rss headquarters
-
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!
ఆయన స్వయానా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి. కానీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. అవును.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్లి, కెమెరాలకు దొరికేశారు. నాగ్‌పూర్ నుంచే ఎంపీగా ఎన్నికైన గడ్కరీ (58) తెల్ల రంగు స్కూటర్ వేసుకుని, వెనకాల సెక్యూరిటీ అధికారిని కూడా పెట్టుకుని.. మాహల్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న మోహన్ భాగ్వత్ను కలవడానికి వెళ్లారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన వెళ్లారు. అయితే, హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపి.. నిబంధనలను ఉల్లంఘించారేమని పలువురు పాత్రికేయులు ఆయన్ను అడిగారు. దానిపై వ్యాఖ్యానించేందుకు గడ్కరీ తిరస్కరించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇది ఆ నాయకుడి, పార్టీ ప్రవర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు. వేరే ఎవరైనా అయితే అది చిన్న విషయం కావచ్చు గానీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి ఇలా చేయడం ఏంటని నిలదీశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇంకా ఆయన మంత్రి కాక ముందు కూడా ఇలాగే హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి పట్టుబడ్డారని ఓ టీవీ ఛానల్ వ్యాఖ్యానించింది. నాగ్‌పూర్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్లో చూస్తే.. ఇలా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాళ్లకు వంద రూపాయల జరిమానా విధిస్తారు!!