మహాయుతి విజయంపై శరద్‌పవార్
కరాడ్: లడ్కీ బహిన్ పథకం, మతపరమైన విభజనే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి దోహదపడ్డాయని ఎన్‌సీపీ (ఎస్పీ)అధినేత శరద్‌పవార్ అభిప్రాయపడ్డారు. లడ్కీ బహెన్ పథకం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని, మతపరమైన విభజన కలిసొచ్చిందని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడంపై పార్టీ సహచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్న అంశంపై అధికారిక సమాచారం ఉంటేనే మాట్లాడతానన్నారు. ఎంవీఏ కూటమి ఎంతో కష్టపడ్డా ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని పవార్ అన్నారు. మనవడు యుగేంద్ర పవార్‌ను బారామతిలో అజిత్ పవార్‌పై బరిలోకి దింపడం తప్పు నిర్ణయం కాదని, ఎన్నికలన్నప్పుడు పోటీ తప్పదని చెప్పారు. అజిత్ పవార్, యుగేంద్ర పవార్లను పోల్చలేమని, ఈ విషయం తనకూ తెలుసని స్పష్టం చేశారు. యుగేంద్ర పవార్‌పై అజిత్ పవార్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment