ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment