
మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే చారిత్రాత్మక పెట్టుబడి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ఒప్పంద ప్రకటనలు వెలువడిన తరువాత.. ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్'కు చెందిన అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (AWS), 2030 నాటికి మహారాష్ట్రలో 8.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 71,600 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్, పాలిస్టర్, పునరుత్పాదక ఇంధనం, బయో ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ కెమికల్స్, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్స్, రిటైల్, డేటా సెంటర్లు, టెలికమ్యూనికేషన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఈ రంగాల్లో సుమారు 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సమాచారం.
Government of Maharashtra and RIL sign historic MoU worth ₹3,05,000 crore at #WEF25 #Davos https://t.co/Ho5OFW73IO
— Reliance Industries Limited (@RIL_Updates) January 22, 2025
Comments
Please login to add a commentAdd a comment