‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’ | Built Temple To EVMs Infront Of RSS Headquarters, Suggested Sanjay Raut To Maha Government | Sakshi
Sakshi News home page

‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’

Published Sat, Dec 14 2024 2:15 PM | Last Updated on Sat, Dec 14 2024 3:34 PM

Built Temple To Evms Suggest Sanjay Raut to Maha Government

ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ  కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.

ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్‌ స్పందించారు. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.

‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్‌ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. 

 

‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది.  కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని  రౌత్‌ అన్నారు.

1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్‌ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్‌లో ఛగన్ భుజ్‌బల్‌, మరికొందరితో గవర్నర్‌ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.

ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement