హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.
‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.
అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment