reward
-
మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్‌ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది. గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటేకేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్‌పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం -
‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’
ముంబై: ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. రూ. కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్.. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజ్ సేకావత్ ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభ్వుం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్ కూడా ఒకరు’’ అని అన్నారు.लॉरेंस बिश्नोई के एनकाउंटर के लिए क्षत्रिय करणी सेना ने घोषित किया इनाम। सुनिए क्या कह रहे है डॉ. राज शेखावत। #LawrenceBishnoi #KarniSena #SalmanKhan #BabaSiddique #BabaSiddiqui #Gujarat pic.twitter.com/zaHn3O8ens— Achlendra Kr. Katiyar (@achlendra) October 21, 2024డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు.. కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పని చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్ బాధ్యత వహించటం గమనార్హం. కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక కోసిన వారికి రూ, 11 లక్షలు బహుమతిగా ఇస్తానని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించారు. అయితే రిజర్వేషన్లపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు.“ఇటీవల అమెరికా పర్యటనలో భారత్‌లో రిజర్వేషన్లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటించడం.. ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఓవైపు మహారాష్ట్రలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ అక్కడ దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటన చేశారు. దేశం నుంచి రిజర్వేషన్లను దూరం చేస్తామంటూ రాహుల్ మాటాలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది. రాహుల్ నాలుకను ఎవరు నరికినా, వారికి 11 లక్షల రూపాయల బహుమతి ఇస్తాను’ అని గౌక్వాడ్ ప్రకటించారు.అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, శివసేన భాగస్వామ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గైక్వాడ్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కానీ, అటుశివసనే కానీ స్పందించలేదు. కాగా గైక్వాడ్ విధర్బలోని బుల్దానా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేకు వివాదాలు కొత్తేమీ కాదు. గత నెలలో ఓ పోలీసు అధికారి గౌక్వాడ్ కారును శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో వివాదంగా మారింది. అయితే దీనిని ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. కారులో అనుకోకుండా కారులో వాంతులు చేసుకోవడంతో ఆ పోలీసు స్వచ్ఛందంగా దాన్ని శుభ్రం చేశాడని చెప్పుకొచ్చారు. అంతేగాక 1987లో ఓ పులిని వేటాడి దాని దంతాన్ని నెక్లెస్‌గా ధరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర అటవీశాఖ ఫోరెన్సిక్ ఆ దంతాన్ని పరీక్షించి.. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసింది. -
రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది. -
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్‌ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. -
‘ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షలు’
హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్‌లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అతికించింది. పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్‌ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది. కాగా ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
కాటలిన్ కారికో, డ్రూ వీస్మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. 2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి? -
‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు!
GST reward scheme: జీఎస్టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్'(Mera Bill Mera Adhikar) పథకం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైంది. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి. ‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని తెలిపారు. ఇదీ చదవండి: High Profit Farming Business: ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి.. పెట్టుబడీ తక్కువే! అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న ప్రయోగాత్మకంగా మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెలా 810 లక్కీ డ్రాలు ఉంటాయి. అలాగే ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. నెలవారీ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.10,000 చొప్పున 800 మందికి అందిస్తారు. రూ. 10 లక్షల బహుమతితో 10 డ్రాలు ఉంటాయి. ఇక ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.1 కోటి ఉంటుంది. -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్‌ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్‌ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
జీఎస్టీ బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు
GST reward scheme: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ఏదైనా కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌ని మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసి రివార్డ్ పొందవచ్చు. ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకం కింద రిటైలర్ లేదా హోల్‌సేల్ వ్యాపారి నుంచి తీసుకున్న ఇన్వాయిస్ను యాప్‌లో అప్లోడ్ చేసినవారికి నెలవారీగా, త్రైమాసికంవారీగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థతో పేర్కన్నారు. 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఇన్వాయిస్లో విక్రేతకు సంబంధించిన జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్వాయిస్లను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వాయిస్ కనీసం రూ. 200 కొనుగోలు విలువను కలిగి ఉండాలి. ప్రతి నెలా లక్కీ డ్రాలు కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే త్రైమాసానికి రెండు చొప్పున లక్కీ డ్రాలు తీస్తారు. ఇక్కడ రూ. 1 కోటి వరకూ నగదు బహుమతి ఉంటుంది. ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి , వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. 'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ బీ2సీ కస్టమర్ల విషయంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంగీకరిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు
భోపాల్: సాటి మనిషి మీద దయ చూపని ఈ సమాజంలో కొందరు మాత్రం జంతువులు మీద కూడా అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉత్తరప్రదేశ్‌లో సరస్ క్రేన్, ఒక వ్యక్తి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నుండి ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీపక్ సోనీ తన తప్పిపోయిన చిలుక కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. అంతేకాకుండా తన చిలుక ఆచూకీతో తెలిపితే ₹ 10,000 నగదు బహుమతిని అందజేస్తూ, పట్టణం అంతటా పోస్టర్లు వేశాడు. తప్పిపోయిన పక్షిని కనుగొనే ప్రయత్నంలో నగరం అంతటా పోస్టర్లు అంటించేందుకు అతను ఒక ఆటోరిక్షా డ్రైవర్లకు సహాయం తీసుకున్నాడు. అందుకు వారికి డబ్బులు కూడా చెల్లించాడు. ‘గత నెలలో ఎగిరిపోయి దానికదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. ఇంకా తిరిగి రాలేదు. వీధి కుక్కలు దానికేమైనా హాని చేశాయోనని భయపడుతున్నాము. చిలక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాని ఆచూకీ తెలిపిన వారికి పదివేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధం. దానిని కనుగొన్న వారు నా నంబర్‌కు కాల్ చేయగలరు ’ అని వారి ప్రాంతంలో పోస్టర్లు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్‌గా మారింది. -
ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక స్పిన్నర్లు చెలరేగడంతో మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఫ్యాన్స్ ఫైర్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. జైస్వాల్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డ్‌పై తాజాగా నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ప్రస్తుతం దీనిపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా వేడి వేడిగా చర్చ కూడా మొదలైంది. అసలు ఈ రచ్చ అంతా ఎందుకంటే.. యశస్వి జైశ్వాల్‌కు రివార్డుగా ఇచ్చిన మొత్తం 500 అమెరికా డాలర్లు కావడమే. ఈ మొత్తం మన భారత కరెన్సీలో సుమారు రూ.41,000 మాత్రమే. ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు కారణం ఇదేనా! ఈ రివార్డ్ మనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భారత దేశవాళీ క్రికెట్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారితోషికం ఎక్కువ అని సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ బోర్డు పరిస్ధితి ఆర్థికంగా అంతగా బాలేదని చెప్పాలి. వాస్తవానికి టీమ్ ఇండియా కూడా ఈ సిరీస్ ఆడేందుకు ప్రధాన కారణమే వెస్టిండీస్ బోర్డుకు ఆర్థిక సహకారం అందించడమే. ఈ కారణం వల్లే వెస్టిండీస్ బోర్డు రివార్డ్ మొత్తాన్ని 500 అమెరికన్ డాలర్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంత తక్కువ మొత్తంలో రివార్డ్ బహుకరించడం నెట్టింట అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్ అని జోకులు పేల్చుతున్నారు. Only $500? pic.twitter.com/RMLvMvziJu — Apoorv Sood (@Trendulkar) July 15, 2023 చదవండి Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్! -
4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..
భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎలా పట్టుకున్నారంటే! జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! -
హెడ్ కానిస్టేబుల్‌కు రివార్డు
కొరుక్కుపేట: శంకరాపురం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను పరిష్కరించిన హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కళ్లకురిచ్చి జిల్లా, శంకరాపురం సమీపంలోని రౌతనల్లూర్ గ్రామం వద్ద మారియమ్మన్ ఆలయానికి కందులు పోసే విషయంలో పంచాయతీ కౌన్సిల్ చైర్మన్ భర్త కదిరవన్‌న, అదే గ్రామానికి చెందిన మాయవన్ మధ్య వాగ్వాదం జరిగింది. కదిరవన్ దాడిలో మాయవన్ తీవ్రంగా గాయపడడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. బందోబస్తులో ఉన్న వడపొన్‌న్‌పరప్పి హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆయనకు రివార్డు అందించి అభినందించారు. -
సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి!
ఎగవేతదార్లు(డిఫాల్టర్లు) నుంచి జరిమానా బకాయిలు వసూలు చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సరికొత్త ప్రణాళిక రచించింది. డిఫాల్టర్ల ఆస్తులు, ఇతర సమాచారాన్ని తెలియచేసే వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 515 మంది ఎగవేతదార్ల జాబితాను సెబీ విడుదల చేసింది. వీళ్లకు సంబంధించిన సమాచారాన్నే తెలియజేయాల్సి ఉంది. రెండు దశల్లో చెల్లింపు ఇలా డిఫాల్టర్ల ఆస్తుల సమాచారాన్ని తెలియజేస్తే సెబీ రెండు దశల్లో నజరానా అందిస్తుంది. ఎగవేతదారు నుంచి వసూలు చేసిన బకాయి విలువలో 2.5 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అది తొలిదశలో చెల్లిస్తుంది. ఇక తుది దశ కింద బకాయి విలువలో 10 శాతం లేదా రూ.20 లక్షలు ఏది తక్కువైతే అది ఇవ్వనుంది. సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యం సెబీ ప్రకటన ప్రకారం.. డిఫాల్టర్లను నుంచి బకాయి వసూలుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నించినా పూర్తి బకాయి వసూలు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ ఎగవేతదారు ఆస్తులకు సంబంధించి విశ్వసయనీయ సమాచారం అందించేవారికి ఈ నజరానా అందిస్తారు. ఇదే సమయంలో సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలను, నజరానా మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరో తెలుసా? సమాచారం అందించేవారికి ఎంత మేర నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. ఈ నజరానాను ఇన్వెస్టర్ల భద్రత, అవగాహన నిధి నుంచి చెల్లిస్తారు. మార్చి 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 2021-22 సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. వసూలు కష్టంగా మారిన బకాయిల విభాగం కింద 2022 మార్చి చివరి నాటికి రూ.67,228 కోట్ల బకాయిలను సెబీ గుర్తించింది. నజరానా ప్రకటించడం వల్ల బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు దోహదం చేస్తుందని సెబీ భావిస్తోంది. -
ఎగవేతదారుల ఆస్తుల వివరాలిస్తే రివార్డ్
న్యూఢిల్లీ: జరిమానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఎగవేతదారుల నుంచి సొమ్ము రికవర్ చేసుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొత్త పథకానికి తెరతీసింది. ఎగవేతదారుకు చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించేవారికి రూ. 20 లక్షలవరకూ బహుమతి(రివార్డు)ని అందించేందుకు పథకం రచించింది. రివార్డును రెండు(మధ్యంతర, తుది) దశలలో అందించనుంది. మధ్యంతర రివార్డు కింద ఎగవేతదారుడికి చెందిన ఆస్తి విలువ రిజర్వ్ ధరలో 2.5 శాతం మించకుండా లేదా రూ. 5 లక్షలవరకూ(వీటిలో ఏది తక్కువైతే అది) చెల్లిస్తారు. తదుపరి బకాయిల వసూల విలువలో 10 శాతం మించకుండా లేదా రూ. 20 లక్షలలోపు తుది బహుమతిగా ఇవ్వనుంది. అయితే రికవరీకి వీలయ్యే ఆస్తుల సమాచారమిచ్చే వ్యక్తి విశ్వాసపాత్రమైన వివరాలు అందించవలసి ఉంటుంది. సమాచారమిచ్చేవారి వివరాలు, రివార్డు తదితరాలను రహస్యంగా ఉంచుతారు. ఇందుకు అనుగుణంగా సెబీ 515 ఎగవేతదారులతో రూపొందించిన జాబితాను తాజాగా విడుదల చేసింది. -
శ్రద్ధా కేసు: అఫ్తాబ్‌కి ఆ సమయంలో రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాని తీసుకువెళ్తున్న వాహనంపై కొందరూ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అతడికి రక్షణగా ఉన్న ఐదుగురు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ఆ సమయంలో సరైన విధంగా స్పందించిన ఢిల్లీ ఆర్మీ పోలీస్ బృందానికి చెందిన మూడవ బెటాలియన్ పోలీస్ కమాండ్‌కి రివార్డులు బహుకరించారు. ఈ మేరకు సబ్ఇన్స్పెక్టర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రివార్డు అందజేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు రూ 5000/-లు మరోక కానిస్టేబుల్ రూ. 5000లు బహుకరించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు అప్తాబ్‌ను పాలీగ్రఫీ టెస్ట్ నిమిత్తం సోమవారం ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అఫ్తాబ్‌కి నిర్వహించాల్సిన టెస్ట్‌లు పూర్తి అయిన తదనతరం రక్షణగా ఉన్న ఢిల్లీ ఆర్మీ పోలీసు బృందం వ్యాన్ని పూర్తిగా తనిఖీ చేసి తీహార్ జైలుకి తరలించేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా వ్యాన్ రోహిణి ప్రాంతంలోని కార్యాలయం నుంచి గేటు దాటుతుండగా... అకస్మాత్తుగా ఒక గుంపు జైలు వ్యాన్‌పై దాడి చేసింది. దీంతో ఢిల్లీ ఆర్మ్డ్ పోలీస్(డీఏపీ) బృందం అద్భుతమైన తెగువను ప్రదర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రక్షించింది. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం అని ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంటూ వారికి రివార్డులు అందజేసింది. కాగా అప్తాబ్ పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ నిందితులు కుల్దీప్ ఠాకూర్, నిగమ్ గుర్జార్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. (చదవండి: ‘మా సోదరిని వాడు 35 ముక్కలు చేశాడు సార్.. మేం 70 ముక్కలు చేస్తాం’) -
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25,000 రివార్డ్!
డెహ్రాడూన్: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ‘నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్ సింగ్. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’
కొచ్చి: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది. ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. -
చిలుకను తెచ్చిచ్చినందుకు రూ.85 వేల నజరానా
తుమకూరు: ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే కుక్కలు, పక్షులు వంటి జంతువులు తప్పిపోతే వాటి యజమానుల బాధ వర్ణనాతీతం. పగలూ రేయి నిద్రాహారాలు మానేసేవారు ఉన్నారు. అదే కోవకు చెందిన ఓ యజమాని తప్పిపోయిన చిలుకను తెచ్చిచ్చిన వ్యక్తికి రూ.85 వేల బహుమానాన్ని అందించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు నగరం జయనగరలో జరిగింది. అర్జున్ అనే వ్యక్తి అరుదైన 2 ఆఫ్రికన్ బూడిద రంగు రామచిలుకలను ఇంట్లో పెంచుకుంటున్నాడు. వాటికి ఏటా ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపేవాడు. వారం కిందట అందులోని ఒక చిలుక ఎగిరిపోయింది. దీంతో అర్జున్ చిలుకను పట్టిస్తే రూ.50 వేల నజరానా ఇస్తానని పోస్టర్లు వేయించాడు. ఫలితం లేకపోవడంతో ఆ బహుమానాన్ని రూ. 85 వేలకు పెంచాడు. శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ అనే వ్యక్తి బుట్టలో చిలుకను తీసుకువచ్చి అర్జున్‌కు ఇచ్చాడు. రోడ్డుపై పడి ఉంటే ఇంటికి తీసుకెళ్లి పరిచర్యలు చేశానని పోస్టర్లను చూసి మీ దగ్గరకు పట్టుకువచ్చానని అర్జున్‌కు చెప్పాడు. దీంతో మాట ప్రకారం శ్రీనివాస్‌కు రూ.85 వేల నగదును అర్జున్ అందజేశాడు. -
భలే ఆఫర్.. ఆ చిలును తెచ్చిస్తే రూ. 50వేలు ఇస్తారట..
తుమకూరు: ఒకప్పటి పాత సినిమాలలో మాంత్రికుని ప్రాణం ఏడు సముద్రాల అవతల ద్వీపంలో ఉన్న చిలుకలో ఉంటుందని కథ సాగుతుంది. ఆ చిలుక కోసం కథానాయకుడు వేట సాగిస్తాడు. అంత కాకపోయినా ఇక్కడ చిలుకను పడితే రూ.50 వేలు కానుక పొందవచ్చు. తుమకూరు నగరంలోని జయనగర లేఔట్లో నివసిస్తున్న ఒక కుటుంబం రెండు చిలుకలను పెంచుతోంది. ఏటా చిలుకల జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల ఒక చిలుక ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ పక్షి కోసం పగలూ రాత్రి గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. రెండున్నర ఏళ్లుగా ఎంతో ప్రేమగా సాకుతున్న చిలుక తప్పిపోయిందని, దానిని వెతికి తీసుకువస్తే రూ. 50 వేల బహుమతిని అందిస్తామని సదరు కుటుంబం ప్రకటించింది. నగరంలో అక్కడక్కడ బ్యానర్లు కట్టారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. More Video for Missing Parrot -#Tumakuru: A family that rears parrots at home in Tumakuru has announced Rs 50,000 cash for those who can find their favourite bird which went missing.#Karnataka #Missing #Tumakuru pic.twitter.com/C2vfbxz3UU — Chaudhary Parvez (@ChaudharyParvez) July 19, 2022 -
స్విగ్గీ బంపర్ ఆఫర్: నెటిజన్ల సెటైర్లు
సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్‌ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
త్యాగానికి బహుమతి! పరిహారం మంజూరు
ఎల్ఎన్ పేట, హిరమండలం, శ్రీకాకుళం పీఎన్ కాలనీ: వంశధార నిర్వాసితులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అదనపు పరిహారాన్ని వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం ప్రకటించింది. మెత్తం రూ.216.71కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని పునరావాస కాలనీల్లో లబ్ధిదారులను గుర్తించే పనిలో అ«ధికారులు పడ్డారు. ఇదీ చరిత్ర.. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2005లో హిరమండలం వద్ద 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వంశధార రిజర్వాయర్ (జలాశయం) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వాసితులను గుర్తించేందుకు అనేక సర్వేలు 2007 వరకు జరిగాయి. సర్వే అనంతరం పంట భూములకు పరిహారం చెల్లించి నిర్మాణం పనులు చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట మండలాల్లోని 19 గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరో 14 గ్రామాలు పాక్షికంగా నష్టపోయాయి. 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా గుర్తించారు. అప్పట్లో ఎకరా పల్లం భూమికి రూ.1.29లక్షలు, ఎకరా మెట్టు భూమికి రూ.90 వేలు నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందజేశారు. ఇప్పుడు అదనపు పరిహారం చెల్లించేందుకు రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు పొందుపరుస్తున్నారు. అయితే చాలామంది భూ యజమానులు చనిపోయారు. వారి స్థానంలోకి వచ్చిన వారి ఫ్యామిలీ సర్టిఫికెట్(లీగల్ హేర్) వివరాలు సేకరిస్తున్నారు. అదనపు పరిహారం చెల్లింపు ఇలా.. భూములు కోల్పోయిన రైతులతో పాటు పీడీఎఫ్ పొందిన కుటుంబాలకు ఆదనపు పరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రిజర్వాయర్ నిర్మాణం కోసం 9,579.62 ఎకరాల భూమిని సేకరించగా వీటిలో 8775.42 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి. 804.20 ఎకరాల డి–పట్టా భూములు ఉన్నాయి. భూములకు గాను ఎకరానికి రూ.లక్ష అదనపు పరిహారంగా మొత్తం 95.80 కోట్లు విడుదల చేశారు. 12,091 మంది పీడీఎఫ్ అర్హత కలిగిన కుటుంబాలు ఉండగా వీరిలో 7,103 కుటుంబాలకు పీడీఎఫ్ పరిహారానికి, 4,988 మంది 18 ఏళ్లు దాటిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చెప్పున్న రూ.120.91 కోట్లు విడుదల చేశారు. ఎమ్మెల్యేదే కీలక పాత్ర వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తీసుకురావటంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కూడా కృషి చేశారు. అదనపు పరిహారం విడుదలపై కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమలరావులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మాట నిలబెట్టుకునేలా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో హిరమండలం వచ్చి ఒక బహిరంగ సభలో నిర్వాసితుల కష్టాలను తెలుసుకున్నా రు. అప్పుడే మన ప్రభుత్వం వస్తే ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు రూ.216.71 కోట్లు విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి కోరిన ప్రొఫార్మాలో వంశధార నిర్వాసితుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా నిర్వాసితుల పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. – ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం సంతోషంగా ఉంది వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనపు పరిహారం ఇస్తాననడం ఎంతో సంతోషంగా ఉంది. çస్థిరాస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యాం. పునరావాస కాలనీల్లో అదనపు పరిహారం కోసం గ్రామాల్లో సర్వే ముమ్మరంగా సాగుతుంది. – గవర వెంకటరావు,నిర్వాసితుడు గార్లపాడు -
వికటించిన పెడిక్యూర్.. ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం
మహిళలు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటారనే విషయం తెలుసు. కానీ ఒక్కొసారి అవి వికటిస్తే ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో కుడా ఇటీవల చూస్తున్నాం. అచ్చం అలానే ఒక మహిళ పాదాలకు మానిక్యూర్ చేయించకున్న తర్వాత ఆమె ఏకంగా కాలునే పొగొట్టుకుంది. (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) అసలు విషయంలోకెళ్లితే....ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్‌కి వెళ్లింది. అయితే అప్పుడు ఆమె పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంది. అప్పుడు పార్లర్ వాళ్లు పాదాలు మంచి అందంగా ఉండే నిమిత్తం కాస్మటిక్ ట్రీట్మెంట్ వంటివి చేశారు. అయితే ఆ సమయంలో ఆమె పాదం కాస్త తెగుతుంది. ఈ మేరకు ఆమెకు ఫెరిఫెరల్ వాస్క్యూలర్ అనే వ్యాధి( రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఏర్పడి ద్వారాలు ఇరుకై రక్త ప్రవహానిక అవరోదం ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు. దీంతో ఆ చిన్న గాయం కాస్త మానకపోగా పూర్తిగా ఇన్ఫెక్షన్కి గురై కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైద్యా ఖర్చుల అధికమవ్వడమే కాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లును కూడా కోల్పోయింది. అయితే 55 ఏళ్ల ఈ మహిళ పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఏదిఏమైతేనే ఆ టామీస్ నెయిల్స్ పార్లర్ మూడు సంవత్సరాల తర్వాత తమ తప్పుని ఒప్పుకోవడమే కాక ఆ మహిళకు ఏకంగా రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. (చదవండి: తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!) -
నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!
ఇటీవలకాలంలో భార్యలే భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. వాళ్లు వ్యక్తి గత కారణాల రీత్యానో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. కానీ భర్తలు మాత్రం తమ భార్యల తిరిగి వస్తే చాలు పాతవాటిని గురించి పట్టించుకోం మాతో ఉంటే చాలు అంటూ ఆవేదనగా వాపోతున్న సంఘటనలు ఎక్కువగా చూశాం. అచ్చం అలాంటి సంఘటన బెంగాల్‌లోని పింగ్లా గ్రామంలో చోటుచేసుకుంది. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి) అసలు విషయంలోకెళ్లితే....బెంగాల్‌లోని పింగ్లా గ్రామం నివాసి అయిన ఒక వ్యక్తి వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను డిసెంబర్ 9న పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య, బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయిందని అతనికి ఇంట్లో సభ్యులు తెలిపారు. దీంతో అతను మరుసటి రోజే ఇంటికి వచ్చి తన భార్య ఆచూకి కోసం గాలించడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రయత్నం ఫలించ లేదు. చివరి ప్రయత్నంగా సోషలో మీడియాలో తన బాధనంతా పోస్ట్ చేశాడు. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో" నేను పని నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నా భార్య చిన్నారితో సహా కిటికి గుండా పారిపోయింది. ఆమెను ఎవరైన వెతికి తీసుకు వస్తే రూ 5000 పారితోషకం ఇస్తాను" అని ప్రకటించాడు. అంతేకాదు తన ఇంట్లో మొబైల్ ఫోన్ లేదని అందువల్లే తన భార్య మొబైల్ ఫోన్ తీసుకువచ్చే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అతను చెప్పగా, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా తన భార్య ఒక్కత్తే కిటికి పగలకొట్టి పారిపోలేదని అతని సహాకారంతోనే ఈ ఘటనకు పాల్పడిందని వాపోయాడు. ఇంట్లోంచి వెళ్లే ముందు డబ్బు, నగలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకుపోయిందని అన్నాడు. పైగా ఆ రోజు రాత్రి తమ ఇంటి ముందు నెంబర్ ప్లేట్ లేని నానో కారు ఆగిందని కూడా చెబుతున్నాడు. ఈ మేరకు సదరు వ్యక్తి తన భార్య బంగారు వస్తువులకు ప్రలోభ పడి అతనితో వెళ్లిపోయిందంటూ ఆరోపించాడు. పైగా పెద్దగా చదువుకోలేదు కాబట్టి సులభంగా ఆ వ్యక్తి మాయమాటలకు పడిపోయి వెళ్లిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె పారిపోయిన దాని గురించి తానేం ఆలోచించటం లేదని పైగా తాను తన కుటుంబసభ్యులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) -
శెభాష్ దాస్.. క్యాష్రివార్డ్ ప్రకటించిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యువకుడికి నజరానా ప్రకటించింది. హ్యాకర్ల పాలిట కల్పతరువుగా మారిన ఓ బగ్‌ను కనిపెట్టిన కృషికి ఫలితంగా ఆ యువకుడికి క్యాష్ ప్రైజ్‌ను అందించింది. అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు.. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సర్వీసులో ఒక బగ్‌ను గుర్తించాడు. ఈ బగ్ సాయంతోనే హ్యాకర్లు యూజర్ల ఫోన్‌ను హ్యాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డాటాను తస్కరించే అవకాశం ఉంది. ఈ బగ్‌ను రిపోర్టింగ్ చేసినందుకు గానూ 5 వేల డాలర్లను(మన కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు) ప్రకటించింది గూగుల్. దాస్ ఈ బగ్‌ను ఈ ఏడాది మే నెలలోనే గుర్తించాడు. ఈ కష్టానికి గుర్తింపుగా 5వేల డాలర్లు అందిస్తున్నాం అని గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం ఒక మెయిల్ ద్వారా దాస్‌కు తెలియజేసింది. దాస్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్..ఇలాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్తాయట. అయితే గోప్యత కారణంగా బగ్‌కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించేందుకు దాస్ ఇష్టపడలేదు. సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్.. గతంలో గువాహటి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనూ బగ్‌ను గుర్తించాడు. ఇక రోనీ దాస్ గుర్తించిన బగ్‌ను ఫిక్స్ చేసిందా? లేదా? అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. బగ్‌లను గుర్తించిన రీసెర్చర్లు, ఇంజినీర్లు, సైబర్ ఎక్స్‌పర్ట్స్‌లకు టెక్ దిగ్గజాలు నజరానా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తి ఉంటే మీరూ ఆ దిశగా ప్రయత్నం చేసి అదృష్టం పరీక్షించుకోండి. చదవండి: భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం.. వామ్మో! -
Jai Bhim: సూర్యపై దాడి చేస్తే లక్ష రూపాయల బహుమతి!
PMK Announces Rs 1 Lakh Reward for Attacking Hero Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్ పలు వివాదాలకు దారితీస్తుంది. భారీ అంచనాల మధ్య ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తుంటే.. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. (చదవండి: పార్వతి అమ్మాళ్కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్) అంతేకాదు వన్నియార్ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది. ఇదే వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు. మరోపైపు పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా సూర్యకు మద్దతు ప్రకటిస్తున్నారు. -
అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది !
Pregnant Cat Saved Video: మనం చేసే మంచి పని ఏదో ఓ రూపంలో మనకి సహాయపడుతుందంటారు. సరిగ్గా అలానే ఆపదలో ఉన్న ఓ పిల్లిని కొందరు మానవత్వం కాపాడారు. అదే వాళ్లకు అదృష్ట దేవతలా మారి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు నసిర్ షిహాబ్, మహమ్మద్ రషిద్ దుబాయ్‌లో పని చేస్తున్నారు. నసిర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రషిద్ కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ భవనం రెండో అంతస్తు నుంచి పిల్లి కింద పడిపోయే ప్రమాదం ఉన్నట్లు రషిద్ గమనించాడు. నసిర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఇక వెంటనే ఆ ఇద్దరూ పిల్లిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పిల్లి సరిగ్గా కింద పడే ప్రాంతంలో బెడ్ షీట్‌ని పట్టుకుని నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో అంతస్తు బాల్కనీ నుంచి నేరుగా వారి ఉంచిన ఆ బెడ్ షీట్లో పడి ప్రాణాలు దక్కించుకుంది. అయితే.. ఆ పిల్లి ప్రెగ్నెంట్‌గా ఉండటంతో.. దాన్ని కాపాడిన ఆ ఇద్దరు భారతీయులను, వారికి సహాయం చేసిన మరో ఇద్దరిని అక్కడి స్థానికులు మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రషిద్.. తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో దుబాయ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చివరికి ఆ దేశ రూలర్షేక్ మహమ్మద్ బిన్ రషిద్ కంట పడింది. దీంతో షేక్ మహమ్మద్.. పిల్లిని కాపాడినందుకుగాను 10 లక్షల రివార్డును ప్రకటించాడు. ఆ ఇద్దరి భారతీయులతో పాటు ఈ రెస్క్యూ ప్లాన్‌లో సహకరించిన పాక్ దేశస్తుడైన అతీఫ్ మెహమూద్, మొరాకో సెక్యూరిటీ గార్డు అష్రఫ్ కూడా బహుమతులు అందించాడు. Proud and happy to see such acts of kindness in our beautiful city. Whoever identifies these unsung heroes, please help us thank them. pic.twitter.com/SvSBmM7Oxe— HH Sheikh Mohammed (@HHShkMohd) August 24, 2021 చదవండి: Bride Beats Groom Viral Video: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్! -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్‌తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం నజరానా రూ. 6 కోట్లు
భారత అథ్లెటిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అటు ప్రశంసలు ఇటు రూ. కోట్లు కురుస్తున్నాయి. హరియాణాకు చెందిన ఈ చాంపియన్ అథ్లెట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం అతనికి రూ. 6 కోట్ల పారితోషికం, క్లాస్–1 ఉన్నతోద్యోగంతో పాటు నివాస స్థలం (నామమాత్రపు ధరతో) ఇస్తామని సీఎం తెలిపారు. కాంస్యం నెగ్గిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు రూ.2 కోట్ల 50 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం అందజేస్తామని చెప్పారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు క్రికెట్ వర్గాలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రూ. ఒక కోటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ. ఒక కోటి నజరానాగా ఇస్తామని వెల్లడించింది. దేశీ వాహనరంగ సంస్థ మహీంద్ర త్వరలో విడుదల చేసే ‘ఎక్స్‌యూవీ700’ ప్రీమియం కారును తొలుత నీరజ్‌కే బహుమతిగా ఇస్తామని మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు. -
హ్యాట్రిక్ గర్ల్‌కు ప్రభుత్వ భారీ నజరానా
డెహ్రాడూన్: హాకీ క్రీడాకారిణి, హ్యాట్రిక్ గర్ల్ వందన కటారియాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనకుగాను ఆమెకు రూ. 25 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అలాగే ఆటలలో ప్రతిభను పెంపొందించేందుకు త్వరలోనే ఒక ఆకర్షణీయమైన కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నామని కూడా ఆయన చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శనలో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ కులంపేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులనుపోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక నేషనల్ హాకీ ప్లేయర్ అని సమాచారం. తెలుస్తోంది. అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో వందన కటారియా వల్లనే ఓడి పోయిందంటూ దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. దీనిపై వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రోష్నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందనా కటారియా. టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సరికొత్త రికార్డు సాధించింది. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి హోరా హోరీ కాంస్య ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించాలనే భారత మహిళల హాకీ జట్టు ఆశ ఫలించకుండా పోయింది. -
శునకం మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.5వేలు!
టీ.నగర్: కనిపించకుండాపోయిన పెంపుడు కుక్క పిల్ల ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ప్రకటించాడో ఆ శునక యజమాని. అంతేకాకుండా పోస్టర్లు సైతం ముద్రించి పలుచోట్ల అతికించాడు. వివరాలు.. శివగంగై జిల్లా, మదగుపట్టి తూర్పు వీధికి చెందిన రైతు వైరవన్. ఇతను జల్లికట్టు ఎద్దులను పెంచుతుంటాడు. పెంపుడు జంతువులంటే ఆసక్తి కలిగిన ఇతను నెల క్రితం రామనాథపురం జిల్లా, కముది నుంచి ఒక కుక్క పిల్లను కొనుగోలు చేశాడు. ఇది ప్రసిద్ధి చెందిన రాజపాళయం జాతికి చెందింది. ఇది మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో వైరవన్ కంటికి కునుకు కరువైంది. మనస్తాపానికి గురయ్యాడు. తన పెంపుడు శునకం ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ఇస్తానంటూ మదగుపట్టి, బాగనేరి, సొక్కనాథపురం ప్రాంతాలలో పోస్టర్లు అతికించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆయన కుటుంబీకులు, బంధువులు ఈ శునకం అన్వేషణలో పడ్డారు. ఈ పోస్టర్లు చూసి జనం వెతికేందుకు సిద్ధమయ్యారు. -
జొమాటో బంపర్ ఆఫర్ : లక్షలు గెల్చుకునే లక్కీ ఛాన్స్!
సాక్షి,ముంబై: ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలోనే ఐపీవోకు వస్తున్న జొమాటో టెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు ఒక సువర్ణావకాశాన్ని ప్రకటించింది. ఐపీవో ప్రమోషన్‌తోపాటు, తమ యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్‌పెట్టేలా ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. జొమాటో వెబ్సైట్లో కానీ, యాప్‌లో కానీ బగ్స్ కనిపెడితే 4,000 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) గెలుచుకోవచ్చని ట్విటర్ ద్వారా వెల్లడించింది. "జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్’’లో సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను గుర్తించిన వారికి ఈ రివార్డును ఇవ్వనుంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ జూలై 8న అధికారికంగా ప్రకటించింది. బగ్స్ తీవ్రతను బట్టి, బహుమతి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని జొమాటో సెక్యూరిటీ ఇంజనీర్ యష్ సోధా ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా కోరారు. ఫేస్బుక్ ,గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు, టెక్ ఆధారిత ప్లాట్‌ఫాంలలో బగ్‌లు,సెక్యూరిటీ సమస్యలు గుర్తించిన వారికి రివార్డులు ప్రకటించడం మామమూలే. ఇందులో భాగంగానే జొమాటలోతాజాగా ఈ బహుమతిని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ (సీవీఎస్ఎస్)ను ఏర్పాటు చేసింది. ఈ స్కోరు ఆధారంగా తుది బహుమతి విలువను సంస్థ నిర్ధారించనుంది. తీవ్రమైన హాని కలిగించే బగ్‌ను గుర్తించిన వారికి ఈ స్కోర్ 10గా ఉంటుంది. తద్వారా 4,000 డాలర్లు గెల్చుకోవచ్చు. ఈ స్కోరు 9.5గా ఉంటే.. రివార్డు 3,000 డాలర్ల వరకు ఉంటుంది. సో.. ఔత్సాహికులూ.. హ్యాపీ హ్యాకింగ్. Starting today, we’re increasing the rewards for @zomato's bug bounty program: $4,000 for critical, $2000 for high, and so on. We welcome your participation and look forward to your reports! Happy Hacking :) Find more details here: https://t.co/OSvNH1q6Mm — Yash Sodha (@y_sodha) July 8, 2021 -
సుశీల్ కుమార్ ఆచూకీ చెబితే రూ.1 లక్ష!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే. -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
-
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్ ఘటనకు ప్రధాన సూత్రధారైన హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టును మడివి. వనజగా గుర్తించారు. ఆమె వద్ద నుంచి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. అతడిని పట్టుకునేందకు వెళ్లిన దళాలు అతడి వ్యూహంలో చిక్కుకున్నాయి. అనంతరం భద్రతా దళాలను హిడ్మా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. గతంలో కసాపాల్, మినపా ఘటనలకు హిడ్మానే నాయత్వం వహించాడు. ఎవరీ హిడ్మా.. హిడ్మా అలియాస్ హిడ్మాన్న(40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజనుడు. 90వ దశకంలో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు. భయంకరమైన, ఘోరమైన ఆకస్మిక దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ప్రస్తుతం మహిళలతో సహా 180-250 మంది మావోయిస్టుల దళానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో (డీకేఎస్‌జడ్) లోనే కాక సీపీఐ(ఎం) 21 సుప్రీం మెంబర్ సెంట్రల్ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అతడిని సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా నియమించినట్లు తెలిసింది. భీమ్ మాండవి హత్యా నేరంలో ఎన్ఐఏ హిడ్మాపై చార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎలా దాడి చేస్తారంటే.. ప్రతి ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో మావోయిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేసుకుని వ్యూహాత్మక ఎదురు దాడి (కౌంటర్ ఆఫెన్సివ్ కాంపెయిన్(టీసీఓసీ) అంబుష్ ఆపరేషన్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం)లను నిర్వహిస్తారు. ఈ కాలాన్నే ఎందుకు ఎన్నుకుంటారంటే.. ఈ సీజన్లో చెట్లు ఆకులు రాలి మోడులుగా మారడంతో భద్రతా దళాల కదలికలు బాగా కనిపిస్తాయి. అందుకే మావోయిస్టులు ఎక్కువగా ఈ సీజన్లో ఎదురుదాడులకు దిగుతారు. నేడు చత్తీస్‌గఢ్‌కు అమిత్ షా.. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఉ.10.30 గంటలకు జగదల్పూర్కు వెళ్లి.. అమరులైన జవాన్లకు అమిత్ షా నివాళులర్పించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం అమిత్ షా రాయ్‌పూర్‌లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే -
దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే రూ. లక్ష
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 రోజులపాటు ప్రశాంతంగా సాగిన అన్నదాతల నిరసన.. గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. అప్పటి వరకు రైతులకు మద్దతుగా నిలిచిన వారు వెనకంజ వేశారు. రైతు సంఘాల మధ్య కూడా చీలకలు వచ్చాయి. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో తలెత్తిన విధ్వంసానికి నటుడు, సింగర్ దీప్ సిద్ధునే ప్రధాన కారకుడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా) ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధుపై బుధవారం నాడు లక్ష రూపాయాల రివార్డును ప్రకటించారు. రైతు గణతంత్ర పరేడ్ నాడు దీప్ సిద్ధు ఎర్రకోటపై జెండా ఎగురవేయడమే కాక ఫేస్బుక్ లైవ్‌లో జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఉద్రిక్తతలు చేలరేగాయి. ఇక నాటి నుంచి ఆయన కన్పించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీప్ సిద్ధుతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు రివార్డు ప్రకటించారు. దీప్ సిద్ధు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. -
20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం
శ్రీనగర్: గత ఏడాది జూలై 18న కశ్మీర్‌లోని అంషిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నగదు రివార్డు రూ.20 లక్షల కోసం ఆశపడిన 62–రాష్ట్రీయ రైఫిల్స్ రెజిమెంట్ కెప్టెన్ భూపేందర్ సింగ్ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లు తేలింది. ఈ ఘటనలో అతడికి ఇద్దరు స్థానికులు సాయపడినట్లు కూడా సిట్ గుర్తించింది. ఈ మేరకు 300 పేజీల చార్జిషీటును షోపియాన్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సికందర్ అజామ్‌కు గత డిసెంబర్ 26న సమర్పించింది. ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న షోపియాన్‌కు చెందిన తబిష్ నాజిర్, పుల్వామా వాసి బిలాల్ అహ్మద్‌లతో కలిసి కెప్టెన్ భూపేందర్ సింగ్ పథకం వేశాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ మరో నలుగురు జవాన్లను తీసుకుని అంషిపొరా వెళ్లారు. నలుగురు జవాన్లు కార్డాన్ సెర్చ్ చేపడుతున్న సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వారికి వినిపించింది. ఆ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్చినట్లు అనంతరం సింగ్ వారితో నమ్మబలికాడు. ముగ్గురినీ కాల్చి చంపిన అనంతరం వారిని గుర్తు పట్టకుండా చేసి, ఆయుధాలు ఉంచాడు. మృతులు అబ్రార్ అహ్మద్(25), ఇంతియాజ్ అహ్మద్(20), మొహమ్మద్ ఇబ్రార్(16)ల ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆపిల్ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలుగా వారిని గుర్తించారు. ఖననం చేసిన మృతదేహాలను అక్టోబర్ 3వ తేదీన కుటుంబసభ్యులకు అందజేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టింది. దీనిపై ఏర్పాటైన సిట్ 75 మందిని ప్రశ్నించింది. అనుమానితుల కాల్ రికార్డును పరిశీలించింది. నగదు రివార్డు కోసమే భూపేందర్ సింగ్, స్థానిక ఇన్ఫార్మర్లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు గాను వారికి కొన్ని వేల రూపాయలు ముట్టినట్లు కూడా తేలింది. రూ.20 లక్షల రివార్డు కోసం తమ అధికారి బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలపై సైన్యం స్పందించింది. అవి సైనిక వ్యవస్థలోని వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని పేర్కొంది. ‘యుద్ధ క్షేత్రంలో గానీ, ఇతర విధుల్లో గానీ పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి నగదు రివార్డులు అందజేసే విధానం లేదని శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. -
మధ్యప్రదేశ్, ఏపీలకు కేంద్రం రివార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది. కాగా రివార్డులో భాగంగా కేంద్రం స్పెషల్ అసిస్టేన్స్ కింద ఈ రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును అందించింది. ఇందులో ఏపీ వాటా 344 కోట్ల రూపాయలు ఉండగా.. మధ్యప్రదేశ్ వాటా 660 కోట్లు. -
అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా
వాషింగ్టన్ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడులకు పాల్పడడంలో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై భారీ నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చిన వారికి 5 లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సందర్భంగా సాజిద్ మిర్ సమాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ సాజిద్ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. -
ఈ పిల్లిని పట్టిస్తే రూ.15 వేలు మీ సొంతం
గోరఖ్‌పూర్: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు మాయమైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఏం చేసైనా సరే దాని జాడ కనుక్కోవాలని దగ్గరలోని సందుల్లో దూరి, పక్కింట్లోకి తొంగి చూసి వీలైనన్ని చోట్లా వెతుకుతాం. అయినా ఆ జంతువు కనిపించకపోతే గుండె బరువెక్కి అన్నం కూడా సహించదు. ఇలాంటి బాధలోనే కూరుకుపోయారు ఓ మహిళ. భారత్‌లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య, నేపాల్‌లోని మాజీ ఎన్నికల అధికారిణి ఇల శర్మ పిల్లిని పెంచుకుంటున్నారు. అది క్షణం కనిపించకపోయినా అల్లాడిపోయేవారు. ఎక్కడికెళ్లినా దాన్ని వెంటబెట్టుకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఆమె తన కూతురు సాచి, డ్రైవర్ సురేందర్‌తో పాటు, తన పెంపుడు పిల్లితో సహా ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్!) ఇంతలో రైలు పెద్ద శబ్ధంలో కూత పెట్టుకుంటూ రావడంతో బెంబేలెత్తిన పిల్లి అక్కడనుంచి పరిగెత్తింది. అలా భయంతో తప్పిపోయిన మార్జాలం కోసం ఎంత వెతికినా దాని జాడ కానరాలేదు. దీంతో ఆకుపచ్చని కళ్లు, ముక్కు మీద గోధుమ రంగు మచ్చ ఉండి రెండున్నరేళ్ల వయసున్న పిల్లి తప్పిపోయిందని, కనిపిస్తే తిరిగి ఇవ్వాలంటూ ఆమె రైల్వే స్టేషన్లోనే కాకుండా నగరంలోనూ పోస్టర్లు అతికించారు. తన పిల్లిని తెచ్చిచ్చిన వారికి 11 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని రూ.15 వేలకు పెంచారు. రోజులు గడుస్తున్నా పిల్లి తిరిగి తన చెంతకు రాకపోవడంతో ఆమె తన ఢిల్లీ ప్రయాణాన్ని మానుకుని గోరఖ్‌పూర్‌లోనే ఉండి దాన్ని వెతికే పనిలో పడ్డారు. (చదవండి: వైరల్ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!) -
యువతి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రివార్డు
సాక్షి, హైదరాబాద్ : అంబేద్కర్‌నగర్‌లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మనీషా అనే యువతి అదృశ్యమైంది. అదే సమయంలో అదే ఇంటికి సమీపంలో నివసించే మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు యువతి తండ్రి పులిగిల్ల లక్ష్మయ్య మూడు నెలల క్రితం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనంలేకుండా పోయింది. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే మహేష్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ కిడ్నాప్ చేశాడా? వారు ఎక్కడున్నారు?. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా గురువారం రివార్డు ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వారు 9490617140, 8555872362 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్‌బీఐ రివార్డు
వాషింగ్టన్: అమెరికాలో ఒక భారతీయ వ్యక్తిని కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి భారీ రివార్డును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. ఈ కేసును ఎఫ్‌బీఐ సెంట్రల్ వర్జీనియా హింసాత్మక నేరాల టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేరస్థుడి ఆచూకీని కనుక్కునేందుకు తాజా ప్రకటన చేసింది. ఈ హత్యకు సంబంధించిన ఏదైన సమాచారం ఇచ్చిన వారికి 15,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. పరేష్‌కుమార్ పటేల్ (ఫైల్ ఫోటో) ఎఫ్‌బీఐ సమాచారం ప్రకారం సెప్టెంబర్16, 2012 న అమెరికాలో ఉంటున్న భారత జాతీయుడు పరేష్‌కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. వర్జీనియాలోని చెస్టర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న పటేల్‌ను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల తరువాత తుపాకీ గుళ్ల గాయాలతో ఉన్న అతని మృతదేహాన్నివర్జీనియా రిచ్మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వద్ద పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో చాలెంజింగ్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. #FBIRichmond's Central VA Violent Crimes Task Force offers up to $15K #reward for info leading to arrest/conviction of person(s) responsible for the 2012 murder of Mr. Pareshkumar Patel. https://t.co/2rk9WgTRwq or 804-261-1044.https://t.co/qtJjIzl9hj @RichmondPolice @CCPDVa — FBI Richmond (@FBIRichmond) September 15, 2020 -
మావోల తలలకు వెల..!
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల తలలకు పోలీస్ శాఖ వెల కట్టింది. సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని వాల్‌పోస్టర్ల ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి తతంగం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా ఉండేది. పదేళ్ల అనంతరం మావోయిస్టుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో రెండుసార్లు ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగి అటవీ ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మావోల ఏరివేతనా..? తరిమికొట్టడమా..? అంశంపై చర్చించారు. అదే సమయంలో మావోయిస్టులు పార్టీ పునర్మిర్మాణం చేసినట్లు రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మావోల అణచివేతకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు వందలాది మందితో 24 గంటలపాటు అడవులను జల్లెడ పడుతున్నారు. పైగా ఉమ్మడి జిల్లా ఓఎస్డీగా మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ ప్రస్థానం నక్సల్ ఉద్యమం ఉమ్మడి జిల్లాల్లో నాలుగు దశాబ్దాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉద్య మం పుట్టింది శ్రీకాకుళంలోనే అయినా ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం ఇక్కడే. బడిపంతులైన కొండపల్లి సీతరామయ్య ఆధ్వర్యంలో జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన పితంబర్రావు దొరగడిపై జరిగిన దాడులు.. వారి సోదరుల హత్యతో భీతిల్లి గుండెపోటుతో మరణించినప్పటి నుంచి ఉద్యమం ఇక్కడి అడవుల్లో వేళ్లూనుకుపోయింది. తరచూ పోలీస్, పీపుల్స్ మధ్య వార్ కొనసాగేది. అదే తరహాలో మవోయిజం తెరమీదికి వచ్చింది. సమాచారం మాకు.. బహుమతి మీకు.. మావోయిస్టుల సమాచారం ఇచ్చి సహకరించాలని, సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందిస్తామని ఓఎస్డీ ఆరుగురు మావోయిస్టుల ఫొటొలతో కూడిన వా ల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీరి తలలకు గతంలోనే వెల కట్టినా.. తాజాగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ ఎస్పీ 944079500, నిర్మల్ ఎస్పీ 8332811100, ఆసిఫాబాద్ ఎస్పీ 8332801100, మంచిర్యాల డీసీపీ 9440795003, ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ 8333986921కు సమాచారం ఇవ్వాలన్నారు. -
24 గంటల్లో 1035 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 242కు, పాజిటివ్ కేసుల సంఖ్య 7,529కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 6,634 కాగా, 652 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 261 మంది మృతి చెందినట్లు. 8,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది. నియంత్రణ చర్యలు లేకుంటే.. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో అన్నారు. లాక్డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు. 586 ఆసుపత్రుల్లో వైద్య సేవలు దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలను కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్ చేశారు. దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో కువైట్‌కు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పున:ప్రారంభించనున్నారు. వైద్య బృందంపై దాడి కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తబ్లిగీల ఆచూకీ చెప్తే 5,000 రివార్డు తబ్లిగీ జమాత్ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 30దాకా లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. కర్ణాటకలో కూడా లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగుతుందని, సంబంధిత విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుందని సీఎం యడ్యూరప్ప శనివారం చెప్పారు. -
కరోనాకు మందు కనిపెడితే రూ. కోటి ఇస్తా!
బీజింగ్ : చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు వుహాన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తమ దేశ పరిస్థితిని చూసి అక్కడి బహళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. అలీబాబా గ్రూప్, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సహా పలువురు వ్యాపారవేత్తలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్‌పై స్పందించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన.. మరో కీలక ప్రకటన చేశారు. కరోనాకు మందు కనిపెట్టిన వారికి 1 మిలియన్ యువాన్(రూ. 1 కోటి) రివార్డ్‌గా ఇస్తానని ప్రకటించారు. (ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!) కరోనాపై పోరాటం కోసం చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) సాయం చేశారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వేలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో చైనాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ ఈ విషయాలు తెలిపారు. జీఎస్టీ కింద తీసుకునే ప్రతీ బిల్లుతోనూ కస్టమర్లు.. లాటరీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. "కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకే లాటరీ బిల్లు భారీ స్థాయిలో పెడుతున్నాం. కాబట్టి బిల్లు తీసుకోకుండా 28 శాతం (గరిష్ట జీఎస్టీ) పొదుపు చేయడం కన్నా రూ. 10 లక్షలో లేదా రూ. 1 కోటి దాకా గెలవడానికి అవకాశం ఉంటుంది కదా అని కొనుగోలుదారులు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. పన్నుల చెల్లింపుపై కొనుగోలుదారుల ఆలోచనా ధోరణులను మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడగలవు" అని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం లాటరీలో పాల్గొనాలంటే కనీస బిల్లు మొత్తం ఉంటుంది. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. -
ట్రంప్ తలపై రూ.575 కోట్లు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన జనరల్ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్ వెబ్సైట్ తెలిపింది. సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.‘ఇరాక్ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అణు ఇంధన శుద్ధి పరిమితులపై.. తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరోధం ఇప్పటిది కాదు ► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ► 1988: గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ► 2000: ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు. ► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది. ► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి. ► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. -
దిశ నిందితుల ఎన్కౌంటర్.. ఆ పోలీసులకు రివార్డు!
హిసార్(హరియాణా) : దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్ పేర్కొన్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు రివార్డు అందజేయనున్నట్టు తెలిపారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు రూ. లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశ ను కాల్చివేసిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపైకి రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే మృతిచెందారు. -
బాగ్దాదీ జాడ చెప్పినందుకు రూ.177 కోట్లు!
వాషింగ్టన్/బాగ్దాద్: ఇటీవల అమెరికా దాడుల్లో హతమైన ఉగ్రసంస్థ ఐసిస్ అధినేత అల్‌బకర్ బాగ్దాదీ గురించి ఐసిస్‌లోని కీలక సభ్యుడే ఉప్పందించాడు. బాగ్దాదీ తలపై రూ. 177 కోట్ల బహుమతిని అమెరికా గతంలో ప్రకటించింది. బాగ్దాదీ సిరియాకి వచ్చిన విషయాన్ని ఐసిస్ కీలక సభ్యుడే అమెరికాకు తెలిపాడు. ఈ నేపథ్యంలో అమెరికా ఇస్తామన్న రూ. 177 కోట్ల నగదు పూర్తిగాగానీ, ఎక్కువ మొత్తంలోగానీ అతడికే దక్కే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జాతీయతనుగానీ మరే వివరాలనుగానీ అతడి భద్రత రీత్యా వెల్లడించలేదు. గతంలో ఇతడే బాగ్దాదీ లోదుస్తులను, రక్తపు శాంపిల్‌ను అమెరికాకు అందించాడు. వీటి ఆధారంగానే మరణించింది బాగ్దాదీదేనని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారించుకున్నారు. -
'మొక్కలను సంరక్షిస్తే రూ. లక్ష నజరానా'
సాక్షి, సిద్దిపేట : మొక్కలు చక్కగా నాటి వాటి సంరక్షణ చేసిన గ్రామానికి, విధులు సక్రమంగా నిర్వహించిన అధికారులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో గ్రామాల వారీగా హరితహారం స్థితిగతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అలాగే రెండో బహుమతి కింద రూ.50వేలు, మూడో బహుమతి రూ.25 వేల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పని చేయని వారిపై చర్యలు కూడా శాఖ పక్షాన ఉంటాయని హెచ్చరించారు. మండలాల వారీగా సమీక్షకు హాజరైన వ్యవసాయశాఖ, ఈజీఎస్ అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శుల హాజరు స్థితిగతులను క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. వచ్చే సమావేశంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. భవిష్యత్తులో సమీక్షలో ఉపన్యాసాలు ఉండవని కేవలం గ్రామాల వారీగా క్షుణ్ణంగా సమీక్ష నిర్వహిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలంటూ సూచిస్తూ మొక్కుబడి సమావేశాలు నిర్వహించకుండా సీరియస్‌గా పని చేసే ఉద్దేశం ఉంటేనే సమీక్షలు నిర్వహిద్దామని లేకపోతే సమయం వృథా చేయడం వద్దంటూ సమీక్ష లక్ష్యం, ఉద్దేశం గూర్చి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఇటీవల సీఎం శాసనసభలో స్పష్టంగా తెలిపిన హరితహారంపై నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యల గూర్చి గుర్తు ఆయన చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి రాదు అనే నమ్మకంతో తాను ఉన్నాడని సమష్టిగా గ్రామాల్లో హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే చర్యలను చేపట్టాలన్నారు. తొలి సమావేశం కావడంతో లక్ష్య సాధనలో వైఫల్యం చెందిన గ్రామాల అధికారులను, ప్రజాప్రతినిధులకు మరొక అవకాశం ఇస్తున్నామన్నారు. సరిగ్గా 30 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని పరిస్థితిలో మార్పు ఉండాలంటూ సూచించారు. మొక్క నాటిన రైతుకు రాబడి రైతులు జీవిత కాలం కష్టపడి పంట తీస్తారు. వృద్ధాప్యంలో ఇంటి వద్ద ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి లాగా ఉద్యోగ విరమణ తర్వాత పెన్ష¯Œన్ ఉండదని కొంచెం అధికారులు రైతులను చైతన్య పరిచి మొక్కలు నాటించడం వలన భవిష్యత్తులో ఒనగూరే ఆదాయం గూర్చి వివరిస్తే మన లక్ష్యం సుగమం అవుతుందంటూ హరీశ్‌రావు అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక టేకు మొక్కను శాస్త్రీయంగా సాగు చేయడం వల్ల 50 సంవత్సరాల వయస్సులో ఎకరంలో వంద టేకు మొక్కలు నాటడం వల్ల వాటిలో 70 మొక్కలు బతికినా వాటిని భవిష్యత్తులో విక్రయించడం వల్ల లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని లెక్కలతో వివరించారు. దినసరి ఆదాయం కావాలనుకునే రైతులకు పొలం గట్లపై మునగ, నిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, జామ లాంటి పండ్ల మొక్కలను నాటడం వల్ల వచ్చే ఆదాయం గూర్చి రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటూ సూచించారు. ప్రతి ఇంటి ముందు ఒక వేపచెట్టు నాటే లక్ష్యంతో సిద్దిపేట నియోజకవర్గంలో హరితహారాన్ని నిర్వహించాలని అదే ప్రధాన అంశంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం సిద్దిపేటఅర్బన్, సిద్దిపేటరూరల్, నారాయణరావుపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల హరితహార లక్ష్యం, ప్రస్తుత స్థితిగతుల నివేదికను ఆధారంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీటీసీలను ఒక్కొక్కరితో మాట్లాడుతూ లక్ష్యం చేరేందుకు చేపడుతున్న చర్యలు, ప్రస్తుతం హరితహారం స్థితిగతులు, గ్రామ ప్రజల భాగస్వామ్యం, రైతుల్లో చైతన్యపరమైన సదస్సుల గూర్చి ఆరా తీస్తూ సలహాలు, సూచనలు అందిస్తూ సమీక్షను నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, తుపాకుల ప్రవళ్లిక, కుంబాల లక్ష్మి, ఎంపీపీలు శ్రీదేవి, వంగ సవిత, బాలమల్లు, మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు పాల్గొన్నారు. -
యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!
సాక్షి, కడప: సాహసోపేతంగా యువకుడిని కాపాడిన రిమ్స్ ఎస్సైను జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అభినందించారు. రెండు రోజుల క్రితం పాలకొండలో తేనెటీగల దాడిలో గాయపడిన యువకుడ్ని తన భుజంపై మోసుకుని కొండ కిందకు రిమ్స్ ఎస్సై తెచ్చిన విషయం విధితమే. ఎస్సై సమయస్పూర్తితో వ్యవహరించిన కారణంగా తేనేటీగల బారిన పడిన యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా రిమ్స్ ఎస్సై, సిబ్బందికి రివార్డు అందజేశారు. -
ఆచూకీ తెలిపితే రూ. 5లక్షల రివార్డు
న్యూఢిల్లీ : గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. విమానం కోసం తీవ్ర గాలింపు చేపట్టిన అధికారులు.. ఆరు రోజులు గడిచిన ఆచూకీ కనుగొనలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దళానికి చెందిన ఎయిర్ మార్షల్ ఆర్ డి మాథుర్ శనివారం ఈ ప్రకటన చేసినట్టు డిపెన్స్ పీఆర్వో వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ తెలిపారు. విమానం ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందజేసిన వారికి రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించారు. గల్లంతైన విమానం గురించి ఎవరైన కొద్దిపాటి సమాచారం అందజేసిన దాన్ని గుర్తించడం తెలిక అవుతుందని పేర్కొన్నారు. సమాచారం తెలుపాల్సిన వారు 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాం లోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. అధికారులు ఇస్రో సాయం తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. -
హానర్ ఫోన్ పోయింది..ఇస్తే రూ.4 లక్షలు
సామాన్య మానవుడు విలువైన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకోవడం అంటే చెప్పలేని బాధ. మరి అలాంటిది టెక్ జెయింట్ పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను కోల్పోతే.. ధర పరంగా పెద్దగా బాధపడకపోయినా.. ఇంకా లాంచ్ కావాల్సిన స్మార్ట్‌ఫోన్ మిస్ అయితే మాత్రం కష్టమే. జర్మనీకి చెందిన మొబైల్ మేకర్ హువావే సబ్బ్రాంబ్ హానర్‌కు చెందిన ఉద్యోగి ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. దీంతో ఆ ఫోన్‌ను తెచ్చి ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. సురక్షితంగా హానర్ మొబైల్ తెచ్చి ఇస్తే.. సుమారు రూ. 4 లక్షల బహుమానం ఇస్తానని ట్విటర్ ద్వారా వెల్లడించింది. హానర్ ఉద్యోగి ఏప్రిల్ 22న జర్మనీలోని మ్యూనిచ్‌కి రైల్లో వెళుతుండగా హానర్ మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో అప్‌కమింగ్ ప్రోటో టైప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హువావే విజ్ఞప్తి చేసింది.గ్రే ప్రొటక్టివ్ కవర్‌తో ఉన్న హానర్ మొబైల్‌ను సురక్షితంగా రిటన్ చేసిన వారికి 5 వేల యూరోలు (రూ. 4లక్షలు) నజరానా ఇస్తానని హానర్ ట్వీట్‌చేసింది. కాగా మే 21 లండన్‌లో నిర్వహించనున్న ఒక ఈవెంట్లో హానర్ 20సిరీస్‌లో భాగంగా హానర్ 20 ప్రొ, హానర్ 20ఏ, హానర్ 20సీ, హానర్ 20 ఎక్స్ తదితర స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. పోయిన స్మార్ట్‌ఫోన్ వీటిల్లో ఒకటి కావచ్చని పలు అంచనాలు నెలకొన్నాయి. ⚠️Bitte helft uns ⚠️ Hinweise an de.support@hihonor.com oder jeden Servicemitarbeiter der Deutschen Bahn! 😔🙏 pic.twitter.com/vI5ZjDOlpN — HonorDE (@HonorGermany) April 22, 2019 -
అతడిని పట్టిస్తే రూ. 5 లక్షలు ఇస్తాం!
న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో మహిళలు, బాలికలను బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ దొంగ బాబా ఆచూకీ తెలిపిన వారికి నజరానా అందజేస్తామని సీబీఐ తెలిపింది. ఈ మేరకు అతడిని పట్టించిన వారికి రూ. 5 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. వివరాలు.. తనను తాను భగవంతుడిగా చెప్పుకొనే వీరేందర్ దేవ్ దీక్షిత్(77) ఢిల్లీలోని రోహిణి సమీపంలో ఆశ్రమం నడిపించేవాడు. ఈ క్రమంలో ప్రవచనాలు వినేందుకు మహిళలు, బాలికలు అక్కడికి వచ్చేవారు. మాయమాటలు చెప్పి వీరిని బంధించిన వీరేందర్..ఆశ్రమంలోనే అకృత్యాలకు పాల్పడేవాడు. ఇతడి ఆగడాలను ఓ గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి 2017 డిసెంబరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. దారుణంగా హింసించేవాడు... తన ఆశ్రమానికి వచ్చే బాలికలు, మహిళలనుదారుణంగా హింసించేవాడని సీబీఐ పేర్కొంది. జంతువుల్లా వాళ్లను పంజరాల్లో బంధించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిపింది. అయితే కేసు నమోదైన నాటి నుంచి అతడు పరారీలో ఉండటం.. నేపాల్‌కు పారిపోయాడనే సమాచారంతో గతేడాది జనవరి 22, ఫిబ్రవరి 22, 2019లో రెండుసార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించింది. కానీ ఇంతవరకు అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో తాజాగా వీరేందర్‌ను పట్టించిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానమిస్తామని ప్రకటించింది. -
చిలుకను తెచ్చిస్తే రూ.20వేల నజరానా
లక్నో : ఓ రామచిలుకను పట్టిస్తే రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని ఓ రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన ఓ రాజకుటుంబ వారసురాలు సనమ్ అలీఖాన్ పౌలీ అనే రామచిలుకను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అది చెప్పే ముద్దుముద్దు మాటలంటే ఆమెతోపాటు ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం. వారి బంధువులు స్కైప్ ద్వారా దానితో మాట్లాడుతూ ముచ్చట పడిపోతుండేవారు. అయితే కొద్దిరోజుల కిందట కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లినప్పుడు కేర్ టేకర్ చిలుకను సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ చిలుక ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిలుక జాడ కోసం వెతకని ప్రదేశం లేదు. ప్రాణంగా పెంచుకున్న చిలుక అదృశ్యం కావడంతో యజమాని కుటుంబం చిన్నబోయింది. ఇల్లు బోసిపోయింది. తప్పిపోయిన ఈ చిలుక ఇప్పుడు యూపీలోని రామ్ పూర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇక లాభం లేదని చిలుక యజమాని సనమ్ అలీ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చిలుక జాడ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే చిలుక పట్టి తెస్తారో వారికి రూ.20వేల రివార్డు ఇస్తామంటూ ఆటో రిక్షాపై లౌడ్ స్పీకర్ తో చాటింపు వేయించారు. ప్రస్తుతం రామ్పూర్లోని అనేక వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఆ చిలక ఫోటోలు వైరల్‌గా మారాయి. చిలుక జీవితం ఆధారంగా వచ్చిన హాలీవుడ్ మూవీ పౌలీ (1998) చూసిన తర్వాత తాము పెంచుకునే చిలుకకు.. పౌలీ అని పేరు పెట్టినట్టు సనమ్ తెలిపారు. -
26/11 దాడులు: అమెరికా భారీ రివార్డు
వాషింగ్టన్: ముంబైలో 26/11 మరణహోమం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల వెనుక ఉన్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి భారీ నజరానా అందజేయనున్నట్టు ప్రకటించింది. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి సూత్రధారుల గురించి కానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి కానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. ఈ ఉగ్రచర్య జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం తరఫున, అమెరికా ప్రజల పక్షాన భారత ప్రజలకు, ముంబై వాసులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ అనాగరిక చర్య ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిందని పొంపియో అన్నారు. ఈ దాడిలో కుటుంబసభ్యులను కోల్పోయినవారికి, గాయపడ్డవారికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఈ దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి క్రూరమైన చర్య జరిగి పదేళ్లు గడిచినప్పటికీ.. ఈ దాడికి సూత్రధారులను పట్టుకుని శిక్షించకపోవడం బాధితుల కుటుంబాలను అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు భాద్యులైన లష్కరే తోయిబాతో సహా దాని అనుబంధ సంస్థలపై అంక్షలు అమలు చేయాలని ఐకరాజ్యసమితి భద్రత మండలి తరఫున ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఈ దుర్మార్గపు చర్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాగా, అమెరికా ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి. 2008 నవంబర్ 26న భారత ఆర్థిక రాజధానిపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన పాక్ ఉగ్రమూకల బారిన పడి 166మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రమూకలను మట్టుపెట్టే క్రమంలో పలువురు పోలీసులు వీర మరణం పొందారు. ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను భద్రత బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. కసబ్‌కు న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో.. 2012లో అతడిని ఉరితీశారు. ఈ దాడికి కారకులను శిక్షించడంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పిన దాయాది దేశం.. కుట్రదారులు వారి దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. సంబంధిత కథనాలు: మరో దాడి జరిగితే యుద్ధమే..! 26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం -
తమిళనాడు ప్రభుత్వ తీరుపై షణ్ముగప్రియ మండిపాటు
-
తలనొప్పిగా మారిన కోటి రూపాయల రివార్డు స్కీమ్
న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీత కోసం ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల రివార్డు స్కీమ్ తలనొప్పిగా మారింది. ఈ స్కీమ్ ప్రకటించిన దగ్గర్నుంచి ఐటీ డిపార్ట్మెంట్ ఫోన్లతో మారుమోగిపోతోంది. అంతేకాక కుప్పలుతెప్పలుగా ఈ-మెయిల్స్, కొరియర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ స్కీమ్ ప్రకటించిన తొలి రోజు నుంచి అంటే జూన్ 1 నుంచి ఇన్ఫార్మర్ల దగ్గర్నుంచి భారీగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయని డిపార్ట్మెంట్కు చెందిన కమిషనర్ స్థాయి అధికారులు చెప్పారు. గత వారమే ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫార్మర్లకు ఇచ్చే రివార్డు స్కీమ్‌ను సమీక్షించింది. దీని కింద బినామి లావాదేవీ లేదా ఆస్తికి సంబంధించి ఆదాయపన్ను విభాగానికి ఏదైనా నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడిస్తే, పన్ను సమాచార వ్యవస్థ, వారికి కోటి రూపాయల విలువైన రివార్డు అందజేస్తుంది. అదేవిదంగా విదేశాలలో ఉన్న నల్లధనం గురించి సమాచారం అందించిన వారికి సుమారు రూ.5 కోట్ల దాక నజరానా అందిస్తారు. అలాగే, సమాచారం అందజేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు అత్యంత గోప్యంగ ఉంచుతామని పన్ను శాఖ తెలిపింది. దీంతో వారంలోనే ఈ రివార్డుకు సంబంధించి 500 కాల్స్ పైగా వచ్చాయని సీబీడీటీ అధికారులు చెప్పారు. వీటిలో అవసరం లేని కాల్స్, కొరియర్స్ కూడా వస్తున్నాయని పేర్కొంది. ఈ-మెయిల్స్‌ను తనిఖీ చేసిన అనంతరం, సంబంధిత విచారణ విభాగానికి ఫిర్యాదులను ఫార్వర్డ్ చేస్తున్నామని మరో అధికారి చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ఏకంగా 500 పేజీలకు పైగా ఉంటున్నాయని, వాటిని తాము కోర్టుకు సమర్పిస్తున్నామని తెలిపారు. ఇది ఐటీ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా ఉన్నప్పటికీ, దీనికి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని పేర్కొన్నారు. -
ఆ సమాచారం ఇస్తే రూ కోటి రివార్డ్..
సాక్షి, న్యూఢిల్లీ : బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపడుతున్న మోదీ సర్కార్ ఈ తరహా ఆస్తులపై నిర్థిష్ట సమాచారం అందించిన వారికి కోటి రూపాయల రివార్డు స్కీమ్‌ను ప్రకటించింది. నిర్ధేశిత రూపంలో బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలో సంబంధిత అధికారులకు ఎవరైనా నిర్థిష్ట సమాచారం అందచేయవచ్చు. బినామీ లావాదేవీల సమాచారం అందించిన వారికి ఇచ్చే రివార్డు పథకానికి ఎంపికయ్యేందుకు ఎవరైనా బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలోని బినామీ నిరోధక యూనిట్లకు చెందిన సంయుక్త, అదనపు కమీషనర్లకు నిర్ధేశిత రూపంలో సమాచారం అందచేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం బినామీ ఆస్తుల లావాదేవీల సవరణ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు అనువైనదిగా ఉండాలి. బినామీ ఆస్తుల వెలికితీతకు దారితీసే సమాచారం అందించే విదేశీయులూ రివార్డు స్కీమ్‌కు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. బినామీ ఆస్తులు, కంపెనీలు, లావాదేవీలపై నిరంతర నిఘా ఉంటుందని, బినామీ లావాదేవీలపై సమాచారం అందచేసిన వారికి రివార్డు పథకం ప్రవేశపెడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఈ రివార్డ్ స్కీమ్‌ను ప్రకటించారు. -
ఎక్కడికి పోయావ్ బుజ్జీ..?, ఆచూకీ తెలిపితే రూ.2 వేలు
సాక్షి, హైదరాబాద్ : పెంపడు జంతువులపై ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత ప్రేమ ఉంటుంది. ఇంట్లో ముద్దుగా పెంచుకునే శునకాలు, పిల్లులు, పక్షులకు పుట్టినరోజును వేడుకగా చేసేవారు.. అలాంటివి చనిపోతే.. సొంతవారు పోయినట్టు కర్మకాండలు చేసేవారు.. నగరంలో చాలామందే ఉన్నారు. ఒకవేళ అనుకోకుండా అలాంటివి తప్పిపోతే వాటికి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేవారు ఉన్నారు. ఈ కోవలోనే ఫిలింనగర్‌కు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని, వెతికి తెచ్చినవారికి బహుమతి ఇస్తానంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. గోడలపై సదరు పిల్లి ఫొటోతో పాటు దాని వయసు, ఎత్తు, పొడవు కొలతలతో సహా పోస్టర్లు సైతంఅంటించారు. తన పిల్లిన అప్పగించినవారికి రూ.2 వేలు రివార్డు కూడా ప్రకటించారు. ఇంతకూ సదరు మార్జాలం ఏ విదేశాల నుంచో తెచ్చిన అరుదైన జాతి కాదు.. ఇళ్లలో తిరిగే మామూలు పిల్లిని ఆమె ఏడాదిగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒంటరిగా ఉండే ఆమె పిల్లి తోడుగా జీవిస్తున్నారు. అది కనిపించకుండా పోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. వారం రోజులుగా ఆమె ఫిలింనగర్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని వీధివీధీ జల్లెడ పడుతున్నారు. -
టెక్కీ అజితాబ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ టెక్కీ కుమార్ అజితాబ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్ అదృశ్యంపై వైట్‌ఫీల్డ్‌లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్‌కుమార్ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తునకు నగర కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. అజితాబ్ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్ రూమ్ 080–2204498, 22942444 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. -
రూ.10 లక్షల రివార్డుకు లాస్ట్ ఛాన్స్
న్యూఢిల్లీ : మెరుగైన సర్వీసులను అందిస్తూ.. డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? అనే దాని కోసం దేశీయ రైల్వే వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. దీని కోసం ఓ పోటీని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెరుగైన సర్వీసుల అందిస్తూ, నగదును ఎలా పెంచుకోవాలో దేశీయ రైల్వేకి ఐడియా చెబితే రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ పోటీలో పాల్గొనే వారు ఎంట్రీస్‌ను పోస్టు చేయడానికి ఈ రోజే తుది గడువు. ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని ఆచరణాత్మక ఆలోచనలను తమకు పంపించాలని రైల్వే పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన తొలి విజేతకు రూ.10 లక్షలను, రెండో విజేతకు 5 లక్షల రూపాయలను, మూడో విజేతకు 3 లక్షల రూపాయలను, నాలుగో విజేతకు లక్ష రూపాయలను బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది. పోటీలో పాల్గొనే వారు ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్‌లో ఎంట్రీస్‌ను పోస్టు చేయాల్సి ఉంటుంది. https://www.innovate.mygov.inలోకి వెళ్లి, ‘CLICK HERE TO PARTICIPATE’ బటన్‌న్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పాల్గొనాల్సిన రిజిస్ట్రేషన్ దరఖాస్తును కూడా అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ సబ్మిషన్ ఫాంను వస్తోంది. అభ్యర్థులు మొబైల్ నెంబర్‌ను, ఈమెయిల్ ఐడీని సరియైనదిగా ఉండాలి. దేశీయ రైల్వే ఏదేనీ సమాచారం అభ్యర్థులకు అందించాల్సి ఉంటే ఆ ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్‌కే పంపుతుంది. ఒకవేళ ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటే ఈ రోజే తుది గడువు. దీనిలో పాల్గొనాల్సిన అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండి తీరాలి. -
మిస్టరీ కిల్లర్.. పట్టిస్తే 30 కోట్లు..
సిడ్నీ: దశాబ్దాలు గడిచిన చిక్కువీడని ఓ మిస్టరీ కేసుతో ఆస్ట్రేలియన్ పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. చివరికి చేసేదేమి లేక శనివారం రికార్డు రివార్డు ప్రకటించారు. 1980లో మెల్ బోర్న్లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం కోసం ఏకంగా రూ.30 కోట్ల రికార్డు రివార్డును ఆఫర్ చేశారు. 1980-1981 మధ్య కాలంలో దుండగలు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి నుంచి ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛేదించేందుకు నడుంబిగించిన విక్టోరియా పోలీసులు సమాచారం అందించినా, మిస్టరీ ఛేదించినా ఒక్కో కేసుకు రూ.5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇది ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించిన రెండో అతిపెద్ద రివార్డని తెలిపారు. అంతేగాకుండా ఎవరికైనా మిస్టరీలు ఛేదించే మేధాశక్తి ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. అయితే ఈ రివార్డుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన'చందంగా పోలీసులు తీరుందని విమర్శిస్తున్నారు. -
ఈ దొంగను పట్టిస్తే 50 వేలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఓ వృద్ధురాలిని చంపి బంగారు నగలతో ఉడాయించిన ఓ నిందితుడు ఏడాదిన్నరగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ దొంగ సమాచారం అందిస్తే 50 వేల నజరాన ఇస్తామని రాచకొండ కమిషనర్ పోలీసులు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తమిళనాడులోని తుత్తుకూడి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, డ్రైవింగ్ చేస్తూ భార్యతో మెడ్చల్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసించేవాడు. గతేడాది మార్చిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట,వెంకటాద్రి నివాస్‌లో ఒంటిరిగా నివసిస్తున్న నాగమణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె నగలతో ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే అతని భార్యను అదుపులోకి తీసుకున్న మీర్పేట్ పోలీసులు అతని ఆచూకి కనుగొనడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పోలీసులు నిందితుని సమాచారం తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. -
హర్మన్ ప్రీత్‌కు సీఎం నజరానా..
♦ రూ.5 లక్షలు ప్రకటించి పంజాబ్ ప్రభుత్వం మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్‌కౌర్‌కు ఆదివారం పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కౌర్ ఏకంగా 20 ఫోర్లు 7 సిక్సులతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోశించిన విషయం తెలిసిందే. కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రోత్సాహాకంగా రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు. కౌర్ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు. కౌర్ మరో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ సాధిస్తుందని, కేరిర్‌లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె తండ్రి హర్మందర్ సింగ్‌కు అభినందనలు తెలిపారని సీఎం అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. -
బగ్ కనిపెడితే, గూగుల్ భారీ రివార్డు
ఆండ్రాయిడ్ ఆధారితంగా నడిచే ఫోన్లకు ఇటీవల పెద్ద ముప్పే వచ్చిన పడిన సంగతితెలిసిందే. వన్నాక్రై సైబర్ ఎటాక్ నుంచి తేరుకోకముందే ఆండ్రాయిడ్ ఫోన్లను దెబ్బకొడుతూ గూగుల్ ప్లే స్టోర్ లోకి జుడీ అనే మాల్వేర్ ప్రవేశించింది. 3.65కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ మాల్వేర్ ప్రభావానికి గురయ్యాయి. ఈ దాడితో అలర్ట్ అయిన గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఓఎస్ లో బగ్ కనుకున్న వారికి భారీగా రివార్డు ఇవ్వాలని నిర్ణయించిందట. ప్రస్తుతమున్న రివార్డును రెండు లక్షల డాలర్లకు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,28,83,000కు పెంచినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. సైబర్ సెక్యురిటీ సంస్థ చెక్ పాయింట్ ప్రకారం ప్లే స్టోర్ నుంచి 45 లక్షల నుంచి 1.85 కోట్ల హానికరమైన యాప్స్ డౌన్ లోడ్ అయినట్టు తెలిసింది. పాతకాలపు ఓఎస్ లతో ఎక్కువగా సెక్యురిటీ ముప్పు తలెత్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ ఎక్స్ ట్రీమ్ టెక్.కామ్ శుక్రవారం రిపోర్టు ఏసింది. కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ అందించిన వాటికంటే ప్రస్తుతం విడుదలచేస్తున్న ఆండ్రాయిడ్ లు ఎక్కువగా సురక్షితంగా ఉన్నాయని, దీంతో ఆండ్రాయిడ్ లో బగ్స్ కనుగొని ప్రయోజనాలు పొందడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలిసింది. కానీ బగ్ బాంటీ ప్రొగ్రామ్ ద్వారా ఎక్కువమంది రీసెర్చర్లను, ఇంజనీర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ రివార్డును రెండు లక్షల డాలర్లకు పెంచినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. రెండేళ్ల క్రితం గూగుల్ ఈ బగ్ బాంటీ ప్రొగ్రామ్ ఆండ్రాయిడ్ ల కోసం ప్రారంభించింది. ఆండ్రాయిడ్స్ లో బగ్ కనుగొన్నవారికి నగదును బహుమతి అందిస్తోంది. -
వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు
అమృత్సర్: పంజాబ్‌లో జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరికొందరు పారిపోయిన ఘటనలో పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నుంచి పారిపోయిన వారి సమాచారం అందించిన వారి రూ 25 లక్షల రివార్డు అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం నభా జైలుపై సాయుధులు దాడి చేసి హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురిని జైలు నుంచి విడిపించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జైలు నుంచి పారిపోయిన కోసం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ చోట ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కాగా జైల్ బ్రేక్ ఘటనలో ప్రభుత్వ హస్తముందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. -
ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?
ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్నీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ముఖ్యమైన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కంపెనీలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతిభ గల టాప్ వంద మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. సగటున రెండుకోట్ల జీతం తీసుకుంటున్నఉద్యోగులకు వారి వేతనాల్లో 10-15శాతం మేరకు సంస్థ షేర్ల రూపంలో అందించనున్నారు. లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ అని పేరు పెట్టిన ఈ పథకం ప్రకారం సగటున రూ .2 కోట్ల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకాలు రిలయన్స్ అందించనుందని సంస్థకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 20-30 లక్షల విలువ చేసే షేర్లను ఆయా ఉద్యోగులకు ఎలాట్ చేయనుంది. దీనికి నిర్దేశించిన కాలపరిమితి మూడు సంవత్సరాలు పూర్తికాగానే ఈ ఎలాట్ మెంట్ ఉంటుంది. ఈ బోనస్ సంస్థలో టాప్ 100 ఉద్యోగులకోసమే మాత్రమే ఉద్దేశించబడిందనీ, ఇతర స్థాయిల్లో ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అయితే ఈ వార్తలపై రిలయన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ వార్తలను ధృవీకరించిన సంస్థ ఉన్నతోద్యోగి ఎలాంటి షేర్లను కేటాయించాలి అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. రిలయన్స్ లాంటి షేర్లను కేటాయిస్తామంటే ఎవరు మాత్రం కాదంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ లాభాలను, సంపదను ఉద్యోగులకు పంచి ఇచ్చే సాంప్రదాయం రిలయన్స్ గ్రూపునకు కొత్త అని మరో ఆర్ఐఎల్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇది సంస్థ వ్యాపారవృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా సాధారణంగా ఐటీ, ఈ కామర్స్ రంగాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. టాప్ లెవల్ ఉద్యోగుల రాజీనామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు వెలుగులోకి వస్తాయని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి. గత రెండేళ్లకాలంలో ఆర్ఐఎల్ ఉన్నతోద్యోగులు సంస్థకు రాజీనామా చేయడం ఈ పథకానికి దారి తీసి వుండొచ్చని అంచనా వేశారు. -
పీవీ సింధుకు ప్రశంసల జల్లు
-
సంగం హోంగార్డుకు ప్రశంసలు
సంగం : కష్ణా పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న సంగంకు చెందిన మహిళా హోంగార్డ్ వినీల బుధవారం మూగబాలుడి ప్రాణాలు కాపాడి పోలీసు రివార్డు ప్రజల ప్రశంసలు పొందారు. కష్ణా పుష్కరాల సందర్భంగా సంగం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు వినీలను గుంటూరు జిల్లాలోని సీతానగర్ఘాట్ విధుల నిమిత్తం నియమించారు. బుధవారం గుడివాడకు చెందిన మురళీ (7) అనే మూగ బాలుడు కష్ణా నదిలో స్నానం చేస్తూ లోతుకి వెళ్లి మునిగిపోయాడు. ఇది గమనించిన వినీల నదిలోకి దూకి మురళీ ప్రాణాలను కాపాడింది. విషయం తెలిసుక్ను డీజీపీ నందూరి సాంబశివరావు ఆదేశాలతో గుంటూరు ఎస్పీ త్రిపాఠి వినీలకు నగదు రివార్డు అందజేశారు. -
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!
నాగ్ పూర్ః తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది. నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!
న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది. 2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు. -
ఒవైసీ దేశద్రోహి.. నాలుక కట్ చేస్తే కోటి ఇనాం
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన నాలుక కట్ చేస్తే రివార్డు ఇస్తామని ప్రకటించిన ఏబీవీపీ నేతకు.. మరో బీజీపీ నేత తోడయ్యారు. భారతమాతకు జై అని పలకడానికి నిరాకరించిన అసద్ నాలుకను ఎవరైనా కట్ చేస్తే వారికి కోటి రూపాయల ఇనాం ఇస్తానని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది ప్రకటించారు. భారతమాతకు జై పలకడానికి అభ్యంతరమున్న ఒవైసీ ఒక దేశద్రోహి అని అభిప్రాయపడ్డారు. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పని చేసినవారికి ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తానంటూ వ్యాఖ్యానించి మరో సంచలనం సృష్టించారు. మరోవైపు ఢిల్లీ అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ నివాసం దగ్గర 'దేశద్రోహి' అనే పోస్టర్లు వెలిశాయి. 'నా పీకపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను' అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. లాతూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కొత్త తరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలన్న ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మాటలు అన్నారు. అటు 'భారత్ మాతాకీ జై' అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది. -
అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షల నజరానా
-
దొంగను పట్టించిన సమయస్పూర్తి
మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు అభినందించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి (48) సోమవారం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టించాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని ఎస్పీ రాజశేఖర్‌బాబు మెచ్చుకున్నారు. గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డు అందజేశారు. గీతా ప్రసాద్ సాహస కృత్యాన్ని జాతీయ అవార్డుకు సిఫారసు చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. -
చైన్ స్నాచర్ ని బైక్‌తో ఢీకొట్టాడు..
అనంతపురం: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు ఘనంగా సన్మానించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి(48) సోమవారం మధ్యాహ్నం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యాడు. దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని, బంధించారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు.. యువకుడు గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డుగా అందజేసి, ఘనంగా సత్కరించారు. జాతీయ అవార్డుకు గీతా ప్రసాద్ సాహసకృత్యాన్ని సిఫారసు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.