Poonch
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఆ తర్వాత సైనికులు ప్రతీ దాడి జరిపారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల మేరకు మెంధార్‌లోని పఠాన్ తీర్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు. దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని అధికారి తెలిపారు. బారాముల్లాలో 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్‌ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. -
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ గాలిస్తున్నారు.దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. -
పూంచ్‌లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్‌లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
వైవిధ్యమే భారత్ బలం: మోదీ
న్యూఢిల్లీ: భారతీయులను వైవిధ్యం పట్ల సహజంగా ఉండే ప్రేమే శతాబ్దాలుగా ఐకమత్యంగా ఉంచుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌కున్న ఈ విశిష్టతే ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిందని చెప్పారు. ‘భారతదేశం వివిధ వర్గాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలకు నెలవు. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను ఆచరిస్తూనే ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు’అంటూ ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌కు చెందిన నజాకత్ చౌధరికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా చౌధరి ఇటీవల అస్సాంలో పర్యటించారు. ఈ పర్యటన తనలో స్ఫూర్తి నింపిందనీ, మరిచిపోని అనుభూతులను మిగిల్చిందంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రధాని పైవిధంగా బదులిచ్చారు. నేడు 71 వేల మందికి నియామక పత్రాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో నియామక పత్రాలివ్వనున్నారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన ఇప్పటిదాకా 2.9 లక్షల మందికి నియామక పత్రాలిచ్చారని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. -
స్టికీ బాంబులు, గ్రనేడ్లు, స్టీలు బుల్లెట్లు.. ఉగ్రదాడిలో కీలక విషయాలు..!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పూంఛ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు ఈ దాడికి స్టికీ బాంబులు, స్టీల్ బుల్లెట్లు, గ్రనేడ్లు ఉపయోగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. స్టికీ బాంబులు అంటే పేలుడు పరికరాలు. వీటిని వాహనానికి అమర్చి డిటోనేటర్ల ద్వారా లేదా టైమర్ సెట్ చేసి పేలుస్తారు. ఘటనా స్థలంలో స్టికీ బాంబులతో పాటు, రెండు గ్రనేడ్ పిన్నులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో రెండు ఉగ్ర సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులు పాల్గొన్నారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు అయి ఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో.. కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏకు అందించింది. దాడి అనంతరం నిందితుల కోసం వేట మొదలుపెట్టాయి భారత బలగాలు. 2000కు పైగా కామాండోలను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన సైనికులు వీరే.. -
పూంఛ్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన ఆర్మీ
-
శివునికి జలాభిషేకం చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
-
Poonch Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం
శ్రీనగర్: ఘోర రోడ్డు ప్రమాదంతో జమ్ము కశ్మీర్ నెత్తురోడింది. బుధవారం ఉదయం పూంచ్ దగ్గర సావ్జియన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలుకాగా.. పాతిక మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వాళ్లను మండీ ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు మండీ తహసీల్దార్ షెహ్జాద్ లతిఫ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం మండీ నుంచి సౌజియాన్‌కు వెళ్లాల్సిన మినీబస్సు మార్గం మధ్యలో లోయలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు ఆర్మీ రంగంలో దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. ఘటన గురించి తెలియగానే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 11 die, 25 injured in minibus accident in J-K's Poonch Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident pic.twitter.com/15QBXiGwq8 — ANI Digital (@ani_digital) September 14, 2022 Jammu & Kashmir | A mini-bus accident occurred in the Sawjian area of Poonch. Army's rescue operation is underway; 9 deaths reported, many injured shifted to a hospital in Mandi. Further details awaited: Mandi Tehsildar Shehzad Latif pic.twitter.com/NMFhtuK5lj — ANI (@ANI) September 14, 2022 The loss of lives in a tragic road accident in Sawjian, Poonch is deeply distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured. — President of India (@rashtrapatibhvn) September 14, 2022 -
నేలకొరిగిన మరో ఇద్దరు జవాన్లు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపులో జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీవో) సహా ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. దీంతో సోమవారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు జేసీవోలు సహా మొత్తం 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లయింది. గురువారం నార్‌ఖాస్ ప్రాంతంలో ఉగ్రమూకలతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలోనే తాజాగా జేసీవో అజయ్ సింగ్, జవాన్ హరేంద్ర సింగ్ మృతదేహాలు దొరికాయని అధికారులు తెలిపారు. పర్వతమయమైన దట్టమైన అటవీప్రాంతంలో గాలింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగామారిందన్నారు. మెంధార్ నుంచి థానామండి వరకు మొత్తం అటవీ ప్రాంతాన్ని పారా మిలటరీ కమాండోలు, హెలికాప్టర్లతో జల్లెడపడుతున్నామన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లోని బాంకా ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలసవచి్చన అర్వింద్‌కుమార్ షా(30)ను శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో, యూపీ నుంచి వచ్చిన సాగిర్ అహ్మద్ అనే కార్పెంటర్‌ను పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు. లష్కరే కమాండర్ హతం జమ్మూకశీ్మర్‌లోని పుల్వామా జిల్లా పంపోరే ప్రాంతంలో శనివారం భద్రతాబలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాన్దేతోపాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. పలు నేర ఘటనలతోపాటు ఈ ఏడాది జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యతో ఖాన్దేకు సంబంధముందని అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో బుధవారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు.. సూరంకోట్‌లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. (చదవండి: తాలిబన్ల రాజ్యం: ‘పరిణామాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’) గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా "తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది" అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు -
పాక్ కాల్పులు: భారత జవాను మృతి
కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో షాపూర్, కిర్ణి సెక్టార్ల పరిధిలో నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి కాల్పులు జరుపుతూ, మోర్టార్లు విసిరింది. ఈ దాడిలో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కాగా సరిహద్దుల వెంబడి పాక్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. గడిచిన ఆరునెలల్లో 2 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. గత ఆరు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. (ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం) -
సరిహద్దుల్లో పాక్ దాష్టీకం!
విచక్షణారహితంగా కాల్పులు.. ఒక మహిళ మృతి పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ దాష్టీకం పెరిగిపోతోంది. పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖకు సమీపంలో పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందారు. మృతురాలిని రుఖియా బీగా గుర్తించారు. పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో ఉదయం 5 గంటల సమయంలో భారీ ఎత్తున కాల్పులకు తెగబడిందని, దీంతో భారత బలగాలు దీటు బదులిచ్చాయని, కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు కుప్వారా జిల్లాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. దీంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాయి. -
పాక్ కాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ము: పాకిస్తాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా గురువారం తెల్లవారుజామున పూంఛ్ సెక్టార్‌లోని ఎల్వోసీ వెంట పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. -
పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!
-
పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్వోసీ మీదుగా ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. కృష్ణగాటి సెక్టార్లో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. పాక్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు, ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారని సైనిక వర్గాలు తెలిపాయి. ఒక జవానుకు గాయాలయ్యాయి. వెంటనే ఈ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చిందని, కానీ, పాక్ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్ కమాండ్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. కశ్మీర్లో అలజడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. -
కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు
శ్రీనగర్: పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూలోని పూంఛ్ సెక్టార్లో బుధవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు వారికి ధీటైన జవాబిస్తున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత నాలుగు రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీ మూడు సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. -
మరోసారి తెగబడ్డ పాకిస్తాన్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫూంచ్ జిల్లాలోని మల్టీ సెక్టార్లో పాక్ సైన్యాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డాయి. నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారు. కాగా 24 గంటల్లో పాక్ కాల్పులకు పాల్పడటం ఇది రెండోసారి. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యానికి భారత జవాన్లు ధీటుగానే బదులు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం కూడా కృష్ణఘటి సెక్టార్లో పాక్ సైన్యాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల ఘటనపై రక్షణ శాఖ అధికారి మాట్లాడుతూ పాక్ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. -
జమ్మూ పూంచ్ జిల్లాలో పాక్ కాల్పులు
-
రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు
కశ్మీర్: సుదీర్ఘకాలంగా కర్ఫూ నీడలో మగ్గిపోతున్న జమ్ము కశ్మీర్ లో ఆపిల్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయట. ఆపిల్ పళ్లకు పెట్టింది పేరైన కశ్మీర్ ఈ ఏడాది గణనీయమైన ఉత్పత్తిని సాధించింది. గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం అధిక ఉత్పత్తిని, అమ్మకాలను సాధించామని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పూంచ్ లో భారీ ఎత్తున ఆపిల్ విక్రయాలు జరిపినట్టు చెప్పారు. కశ్మీర్ లోయలో తీవ్రమైన అశాంతి ఉన్నప్పటికీ తమ ఆపిల్ పళ్లకు భలే డిమాండ్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా కిలోకు రూ.100 ఉండే కశ్మీరీ ఆపిల్ ధర ఇప్పుడు రూ. 20-30 పలుకుతోందని తెలిపారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులమోత
-
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం: కశ్మీర్లో కలకలం
-
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం: కశ్మీర్లో కలకలం
జమ్ము: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కశ్మీర్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. పూంఛ్ జిల్లాలో పాక్ బలగాల కాల్పులు, బుద్ధ అమర్ నాథ్ యాత్రికులపై గ్రెనేడ్ దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. ఢిల్లీలోని జరిగిన స్వాతంత్ర్యవేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూంఛ్ జిల్లా సరిహద్దులో ఆదివారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత జవాన్లే లక్ష్యంగా మిషిన్ గన్స్, మోర్టార్ రాకెట్లతో దాడి చేసిందింది. దీనిని తిప్పి కొట్టే క్రమంలో భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు కొనసాగుతున్నయని, ఎవరైనా గాయపడిందీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని భద్రతాబలగాల ప్రతినిధులు పేర్కొన్నారు. నాలుగు నెలల తర్వాత ఇరుదేశాల జవాన్ల మధ్య కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. పూంఛ్ జిల్లాలోనే ప్రఖ్యాత బుద్ధ అమర్ నాథ్ దేవాలయానికి వెళుతోన్న యాత్రికులపై ముగ్గురు ముష్కరులు గ్రేనేడ్లు విసిరారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో 11 మంది యాత్రికులు గాయపడ్డారు. వారందరినీ జమ్ములోని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాంబులు వరిసిన ముగ్గురు యువకుల్లో ఇద్దరిని జనం పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మరొకడు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. ఇటు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో కమిషనర్ అబ్దుల్ బాసిత్ పాక్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ కీ ఆజాదీ (కశ్మీర్ స్వాతంత్ర్యం) నేపథ్యంలో ఈ ఏటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే ఆయన కశ్మీర్ స్వాతంత్ర్యంపై మాట్లాడటం గమనార్హం. ఇదిలాఉంటే ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని సరిహద్దుల్లోని కీలక చెక్ పోస్టుల వద్ద పాక్ బలగాలు.. భారత బగాలకు మిఠాయిలు పంచిపెట్టాయి. -
సరిహద్దులో ఉగ్రవాదుల మెరుపుదాడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో భారీ దాడికి పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 7.40గంటల ప్రాంతంలో భారీ మొత్తంలో ఆయుధాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు తాంఘ్దార్ సెక్టార్ సమీపంలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకొని కాల్పులు ప్రారంభించారు. ఈ దాడితో ఉలిక్కిపడిన భారత ఆర్మీ కూడా ప్రతి దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో భారత ఆర్మీకి చెందిన ఆయిల్ డిపో మంటల్లో చిక్కుకుంది. ఉగ్రవాదులు దాడికి దిగిన విధానాన్ని బట్టి భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడి చేసేందుకు వచ్చారా అనే అనుమానం కలిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయి. మరోపక్క, జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి జరిపిన గాలింపు చర్యల్లో భారత ఆర్మీకి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం అయ్యాయి. వీటిలో ఒక ఏకే 47 గన్, 113 రౌండ్లకు సరిపోయే బుల్లెట్లు, పికా మందుగుండు, రెండు ఐఈడీలు, ఒక చైనా గ్రనేడ్, పాకిస్థాన్ సిమ్ కార్డులు, కరెన్సీ ఉన్నాయి. ఆర్మీ అలికిడి వారు ఆ వస్తువులు అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. -
చర్చలైనా తీరు మారలే.. మళ్లీ బుల్లెట్ జారిన పాక్
జమ్మూ: పాకిస్థాన్ తీరు మారలేదు. అంతర్జాతీయ సరిహద్దు విభాగ రక్షణ దళానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజులపాటు ఓ చోట కూర్చుని చర్చించినా ఫలితం రాలేదు. బుధవారం మరోసారి ఆ దేశం సైనికులు హద్దు మీరారు. గంటల వ్యవధిలోనే పూంచ్ సెక్టార్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఆటోమేటిక్ ఆయుధాలతో, మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొని దాడులను తిప్పికొట్టింది. పూంచ్ సెక్టార్ తోపాటు కృష్ణఘాట్ సెక్టార్లో పాక్ సైన్యం దుశ్చర్యలకు దిగింది. ఈ నెలలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడటం 17వ సారి. -
ఓ పక్క చర్చలు.. మరోపక్క కాల్పులు
పూంచ్: ఓ పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను నిర్మూలించేందుకు నేడు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల బీజీ సెక్టార్లో గత రాత్రి సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు ధీటుగా స్పందించారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఈ నెలలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడటం ఇది తొమ్మిదోసారి. ఇరు దేశాల సరిహద్దు విభాగ ఉన్నతాధికారులు నేడు ఢిల్లీలో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. -
పాక్ కాల్పులు : ఆరుకి చేరిన మృతులు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఆరుకి చేరింది. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దాంతో మృతుల సంఖ్య ఆరుగురకి చేరింది. శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది... ఈ ఘటనలో ముగ్గురు మరణించగా... నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులను సైనిక అధికారులు ఆసుపత్రికి తరలించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. -
కశ్మీర్ లో పేలుళ్లు..!
జమ్మూ: జమ్ము-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మందు పాతర పేలి ఒకరికి గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని బాగియాల్ దారా వద్ద బుధవారం ఉదయం మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. మందు పాతరపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అవి పేలాయి. ఈ ఘటనలో గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాక్ కాల్పులు, 17 ఏళ్ల యువతి మృతి
శ్రీనగర్ : పాకిస్తాన్ మళ్లీ తెగబడింది. అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్ సౌజెయిన్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల యువతి జహీరా అక్తర్‌తో పాటు మరో నలుగురు గాయడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో పాక్ సైన్యం ఇలా కాల్పులు జరపడం ఇది మూడోసారి. పాక్ సైనికులు గురువారం జరిపిన కాల్పుల్లో కూడా ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. -
సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత, పాక్ జవాన్లు!
జమ్మూ: పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా జమ్మూ,కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణారేఖ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకుని సామరస్యాన్ని చాటారు. కాల్పుల ఒప్పంద నిబంధనల్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోనే ఈ ఘటన ఇరుదేశాల జవాన్ల మధ్య చోటుచేసుకోవడం అందర్ని ఆకట్టుకుంది. నియంత్రణారేఖ సమీపంలోని చకన్ దా బాగ్, హాట్ స్పింగ్ మెందార్ పాయింట్ల వద్ద ఇరుదేశాలకు చెందిన జవాన్తు గురువారం రాత్రి స్వీట్లు పంచుకున్నట్టు సైనికాధికారి వెల్లడించారు. నియంత్రణా రేఖ వద్ద సామరస్యం నెలకొనాలని ఇరుదేశాల అధికారులు అశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల్లో హమీర్ పూర్, బాలకోటే ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు. -
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది దేశం ఉల్లంఘిస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ దళాలు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి. మూడు రోజుల క్రితం పూంఛ్ సెక్టార్లో మోర్టార్లు, చిన్న తరహా ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ దళాలు తాజాగా మంగళవారం రాజౌరీ జిల్లాలోని బీమ్ బేర్ లోని గాలీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు దిగాయి. భారత సైనికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
పాక్ దుర్మార్గంపై మండిపడ్ద యువత
-
గీత దాటిన పాక్: ఐదుగురు భారత జవాన్ల హతం