‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం! | Devendra Fadnavis, Eknath Shinde meet in Mumbai | Sakshi
Sakshi News home page

‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం!

Published Tue, Dec 3 2024 7:44 PM | Last Updated on Wed, Dec 4 2024 8:39 AM

Devendra Fadnavis, Eknath Shinde meet in Mumbai

ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతుంది. ఈ తరుణంలో మహా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత ఏక్‌నాథ్‌ షిండే ముంబైకి బయలుదేరారు. 

తొలిసారి భేటీ
మహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత ఫడ్నవీస్, షిండేల మధ్య ఇదే తొలి సమావేశం. అయితే, డిసెంబర్‌ 5న మహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తదుపరి భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు ఏక్‌నాథ్‌ షిండే నివాసానికి వెళ్లినట్లు స్థానిక మీడియా,మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు.     
 


మోదీ నిర్ణయం శిరోధార్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విషయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం ఫడ్నవీస్,షిండేలు పోటీ పడ్డారు. అయితే, బీజేపీ అగ్రనేతలతో జరిగిన సమావేశం తర్వాత ఏక్‌నాథ్‌ షిండే వెనక్కి తగ్గారు. మహాముఖ్యమంత్రి ఎవరు? అనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. మోదీ నిర్ణయమే తమకు శిరోధార్యమని బహిరంగంగా వెల్లడించారు.  
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement