maharashtra assembly sessions
-
‘50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా’
ముంబై : మరికొద్ది రోజుల్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూరుస్తానంటూ ఓ హ్యాకర్.. ఓ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కూటమికి చెందిన ఓ ఎంపీతో మంతనాలు జరిపినట్లు చెప్పడం గమనార్హం. సదరు మీడియా ప్రతినిధి..ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు మార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ మాట్లాడారు. తాను ఓ ఎంపీకి వ్యక్తిగత సహాయకుడినంటూ (పీఏ) పరిచయం చేసుకున్నారు. ఆ వీడియో కాల్లో ఎంపీకి పీఏగా పనిచేస్తున్న ప్రతినిధి.. మీతో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడుతారా? అని అడగ్గా.. ఒక్క నిమిషం తర్వాత మరో మీడియా ప్రతినిధి తాను మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు లబ్ధి చేకూరేలా ఈవీఎం హ్యాక్ చేయాలని కోరారు. మధ్యలో సయ్యద్ ఘజా కలగజేసుకుని నియోజవర్గం వివరాల గురించి ఆరాతీశారు. నేను ఈవీఎం హ్యాక్ చేస్తా. అందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈవీఎం హ్యాక్ చేసినందుకు తనకు సుమారు రూ. 52-53 కోట్లు చెల్లించాలి. ప్రాంతాలను స్కాన్ చేయడం,యాప్స్‌ను ఉపయోగించి ఈవీఎం సిగ్నల్స్‌ను మారుస్తానని చెప్పడం వీడియో సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ సయ్యద్ షుజాతో చెప్పడం కలకలం రేపుతుంది.మరి ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహరాష్ట్ర అధికార,ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి. 👉చదవండి : బీజేపీపై అజిత్ పవార్ తిరుగుబావుటా? -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. ‘సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించాం. మరాఠా రిజర్వేషన్ బిల్లు కోసమే నేడు(మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్ కల్పిస్తాం’ అని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ.. రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ముస్లింల కూడా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం గమనార్హం. చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? -
‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’
సాక్షి, ముంబై: ముంబై ఎవడబ్బ సొమ్ము కాదని, మహారాష్ట్రదేనని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. కర్ణాటక న్యాయ శాఖ మంత్రి మధు స్వామి, ఎమ్మెల్యే లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అసెంబ్లీలో ఫడ్నవీస్ కర్ణాటక ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీటుగా సమాధానమివ్వకపోవడం వల్లే: పవార్ సరిహద్దు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు సరిహద్దు వివాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాయి. చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. కర్ణాటక మంత్రి మధు స్వామి, లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత అజిత్ పవార్ పట్టుబట్టారు. వ్యాఖ్యలను ఖండిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ‘కేంద్ర మంత్రి అమిత్‌షాతో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో సరిహద్దుపై ఎవరూ కొత్తగా దావా వేయవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దావా వేయలేదు. కానీ కర్ణాటక నేతలు, మంత్రులు మహారాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవహరిస్తున్నారు’ అని పవార్ ధ్వజమెత్తారు. కర్ణాటక నేతల వ్యాఖ్యలపై పవార్ ఘాటుగా స్పందించారు. వారికి దీటుగా సమాధానమివ్వపోవడం వల్లే కొవ్వెక్కి ఇష్టమున్నట్లు వ్యాఖ్యా నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవార్ డిమాండ్‌ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమరి్ధంచారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని, దీనిపై వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ కంపెనీల సిరప్‌లే కారణం’ భూకుంభకోణంపై గందరగోళం.. వాకౌట్ వాషీం జిల్లాలోని గాయ్రన్లో జరిగిన భూ కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్ష నేతలు సభలో గందరగోళం సృష్టించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ సమాధానమిస్తూ గాయ్రన్ భూ పంపిణీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారమే స్థలాన్ని పంపిణీ చేశామన్నారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు ఏ శిక్ష విధించినా తాను సిద్ధమేనన్నారు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. అబ్దుల్ సత్తార్ వెంటనే మంత్రి పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలికసదుపాయాల కోసం పంపిణీ చేస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ సమాధానమిచ్చారు. నిధుల కోసం విద్యాశాఖ త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను 2023 మార్చి వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విదర్భకు న్యాయం చేయండి: అజిత్‌పవార్ కరోనా కారణంగా రెండేళ్లుగా నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో విదర్భ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అజిత్‌పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. విదర్భ, మరఠ్వాడ, రైతులు ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను మరో వారం రోజులు పొడగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేకపోయారని, అది మహిళలను అవమానించడమేనని పవార్ అన్నారు. ఫడ్నవీస్ వద్ద ఏడు శాఖలున్నాయని, ఏ పనిమీద వెళ్లినా ఫడ్నవీస్‌ను అడగాలని చెబుతున్నారని ఆరోపించారు. సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవార్ సూచించారు. ఎన్సీపీ ప్రదేశ్ అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ... నందుర్బార్ జిల్లా ఆదివాసీ పాడలకు, కుగ్రామాలకు, నర్మద నదీ తీరంలోని 33 పల్లెకు వైద్య సేవలందడం లేదని ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఆశ వర్కర్లను అవసరమైతే వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. -
మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దమని, చట్ట వ్యతిరేకమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ నిర్ణయం తన అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది. అంతేగాక సస్పెన్షన్.. సెషన్ మేర లేదా ఆరు నెలలలోపే ఉండాలని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది. కాగా గత జూలై మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బీసీ కోటాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలుపుతూ.. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసింది. చదవండి: Yogi Adityanath: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష! -
‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకున్న కోవిడ్.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. 54 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. వీరిలో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఏ జర్నలిస్ట్ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్ బారిన పడలేదు. కాగా పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత పటిష్టంగా వైద్య పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం స్పీకర్ రేసులో సంగ్రామ్ థోపటే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి స్పీకర్ స్థానం ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మహావికాస్ ఆఘాడి కూటమి ఒప్పందంలో భాగంగా స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, భోర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగ్రామ్ థోపటే స్పీకర్ రేసులో ఉన్నారు. మరోవైపు, నిన్న మొన్నటి వరకు స్పీకర్ ఎన్నిక గురించి నోరు విప్పని బీజేపీ.. ఇప్పుడు తమ అభ్యర్థిని కూడా స్పీకర్ ఎన్నిక బరిలో దింపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ప్రకటన చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలుండగా, అందులో మహావికాస్ ఆఘాడి కూటమికి చెందినవారు 170 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 106 మంది ఉన్నారు. ఈ క్రమంలో సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే స్పీకర్ పదవి మహావికాస్ ఆఘాడి కూటమికి చెందిన అభ్యర్థికే దక్కే అవకాశమే కనిపిస్తోంది. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్‌లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. -
12 మంది బీజీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
-
రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్
ముంబై: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన–బీజేపీ కలిసే పోటీ చేస్తాయని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరికెన్ని సీట్లనేది రెండ్రోజులు ప్రకటిస్తామని శుక్రవారం ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ముందే సీట్ల పంపకాలపై నిర్ణయించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఎవరికెన్ని సీట్లనేది ప్రకటిస్తామని చెప్పారు. ‘రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీచేస్తాయనేది మీడియానే ప్రచారం చేస్తోంది..’అని వ్యాఖ్యానించారు. అనంతరం శివసేన కార్యదర్శి అనిల్ దేశాయి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న బీజేపీ చీఫ్ అమిత్ షా ముంబై పర్యటన ఉన్న నేపథ్యంలో ఆలోపే సీట్ల పంపకాల గురించి ప్రకటిస్తామని చెప్పారు. శివసేన–126, బీజేపీ–162 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరి యాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు నేడు లేదా రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నా యని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే దీపావళి(అక్టోబర్ 27వ తేదీ)కి ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీల కు కూడా ఎన్నికలు జరిపే యోచనలోనూ ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. -
శీతాకాల సమావేశాలపై మావోలు, ఉగ్రవాదుల గురి
సాక్షి, ముంబై: నాగపూర్‌లోని శాసనసభకు పోలీసు శాఖ భారీ భద్రత కల్పించింది. దీంతోపాటు ఈ నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున బలగాలను మోహరించింది. ఇందుకు కారణం శీతాకాల సమావేశాలు జరిగే సమయంలో మావోయిస్టులు, ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందంటూ సమాచారం అందడమే. ఈ నెల తొమ్మిదో తేదీన నాగపూర్‌లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సమావేశాల సమయంలో దాడి జరిగే అవకాశముందంటూ సమాచారమందడంతో నాగపూర్ నగరపోలీసు విభాగం ఏకంగా తొమ్మిది వేలమంది సిబ్బందిని మోహరించింది. వీరిలో కొందరు యూనిఫాంలతో, మరికొందరు సాధారణ దుస్తులతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పోలీసులే కనిపిస్తున్నారు. శాసనసభ భవన పరిసరాల్లో, అటు దారితీసే మార్గాలలో సీసీటీవీ కెమెరాలు, వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. కాగా గత కొద్దినెలలుగా గడ్చిరోలి, గోండియాలతోపాటు ఉప రాజధాని అయిన నాగపూర్‌లో కూడా మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయి. అంతేకాకుండా పోలీసులు, మావోల మధ్య తరుచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగపూర్‌లో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 20 వరకు జరగనున్న సమావేశాల సమయంలో మావోలు తెగబడే ప్రమాదం పొంచిఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. శాసనసభ భవన పరిసరాలతోపాటు నగరమంతటా సిబ్బందిని మోహరించినట్టు పేర్కొన్నాయి. కాగా సరిహద్దు రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే రహదారులన్నీ పోలీసుల అధీనంలోనే ఉన్నాయి. మరోవైపు సమావేశాల సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం వివిధ సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తుంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని మావోలు ర్యాలీల గుంపు లో చేరే ప్రమాదం కూడా లేకపోలేదు.