ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ తన బుద్ధిని చూపెట్టిందని వ్యాఖ్యానించారు. అయితే జీషన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆ 255 స్థానాల్లో వాండ్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానం సైతం ఉంది. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీ చేయనున్నారు.
అయితే సీట్ల పంపకంపై కాంగ్రెస్‌లో ఉన్న తన పాత స్నేహితుడు ఫోన్ చేశాడని, వాండ్రే స్థానాన్ని శివసేన వర్గం (యూబీటీ)కి అప్పగించిన విషయాన్ని తనతో చెప్పాడని అన్నారు. ఇదే విషయంపై జీషన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తాను సొంత పార్టీగా భావించిన కాంగ్రెస్ తనని ద్రోహం చేసిందని, వాండ్రే సీటును ఉద్దశ్ ఠ్రాకేకు కేటాయించి తన బుద్ధిని చూపెట్టిందన్నారు. నమ్ముకున్న వాళ్లకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రక్తంలోనే లేదని అన్నారు.
सुना है पुराने दोस्तों ने वांद्रे पुर्व में अपना उम्मीदवार घोषित कर दिया है । साथ निभाना तो कभी इनकी फितरत में था ही नहीं।
“रिश्ता उसी से रखो जो इज़्ज़त और सम्मान दे,
मतलब की भीड़ बढ़ाने का कोई फ़ायदा नहीं।”
अब फैसला जनता लेगी!!!!— Zeeshan Siddique (@zeeshan_iyc) October 23, 2024
దీనిపై కాంగ్రెస్ మద్దతు దారులు జీషన్ సిద్ధిఖీని ట్రోల్ చేస్తున్నారు. జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పలు ఘటనల్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న జీషన్ సిద్ధిఖీ..ఎన్సీపీ చీఫ్ అజిత్ పవర్ చేసిన జన్ సన్మాన్ యాత్రలో పాల్గొన్నారు. ఆయాత్రకి కాంగ్రెస్‌కి సంబంధం లేదు. అలాంటప్పుడు మీరు అజిత్ పవార్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. కాబట్టే పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరిస్తే ఎన్సీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి తాజా జీషన్ సిద్ధిఖీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
They give you respect and honor and everything and you betray them on occasion, how will it work like this my brother?
— Yadvendra Yadav (@yadusandy) October 23, 2024
Comments
Please login to add a commentAdd a comment