మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు | SC Quashes One Year Suspension of 12 Maharashtra BJP MLAs | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Jan 28 2022 11:15 AM | Updated on Jan 28 2022 12:51 PM

SC Quashes One Year Suspension of 12 Maharashtra BJP MLAs - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్‌ విధించిన ఏడాది సస్పెన్షన్‌ రాజ్యాంగ విరుద్దమని, చట్ట వ్యతిరేకమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ నిర్ణయం తన అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది. అంతేగాక సస్పెన్షన్.. సెషన్ మేర లేదా ఆరు నెలలలోపే ఉండాలని గతంలో వ్యాఖ్యానించిన  విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది.

కాగా గత జూలై మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారంటూ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. బీసీ కోటాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసన తెలుపుతూ.. స్పీకర్‌ని దూషిండచడమే కాక కొట్టారనే ఆరోపణలపై ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్‌ విధించిన ఏడాది సస్పెన్షన్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసింది.
చదవండి: Yogi Adityanath: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement