్‌ పర్యటన రద్దు
  • ప్రధాని మోదీ మీడియా సమావేశం..
  • భారత్‌ ఎన్నో విజయాలు సాధిస్తోంది.
  • అంతరిక్ష ప్రయోగాలపై మోదీ సందేశం.
  • అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.
  • మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం.
     

కేంద్ర కేబినెట్‌ భేటీ..

  • కొనసాగుతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశం
  • ఆపరేషన్ సిందూర్‌పై చర్చిస్తున్న కేబినెట్‌
  • సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులపై సమీక్ష

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రపంచ నేతల స్పందన ఇదే..

👉అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్‌, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు.

👉అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందన.. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి

👉భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌.. ఆత్మ రక్షణ కోసం భారత్‌ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది.

👉యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌.. భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి

👉చైనా స్పందన.. భారత్‌, పాక్‌ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్‌, పాకిస్థాన్‌లను కోరుతున్నాం

👉ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌.. రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలి.
 

పౌరులను చంపడం భావ్యం కాదు: ఒమర్‌ అబ్దుల్లా

  • పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత బలగాలు
  • పాక్‌ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడి
  • అయినప్పటికీ పాక్‌ అన్యాయంగా పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని విమర్శ.


అమిత్‌ షా కీలక ఆదేశాలు..

  • సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండి
  • ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • సెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్న అమిత్ షా
     

ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా సమావేశం ప్రారంభం

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్‌ షా

  • భారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది.
  • పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాయని వెల్లడి
  • ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టిన అమిత్ షా
  • జమ్ముకశ్మీర్‌ సీఎంతో మాట్లాడిన అమిత్‌ షా
  • ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత స్పందిస్తున్న కేంద్ర పెద్దలు..
  • ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా
  • కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, బీఎస్‌ఎఫ్‌ డీజీతోనూ చర్చించిన అమిత్‌ షా
  • సరిహద్దు భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష
  • పౌరుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎం
  • అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశం

జేపీ నడ్డా వార్నింగ్‌..

  • మా జోలికొస్తే ఊరుకుంటామా అంటూ నడ్డా వ్యాఖ్యలు..
  • ఆపరేషన్‌ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయి.
  • భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నడ్డా
  • ఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని పోస్టు పెట్టిన నడ్డా
  • రక్షణ మంత్రితో సీడీఎస్‌ భేటీ
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌
  • సౌత్ బ్లాక్‌లో పరిస్థితిని వివరిస్తున్న అనిల్‌ చౌహాన్‌ 

త్రివిధ దళాల మీడియా సమావేశం..

  • ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం
  • సమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులు
  • ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.
  • ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్

 ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..

  • పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.
  • పాకిస్తాన్‌, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.
  • భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.
  • జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరం
  • భారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.
  • మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.
  • జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది.

 

ఆపరేషన్‌ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.

  • భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...
  • పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.
  • జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాం
  • ఈ సమయంలో  మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!
  • #ఆపరేషన్ సిందూర్

 

భారత్‌కు ఇజ్రాయెల్‌ మద్దతు..

  • ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి
  • ఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్
  • ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్‌ అజర్‌
  • అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌

భారత్‌ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్‌ ఒవైసీ  

  • ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ  
  • పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాం
  • పహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారు
  • పాకిస్తాన్‌ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్‌

 

 

ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ గాంధీ స్పందన ఇదే..

  • ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ పోస్ట్
  • ‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్‌’
     

 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌

  • పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యం
  • సైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌
  •  

ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్‌ పోస్ట్

  • ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌
  • ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలు

సరిహద్దుల నుంచే దాడులు.. 

  • ఆపరేషన్‌ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశం
  • భారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులు
  • ఆపరేషన్‌ సిందూర్‌.. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్త ఆపరేషన్‌
  • ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలు
  • ఇంటెలిజెన్స్‌ వర్గాల సహకారంతో దాడి
  • భారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు
     

ఆపరేషన్ సిందూర్‌లో  80 టెర్రరిస్టుల మృతి
ఆపరేషన్ జరిగిన ప్రాంతాలు

1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం
2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT
3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం
4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ - HM
5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT
6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM
8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT
9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం

సరిహద్దుల్లో టెన్షన్‌..

  • భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్
  • సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్
  • రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్
  • తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్
  • దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్
  • తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికా
  • ఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశం
  • మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీ
  • బహవల్పూర్  లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడి
  • మురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్
  • మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్
  • ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీ

భారత్‌ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. 

  • ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..
  • పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.
  • తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్‌ ఆర్మీ,
  • కోట్లీ, బహ్వాల్‌పూర్‌, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.
  • బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.
  • పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం
  • త్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.
  • భారత్‌ దాడుల్లో పాక్‌ ఆర్మీ ఐఎస్‌ఐ కంట్రోల్‌ రూమ్‌ ధ్వంసం
  • అర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.
  • 200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు. 

 

పాక్‌ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేత

  • అప్రమత్తమైన పాక్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు
  • భారత్‌ దాడులతో పాక్‌ అప్రమత్తమైంది.
  • లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.

 

పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు

  • పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌
  • తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం
  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలు

 

 

భారత్‌ దాడులు.. పలు విమానాలు రద్దు

 

  • శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్‌ జెట్‌
  • ధర్మశాల, లేహ్‌, జమ్మూ, అమృత్‌సర్‌ విమానాశ్రయాల మూసివేత
  • ఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేత
  • ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయం
  • జమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేత
  • కేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం
     

పాక్‌ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..

  • అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్  ప్రధాన కార్యాలయం
  • తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
  • అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసిన భారత్‌
  • మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌
  • సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌
  • పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌
  • జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
  • రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
  • రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌
  • సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది  జేఎంకు ఒక క్యాంప్.
  • అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్

👉పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్‌ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.

👉పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్‌ టు సర్ఫేస్‌’ మిసైళ్లను  ప్రయోగించారు.  

👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది.  

👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని నామకరణం చేశారు. మసూద్‌  అజర్, హఫీజ్‌ సయీద్‌ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం  పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.  

👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్‌ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన రాజ్‌నాద్‌ సింగ్‌. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

భారత్‌ తడాఖా.. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ విలవిల (ఫొటోలు)
👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement