Baba Siddique
-
సిద్ధిఖీ కేసు: మృతి నిర్ధారణయ్యే వరకు ఆస్పత్రి దగ్గరే..
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ కేసు విషయంలో రోజుకో కొత్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు(షూటర్)ను విచారణ చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లుడిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్.. సిద్ధిఖీపై కాల్పుల జరిపిన అనంతరం ఆయన మరణించారా? లేదా? అని ఆస్పత్రి బయట ఉండి నిర్ధారించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. కాల్పులు జరిగిన తర్వాత సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి బయట ఆయన మృతి నిర్థారణ కోసం సుమారు 30 నిమిషాల పాటు నిలబడి వేచి చూశానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘సిద్ధిఖీపై కాల్పులు జరిగిన వెంటనే చొక్కా మార్చుకొని.. ఆసుపత్రి బయట 30 నిమిషాల పాటు జనం మధ్య నిలబడి ఉన్నా. సిద్ధిఖీ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన వెంటనే వెళ్లిపోయా’’ అని నిందితుడు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.అక్టోబర్ 12 రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆయన ఛాతీపై రెండు బుల్లెట్ గాయాలు తగలడంతో వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. ప్రధాన నిందితుడు శివకుమార్, అతని సహాయకులు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్‌లను ఉజ్జయిని రైల్వే స్టేషన్లో కలవాల్సి ఉంది. అక్కడ బిష్ణోయ్ గ్రూప్ సభ్యుడు వారిని వైష్ణో దేవి వద్దకు తీసుకెళ్లాలి. అయితే.. కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో వారి ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’ -
సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలను ముంబై పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో అతనితోపాటు, నలుగురు సహాయకులను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. శివకుమార్‌ను విచారించిన సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్న విషయాలు, మిస్టర్ సిద్ధిఖీని చంపిన తర్వాత ఎలా పారిపోయాడనే విషయాలను నిందితుడు శివకుమార్ పోలీసులకు వివరించాడు. కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీని కాల్చివేయమని అన్మోల్ బిష్ణోయ్ తమకు ఆదేశించాడని శివకుమార్ చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ముందు ఎవరిని చూసినా కాల్చేయండి’ అని అన్మోల్ శివకుమార్‌తో చెప్పాడని తెలిపారు. సిద్ధిఖీ హత్యకు ముందు.. కెనడాలో ఉన్న ఎన్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రధాన నిందితుడు శివ కుమార్ టచ్‌లో ఉన్నాడని తెలిపారు. ‘దేవుడు, సమాజం’ కోసం తాను ఏం చేయబోతున్నానో.. అన్మోల్ తనతో చెప్పాడని శివకుమార్ చెప్పినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అయితే.. సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురిలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో జీషన్ సిద్ధిఖీ ఫొటో కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు.బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ప్రధాన నిందితుడు శివ కుమార్ గౌతమ్ వెంటనే బట్టలు మార్చుకొని అదృశ్యం అయ్యాడని. అతన్ని ఎవరూ గుర్తించలేదని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలం నుంచి కుర్లాకు ఆటోలో ప్రయాణించి.. అక్కడి నుంచి థానేకు లోకల్ రైలు ఎక్కినట్లు తెలిపారు. థానే నుంచి రైలులో పూణెకు వెళ్లి ప్రయాణంలో తన మొబైల్ ఫోన్‌ను పారేశాడని చెప్పారు. ఇక.. శివ కుమార్ సుమారు ఏడు రోజుల పాటు పూణేలో ఉండి, ఆపై రైలులో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్లారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు అక్కడే ఉండి రాష్ట్ర రాజధాని లక్నో చేరుకున్నాడు. లక్నోలో కొత్త మొబైల్ కొని తన సహాయకులను సంప్రదించాడు. అక్కడ 11 రోజులు గడిపిన తర్వాత, అతను తన స్వస్థలమైన బహ్రైచ్కు వెళ్లి తన సహాయకులను కలుసుకున్నాడు. దీంతో వారు సమీపంలోని గ్రామంలో అతనికి భద్రత కల్పించారని పోలీసులు వెల్లడించారు. ఇక.. దేశం విడిచి పారిపోయే ముందు అతను మొదట మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వెళ్లి, ఆపై జమ్మూలోని వైష్ణో దేవికి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.ఆదివారం నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను బహ్రైచ్‌లో అతని నలుగురు సహాయకులతో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 12న ముంబైలో సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురు షూటర్లలో శివకుమార్ కూడా ఉన్నాడు. అయితే.. హర్యానా నివాసి గుర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేయగా.. శివ కుమార్ పారారైన విషయం తెలిసిందే. -
సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.చదవండి: సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండేచదవండి: ‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’ -
సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండే
ముంబై: ఎన్‌న్సీపీ (అజిత్ పవార్) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. అయితే.. బాబా సిద్ధిఖీ హత్యకేసు నిందితులు ఎవరైనా వదలిపెట్టమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఆయన మహారాష్ట్రలో లా అండ్ ఆర్డ్‌ర్ అదుపుతప్పిందే విమర్శలపై తాజాగా స్పందించారు. ‘‘బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ మూలాలను ఛేదిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాబా సిద్ధిఖీ హత్య దురదృష్టకరం. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఈ ఘటనలో పలువురు నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం. ప్రభుత్వం, హోంశాఖ కేసు మూలాలు చేధిస్తోంది.. అందులో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని.. అక్టోబర్ 12న ముంబైలోని నిర్మల్ నగర్ ప్రాంతంలో ఆయన కుమారుడి కార్యాలయం సమీపంలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’ -
‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’
ముంబై: తన తండ్రి హత్య తర్వాత బాలీవుడ్ నటుడు, సిద్ధిఖీ కుటుంబానికి సన్నితుడైన సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశామని తెలిపారు. అయితే ఇటీవల జీషన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యులో తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ఎలా మద్దుతుగా నిలిచారో పలు విషయాలు పంచుకున్నారు.‘‘నాన్న హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రతీరోజు రాత్రి క్రమం తప్పకుండా నా రాత్రి నాకు కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటున్నారు. సల్మాన్ భాయ్.. మా నాన్న హత్య విషయంలో చాలా బాధపడ్డారు. మా నాన్న, సల్మాన్ భాయ్ నిజమైన అన్నదమ్ముల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాత సల్మాన్ భాయ్.. నేను రాత్రి సమయంలో ఎలా ఉన్నాను. నిద్ర పోతున్నానా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. రాత్రి నేను నిద్ర పోకపోతే.. నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అని జీషన్ తెలిపారు.మరోవైపు.. జీషన్ సిద్ధిఖీ గత వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. అంతేకాక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఈ అభియోగాలను జీషన్ తోసిపుచ్చారు.చదవండి: బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ! -
ఎన్సీపీలో చేరిన బాబా సిద్దిఖీ కుమారుడు
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్ పవార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా జీషన్ మాట్లాడుతూ.. ఇది తనకు, తన కుటుంబానికి ఉద్వేగభరితమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో తనును నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన వాంద్రే ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే నామినేషన్ వేసి ప్రజలందరి ప్రేమ, మద్దతుతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.కాగా 2019 ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్ నుంచి గెలుపొందిన 32 ఏళ్ల జీషన్ సిద్దిఖీ.. గత ఆగస్టులో మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాంద్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వ్యక్తం చేస్తూ జీషన్.. ఎన్సీపీలో చేరారు. -
బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ!
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ తన బుద్ధిని చూపెట్టిందని వ్యాఖ్యానించారు. అయితే జీషన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆ 255 స్థానాల్లో వాండ్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానం సైతం ఉంది. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీ చేయనున్నారు.అయితే సీట్ల పంపకంపై కాంగ్రెస్‌లో ఉన్న తన పాత స్నేహితుడు ఫోన్ చేశాడని, వాండ్రే స్థానాన్ని శివసేన వర్గం (యూబీటీ)కి అప్పగించిన విషయాన్ని తనతో చెప్పాడని అన్నారు. ఇదే విషయంపై జీషన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తాను సొంత పార్టీగా భావించిన కాంగ్రెస్ తనని ద్రోహం చేసిందని, వాండ్రే సీటును ఉద్దశ్ ఠ్రాకేకు కేటాయించి తన బుద్ధిని చూపెట్టిందన్నారు. నమ్ముకున్న వాళ్లకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రక్తంలోనే లేదని అన్నారు.सुना है पुराने दोस्तों ने वांद्रे पुर्व में अपना उम्मीदवार घोषित कर दिया है । साथ निभाना तो कभी इनकी फितरत में था ही नहीं। “रिश्ता उसी से रखो जो इज़्ज़त और सम्मान दे, मतलब की भीड़ बढ़ाने का कोई फ़ायदा नहीं।”अब फैसला जनता लेगी!!!!— Zeeshan Siddique (@zeeshan_iyc) October 23, 2024 దీనిపై కాంగ్రెస్ మద్దతు దారులు జీషన్ సిద్ధిఖీని ట్రోల్ చేస్తున్నారు. జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పలు ఘటనల్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న జీషన్ సిద్ధిఖీ..ఎన్సీపీ చీఫ్ అజిత్ పవర్ చేసిన జన్ సన్మాన్ యాత్రలో పాల్గొన్నారు. ఆయాత్రకి కాంగ్రెస్‌కి సంబంధం లేదు. అలాంటప్పుడు మీరు అజిత్ పవార్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. కాబట్టే పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరిస్తే ఎన్సీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి తాజా జీషన్ సిద్ధిఖీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. They give you respect and honor and everything and you betray them on occasion, how will it work like this my brother?— Yadvendra Yadav (@yadusandy) October 23, 2024 -
సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్.. కీలక విషయలు వెల్లడి
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…— ANI (@ANI) October 24, 2024కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. -
‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’
ముంబై: ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. రూ. కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్.. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజ్ సేకావత్ ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభ్వుం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్ కూడా ఒకరు’’ అని అన్నారు.लॉरेंस बिश्नोई के एनकाउंटर के लिए क्षत्रिय करणी सेना ने घोषित किया इनाम। सुनिए क्या कह रहे है डॉ. राज शेखावत। #LawrenceBishnoi #KarniSena #SalmanKhan #BabaSiddique #BabaSiddiqui #Gujarat pic.twitter.com/zaHn3O8ens— Achlendra Kr. Katiyar (@achlendra) October 21, 2024డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు.. కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పని చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్ బాధ్యత వహించటం గమనార్హం. కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్ యాప్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.Baba Siddique murder case | A picture of Baba Siddique's son Zeeshan Siddique was found in the phone of the accused in Baba Siddique's murder. This picture was shared with the accused by their handler through Snapchat. Investigation revealed that the shooters and conspirators…— ANI (@ANI) October 19, 2024షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ యాప్‌లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్ అయ్యే ఫీచర్ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్కానిస్టేబుల్ సస్పెండ్బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.Baba Siddique Murder case | Police security guard Constable Shyam Sonawane, present with late NCP leader Baba Siddique at the time of the murder has been suspended. An internal investigation is also going on: Mumbai Police— ANI (@ANI) October 19, 2024ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్ చేసినట్లు ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ముంబై: ఎన్సీపీ నేత,మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిఖీ హత్యకేసులో మరో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిఖీ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలో హత్య కేసులో నిందితులు రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్, కర్జాత్లలో ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నేరానికి సంబంధించిన కుట్ర, దాని అమలుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు అధికారి తెలిపారు.అరెస్టయిన వ్యక్తులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా టచ్‌లో ఉన్నారని అన్నారు. కాగా, ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారని, తదుపరి విచారణ జరుగుతోంది’ అని అన్నారు.కార్యాలయంలో ఉండగా కాల్పుల కలకలంఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబై బాంద్రాలో తన తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగా..ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. -
సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీ హత్యకు సింబంధిచి.. నిందితుల బుల్లెట్ల నిల్వ, యూట్యూబ్ ద్వారా గన్ షూటింగ్ శిక్షణ, ఘననాస్థలం నుంచి వెంటనే తప్పించుకునే ప్రణాళిక వివరాలను పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. హర్యానా చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) షూటర్లు. హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్ (23), పూణేకు చెందిన రవీణ్ లోంకర్ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్ధిఖీని హత్యకు చేసేందుకు నిందితులు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ తమ తుపాకుల్లో 65 బుల్లెట్లు అమర్చారు. ముందుగానే భారీగా బుల్లెట్లు నిల్వ ఉంచుకున్నారు. నిందితులు ఉపయోగించిన రెండు తుపాకీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి ఆస్ట్రియాలో తయారు కాగా, మరొకటి స్థానికంగా తయారు చేయబడింది. ఈ ఆయుధాలతో పాటు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు వారి వద్ద 28 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.టర్కీలో తయారు చేసిన 7.62 బోర్ పిస్టల్, 30 రౌండ్లకు సరిపడే బుల్లెట్లు కలిగివున్న నల్లటి బ్యాగ్‌ను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాగ్‌లో రెండు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఒకటి కేసులో అనుమానితుడైన శివకుమార్ గౌతమ్ పేరుతో ఉంది. మరొకటి సుమిత్ కుమార్ పేరుతో ఉంది. కానీ, రెండు కార్డులలో శివకుమార్ ఫోటో ఉండటం గమనార్హం.సెకండ్ హ్యాండ్ బైక్ కొని..నిందితులు ముందుగా మోటర్‌బైక్‌పై నుంచి కాల్పులు జరపాలని ప్లాన్ వేశారు. షూటర్లు లొకేషన్ వరకు ప్రయాణించి కాల్పులు జరిపి.. ఆపై బైక్‌పై త్వరగా పారిపోవాలని అనుకున్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రణాళికను పక్కకుపెట్టారు. అయితే.. ముగ్గురు నిందితులు హత్య జరిగిన ప్రదేశానికి ఆటో రిక్షాలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. హత్య తర్వాత వారిని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు బట్టలు మార్చుకున్నారు. నిందితుడు హరీష్‌కుమార్ బలక్రమ్ నిసాద్ మోటార్ బైక్ కొనుగోలుకు మిగతా నిందితులకు రూ. 60 వేలు పంపిచాడు. రూ.32 వేలతో సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారు.ప్రధాన నిందితుడు, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శుభమ్ లోంకర్‌తో పాటు పలువురు అనుమానితుల ప్రమేయం పోలీసుల విచారణలో వెల్లడైంది. నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్న లోంకర్‌పై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. లోంకర్ హత్యకు మూడు రోజుల ముందు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ అక్టోబర్ 9న తన ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అతని సోదరుడు ప్రవీణ్ లోంకర్ నిందితులకు ఆర్థిక సహాయం అందించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.యూట్యూబ్ వీడియోలతో ప్రాక్టీస్షూటర్లు యూట్యూబ్ వీడియోలు చూసి తుపాకీలను ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. హత్యకు ముందు నిందితులు ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారు ఆయుధాలను లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ చేశారు. ఖాళీ స్థలం లేకపోవడంతో బుల్లెట్లు లేకుండా షూటింగ్ ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’ -
సిద్ధిఖీ కేసు: ‘నిందితులు గ్లాక్ పిస్టల్‌తో కాల్పలు జరిపారు’
ముంబై: ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. ఇక.. హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు చెందిన నిందులు వాడిన తుపాకీల గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.సిద్ధిఖీ హత్య చేయడానికి నిందితులు మొత్తం మూడు పిస్టల్స్ ఉపయోగించారని తెలిపారు. వాటిలో ఒకటి ఆస్ట్రేలియాలో తయారు చేయబడిన గ్లాక్ పిస్టల్, మరొకటి టర్కిష్ పిస్టల్ కాగా మూడో పిస్టల్ దేశీయంగా తయారు చేసిందని వెల్లడించారు. ఇక.. ఈ మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. నిందితులు అక్టోబరు 12న నిర్మల్‌నగర్‌లో బాబా సిద్ధిఖీని తన కుమారడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం బయట కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.Maharashtra | Three pistols were used in NCP leader Baba Siddiqui's murder, one of them was an Australian-made Glock pistol, a Turkish pistol and a country-made pistol. Police have recovered all three weapons: Mumbai PoliceHe was murdered after being shot outside Zeeshan…— ANI (@ANI) October 16, 2024గ్లాక్ సిస్టల్స్ యూరప్, అమెరికాలో అధికంగా ఉత్పత్తి అవుతాయని పోలీసులు తెలిపారు. వాటి డిజైన్, క్వాలిటీ, అధిక మ్యాగజైన్ సామర్థ్యం, ప్రమాదవశాత్తు జరిగినే ఫైరింగ్‌ను నిరోధించే అధునాతన ‘సేఫ్ యాక్షన్ సిస్టమ్’ ఉంటుందని పేర్కొన్నారు. గ్లాక్ తుపాకీని కలిగి ఉన్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్లోక్ పిస్టల్స్‌ను ఆస్ట్రియాలో అధికంగా తయారు చేస్తారు. అక్కడి పౌరులు, ప్రజా ప్రతినిధులు, సైనిక సిబ్బంది కోసం ఇటువంటి సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌లను తయారు చేస్తోంది.ఇక.. నిందితులు సిద్ధిఖీపై కాల్పులు జరపటం కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రాక్టిసు చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.చదవండి: Baba Siddiqui Case: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’ -
సిద్ధిఖీ కేసు: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీను హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలు చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరీరాలో ఉన్న వారిని వెతకడానికి పోలీసులు బృందాలను గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కూడిన ఓ నల్ల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.‘‘సిద్ధిఖీని గుర్తించడానికి నిందితులకు ఆయన ఫోటోను ఇచ్చారు. ఘటనకు 25 రోజుల ముందు నిందితులు ఆయన నివాసం, కార్యాలయాన్ని పరిశీలించారు. గుర్మైల్ సింగ్ , ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ నుంచి షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ముంబైలో బుల్లెట్ మ్యాగజైన్ లేకుండా గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు’’ అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.ఇక.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్కు చెందిన 23 ఏళ్ల హరీష్‌కుమార్ బాలక్రామ్గా ఈ హత్యకేసులో నాలుగో నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్స్‌ను సమన్వయం చేశాడని పోలీసులు తెలిపారు. బాలక్‌రామ్ పూణెలో స్క్రాప్ షాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలక్రామ్గా స్క్రాప్ షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.చదవండి: సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
సిద్ధిఖీ హత్య కేసు: ‘ ఆ నిందితుడు మైనర్ కాదు’
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హ్యత కేసులో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్‌కు ముంబై పోలీసులు ఆసిఫికేషన్ టెస్ట్ (వయసు నిర్ధారణ) నిర్వహించగా మైనర్ కాదని తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు కశ్యప్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చారు.Baba Siddique murder case: Ossification test confirms accused Dharmaraj Kashyap is not minor; sent to police custodyRead @ANI Story | https://t.co/ozKl30zuSo#MumbaiPolice #BabaSiddiqueShotDead #Maharashtra pic.twitter.com/QaljPVVnUe— ANI Digital (@ani_digital) October 13, 2024 దీంతో కోర్టు కశ్యప్‌ను సైతం అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీని అనుమతి మంజూరు చేసింది. అయితే ఆదివారం నిందితుడు కశ్యప్ మైనర్ అని అతని న్యాయవాది పేర్కొనడంతో ఎస్ప్లానేడ్ కోర్టు ఆసిఫికేషన్ పరీక్షను ఆదేశించించిన విషయం తెలిసిందే. నిన్ననే మరో నిందితుడు గుర్మైల్ సింగ్‌ను కోర్టు.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యఇక.. ఈ హత్య కేసులో మూడో నిందితుడు శివకుమార్ అనే మూడో షూటర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతన్ని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్‌గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ -
బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. ఆయనపై జరిగిన కాల్పుల కేసులో నిందితుడు గుర్మైల్ సింగ్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో ఆదివారం హాజరుపర్చగా.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులైన గుర్మైల్ సింగ్(23), ధర్మరాజ్ సింగ్ కశ్యప్(17)లను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్ప్లానేడ్ కోర్టు రెండో నిందితుడు మైనర్ కావటంతో ఆసిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్లీ తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది.. వ్యక్తి ఎముకలను ద్వారా వయస్సును అంచనా వేసే వైద్య పరీక్ష. ఇద్దరు నిందితులను పోలీసులు ముంబై క్రైం బ్రాంచ్‌కు తరలించారు.Mumbai: One accused in Baba Siddique firing case sent to custody till October 21Read @ANI Story | https://t.co/DljJNa4h7x#BabaSiddique #MumbaiCourt pic.twitter.com/s9uXQAZ8nw— ANI Digital (@ani_digital) October 13, 2024 నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. మేము దానిని వ్యతిరేకించాం. కోర్టుకు ఇవ్వగలిగిన ఆధారాలను ఇచ్చాం. కోర్టు ఆ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబరు 21 వరకు కస్టడీ విధించింది. ఇక రెండో నిందితుడిని ఆసిఫికేషన్ టెస్ట్ తర్వాత మళ్లీ హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి అడిగారు. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ అవసరమని కోర్టు భావిస్తే కస్టడీని మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉంది’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి పేరు మహ్మద్ జీషన్ అక్తర్ అని వెల్లడించారు. ఇప్పటికే మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.మరోవైపు.. బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిని దారుణం ఉందని..దానికి నిదర్శణమే బాబా హత్ అని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. నేరాల విషయంలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్, బీహార్ మార్గంలో వెళుతుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాజీనామా చేయాలని వాడెట్టివార్ డిమాండ్ చేశారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్ రియాక్షన్ -
బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్ రియాక్షన్
ముంబై: బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర, బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాబా సిద్ధిక్ హత్యతో మహారాష్ట్రే కాదు.. దేశం మొత్తం భయాందోళనకు గురవుతోందని ‘ఎక్స్’ వేదికగా అన్నారు.‘‘ముంబైలో ఎన్సీపీ నేతను బహిరంగంగా కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటనతో మహారాష్ట్ర మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఢిల్లీలో కూడా అదే వాతావరణాన్ని సృష్టించారు. దేశం మొత్తం మీద గ్యాంగ్‌స్టర్ పాలన తీసుకురావాలన్నారు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రజానీకం నిలబడాలి’’ అని అన్నారు.मुम्बई में सरेआम NCP नेता की गोली मारकर हत्या की इस वारदात से ना केवल महाराष्ट्र बल्कि देशभर के लोग ख़ौफ़ज़दा हैं। दिल्ली में भी कमोबेश यही माहौल बना दिया है इन्होंने। ये लोग पूरे देश में गैंगस्टर राज लाना चाहते हैं। जनता को अब इनके ख़िलाफ़ खड़ा होना ही पड़ेगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2024ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: రాహుల్ గాంధీ ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ మరణం చాలా బాధాకరమని, మరణ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబంతో అండగా ఉంటామని ‘ఎక్స్’లో వేదికగా తెలిపారు.‘‘ ఈ భయానక సంఘటన మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమైందని బట్టబయలు చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. న్యాయం గెలవాలి’’ అని అన్నారు.The tragic demise of Baba Siddique ji is shocking and saddening. My thoughts are with his family in this difficult time. This horrifying incident exposes the complete collapse of law and order in Maharashtra. The government must take responsibility, and justice must prevail.— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2024 ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్యపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. “ ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య చాలా బాధాకరం. ఆయన దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తోంది. ఈ ఘటనతో ముంబై, మహారాష్ట్రల్లోని సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా తెలిస్తోంది. ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కుర్చీని కాపాడుకోవడంపైనే అక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబా సిద్దిఖీ హత్య ఘటన పూర్తిగా వైఫల్యం శాంతిభద్రతల లోపం’ అని అన్నారు.#WATCH | Hyderabad, Telangana | Baba Siddique Murder case | AIMIM Chief Asaduddin Owaisi says, "It is very disheartening to hear about the cowardly attack on Baba Siddique, in which he unfortunately lost his life. This shows the complete lack of will of political parties. This… pic.twitter.com/NnWAigRi04— ANI (@ANI) October 13, 2024 ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉండగా.. పలువురు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే.. ఈ కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఇక.. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుమని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఇక.. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గత కొన్ని నెలలుగా ప్లాన్ వేస్తున్నారని, ఆయన నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య చేసినందుకు నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ.50 వేలు అడ్వాన్స్, మారణాయుధాలు ఇచ్చినట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ బాబా సిద్ధిఖీ స్నేహితుడు. ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీ పెంచారు.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ దారుణహత్య
-
ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‌బాస్ షూటింగ్ రద్దు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ.. ముంబైలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కుమారుడు ఆఫీస్ బాంద్రాలో ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న సమయంలో సిద్దిఖీపై గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈయన మృతి చెందారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రతి ఏడాది సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు సల్మాన్ కచ్చితంగా హాజరవుతుంటారు. అలానే సిద్దిఖీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే సల్మాన్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తన స్నేహితుడు చనిపోవడం సల్మాన్ విషాదంలో నింపేసింది.సిద్దిఖీ విషయానికొస్తే ముంబైలోని బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. గత ఫిబ్రవరిలో పార్టీని వీడి, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. మరో నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాల్పులు ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)"Difficult times for #SalmanKhan. Some time ago, his father was threatened, and today his close friend #BabaSiddiqui was murdered. When Mumbai's superstars are not safe, what about the common people? This is a danger for everyone!""जीशान सिद्दीकी" pic.twitter.com/MQb7mFzkrt— Arun sisodiya (@kum58993361) October 12, 2024 -
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్
ముంబయి: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చెప్పడానికి చాలా ఉన్నాయి.. కానీ కొన్ని చెప్పకపోవడమే మంచిదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడుగా సిద్ధిఖ్ పనిచేశారు. I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I resign from the primary membership of the Indian National Congress Party @INCIndia with immediate effect. There’s a lot I would have liked to express… — Baba Siddique (@BabaSiddique) February 8, 2024 ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి మిలింద్ దేవరా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మిలింద్ కూడా సీనియర్ నాయకుడే. ఆయన తర్వాత మరో సీనియర్ నేత సిద్ధిఖ్ పార్టీని వీడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి -
ఇఫ్తార్‌లో హీరోయిన్ అవతారం.. విమర్శలు
నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోనాలీ రౌత్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇఫ్తార్ విందులో ఆమె ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ప్రతీ ఏటా కాంగ్రెస్ నేత బాబా సిద్ధిఖీ గ్రాండ్‌గా ఇఫ్తార్ విందు ఇచ్చే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కార్యక్రమానికి బడా బడా ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నటి సోనాలీ రౌత్ కూడా ఉన్నారు. అయితే ఆ విందులో ఆమె ఫోటోదిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇస్లాంకు, ఉపవాసానికి నువ్వు గౌరవం ఇవ్వకపోవచ్చు. కానీ, పవిత్ర రంజాన్ మాసానికి కాస్త గౌరవం ఇవ్వటం నేర్చుకో. ఇతర మతాల వారెవరూ నువ్వు ఇలాంటి డ్రెస్సులతో వేడుకలకు వెళ్తే అస్సలు ఒప్పుకోరు.. జాగ్రత్త’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ కామెంట్లకు ఆమె మాత్రం స్పందించటం లేదు. కాగా, ఇదే విందుకు మౌనీ రాయ్, హీనా ఖాన్, షామా సికిందర్, రాగిణి ఖన్నా, సుర్విన్ చావ్లా తదితరులు హాజరుకాగా, వారంతా చాలా పద్ధతిగా రావటంతో... సోనాలిని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కొందరు ఇస్లాంకు చెందిన సెలబ్రిటీలు ఇదే తరహాలో హాట్‌గా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శించిన విషయం తెలిసిందే. Last night at Baba Siddique's Iftar Party wearing outfit designed by @charmisdesign. A post shared by Sonali Raut (@isonaliraut) on Jun 11, 2018 at 5:48am PDT -
మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో..!
ముంబయి: మాజీ ప్రేమికులు ఒక్కచోట కలిశారు. బాలీవుడ్లో టాప్ మోస్ట్ చర్చించుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన ఒకప్పటి ప్రేయసి కత్రినా కైఫ్ మరోసారి ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఆదివారం రాత్రి రాజకీయ నేత బాబా సిద్దిఖీ బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అంతేకాదు సల్మాన్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న లులియా వాంటుర్ కూడా ఈ విందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్, ఎమీ జాక్సన్, గోల్డీ బెల్ ఇతర బాలీవుడ్ వర్గం కూడా ఇఫ్తార్ విందుకు హాజరయినట్లు తెలుస్తోంది. అయితే, లులియా ఈ విందుకు నిజంగానే వెళ్లిందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ, ఆమె భర్త ఆయుష్ శర్మ, వాళ్ల కుమారుడు అహిల్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.