Maha Vikas Aghadi
-
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు
నాందేడ్: ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ భాగ స్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.ఈ మేరకు ఏఐసీసీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలెట్లు బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించి నాయకులు, పార్టీ శ్రేణులకు ఎన్నికల రూట్ మ్యాప్‌పై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా కృషిచేయాలంటూ వారికి సూచించారు. -
బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ!
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ తన బుద్ధిని చూపెట్టిందని వ్యాఖ్యానించారు. అయితే జీషన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆ 255 స్థానాల్లో వాండ్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానం సైతం ఉంది. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీ చేయనున్నారు.అయితే సీట్ల పంపకంపై కాంగ్రెస్‌లో ఉన్న తన పాత స్నేహితుడు ఫోన్ చేశాడని, వాండ్రే స్థానాన్ని శివసేన వర్గం (యూబీటీ)కి అప్పగించిన విషయాన్ని తనతో చెప్పాడని అన్నారు. ఇదే విషయంపై జీషన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తాను సొంత పార్టీగా భావించిన కాంగ్రెస్ తనని ద్రోహం చేసిందని, వాండ్రే సీటును ఉద్దశ్ ఠ్రాకేకు కేటాయించి తన బుద్ధిని చూపెట్టిందన్నారు. నమ్ముకున్న వాళ్లకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రక్తంలోనే లేదని అన్నారు.सुना है पुराने दोस्तों ने वांद्रे पुर्व में अपना उम्मीदवार घोषित कर दिया है । साथ निभाना तो कभी इनकी फितरत में था ही नहीं। “रिश्ता उसी से रखो जो इज़्ज़त और सम्मान दे, मतलब की भीड़ बढ़ाने का कोई फ़ायदा नहीं।”अब फैसला जनता लेगी!!!!— Zeeshan Siddique (@zeeshan_iyc) October 23, 2024 దీనిపై కాంగ్రెస్ మద్దతు దారులు జీషన్ సిద్ధిఖీని ట్రోల్ చేస్తున్నారు. జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పలు ఘటనల్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న జీషన్ సిద్ధిఖీ..ఎన్సీపీ చీఫ్ అజిత్ పవర్ చేసిన జన్ సన్మాన్ యాత్రలో పాల్గొన్నారు. ఆయాత్రకి కాంగ్రెస్‌కి సంబంధం లేదు. అలాంటప్పుడు మీరు అజిత్ పవార్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. కాబట్టే పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరిస్తే ఎన్సీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి తాజా జీషన్ సిద్ధిఖీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. They give you respect and honor and everything and you betray them on occasion, how will it work like this my brother?— Yadvendra Yadav (@yadusandy) October 23, 2024 -
‘MVA’లో కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ .. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం)లోని మహా వికాస్ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు. బీజేపీ తొలి జాబితా విడుదల మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. -
‘మహా’ ఎన్నికలు.. కొంకణే కీలకం
సాక్షి, నేషనల్ డెస్క్: కొంకణ్.. మహారాష్ట్రలో రాజధాని ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీరప్రాంతం. నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటముల భాగ్యరేఖలను కొంకణే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కొంకణే అతి పెద్ద ప్రాంతం. మొత్తం 288 స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని రెండు వైరి వర్గాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. కొంకణ్‌లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండటం విశేషం. శివసేన (షిండే) సారథి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వస్థలమైన థానే కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది. దాంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకప్పుడు ముంబై నుంచి వలస వెళ్లేవారు పంపే మొత్తాలపై ఆధారపడ్డ కొంకణ్‌లో కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. చేపలు, మామిడి, కాజు తదితరాల ఎగుమతితో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించింది. యువత వలసలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలతో స్థానికంగానే రాణిస్తున్నారు. వాయు, రైలు మార్గాలు ఇతోధికంగా పెరిగాయి. పర్యాటక ఆకర్షణలకు కూడా కొంకణ్ నెలవుగా మారింది. కమ్యూనిస్టులకు చెక్ పెట్టి... ముంబై, పరిసర ప్రాంతాల్లోని నూలు మిల్లులు, ఇతర కర్మాగారాల్లో కమ్యూనిస్టులు చాలాకాలం పాటు గణనీయమైన శక్తిగా వెలుగొందారు. 1980ల్లో శివసేన ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి. తొలుత కాంగ్రెస్ మద్దతుతో వారి ఆధిపత్యానికి గండి కొట్టిన సేన, ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టి కొంకణ్ అంతటా ప్రబల శక్తిగా ఎదిగింది. 1990ల నాటికి బీజేపీతో జట్టు కట్టి హిందూత్వవాదంతో మహారాష్ట్రవ్యాప్తంగా హవా చెలాయించింది. 1995కల్లా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1999లో రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఏర్పాటు చేసిన ఎన్సీపీ కూడా కొంకణ్‌లో పోటీదారుగా మారింది. అలా ఈ ప్రాంతంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరిగింది. అయితే 2014 నుంచీ పరిస్థితి మారుతూ వస్తోంది. మోదీ మేనియా సాయంతో ముంబై, పరిసర ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటూ వచి్చంది. ప్రస్తుతం మొత్తం మహారాష్ట్ర తీర ప్రాంతంలోనూ కాషాయ పార్టీ హవా కని్పస్తోంది. ఆగర్భ శత్రువులైన శివసేన, కాంగ్రెస్ 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిస్థితుల్లో చేయి కలపడం, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంకణ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. శివసేన అసంతృప్త నేత షిండే బీజేపీ మద్దతుతో పార్టీని చీల్చడమే గాక ఎంవీఏ సంకీర్ణాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా శివసేన కాస్తా షిండే, ఉద్ధవ్ (యూబీటీ) వర్గాలుగా చీలింది. అనంతరం అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరారు. నాటినుంచీ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ)గా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి తమదే నిజమైన పారీ్టగా నిరూపించుకోవడం ఈ నాలుగు వర్గాలకూ కీలకంగా మారింది. అలా వీరందరికీ కొంకణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టణ ప్రాబల్య ప్రాంతం → మహారాష్ట్రలో అత్యంత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతంగా కొంకణ్ తీరం గుర్తింపు పొందింది. → సింధుదుర్గ్ నుంచి ముంబై దాకా విస్తరించిన కొంకణ్ పరిధిలో పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలున్నాయి. → ఇక్కడ 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 12 మంది లోక్‌సభ స్థానాలున్నాయి. → గిరిజన ప్రాబల్య పాల్ఘర్లో 6, థానేలో 18, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరిల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగతా 36 స్థానాలు ఒక్క ముంబై మహానగరంలోనే ఉన్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ కూటమికి ఏడు స్థానాలు దక్కాయి.→ నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. → కొంకణ్‌పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది.మిగతా ప్రాంతాల్లో... మహారాష్ట్రలో విదర్భ (62 అసెంబ్లీ సీట్లు), మరాఠ్వాడా (46), ఆనియన్ బెల్త్గా పేరొందిన ఉత్తర మహారాష్ట్ర (47), పశి్చమ మహారాష్ట్ర (58) ప్రాంతాల్లోనూ అధికార, విపక్ష కూటముల మధ్య గట్టి పోరు నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రుల సంఖ్య భారీగా పెరిగింది. వారిలో కనీసం 30 మంది దాకా నెగ్గడం ఖాయం. చివరికి ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకంగా మారతారు’’ అని మాజీ సీఎం ఛగన్ భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు. – -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.