ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తగా మంత్రివర్గంలో చేరిన కేబినెట్ సభ్యులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 39 మంది సభ్యులు పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వన్నట్లు తెలిపారు.
బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించింది. కొత్తగా మంత్రివర్గంలోని చేరిన 39 మంది ఆదివారం రాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 39 మందిలో 16 మంది కొత్త వారు కాగా, 10 మంది మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు రెండు, మూడు రోజుల్లో శాఖ కేటాయింపు ఉంటుందని తెలిపారు.
అయితే, కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రుల పనితీరుపై సమీక్షలు జరుపుతామని, కూటమిలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన(ఏక్‌నాథ్‌షిండే)తో కేబినెట్ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
Devendra Fadnavis's HUGE statement on ministers🔥
Fadnavis⚡️: We are going to audit the performance of all the ministers.
If it is found in the audit that any minister is not doing the right work then that minister will be reconsidered ↩️
pic.twitter.com/qAS0TpKe3u— Political Views (@PoliticalViewsO) December 15, 2024
కేబినెట్ విస్తరణ అనంతరం మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై మహాయుతి కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తయారు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేపీ మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారనే దానిపై ఫడ్నవీస్ స్పష్టత ఇవ్వలేదు.
కానీ డిప్యూటీ సీఎం, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే తన పార్టీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. పనితీరు ఆధారంగా వారి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్ల సమయంలో మంత్రుల పనితీరు బాగుంటే కొనసాగుతారని, లేదంటే భర్తీ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో కేబినెట్ విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 11,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 9 మంత్రి పదవులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment