devendra fudnavis
-
‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’
ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి? ..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.చదవండి: యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే -
మహారాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు?
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్న క్రమంలో బీజేపీ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులుపై మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న పీయూష్ గోయల్ కొన్ని రోజులుగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర బీజేపీ న్యాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (శివసేన (షిండే వర్గం)-బీజేపీ-ఎన్సీపీ( అజిత్ వర్గం) సంకీర్ణం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆచరించే వ్యూహాలపై కోర్ కమిటీ భేటీలో చర్చించాం’ అని అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రతో పేలవ ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ-9, ఎన్సీపీ (అజిత్ వర్గం)-1, శివసేన (షిండే వర్గం)-7 సీట్లతో మొత్త 17 స్థానాలకే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాలకు 41 సీట్లు గెలుచకున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ తన డిప్యూటీ సీఎం పదివికిఈ రాజీనామా చేయాలని భావించగా.. బీజేపీ అగ్రనేతల సూచన మేరకు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి బీజేపీ చీఫ్‌ను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్థానంలో రావు సాహెబ్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వ్యాప్తిచెందాయి. ‘మహాయుతి కూటమి పార్టీలతో కలిసి.. అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం బ్లూప్రింట్ తయారు చేయటంపై చర్చించాం’డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై పార్టీనేతల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్‌పూల్‌లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి. -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్
ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ముంబై శివారుల్లో ఆదివారం కార్లు, బైకులతో ర్యాలీ తీసిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసు స్పందించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో 10-12 మంది కార్లు, మెటర్ సైకిల్స్‌తో ఆదివారం రాత్రి ముంబై శివారుల్లో శ్రీరాముడి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మరో వర్గం టపాసులు పేల్చింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
దేశ్‌ముఖ్ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి?
ముంబై: మంత్రివర్గంలోని వ్యక్తి తప్పుచేస్తే సరిదిద్దా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని కానీ, ఇంత జరి గినా ఉద్ధవ్ నోరు విప్పడం లేదని ప్రతిపక్ష నాయ కుడు దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అనిల్ దేశ్‌ముఖ్‌కు రాజీనామా చేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని ఫడ్నవిస్ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యతవహిస్తూ ఇదివరకే రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, ఆలస్యంగానైన రాజీనామా చేసి మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని ఫడ్నవీస్ పేర్నొన్నారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. ఆయన మౌనంగా ఉండటం మంచిదికాదన్నారు. నైతిక బాధ్యత కేవలం అనిల్ దేశ్‌ముఖ్‌కే ఉందా? ఒక ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేకు లేదా అని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే నితేశ్ రాణే ట్విట్టర్లో ప్రశ్నిం చారు. ‘‘అనిల్ దేశ్‌ముఖ్ తనకు రూ.100 కోట్ల టార్గెట్ విధించినట్లు పరంబీర్ సింగ్ ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత దేశ్‌ముఖ్‌కు ఉంది కాబట్టి రాజీనామా చేశారు. మరి ముఖ్యమంత్రి సంగతేంటి. మిఠీ నదిని వెతుక్కోవల్సి వస్తుందా ఏంటి’’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిజాలు బయటికి వస్తాయి.. బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పుణేలో విలేకరులతో మాట్లాడుతూ.. తప్పులు చేసేవారికి శిక్ష తప్పదని, లేకపోతే ప్రజాస్వామ్యం బలపడదని అన్నారు. 15 రోజుల సీబీఐ దర్యాప్తుతో నిజాలు బయటికి వస్తాయని, సీబీఐ రూ. 100 కోట్ల వసూలు కేసులో అన్ని విషయాలు బయటపెడుతుందని పాటిల్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా దేశ్‌ముఖ్ వ్యవహారంలో శరద్‌పవార్ తీరు సంతృప్తిగానే ఉందన్నారు. రెండు రాజీనామాలు ఉంటాయని 15రోజుల కిందటే చెప్పానని పాటిల్ వ్యాఖ్యానించారు. ఇపుడు మరొకటి అనుసరిస్తుందని అన్నారు. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం పడిపోతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజ్యాంగం ప్రకారం వారికి మెజార్టీ ఉందని అప్పటివరకు ఏం కాబోదని తెలిపారు. అయితే ప్రజలు ఇప్పటికే కోవిడ్‌తో కష్టాల్లో ఉన్నారని ఇలాంటివి జరిగితే రాజకీయాలపై వారికి విశ్వాసం పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దిలీప్‌కు హోంశాఖ.. మహారాష్ట్ర నూతన హోంశాఖ మంత్రి పదవి దిలీప్ వల్సే పాటిల్ ఎంపికయ్యారు. ఎన్సీపీలో అత్యంత అనుభవమున్న నాయకులల్లో ఒకరైన దిలీప్ వల్సే పాటిల్ ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుణే జిల్లాలో 1956లో జన్మించిన దిలీప్ వల్సే పాటిల్ 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. ఎల్ఎల్బీ చదివిన దిలీప్ వల్సే పాటిల్ తండ్రి దత్తాత్రేయ వల్సే పాటిల్ మార్గదర్శనంలో రాజకీయాల్లోకి దిగిన ఆయన అంబేగావ్ తాలూకాలో యువ నేతగా ముద్ర వేసుకున్నారు. అనంతరం అంబేగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. శరద్ పవార్‌కు స్వీయ సహాయకునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు 2009 నుంచి 2014 వరకు విధానసభ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. వైద్య విద్య, ఉన్నత సాంకేతిక విద్య, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, కార్మికశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చదవండి: సీడీ యువతి తల్లికి అనారోగ్యం -
అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ
సాక్షి, ముంబై: మహారాష్ట్రకు కావాల్సింది సుస్థిరమైన ప్రభుత్వమని, కిచిడి ప్రభుత్వం కాదని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమ బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన మాట తప్పిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర పాలన ఏర్పాటుకు తమతో కలిసి వచ్చిన అజిత్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరికొంత మంది నాయకులు కూడ తమతో చేతులు కలపడంతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని ఫడ్నవీస్ వెల్లడించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తెలిపారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రైతులతో సహా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఏర్పాటైతేనే ఈ సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో బీజేపీతో చేతులు కలిపామ’ని అజిత్ పవార్ వివరించారు. అయితే శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని ఆమోదిందారా, లేదా అనేది ఆయన వెల్లడించలేదు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?) -
‘లెండి’ని పూర్తి చేస్తాం : దేవేంద్ర ఫడ్నవీస్
సాక్షి, మద్నూర్: అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి, ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ వద్ద బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వాటాకు సంబంధించిన నీటిని అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు సరిగా నీటి పంపకాలు చే యలేదన్నారు. తాము మాత్రం వాటాప్రకారం నీటిని ఇస్తున్నామన్నారు. -
'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'
ముంబై: మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. చిన్నారులకు అందించే ఆహారపదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని పంకజపై వచ్చిన ఆరోపణలపై ఫడ్నవిస్ స్పందించారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని సూచించారు. వీటిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఫడ్నవిస్ చెప్పారు. పంకజ 206 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు సంబంధించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.