‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తే రూ. కోటి రివార్డు’ | Karni Sena announces reward for lawrence bishnoi encounter | Sakshi
Sakshi News home page

‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తే రూ. కోటి రివార్డు’

Published Tue, Oct 22 2024 10:26 AM | Last Updated on Tue, Oct 22 2024 4:48 PM

Karni Sena announces reward for lawrence bishnoi encounter

ముంబై: ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నేత  బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్‌  గ్యాంగ్‌  ప్రకటించిన విషయం తెలిసిందే. లారెన్స్‌ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే..  రూ. కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. 

క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్‌.. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజ్‌ సేకావత్‌ ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్‌ బిష్ణోయ్‌ విషయంలో కేంద్రం, గుజరాత్‌ ప్రభ్వుం  చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా  ఒకరు’’ అని అన్నారు.

బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేస్తే కోటి.

డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు.. కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్‌ దేశవ్యాప్తంగా పని చేస్తుంది.  ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్‌ బాధ్యత వహించటం గమనార్హం. 

కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. 

చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్‌ వీడియోలు, బైక్‌తో ప్లాన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement