పూంచ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు | Police Announces Reward On Poonch Terrorists | Sakshi
Sakshi News home page

పూంచ్‌ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు

May 6 2024 3:58 PM | Updated on May 6 2024 4:00 PM

Police Announces Reward On Poonch Terrorists

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్‌ఫోర్స్‌  అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement