ముంబై : మరికొద్ది రోజుల్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూరుస్తానంటూ ఓ హ్యాకర్.. ఓ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కూటమికి చెందిన ఓ ఎంపీతో మంతనాలు జరిపినట్లు చెప్పడం గమనార్హం.
సదరు మీడియా ప్రతినిధి..ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు మార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ మాట్లాడారు. తాను ఓ ఎంపీకి వ్యక్తిగత సహాయకుడినంటూ (పీఏ) పరిచయం చేసుకున్నారు. ఆ వీడియో కాల్‌లో ఎంపీకి పీఏగా పనిచేస్తున్న ప్రతినిధి.. మీతో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడుతారా? అని అడగ్గా.. ఒక్క నిమిషం తర్వాత మరో మీడియా ప్రతినిధి తాను మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు లబ్ధి చేకూరేలా ఈవీఎం హ్యాక్ చేయాలని కోరారు. మధ్యలో సయ్యద్ ఘజా కలగజేసుకుని నియోజవర్గం వివరాల గురించి ఆరాతీశారు. నేను ఈవీఎం హ్యాక్ చేస్తా. అందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈవీఎం హ్యాక్ చేసినందుకు తనకు సుమారు రూ. 52-53 కోట్లు చెల్లించాలి. ప్రాంతాలను స్కాన్ చేయడం,యాప్స్‌ను ఉపయోగించి ఈవీఎం సిగ్నల్స్‌ను మారుస్తానని చెప్పడం వీడియో సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి.
కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ సయ్యద్ షుజాతో చెప్పడం కలకలం రేపుతుంది.మరి ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహరాష్ట్ర అధికార,ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి.
👉చదవండి : బీజేపీపై అజిత్ పవార్ తిరుగుబావుటా?
Comments
Please login to add a commentAdd a comment