mahayuti
-
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. మంత్రులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్!
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తగా మంత్రివర్గంలో చేరిన కేబినెట్ సభ్యులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 39 మంది సభ్యులు పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వన్నట్లు తెలిపారు. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించింది. కొత్తగా మంత్రివర్గంలోని చేరిన 39 మంది ఆదివారం రాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 39 మందిలో 16 మంది కొత్త వారు కాగా, 10 మంది మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు రెండు, మూడు రోజుల్లో శాఖ కేటాయింపు ఉంటుందని తెలిపారు. అయితే, కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రుల పనితీరుపై సమీక్షలు జరుపుతామని, కూటమిలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన(ఏక్‌నాథ్‌షిండే)తో కేబినెట్ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. Devendra Fadnavis's HUGE statement on ministers🔥Fadnavis⚡️: We are going to audit the performance of all the ministers.If it is found in the audit that any minister is not doing the right work then that minister will be reconsidered ↩️pic.twitter.com/qAS0TpKe3u— Political Views (@PoliticalViewsO) December 15, 2024కేబినెట్ విస్తరణ అనంతరం మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై మహాయుతి కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తయారు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేపీ మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారనే దానిపై ఫడ్నవీస్ స్పష్టత ఇవ్వలేదు. కానీ డిప్యూటీ సీఎం, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తన పార్టీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. పనితీరు ఆధారంగా వారి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్ల సమయంలో మంత్రుల పనితీరు బాగుంటే కొనసాగుతారని, లేదంటే భర్తీ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో కేబినెట్ విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 11,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 9 మంత్రి పదవులు దక్కాయి. -
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
Maha Yuti: మీడియా ముందే సెటైర్లు.. ఇంతలోనే సర్దుకుపోయారా?!
ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది. సీఎం పదవికి నేనే సిపారసు చేశాప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. బాంబు పేల్చిన షిండేఅనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.అజిత్ పవార్‌పై షిండే సెటైర్లు షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే.. అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. #WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco— ANI (@ANI) December 4, 2024 -
చేజారిన సీఎం పదవి.. స్పందించిన ఏక్నాథ్ షిండే
ముంబై : ముఖ్యమంత్రి పదవి చేజారడంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే స్పందించారు. మహాయుతి కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు అని వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తో పాటు శివసేన నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతృత్వంలోని అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.ఈ తరుణంలో మహరాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు బుధవారం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యచరణను పూర్తి చేశారు. షిండేకి నా కృతజ్ఞతలుఅనంతరం,ఏక్నాథ్ షిండే,దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేకి నా కృతజ్ఞతలు. మంగళవారం షిండేతో భేటీ అయ్యాను. ఈ భేటీలో మంత్రి వర్గంలో కొనసాగాలని కోరా. దానికి ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టినా.. నిర్ణయాలు కలిసే తీసుకుంటాం’ అని అన్నారు. ఎవరూ ఎక్కువా కాదు.. తక్కువా కాదు‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేను సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. గత 2.5 ఏళ్లలో మహాయుతి కూటమి నేతృత్వంలోని మేం ముగ్గురం, మా బృందం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన కృషి అమోఘం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మేం తీసుకున్న నిర్ణయాలపై మేం సంతోషంగా ఉన్నామని తెలిపారు. బాంబు పేల్చిన షిండేరేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.చమత్కరించిన అజిత్ పవార్షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. -
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్షం బుధవారం ముంబైలో సమావేశమై ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన్ను కోరారు. బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వారికి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను ప్రతిపాదిస్తున్నా: షిండేఅనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలో షిండే, అజిత్ సహా మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైనట్లు లేఖ అందజేశారు. కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహా్వనించారు. గురువారం సాయంత్ర 5.30కు ఆజాద్ మైదాన్‌లో కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు’’ అని తెలిపాయి. అనంతరం షిండే, అజిత్‌లతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసుంటే క్షేమంగా ఉంటాం. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే. మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. షిండే, అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాం’’ అన్నారు. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండున్నరేళ్లపాటు సీఎంగా చేశానని, అందుకు సంతృప్తిగా ఉన్నానని షిండే పేర్కొన్నారు. ‘‘నాడు నన్ను సీఎం పదవికి ఫడ్నవీస్ ప్రతిపాదించారు. నేడు ఆయనను ఆ పదవికి నేను ప్రతిపాదిస్తున్నా. మేమంతా బృందంగా కలిసికట్టుగా పని చేస్తాం’’ అన్నారు.పరస్పర ఛలోక్తులు మీడియా భేటీలో మహాయుతి నేతలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా సాయంత్రం దాకా వేచి చూడండని షిండే బదులిచ్చారు. అజిత్ కల్పించుకుని తాను మాత్రం కచ్చితంగా ప్రమా ణం చేస్తానని అనడంతో గొల్లుమన్నారు. ‘‘అవునవును. ప్రమాణ స్వీకారాల్లో దాదా (అజిత్)కు చాలా అనుభవముంది. ఉదయం, సాయంత్రం ప్ర మాణం చేసిన అనుభవముంది’’ అనడంతో మరో సారి నవ్వు లు విరిశాయి. 2019లో అజిత్ తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. పదవి తీసుకోండి షిండేపై సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటూ షిండేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. బుధవారం షిండేతో భేటీలో వారు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టును షిండే తీసుకుంటే పొత్తు ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చేరితే పార్టీనీ బలోపేతం చేసుకోవచ్చన్నారు. -
అలకలు.. చిటపటలు.. ఎట్టకేలకు మహా డ్రామాకు ఎండ్ కార్డు!
-
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం!
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఈ తరుణంలో మహా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత ఏక్నాథ్ షిండే ముంబైకి బయలుదేరారు. తొలిసారి భేటీమహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత ఫడ్నవీస్, షిండేల మధ్య ఇదే తొలి సమావేశం. అయితే, డిసెంబర్ 5న మహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తదుపరి భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ఏక్నాథ్ షిండే నివాసానికి వెళ్లినట్లు స్థానిక మీడియా,మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. మోదీ నిర్ణయం శిరోధార్యంమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విషయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం ఫడ్నవీస్,షిండేలు పోటీ పడ్డారు. అయితే, బీజేపీ అగ్రనేతలతో జరిగిన సమావేశం తర్వాత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గారు. మహాముఖ్యమంత్రి ఎవరు? అనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. మోదీ నిర్ణయమే తమకు శిరోధార్యమని బహిరంగంగా వెల్లడించారు. #WATCH | Mumbai: BJP leader Devendra Fadnavis arrives at Varsha bungalow to meet Maharashtra caretaker CM Eknath Shinde pic.twitter.com/hjruFEswbj— ANI (@ANI) December 3, 2024 -
బీజేపీ ప్లాన్ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే
ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఏక్నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. #WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07— ANI (@ANI) December 3, 2024 -
‘మహా’ కేబినెట్.. షిండే, అజిత్ పవార్ వాటాకు ఎన్ని మంత్రి పదవులంటే?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది. శివసేన(57): ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బుధవారమైనా తేలుస్తారా?ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారంమహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
మెరుగుపడని ఆరోగ్యం.. ఆస్పత్రికి ఏక్నాథ్ షిండే
ముంబై: మహరాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. ప్రస్తుత, మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆస్పత్రి పాలయ్యారు.గతవారం అనారోగ్యం కారణంగా ఏక్నాథ్ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో షిండేని అత్యవసర చికిత్స నిమిత్తం థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు.పలు రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఏక్నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడలేదని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.కొద్ది సేపట్లో మహాయుతి కూటమి కీలక సమావేశంఓ వైపు ఏక్నాథ్ షిండే అనారోగ్య రిత్యా ఆస్పత్రిలో చేరాగా.. మరోవైపు మహాయుతి కూటమి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.వేర్వేరు నగరాల్లో మహాయుతి కీలక నేతలుమహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతుంది. మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో కీలక నేతలు వేర్వేరు నగరాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కీలక నేతలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టత ఇచ్చారు. గత వారం ఏక్నాథ్ షిండే అనారోగ్యంతో తన స్వగ్రామానికి వెళ్లారు. నాటి నుంచి మహాయుతి కూటమి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఏక్నాథ్ షిండేని పరీక్షించిన వైద్యులు వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా, మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం కుదుట పడకపోవడంతో థానేలోని జూపిటర్ ఆస్పత్రికి వెళ్లారు. 'Tabiyat agar bhadiya hai' then what exactly is Eknath Shinde doing in the hospital while Maharashtra waits for its Chief Minister?#EknathShinde #MaharashtraCM pic.twitter.com/9eZwOpqe70— Sneha Mordani (@snehamordani) December 3, 2024 -
సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్‌షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.మరోవైపు నేడు విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.ఈ ఉదయం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. -
‘మహ’ సీఎం ఎంపిక : పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు. మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి పయనమయ్యారు. కేబినెట్ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్ షెడ్యూల్ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం. Union Finance Minister @nsitharaman and Former Gujarat Chief Minister Vijay Rupani have been appointed as #BJP's Central Observers for Legislature Party meeting to elect leader in #Maharashtra. pic.twitter.com/3wb1DryKVD— All India Radio News (@airnewsalerts) December 2, 2024 -
‘మహా’ సీఎం పదవిపై వీడని ఉత్కంఠ .. షిండే కుమారుడు ట్వీట్ వైరల్
ముంబై : మహా సీఎం పదవిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ తరుణంలో తనకు డిప్యూటీ సీఎం పదవి అంటూ వస్తున్న వార్తల్ని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే కొట్టి పారేశారు.తన కుమారుడు శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ ఏక్నాథ్ షిండే మహాయుతి కూటమి పెద్దలతో మంతనాలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని శ్రీకాంత్ షిండే సోమవారం ఖండించారు. తన గురించి నిరాధారమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని, తాను మహారాష్ట్రలో ఏ మంత్రి పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు. ‘మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. కాబట్టే చర్చలు, పుకార్లకు దారి తీసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజులు తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను ఉపముఖ్యమంత్రి అవుతాననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తలు నిరాధారమైనవి’ అని శ్రీకాంత్ షిండే ట్వీట్లో పేర్కొన్నారుमहायुतीच्या सरकारचा शपथविधी थोडा लांबल्यामुळे सध्या चर्चा आणि अफवा यांचे पीक फोफावले आहे. काळजीवाहू मुख्यमंत्री मा. श्री एकनाथ शिंदे यांनी प्रकृती अस्वास्थ्यामुळे दोन दिवस गावी जाऊन विश्रांती घेतली. त्यामुळे अफवांना अधिकच बहर आला. मी उपमुख्यमंत्री होणार अशा बातम्या प्रश्नचिन्हे…— Dr Shrikant Lata Eknath Shinde (@DrSEShinde) December 2, 2024 -
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే?
ముంబై : మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలనే యోచనలో మహాయుతి కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆ చర్చల్లో నిజమెంత? అనే దానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సి ఉంది. మరోవైపు, శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఏక్నాథ్ షిండే స్పందించారు. ‘ఇలాంటి చర్చలన్నీ మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. మహాయుతి కూటమిలో పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. #WATCH | Satara: Maharashtra caretaker CM Eknath Shinde says, "I am doing good now. I had come here to rest after the hectic election schedule... I did not take any leave during my 2.5 years as the CM. People are still here to meet me. This is why I fell ill... This government… pic.twitter.com/YYa8p7Sh1y— ANI (@ANI) December 1, 2024ఎన్నికల ఫలితాల అనంతరం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్ షాత్‌తో నేను (ఏక్‌నాథ్‌షిండే), అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యాం. ముంబైలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో అన్నీ విషయాలపై కులంకషంగా చర్చిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు మేం జవాబుదారీగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, మహాయుతి పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏక్నాథ్ షిండే ఖండించారు. తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురయ్యా. అందుకే మా స్వగ్రామం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా. నా ఆరోగ్యం బాగుంది. ఇక మహరాష్ట్ర సీఎం ఎవరు? అని అంటారా. సోమవారం మహాయుతి పెద్దలే స్పష్టత ఇస్తారు’ అని స్పష్టం చేశారు. -
Maharashtra: సీఎం పదవి బీజేపీకే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు. 5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే. కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.సేనలో అసంతృప్తి! తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!
ముంబై: మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు.. మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.Baby , don't say may be...Is Murlidhar Mool going to be new CM of maharashtra ...? pic.twitter.com/RDneu9aQC5— amit (@GandhiSoul2) November 30, 2024మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్ పవార్-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
పదవుల కోసం పాకులాడం: ఏక్నాథ్ షిండే
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై అధికార మహాయుతి కూటమిలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు.ఈ ఇద్దరి మధ్య భేటీ సానుకూలంగా జరిగిందని ఏక్నాథ్ షిండే మీడియాకు వెల్లడించారు.‘అమిత్‌షాతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి,ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై చర్చించాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహా సీఎం ఎంపికపై కసరత్తు పూర్తయిన వెంటనే వివరాల్ని వెల్లడిస్తాం. మహారాష్ట్ర ప్రజలు తమను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించారు. ప్రజల ఆదేశాల్ని గౌరవించడమే ప్రాధాన్యత. పదవుల కోసం పాకులాడం’ అని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఆ నిర్ణయం కమలం పెద్దలదేమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా సీఎం నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే అప్పగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మహరాష్ట్ర సీఎం ఎవరు? ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులుతో పాటు ఇతర అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. -
మహారాష్ట్రలో మంత్రి పదవులపై పట్టుబట్టిన మహాయుతి పార్టీలు
-
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్?
ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది. మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం చెప్పారు.2, 3 గంటలే నిద్రపోయా‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌మ్యాన్. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్‌గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్‌పవార్) 41 చోట్ల గెలిచాయి.మా వైపు స్పీడ్ బ్రేక్ లేదన్న షిండేఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు. వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను, ఫడ్నవిస్, అజిత్‌పవార్ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చెప్పారు. -
సీఎం పదవిపై నాకు ఆశలేదు: ఏక్నాథ్ షిండే
ముంబై : మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని, బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారాయన. బుధవారం థానేలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. సీఎం పదవిపై నాకు ఆశ లేదు. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. అంతిమంగా.. మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం’’ అని అన్నారాయన.మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు నా కృతజ్ఞతలు. కూటమికి మద్దతు పలికిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. బాల్ ఠాక్రే ఆశయాలతో ముందుకెళ్తా. మహయుతి కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. నా జీవితంలో నేను సీఎం అవుతానని అనుకోలేదు. ఎన్నో ఒడిదుడుకులు చూశాను. పేదల కష్టాలు, బాధలు చూశాను. మహాయుతి కూటమిలో ఓ కార్యకర్తగా పనిచేశా. ప్రధాని మోదీ మద్దతు నాకు ఉంది అని అన్నారు.ఇక కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరు? అనేది బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని చేసినా తనకు అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి చెప్పాను. పీఎం మోదీ మాటకు కట్టుబడి ఉంటాను’ అని ఉత్కంఠకు తెర దించారు ఏక్నాథ్ షిండే.#WATCH | Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "For the past 2-4 days you must have seen rumours that someone is miffed. We are not people who get miffed...I spoke with the PM yesterday and told him that there is no obstruction from our end in… pic.twitter.com/IvFlgD5WQI— ANI (@ANI) November 27, 2024 -
విజయాన్ని మించిన పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్‌సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్‌కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది. అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది. కాంగ్రెస్‌ది మహావైఫల్యంఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్‌సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు. హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్‌సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు. సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!పాత చింతకాయ పచ్చడిచంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి. వాస్తవిక బలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.దిద్దుబాటు చర్యలతో...లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
-
మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్ .. కౌన్ బనేగా సీఎం
ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి సీఎం అవడం లాంఛనమేనని, సోమవారం నూతన సర్కారు కొలువుదీరుతుందనివార్తలొచ్చాయి. కానీ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని కూటమి భాగస్వామి శివసేన (షిండే) పట్టుబడుతోంది. బిహార్ మోడల్‌ను మహారాష్ట్రలో కూడా బీజేపీ అమలు చేయాలని శివసేన (షిండే) అధికార ప్రతినిధి నరేశ్ మస్కే సోమవారం డిమాండ్ చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లున్నా సంకీర్ణంలోని మైనారిటీ భాగస్వామి జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ను సీఎం చేశారని గుర్తు చేశారు. ‘‘సీఎంగా మహాయుతి కూటమిని షిండే ముందుండి నడిపి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. కనుక ఆయన్నే కొనసాగించడం సబబు’’ అన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. కూటమిలోని మూడో పార్టీ ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అందుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. దాంతో సీఎంపై పీటముడి వీడక కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు కొలిక్కి రావడం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేత అమిత్ షా సమావేశమవుతారంటూ తొలుత వార్తలొచ్చాయి. దాంతో రాత్రికల్లా సస్పెన్స్ వీడుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. దాంతోప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫడ్నవీసే సీఎం అవడం ఖాయమని, అజిత్‌తో పాటు షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. షిండే సేనకు 12, పవార్ ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. ఫడ్నవీస్ తొలిసారి 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2019లో మళ్లీ సీఎం అయినా అజిత్ పవార్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం 80 గంటల్లోనే పడిపోయింది. ‘మంగళవారం డెడ్‌లైన్’ అవాస్తవం మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగుస్తున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనను అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘మంగళవారం డెడ్‌లైన్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘం శనివారమే గవర్నర్‌కు గెజిట్ కాపీ సమరి్పంచింది. కనుక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 73వ సెక్షన్ ప్రకారం కొత్త అసెంబ్లీ ఇప్పటికే పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టే లెక్క. రాష్ట్రపతి పాలన వచ్చేందుకు అవకాశమే లేదు’’ అని అసెంబ్లీ అధికారి ఒకరు వివరించారు. -
రెండోరోజూ మహా ర్యాలీ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మహాయుతి కూటమి ఆఖండ విజయంతో బుల్ రెండోరోజూ రంకెలేసింది. సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80 వేల స్థాయిపైన 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు లాభపడి 24 వేల స్థాయిపైన 24,221 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,076 పాయింట్లు బలపడి 80,193 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు ఎగసి 24,253 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 1,356 పాయింట్లు ఎగసి 80,473 వద్ద, నిఫ్టీ 445 పాయింట్లు దూసుకెళ్లి 24,352 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 84.29 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థికమంత్రిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్, మార్కెట్‌కు అనుకూల ‘స్కాట్ బెసెంట్’ను ట్రంప్ నామినేట్ చేయడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు 1.50% ర్యాలీ చేశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → సెన్సెక్స్ సూచీలో 30కి 26 షేర్లూ లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ఎల్అండ్టీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 – 2.50% లాభపడ్డాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ఇండ్రస్టియల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, ఇంధన 2.50%, రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 2%, ఫార్మా సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2% నుంచి ఒకటిన్నర శాతం పెరిగాయి. → అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ గ్రూప్‌లో పదింటికిగానూ అయిదు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.55%, ఏసీసీ 2.54%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.26%, అదానీ విల్మార్ 2%, అంబుజా సిమెంట్స్ 1% లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4%, అదానీ పవర్ 3%, ఎన్డీటీవీ 2%, అదానీ టోటల్ గ్యాస్ 1.50% నష్టపోయాయి. → బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో చోటు దక్కించుకోవడంతో జొమాటో కంపెనీ షేరు 3.58% పెరిగి రూ.274 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 7.62% ఎగసి రూ.284 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే సూచీలో స్థానం కోల్పోయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 2.5% నష్టపోయి రూ. 953 వద్ద ముగిసింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,954 పాయింట్లు(4%) ర్యాలీ చేయడంతో రూ.14.20 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.58 లక్షల కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.6.11 లక్షల కోట్లు ఆర్జించారు. -
మరికొద్ది గంటలే.. షిండే వెనక్కి తగ్గకుంటే.. 2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ..సీఎం పదవికి, సంఖ్యా బలానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు. కూర్చొని చర్చించి సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. అదే టైంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి ఛాయిస్‌గా బీజేపీ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు.. మొదట సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన అజిత్ పవార్.. ఇప్పుడు బీజేపీకే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..మహా సీఎం పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఫడ్నవిస్-షిండే-అజిత్ పవార్లు ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుత సీఎం షిండే రేపు రాజీనామా చేస్తారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన ప్రకటించింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నేతగా షిండేను ఎన్నుకుంది కూడా. అయితే..మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. పరిస్థితుల దృష్ట్యా కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది. 2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 33 రోజుల పాటు ఆ టైంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇక.. 2014లోనూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ). మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, తదనంతరం సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇంతకు ముందులా లేదుగా.. ..మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లను బీజేపీ దక్కించుకుంది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని.. బీజేపీ కూటమిగా(161 సీట్లతో) సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం డిమాండ్ చేశారాయన. కుదరకపోవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆపై కలిసొచ్చిన అవకాశం అందిపుచ్చుకుని కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఇక..2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి.. బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. ఆ టైంలోనూ ఫడ్నవిస్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మరోవైపు.. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఫడ్నవిస్ సీఎంగా ఉండి.. షిండే, పవార్లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగడమే సబబని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు షిండే అంగీకరిస్తారో లేదో? అనేది ఈ రాత్రికల్లా తేలిపోవాల్సి ఉంది. లేకుంటే.. రాష్ట్రపతి పాలన తప్పదు!. -
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు. అక్కల్కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్సాత్ పూతేను ఓడించారు. ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు -
లడ్కీ బహన్, మత విభజనే కారణం
కరాడ్: లడ్కీ బహిన్ పథకం, మతపరమైన విభజనే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి దోహదపడ్డాయని ఎన్సీపీ (ఎస్పీ)అధినేత శరద్‌పవార్ అభిప్రాయపడ్డారు. లడ్కీ బహెన్ పథకం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని, మతపరమైన విభజన కలిసొచ్చిందని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడంపై పార్టీ సహచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్న అంశంపై అధికారిక సమాచారం ఉంటేనే మాట్లాడతానన్నారు. ఎంవీఏ కూటమి ఎంతో కష్టపడ్డా ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని పవార్ అన్నారు. మనవడు యుగేంద్ర పవార్‌ను బారామతిలో అజిత్ పవార్‌పై బరిలోకి దింపడం తప్పు నిర్ణయం కాదని, ఎన్నికలన్నప్పుడు పోటీ తప్పదని చెప్పారు. అజిత్ పవార్, యుగేంద్ర పవార్లను పోల్చలేమని, ఈ విషయం తనకూ తెలుసని స్పష్టం చేశారు. యుగేంద్ర పవార్‌పై అజిత్ పవార్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
‘మహా’ సీఎంపై పీటముడి!
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే చెప్పారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు. -
మహాసునామీ.. మహాయుతి హవా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సాధించిన కనీవినీ ఎరగనంతటి ఘనవిజయం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా నాలుగింట మూడొంతులకు పై చిలుకు సీట్లను అధికార సంకీర్ణం కైవసం చేసుకోగా విపక్ష మహా వికాస్ గఘాడీ (ఎంవీఏ) కేవలం 49 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. బీజేపీ ఏకంగా 132 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. ఇవి రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యధిక, కాంగ్రెస్‌కు స్థానాలు కావడం విశేషం! మహారాష్ట్రలోని ఆరు ప్రాంతాలకు గాను అన్నిచోట్లా మహాయుతి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగడమే ఈ అఖండ విజయానికి కారణమైంది.పశ్చిమ మహారాష్ట్ర షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి ఎంవీఏకు కంచుకోట వంటిది. ఇక్కడ కూడా ఈసారి విపక్ష కూటమికి దారుణ ఫలితాలే ఎదురయ్యాయి. 70 స్థానాలకు గాను మహాయుతి ఏకంగా 53 చోట్ల విజయనాదం చేస్తే ఎంవీఏ కేవలం డజను సీట్లకు పరిమితమైంది. మరీ ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 12 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతం నుంచి బరిలో దిగిన పృథీ్వరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ వంటి కాకలుతీరిన కాంగ్రెస్ నేతలు కూడా ఓటమి చవిచూశారు. శివసేన (యూబీటీ)కీ రెండే సీట్లు దక్కాయి. వాటితో పోలిస్తే ఎంవీఏలోని మూడో పక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నెగ్గిన 10 స్థానాల్లో ఏకంగా 8 పశి్చమ మహారాష్ట్రలోనే కావడం విశేషం. ఈ ప్రాంత పరిధిలోని కొల్హాపూర్ జిల్లాలోనైతే మహాయుతి ఏకంగా 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంది.మరాఠ్వాడాఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాల్లో ఏకంగా 6 ఎంవీఏ ఖాతాలోకి వెళ్లాయి. ఆర్నెల్లకే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇక్కడి 46 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 41 చోట్ల మహాయుతి జెండా ఎగిరింది. ఎంవీఏ కేవలం 5 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తే ఏకంగా 19 స్థానాలు గెలుచుకుంది. శివసేన (షిండే) 16 స్థానాల్లో 13, ఎన్సీపీ (అజిత్) 9 సీట్లకు ఏకంగా 8 నెగ్గాయి. మరాఠా రిజర్వేషన్ల అంశానికి విరుగుడుగా ఓబీసీలను మహాయుతి పక్షాలు విజయవంతం సంఘటితం చేయగలిగాయి. ఈ సోషల్ ఇంజనీరింగే ఈ ప్రాంతంలో అధికార కూటమి విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఇక్కడి నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నెగ్గడం ఎంవీఏ కూటమికి కాస్తలో కాస్త ఊరటనిచి్చంది. విదర్భ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో 7 ఎంవీఏ పరమయ్యాయి. ఇప్పుడు మహాయుతి 62 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 స్థానాలను నెగ్గింది. వీటిలో ఒక్క బీజేపీ వాటాయే 39 కావడం విశేషం! కాంగ్రెస్ ఇక్కడ కేవలం 8 స్థానాలు గెలవగలిగింది. ఇక్కడి సాకోలీ స్థానం నుంచి పీసీసీ చీఫ్ నానా పటోలే కూడా కేవలం 208 ఓట్ల మెజారిటీతో అతి కష్టమ్మీద గట్టెక్కారు!కొంకణ్ ఈ ప్రాంతాన్ని మహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసేయడం విశేషం. 39 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 35 స్థానాలు అధికార కూటమి ఖాతాలో పడ్డాయి. ఇక్కడ కాస్తో కూస్తో పట్టున్న శివసేన (యూబీటీ) ఒక్కటంటే ఒక్క స్థానమే గెలవగలిగింది. ఆరెస్సెస్ దన్నుతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కొంకణ్‌పై ఉన్న పట్టు ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఉత్తర మహారాష్ట్రమహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన మూడు ప్రాంతాల్లో ఇదొకటి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 7 స్థానాల్లో ఆరు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. ఈసారి మాత్రం 35 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి ఏకంగా 33 చోట్ల గెలిచింది. ఎంవీఏ కూటమి ఇక్కడ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. సోదిలో లేని చిన్న పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కీలక పాత్ర పోషిస్తాయని అంతా భావించిన చిన్న పార్టీలు సోదిలో కూడా లేకుండా పోవడం విశేషం. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) వంటివి కూడా ప్రభావం చూపలేకపోయాయి. 125 చోట్ల పోటీ చేసిన ఎంఎన్ఎస్, 200 స్థానాల్లో బరిలో దిగిన వీబీఏ కనీసం ఖాతా కూడా తెరవలేదు! అత్యధికంగా 237 చోట్ల పోటీ చేసిన బీఎస్పీ కూడా ఒక్కచోటా గెలవలేదు. 28 చోట్ల పోటీ చేసిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం)దీ అదే పరిస్థితి. రైతుల్లో బాగా ఆదరణ ఉన్న స్వాభిమాని పక్ష, ప్రహార్ జనశక్తి వంటివి కూడా సున్నా చుట్టాయి. సమాజ్‌వాదీ, జన్ సురాజ్య శక్తి పార్టీలు కాస్త మెరుగ్గా రెండేసి స్థానాలు నెగ్గాయి. సీపీఎం, మజ్లిస్‌తో పాటు రా్రïÙ్టయ యువ స్వాభిమాన్ పార్టీ, రా్రïÙ్టయ సమాజ్ ప„Š , పిజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, రాజర్షి సాహూ వికాస్ అఘాడీ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈసారి మహారాష్ట్రలో ఏకంగా 158 పార్టీలు ఎన్నికల బరిలో దిగడం విశేషం. ముంబై ఎంవీఏ కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఏకైక ప్రాంతం. రాజధాని నగరంతో పాటు శివారు ప్రాంతాలతో కలిపి 36 సీట్లుంటే విపక్ష కూటమి 14 సీట్లు దక్కించుకుంది. వాటిలో 10 స్థానాలు ఉద్ధవ్ శివసేనకే దక్కగా మూడుచోట్ల కాంగ్రెస్ నెగ్గింది. శరద్ పవార్ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. మహాయుతి 22 చోట్ల గెలిచింది. వాటిలో 15 బీజేపీకే దక్కడం విశేషం.ముఖాముఖిల్లో షిండే, అజిత్ పార్టీల హవా 36 చోట్ల ఉద్ధవ్ సేనపై షిండే సేన గెలుపు 29 చోట్ల శరద్ పార్టీపై నెగ్గిన అజిత్ ఎన్సీపీ శివసేన, ఎన్సీపీ వర్గ పోరులో సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాలు స్పష్టంగా పై చేయి సాధించాయి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ), షిండే శివసేన 50 అసెంబ్లీ స్థానాల్లో ముఖాముఖి తలపడ్డాయి. వాటిలో 36 చోట్ల షిండే సేన నెగ్గింది. 14 చోట్ల మాత్రం ఉద్ధవ్ సేన గెలిచింది. ఆ పార్టీ మొత్తం 95 చోట్ల బరిలో దిగినా కేవలం 20 సీట్లే గెలుచుకుంది. షిండే సేన 81 చోట్ల పోటీ చేయగా 57 స్థానాలు కైవసం చేసుకుంది. 2022లో షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి శివసేనను చీల్చడం, బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇక రెండు ఎన్సీపీలు 35 చోట్ల ముఖాముఖి తలపడ్డాయి. అజిత్ ఎన్సీపీ 29 స్థానాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ఓడించింది. ఆరుచోట్ల మాత్రం ఆ పార్టీ చేతిలో ఓటమి చవిచూసింది. అజిత్ పార్టీ మొత్తం 59 చోట్ల పోటీ చేయగా ఏకంగా 41 స్థానాలు గెలుచుకుంది. శరద్ పార్టీ మాత్రం ఏకంగా 86 చోట్ల పోటీ చేస్తే కేవలం పదింట మాత్రమే నెగ్గింది. శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీని గతేడాది అజిత్ చీల్చి బీజేపీ–షిండే సేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. రెండు వర్గాల్లో అసలైన పార్టీలు ఎవరివంటూ నాటినుంచీ సాగుతున్న చర్చకు ఈ ఫలితాలతో తెర పడింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు పార్టీలు కలిపి కనీసం హాఫ్ సెంచరీని కూడా దాటలేకపోయాయి. కాంగ్రెస్ 15, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం సాధించగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు మరో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ఇలా దాదాపు అన్ని రీజియన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మహాయుతి కూటమి సత్తాచాటింది . ముంబైలో... ముంబైలోని 36 స్థానాల్లో బీజేపీ, శివసేన (శిందే), 6, ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి అత్యధికంగా 22 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి 12 స్థానాలకు పరిమితమైంది. పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 15, శివసేన 6, ఎన్సీపీ (ఏపీ) ఒక స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ 3, శివసేన (యూబీటీ) 9 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచి మాహీం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పరాజయం పాలయ్యారు. అయితే వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) నుంచి బరిలో దిగి ఆదిత్య ఠాక్రే మాత్రం తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.మరఠ్వాడాలో... మరఠ్వాడాలో ఎనిమిది జిల్లాలుండగా మొత్తం 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 19, శివసేన (శిందే) 12, ఎన్సీపీ (ఏపీ) ఎనిమిది, మరోవైపు కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) మూడు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. విదర్భలో... విదర్భలోని 11 జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో మహాయుతి కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా శివసేన (శిందే) నాలుగు, ఎన్సీపీ (ఏపీ) ఆరు స్థానాల్లో గెలిచాయి. కాగా ఎంవీయే కూటమి మొత్తం 13 స్థానాల్లో గెలుపు సాధించగా, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన (యూబీటీ) నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలో... ఉత్తర మహారాష్ట్రలో అయిదు జిల్లాలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడ అత్యధికంగా మహాయుతి కూటమి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఇక పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 20, శివసేన (శిందే) 11, ఎన్సీపీ (ఏపీ) 11, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు దిగ్గజాల ఓటమిపశ్చిమ మహారాష్ట్రలో... పశ్చిమ మహారాష్ట్రలోని అయిదు జిల్లాల్లో మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మహాయుతి కూటమి 42 స్థానాలను గెలుచుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 24, శివసేన (శిందే) ఏడు, ఎన్సీపీ (ఏపీ) 11 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎంవీయే కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) రెండు, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. కొంకణ్‌లో.. కొంకణ్ రీజియన్ అయిదు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో మహాయుతి ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 16, శివసేన (శిందే), 16, ఎన్సీపీ (ఏపీ) మూడు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కోస్థానం గెలుచుకున్నాయి.లాడ్కీబహీణ్తో గణనీయంగా మహిళల ఓటింగ్..ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే మహాయుతి గెలుపునకు బాట వేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి లాడ్కీ బహీణ్ యోజన వీటన్నిటికీ తలమానికంగా నిలిచింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంలోని బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహిళల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని, వీరంతా మహయుతివైపు మొగ్గుచూపడం కూడా మహాయుతి విజయంలో ప్రధానపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇలా అన్ని వర్గాల కోసం ఏదో ఒక పథకం అమలు చేయడం ద్వారా మహాయుతి ప్రభుత్వం అందరినీ ఆకట్టుకోగలిగిందని భావిస్తున్నారు. చెప్పవచ్చు. దీంతోనే ఈ సంక్షేమ పథకాలే మహాయుతి విజయానికి బాట వేశాయి. -
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ
-
మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు
ముంబయి: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి సునామీలా విరుచుపడింది. మహాయుతి దెబ్బకు షాక్‌కు గురవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది. హోరాహోరీగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలుంటాయని చెప్పిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ టర్ములో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అకాశం లేకుండా పోయిందంటే మహాయుతి కూటమి ప్రభంజనం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే పార్టీలకు కనీసం 29 సీట్లు రావాల్సి ఉంటుంది.అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఓటమి చవిచూసిన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)కూటమిలోని ఏ పార్టీకి 29 సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ రానున్న ఐదేళ్లపాటు అసెంబ్లీలో ఉండదు. ఎంవీఏలో శివసేన(ఉద్ధవ్) పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీకి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమిలోని బీజేపీకి అత్యధికంగా 132, శివసేన(షిండే)పార్టీకి 57,అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి.ఇదీ చదవండి: రాజ్‌భవన్‌లో సొంత విగ్రహం.. గవర్నర్‌పై విమర్శలు -
‘మహా’ సీఎం ఎవరు..? నేడు నిర్ణయం వెలువడే ఛాన్స్ !
ముంబై:అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేకు మళ్లీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేనట్టేనంటున్నారు. కూటమి సారథిగానే గాక అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బీజేపీకే ఆ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహోరాత్రాలు శ్రమించిన ఆయనకు అందలం ఖాయమంటున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటికే పిలుపు కూడా వచ్చినట్లు సమాచారం. ఫడ్నవీస్ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. సీఎం ఎవరన్నది మహాయుతి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని శనివారం మీడియాకు చెప్పారు. ఫలితాల అనంతరం షిండే, ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం ఎవరన్న దానిపై అసలు వివాదమే లేదు. దీనిపై చర్చించేందుకు సీఎం షిండేతో నేను, అజిత్ పవార్ ఆయన నివాసంలో భేటీ కానున్నాం’’అంటూ ముక్తాయించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా జరుగుతుందని షిండే కూడా అన్నారు. అనంతరం ఫడ్నవీస్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి తనకే దక్కాలనే అర్థం ధ్వనించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల సాయంతో విపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. -
బీజేపీ ‘మహా’ విజయం
మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పార్టీకీ దక్కకపోవడం విశేషం. అయితే, మహారాష్ట్రలో తలబొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముంబై/రాంచీ: మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! శనివారం వెల్లడైన ఫలితాల్లో 288 స్థానాలకు గాను ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని దుమ్ము రేపింది. అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలైంది. కేవలం 49 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ ఆద్యంతం బీజేపీ కూటమి జోరే కొనసాగింది. రౌండు రౌండుకూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ మధ్యాహా్ననికల్లా మెజారిటీ మార్కు 145ను, ఆ తర్వాత చూస్తుండగానే 200 స్థానాలనూ దాటేసింది. చివరికి 233 స్థానాలు సొంతం చేసుకుంది. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ తాజాగా మహారాష్ట్రలోనూ దక్కిన అఖండ విజయంతో అంతులేని సంబరాల్లో మునిగిపోయింది. ఆ పార్టీ 149 సీట్లలో పోటీ చేయగా ఏకంగా 132 చోట్ల విజయం సాధించడం విశేషం! మహారాష్ట్రలో ఆ పారీ్టకి ఇన్ని అసెంబ్లీ సీట్లు రావడం ఇదే తొలిసారి. బీజేపీ భాగస్వాములైన సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 57, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థా నాలు గెలుచుకున్నాయి. మహాయుతి అభ్యర్థుల్లో ఏకంగా 15 మంది లక్షకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని అందించాయి. మరోవైపు 101 సీట్లలో బరిలో దిగిన ఎంవీఏ కూటమి సారథి కాంగ్రెస్ కేవలం 16 సీట్లే నెగ్గింది. పీసీసీ చీఫ్ నానా పటోలే అతి కష్టమ్మీద గట్టెక్కగా పృథీ్వరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ వంటి దిగ్గజాలు ఓటమి చవిచూశారు. ఎంవీఏ భాగస్వాముల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20, 86 చోట్ల బరిలో దిగిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 చోట్ల విజయం సాధించాయి. ఈ ఫలితాలు ఉద్ధవ్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చడమే గాక శరద్ పవార్‌కు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తెర దించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పారీ్టకీ దక్కకపోవడం విశేషం! విపక్షాలకు జార్ఖండ్ ఊరట మహారాష్ట్రలో తల బొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. అక్కడ జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 56 చోట్ల విజయం సాధించింది. కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) దుమ్ము రేపింది. 43 స్థానాల్లో బరిలో దిగిన సీఎం హేమంత్ సోరెన్ పార్టీ ఏకంగా 34 సీట్లలో విజయ కేతనం ఎగరవేయడం విశేషం. దాని భాగస్వాముల్లో 30 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 16, 6 చోట్ల బరిలో దిగిన ఆర్జేడీ 4, 4 చోట్ల పోటీ చేసిన సీపీఐ (ఎంఎల్–ఎల్) 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 21 చోట్ల గెలుపొందింది. -
ఏదో మోసం జరిగింది: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. -
‘మహాయుతి’ సునామీలా విరుచుకుపడింది: ఉద్ధవ్ థాక్రే
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి సునామీలా విరుచుకుపడిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహాయుతి జయకేతనం ఎగురవేసిన తీరుపై ఉద్ధవ్ స్పందించారు.‘ఈ ఫలితాలను అస్సలు ఊహించలేదు.అధికార మహాయుతి ఒక కెరటంలా కాకుండా సునామీలా విరుచుకుపడింది.లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఎలా మారాయో అర్థం కావడం లేదు.మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం’అని థాక్రే అన్నారు.ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు ఆటోవాలా షాక్ -
‘రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పని చేయలేదు’
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
మోదీ వెంటే మహారాష్ట్ర: దేవేంద్ర ఫడ్నవిస్
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం(నవంబర్23) మీడియాతో మాట్లాడారు.‘మహాయుతి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు మహారాష్ట్ర అంతా ఒక్కటిగా ఉంది.మహారాష్ట్ర మొత్తం మోదీ వెంట నిలిచింది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవ లేదు.పరస్పర అంగీకరాంతో సీఎంను ఎన్నుకుంటాం.షిండే శివసేననే అసలు శివసేన అని ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో ఝార్ఖండ్‌లో ఎందుకవవో విపక్షాలే చెప్పాలి’అని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
ఎక్కువ సీట్లు వచ్చినవాళ్లే సీఎం కావాలనేం లేదు: షిండే
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మహాయుతి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వన్‌సైడెడ్ కావడంతో.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపైకి అందరి దృష్టి మళ్లింది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతలోపే సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే చర్చ మొదలైంది.మహారాష్ట్రలో షిండే వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమికి సంబంధించిన మూడు పార్టీల నుంచి.. ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా? ఇవేవీ కాకుంటే.. ‘మహా’కు సీఎం కావాలన్న అజిత్ పవార్ ఆశయం నెరవేరుతుందా? అనే చర్చ నడుస్తోంది. అయితే..మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మరోవైపు.. షిండే ఫిటింగ్ మొదలైంది. గెలుపు సంబురాల్లో మీడియాతో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడారు. అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం అన్నారు. అలాగే.. కూర్చుని మాట్లాడుకుని సీఎంను నిర్ణయిస్తామని అన్నారాయన. మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపులో శివసేన పాత్రే సింహభాగం ఉందని, తన తండ్రే సీఎం కావాలని అంటున్నాడు. అదే టైంలో.. అజిత్ పవార్ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని అంటోంది. ప్రజలు అజిత్ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనేది హైడ్రామాను తలపించే అవకాశమూ లేకపోలేదు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?
ముంబై: శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే వర్గాలకు మరాఠీలు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే పాగా వేయబోతోంది. ఫలితాల వేళ.. మహాయుతి కూటమి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మెజారిటీని ఇప్పటికే దాటేయగా.. ప్రభుత్వ ఏర్పాటునకు కసరత్తులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. రెండు వందలకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మహాయుతి కూటమి(ఎన్డీయే). ఇందులో బీజేపీ 100+తో అతిపెద్ద పార్టీగా నిలవడం గమనార్హం. అయితే.. మహారాష్ట్రలో ఎన్డీయే ఫ్లస్ అయిన అంశాలను పరిశీలిస్తే.. శివసేన(షిండే), ఎన్సీపీ(శరద్ పవార్).. మరికొన్ని పార్టీలను చేర్చుకుని బీజేపీ మహాయుతి కూటమిగా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లింది. శివసేన, ఎన్సీపీలో చీలికలతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే మహా ప్రజలు మాత్రం మహాయుతికే పట్టం కట్టారు. ఎన్నికల హామీలు, నినాదాలు మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఫ్లస్ అయ్యాయి. పథకం కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏక్తో సేఫ్ హై నినాదం బాగా పని చేసింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందనే విశ్లేషణలకు నడుస్తున్నాయి. -
Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికాసేపట్లో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. -
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
Maharashtra Assembly elections 2024: నువ్వా.. నేనా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హోరెత్తిన ప్రచారంమహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. 18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్‌తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. పార్టీల కోలాటంమహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. జార్ఖండ్‌లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు. -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
మహాయుతికి ఉల్లిమంట
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్‌వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది. దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది. దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్‌లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్‌నగర్, పుణె, నాసిక్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్‌లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది. -
మహా ఎన్నికలు.. ఏ మేనిఫెస్టోలో ఏముంది?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మహాయతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి.కొత్తగా ఉచిత బస్సు ప్రయాణంశివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్‌ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.పథకాల మొత్తాల పెంపుఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాయుతి తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.మహిళలు.. లఖ్పతి దీదీలుమహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార మహాయతి కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్షిప్లుమహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్షిప్ ఇస్తామని మహాయుతి హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్షిప్ను ప్రకటించింది.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపురాష్ట్రంలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమి వివేకానంద యూత్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామని, యువతకు వార్షిక ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తామని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ పాలసీని ప్రారంభించనున్నట్లు మహాయుతి తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ఉచితంగా మందులు అందజేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.21,500 నుంచి రూ.82,100కు పెంచుతామని మహాయుతి చెప్పగా, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంశాన్ని ఎంవీఏ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మహాయుతి తెలిపింది. ఎంవిఎ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా తొలగిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.ఇది కూడా చదవండి: ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు -
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
మహారాష్ట్రలో రెబల్స్ తలనొప్పి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియ ముగిసింది. మహాయుతి, మహావికా స్ అఘాడీకి రెబల్స్ సవాలుగా మారారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 10,900 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 5,949 నామినేషన్లు ఆమోదం పొందగా, 1,649 తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,302 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. నామినేషన్లను వాపసు తీసుకున్న వారిలో మహాయుతి, మహావికాస్ అఘాడీ తిరుగుబాటు నేతలు కూ డా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఐదుగురు తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. నామినేషన్లను వెనక్కి తీసుకోకుంటే చర్యలు తప్పవని మహాయుతి పార్టీలు కూడా రెబల్స్‌ను హెచ్చరించాయి. మహాయుతిలో తగ్గేదేలేదంటున్నారు..! బీజేపీ మాజీ ఎంపీ హీనా గవిత్ నందుర్బార్ జిల్లాలోని అక్కల్కువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శివసేన షిండే వర్గానికి చెందిన అమ్షియా పద్వీ మహాయుతి అధికారిక అభ్యర్థిగా ఉన్నారు. అయితే గవిత్ బరిలో నిలవడం మహాయుతికి తలనొప్పిని పెంచింది. మాహిమ్‌లో ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే నామినేషన్ వేశారు. అయితే, శివసేన షిండేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదా శరవంకర్‌కూడా పోటీకి దిగారు. ఇక్కడ అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మిత్రపక్షాలను కోరుతోంది. నాసిక్‌లోనూ తిరుగుబాటును ఆపడంలో మహాయుతి విఫలమైంది. మహాయుతి అధికారిక అభ్యర్థులపై నంద్‌గావ్ నుంచి సమీర్ భుజ్‌బల్, దేవ్లాలీ నుంచి రాజశ్రీ అహిర్రావ్, చాంద్వాడ్ నుంచి కేదా అహెర్ పోటీలో ఉన్నారు. భివాండి రూరల్ స్థానంలో శివసేన అభ్యర్థి శాంతారామ్ మోరేపై బీజేపీ రూరల్ యూత్ అధ్యక్షురాలు స్నేహా పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. పార్టీలు ఒత్తిడి చేసినప్పటికీ రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదు. కల్యాణ్ ఈస్ట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సులభ గణపత్ గైక్వాడ్‌ను ప్రకటించిన తర్వాత, శివసేనకు చెందిన మహేష్ గైక్వాడ్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మందా మత్రేని బేలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించగా... ఇక్క స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన విజయ్ నహతా రెబల్‌గా బరిలో ఉన్నారు. ఐరోలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గణేష్ నాయక్‌పై శివసేన షిండే వర్గానికి చెందిన విజయ్ చౌగులే నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. శివాజీనగర్‌లో మహాయుతి అనుకోని సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఎన్సీపీ (అజిత్ వర్గం) నవాబ్ మాలిక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఇక్కడ శివసేన(షిండే)కు చెందిన సురేష్ కృష్ణ పాటిల్‌ను కూటమి అధికారిక అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఆశిష్ షెలార్ సహా పలువురు బీజేపీ నేతలు మాలిక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఎంవీఏలోనూ ఇదే తీరు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని చాలా మంది తిరుగుబాటు నాయకులు ఎన్నికలకు ముందు తమ నామినేషన్లను వాపసు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పుణేలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. శివాజీనగర్, పార్వతి స్థానాల్లో కాంగ్రెస్, కస్బాపేట్ స్థానంలో ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేస్తోంది. కొప్రి పచ్‌పాఖాడీలో కాంగ్రెస్ రెబల్స్ ఠాక్రే వర్గాన్ని ఎదుర్కొంటున్నారు. భివాండీ వెస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. కోప్రి పచ్‌పాఖాడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే బృందం కేదార్ దిఘేను నామినేట్ చేయగా... కాంగ్రెస్‌కు చెందిన మనోజ్ షిండే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు భివాండీ వెస్ట్ స్థానం నుంచి దయానంద్ చోర్గేను కాంగ్రెస్ నిలపగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రియాజ్ అజ్మీ స్వతంత్రునిగా నామినేషన్ వేయడం గమనార్హం. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
‘మహా’ ఎన్నికలు.. కొంకణే కీలకం
సాక్షి, నేషనల్ డెస్క్: కొంకణ్.. మహారాష్ట్రలో రాజధాని ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీరప్రాంతం. నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటముల భాగ్యరేఖలను కొంకణే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కొంకణే అతి పెద్ద ప్రాంతం. మొత్తం 288 స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని రెండు వైరి వర్గాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. కొంకణ్‌లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండటం విశేషం. శివసేన (షిండే) సారథి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వస్థలమైన థానే కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది. దాంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకప్పుడు ముంబై నుంచి వలస వెళ్లేవారు పంపే మొత్తాలపై ఆధారపడ్డ కొంకణ్‌లో కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. చేపలు, మామిడి, కాజు తదితరాల ఎగుమతితో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించింది. యువత వలసలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలతో స్థానికంగానే రాణిస్తున్నారు. వాయు, రైలు మార్గాలు ఇతోధికంగా పెరిగాయి. పర్యాటక ఆకర్షణలకు కూడా కొంకణ్ నెలవుగా మారింది. కమ్యూనిస్టులకు చెక్ పెట్టి... ముంబై, పరిసర ప్రాంతాల్లోని నూలు మిల్లులు, ఇతర కర్మాగారాల్లో కమ్యూనిస్టులు చాలాకాలం పాటు గణనీయమైన శక్తిగా వెలుగొందారు. 1980ల్లో శివసేన ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి. తొలుత కాంగ్రెస్ మద్దతుతో వారి ఆధిపత్యానికి గండి కొట్టిన సేన, ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టి కొంకణ్ అంతటా ప్రబల శక్తిగా ఎదిగింది. 1990ల నాటికి బీజేపీతో జట్టు కట్టి హిందూత్వవాదంతో మహారాష్ట్రవ్యాప్తంగా హవా చెలాయించింది. 1995కల్లా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1999లో రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఏర్పాటు చేసిన ఎన్సీపీ కూడా కొంకణ్‌లో పోటీదారుగా మారింది. అలా ఈ ప్రాంతంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరిగింది. అయితే 2014 నుంచీ పరిస్థితి మారుతూ వస్తోంది. మోదీ మేనియా సాయంతో ముంబై, పరిసర ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటూ వచి్చంది. ప్రస్తుతం మొత్తం మహారాష్ట్ర తీర ప్రాంతంలోనూ కాషాయ పార్టీ హవా కని్పస్తోంది. ఆగర్భ శత్రువులైన శివసేన, కాంగ్రెస్ 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిస్థితుల్లో చేయి కలపడం, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంకణ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. శివసేన అసంతృప్త నేత షిండే బీజేపీ మద్దతుతో పార్టీని చీల్చడమే గాక ఎంవీఏ సంకీర్ణాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా శివసేన కాస్తా షిండే, ఉద్ధవ్ (యూబీటీ) వర్గాలుగా చీలింది. అనంతరం అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరారు. నాటినుంచీ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ)గా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి తమదే నిజమైన పారీ్టగా నిరూపించుకోవడం ఈ నాలుగు వర్గాలకూ కీలకంగా మారింది. అలా వీరందరికీ కొంకణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టణ ప్రాబల్య ప్రాంతం → మహారాష్ట్రలో అత్యంత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతంగా కొంకణ్ తీరం గుర్తింపు పొందింది. → సింధుదుర్గ్ నుంచి ముంబై దాకా విస్తరించిన కొంకణ్ పరిధిలో పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలున్నాయి. → ఇక్కడ 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 12 మంది లోక్‌సభ స్థానాలున్నాయి. → గిరిజన ప్రాబల్య పాల్ఘర్లో 6, థానేలో 18, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరిల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగతా 36 స్థానాలు ఒక్క ముంబై మహానగరంలోనే ఉన్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ కూటమికి ఏడు స్థానాలు దక్కాయి.→ నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. → కొంకణ్‌పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది.మిగతా ప్రాంతాల్లో... మహారాష్ట్రలో విదర్భ (62 అసెంబ్లీ సీట్లు), మరాఠ్వాడా (46), ఆనియన్ బెల్త్గా పేరొందిన ఉత్తర మహారాష్ట్ర (47), పశి్చమ మహారాష్ట్ర (58) ప్రాంతాల్లోనూ అధికార, విపక్ష కూటముల మధ్య గట్టి పోరు నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రుల సంఖ్య భారీగా పెరిగింది. వారిలో కనీసం 30 మంది దాకా నెగ్గడం ఖాయం. చివరికి ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకంగా మారతారు’’ అని మాజీ సీఎం ఛగన్ భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు. – -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
మహారాష్ట్రలో ‘మహా’ కూటముల కొట్లాట కాక రేపుతోంది. యూపీ తర్వాత అత్యధికంగా ఇక్కడ 48 లోక్‌సభ స్థానాలుండగా తొలి మూడు దశల్లో 24 సీట్లలో పారీ్టల భవితవ్యం ఈవీఎంలలోకి చేరిపోయింది. నాలుగో అంకంలో 13న రాష్ట్రంలో మరో 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ (మహాయుతి), ఇండియా (మహా వికాస్ అగాడీ) కూటములు హోరాహోరీగా తలపడుతున్న కీలక నియోజకవర్గాలపై ఫోకస్... ఔరంగాబాద్... మజ్లిస్ మేజిక్! కాంగ్రెస్, శివసేనలకు కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో గత లోక్‌సభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. శివసేన నుంచి వరుసగా నాలుగుసార్లు విక్టరీ కొట్టిన చంద్రకాంత్ ఖైరే మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ ఇంతియాజ్ జలీల్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. 97 ఏళ్ల మజ్లిస్ చరిత్రలో తెలంగాణ వెలుపల ఇదే తొలి ఎంపీ స్థానం! 1980 తర్వాత ఔరంగాబాద్‌లో మైనారిటీ గెలుపొందడం అదే ప్రథమం. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాధవ్‌కు ఏకంగా 2.8 లక్షల ఓట్లు పోలవడం ఖైరే ఓటమికి ప్రధాన కారణం. మజ్లిస్ మళ్లీ జలీల్నే బరిలోకి దించింది. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున శివసేన (ఉద్దవ్) అభ్యరి్థగా ఖైరే కూడా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఇక అధికార మహాయుతి కూటమి తరఫున శివసేన (షిండే) అభ్యర్థి సందీపన్రావ్ భూమ్రే బరిలో ఉన్నారు. ఆయన బలమైన మరాఠ్వాడా నేత. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ చేశారు. మరాఠా రిజర్వేషన్ల పోరుతో మరాఠ్వాడా ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈసారి కూడా ఇండిపెండెంట్‌గా ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ వంచిత బహుజన్ అగాడీ నుంచి అఫ్సర్ ఖాన్ పోటీలో ఉన్నారు. 32 శాతం ముస్లిం జనాభా ఉన్న ఔరంగాబాద్‌లో ఈసారి చతుర్ముఖ పోరులో ఎలాంటి సంచలనం నమోదవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.జాల్నా... రావ్‌సాహెబ్ డబుల్ హ్యాట్రిక్ గురి ఇది బీజేపీకి మరో కంచుకోట. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు విజయ ఢంకా మోగించిన రావ్‌సాహెబ్ దన్వే పాటిల్ డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా మరోసారి బరిలో నిలిచారు. మోదీ రెండు విడతల్లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న దన్వే గత ఎన్నికల్లో 3.3 లక్షల పైగా మెజారిటీతో గెలిచారు. గత రెండు పర్యాయాలూ బీజేపీని ఢీకొన్న విలాస్ ఔతాడేను కాంగ్రెస్ ఈసారి పక్కనపెట్టింది. 2009లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి కేవలం 8,482 ఓట్ల తేడాతో ఓడిన కల్యాణ్ విజినాథ్ కాలేను రంగంలోకి దించింది.పుణె.. మాజీ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఇక్కడ గత రెండుసార్లూ బీజేపీదే విజయం. అయితే సిట్టింగ్ ఎంపీ గిరీశ్ బాపట్ గతేడాది మరణించడంతో పుణె మాజీ మేయర్ మురళీధర్ కిశాన్ మాహోల్కు ఈసారి బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్‌ను బరిలో నిలిపింది. పుణె లోక్‌సభ స్థానం పరిధిలోని కస్బాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గతేడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థని ధంగేకర్ మట్టికరిపించడం విశేషం. 28 ఏళ్లుగా కాషాయ జెండా ఎగురుతున్న ఈ సీటు చేజారడం కమలనాథులకు భారీ షాకే. ఇదే జోరుతో పుణె లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.షిర్డీ... శివసేన కుస్తీ 2009లో ఉనికిలోకి వచి్చనప్పటి నుంచీ ఇది శివసేన ఖాతాలోనే పడుతోంది. గత రెండు ఎన్నికల్లో నెగ్గిన సదాశివ లోఖండే ఇప్పుడు శివసేన (షిండే) వర్గం నుంచి మహాయుతి అభ్యరి్థగా హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. షిర్డీ తొలి ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత భావుసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఎంవీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. రెండు శివసేన వర్గాలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఈ స్థానం కోసం పట్టుబట్టినా సీఎం షిండే మోకాలడ్డారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వీబీఏ అభ్యర్థి ఉత్కర్‡్ష రూపవతి ఎవరి ఓట్లకు గండి పెడతారన్నది ఆసక్తికరం! బీడ్.. పంకజకు రిజర్వేషన్ సెగ ఈ స్థానం బీజేపీ దుర్గం. దివంగత గోపీనాథ్ ముండే కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం. ఈసారి అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే బదులు అక్క, మాజీ మంత్రి పంకజా ముండేను బీజేపీ బరిలోకి దించింది. అయితే మారాఠా రిజర్వేషన్లపై అట్టుడుకుతున్న ఈ నియోజకవర్గంలో మహాయుతి కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో పంకజ ఎదురీదాల్సిన పరిస్థితి! అయితే 2019లో పర్లీ అసెంబ్లీ స్థానంలో పంకజను ఓడించిన సోదరుడు ఎన్సీపీ (అజిత్) నేత ధనంజయ్ ముండే దన్నుగా నిలవడం ఆమెకు కలిసొచ్చే అంశం. 2019లో 5 లక్షల పై చిలుకు ఓట్లతో ప్రీతం మెజారిటీకి భారీగా గండికొట్టిన భజరంగ్ మనోహర్ సోన్వానే ఎంవీఏ కూటమి నుంచి ఎన్సీపీ (శరద్) టికెట్‌పై బీజేపీకి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దంగర్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మరాఠా కోటా, ఈ ఎస్టీ హోదా డిమాండ్లు ఎవరిని ముంచుతాయన్నది ఆసక్తికరం. జల్గావ్... టఫ్ ఫైట్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ పాతుకుపోయిన కమలనాథులకు ఈసారి మహా వికాస్ అగాడీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నేత ఉన్మేశ్ పాటిల్ 4 లక్షల పైగా బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయినా ఈసారి ఆయన్ను కాదని స్మితా వాఘ్కు బీజేపీ టికెటిచ్చింది. ఎంవీఏ నుంచి శివసేన (ఉద్దవ్) నేత కరన్ బాలాసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచి్చన ఎన్సీపీ (శరద్) దన్నుండటం కరన్‌కు కలిసొచ్చే అంశం. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లూ మహాయుతి కూటమి చేతిలోనే ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్ఎస్ భేషరతుగా మద్దతు
లోక్‌సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్‌ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు. నాకు పదవులొద్దు నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్‌తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు. -
అత్యాశకు వెళితే విడాకులే!
ముంబై: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సహా పలు పార్టీలతో కలసి కూటమి కట్టిన శివసేనకు సరికొత్త తలనొప్పులు మొదలైయ్యాయి. ‘మహాయుతి’ గా ఏర్పడ్డ శివసేన కూటమికి భాగస్వాముల నుంచి సీట్ల ఒత్తిడి కాస్తా తలనొప్పిగా మారింది. బీజేపీ ఎక్కువ స్థానాలను డిమాండ్ చేస్తున్ననేపథ్యంలో కోర్కెలు ఎక్కువైతే విడాకులకు దారి తీస్తుందని భాగస్వామ్య పార్టీలను హెచ్చరించింది. ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకుండా నిగ్రహం పాటించాలంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన సంపాదకీయంలో పేర్కొంది. ఎక్కువ సీట్లను పొందితేనే కూటమిలో ఉంటామని అనడం సరికాదని సూచించింది. ముందుగా అధికారంలోకి రావాల్సి ఉందని, అప్పుడు ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం దక్కుతుందని పేర్కొంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లకు గాను బీజేపీ 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల కోసం బీజేపీ డిమాండ్ చేస్తోంది.