Ambani
-
అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్‌లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.జియో గ్యారేజ్‌కి ప్రత్యేక అతిథిఅంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్ అయ్యాయి. బుల్లెట్‌ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్‌షాప్‌లో అద్భుతమైన సిల్వర్ ఎస్యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్‌ప్రూఫ్‌ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్‌గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్‌ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.అల్ట్రా లగ్జరీ ఎస్యూవీరోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్డ్ బాడీవర్క్ కోసం వర్క్‌షాప్‌కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్రాయిస్ కలెక్షన్ కల్లినన్ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్‌ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్ కలర్ కార్ వచ్చింది.మూడవ కల్లినన్‌ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్‌ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్‌లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ కులినన్ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి. -
అంబానీ బాటలో.. బెజోస్!: ఏకంగా రూ.71 వేలకోట్లు
మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే చారిత్రాత్మక పెట్టుబడి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) పేర్కొన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ఒప్పంద ప్రకటనలు వెలువడిన తరువాత.. ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్'కు చెందిన అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (AWS), 2030 నాటికి మహారాష్ట్రలో 8.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 71,600 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటురిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్, పాలిస్టర్, పునరుత్పాదక ఇంధనం, బయో ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ కెమికల్స్, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్స్, రిటైల్, డేటా సెంటర్లు, టెలికమ్యూనికేషన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఈ రంగాల్లో సుమారు 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సమాచారం.Government of Maharashtra and RIL sign historic MoU worth ₹3,05,000 crore at #WEF25 #Davos https://t.co/Ho5OFW73IO— Reliance Industries Limited (@RIL_Updates) January 22, 2025 -
ఫోటోలు షేర్ చేసిన అంబానీ ఫ్యామిలీ - స్పెషల్ అట్రాక్షన్‌గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్‌కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్‌తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి పటిష్ట భద్రత ఉంటుంది. తాను ప్రయాణించే వాహనాలు, విమానాలు, ప్రైవేట్ జెట్లు.. ఇలా ప్రతిదాన్ని భద్రత పరంగా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు. అంబానీ వినియోగించే బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను ఇటీవల తనిఖీలు నిర్వహించి వేరే పేరుతో రిజిస్టర్ చేశారు. గతంలో ఈ జెట్ శాన్ మారినో కోడ్ కింద ‘టీ7-లోటస్’ పేరుతో ఉండేది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దీన్ని ‘వీటీ-ఏకేవీ’గా రిజిస్టర్ చేశారు.ఈ విలాసవంతమైన జెట్‌ను నడపడానికి ఉత్తమ పైలట్లను మాత్రమే ఎంచుకుంటారు. దేశంలోనే అత్యంత ధనవంతుడి భద్రత, సౌకర్యానికి సంబంధించిన విషయం కావడంతో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ జెట్ నడిపే పైలట్లకు ఏటా వేతనం 1,20,000 డాలర్లు(సుమారు రూ.ఒక కోటి) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో తొలి అడుగులుసుమారు రూ.1,000 కోట్ల విలువైన బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ లిమిటెడ్ (ఆర్సీడీఎల్) నిర్వహిస్తోంది. దీన్ని నడిపే పైలట్లు నిత్యం భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ అప్డేట్గా ఉండటానికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ముఖేష్ అంబానీ వద్ద ఉన్న ఇతర ప్రైవేట్ జెట్లను కూడా ఆర్సీడీఎల్ పర్యవేక్షిస్తోంది. ఇది అత్యున్నత స్థాయి విమానయాన భద్రత, నైపుణ్యాన్ని కలిగి ఉంది. -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు. -
మస్క్ వైపే కేంద్రం మొగ్గు..
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కోరుతున్నాయి. -
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ట్విన్స్, ఐకాన్ ఇషా, ఆకాశ్ అంబానీ రేర్పిక్స్
-
సంపన్నుల సేవలో మోదీ సర్కారు: రాహుల్ గాంధీ
సోనిపట్: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ధనవంతుల సేవలో తరిస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు తీసుకొచ్చినట్లు హరియాణాలో ఓ వ్యాపారి తనతో చెప్పాడని అన్నారు. మంగళవారం హరియాణాలోని సోనిపట్, బహదూర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.‘‘ఇటీవల జరిగిన అంబానీ కుమారుడి పెళ్లి చూశారా? ఈ పెళ్లి కోసం అంబానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్మంతా ఎవరిది. అది ముమ్మాటికీ ప్రజలదే. మీ బిడ్డల పెళ్లి చేయాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ రైతు తన బిడ్డ పెళ్లి జరిపించాలంటే అప్పులపాలు కావాల్సిందే. కానీ, దేశంలో పిడికెడు మంది బడా బాబులు పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చుచేసేలా వారికి అనుకూలంగా నరేంద్ర మోదీ ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంపన్నుల సేవలో ఆయన తరిస్తున్నారు.ఇది రాజ్యాంగంపై దాడి కాక మరేమిటి?’’ అని నిలదీశారు. ఇద్దరు ముగ్గురు శ్రీమంతుల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం, హరియాణాలో బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంబానీ, అదానీ పేర్లే కనిపిస్తున్నాయని ఆక్షేపించారు. రక్షణ రంగ బడ్జెట్‌ను అదానీకి కట్టబెట్టడానికి అగ్నిపాథ్ పథకం తీసుకొచ్చారని ఆరోపించారు. రక్షణ శాఖకు విక్రయిస్తున్న ఆయుధాలపై అదానీ కంపెనీ సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని, వాస్తవానికి వాటిని విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయని చెప్పారు. -
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
-
ముకేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు.. హాజరైన సినీతారలు
-
అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు (ఫోటోలు)
-
Riya Kapoor: ఖూబ్సూరత్! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల జామ్‌నగర్ ప్రీవెడింగ్ సెలబ్రేషన్ గుర్తుండే ఉంటుంది! ఆ వేడుకలో కళ్లు తిప్పుకోనివ్వని ముస్తాబుతో మెరిసిపోయింది పెళ్లికూతురు. అంతేకాదు ఆ ఈవెంట్‌కి హాజరైన ఆలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్, నతాశా పూనావాలాలూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రాధికా మర్చంట్ సహా వాళ్లందరినీ అంత అందంగా తయారుచేసిన స్టయిలిస్ట్ రియా కపూర్! ఆమె నైపుణ్యానికి ఆ సంబరాన్ని మించిన ఉదాహరణ లేదేమో! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే.. ‘గివ్ ఏ గర్ల్ ద రైట్ షూస్ అండ్ షి కెన్ కాంకర్ ద వరల్డ్!’ అని హాలీవుడ్ స్టార్ మార్లిన్ మాన్రో మాట. దాన్ని నిజం చేసి చూపించింది రియా కపూర్.. ప్రొడ్యూసర్, సెలబ్రిటీ స్టయిలిస్ట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌గా.. అని చెప్పాలి!ఇండియాలో ఫ్యాషన్ ఇండస్ట్రీ.. కాలు మోపలేనంత మంది ఉద్దండులతో నిండిపోయుంది. అలాంటి రంగంలోకి ‘డ్రమాటిక్ లిటరేచర్’ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో.. ఫ్యాషన్ మీద ఆసక్తి అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్‌తో తల దూర్చి.. తన స్టయిల్‌ను ప్రదర్శించగలిగేంత స్పేస్.. గుర్తింపు పొందగలిగేంత ప్రత్యేకతను సాధించింది రియా కపూర్! ఈ మొత్తం ప్రయాణంలో ఆమెక్కడా తన తండ్రి పరపతిని ఉపయోగించుకోలేదు. తన శక్తినే నమ్ముకుంది! ఇంతకీ వాళ్ల నాన్న ఎవరంటే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.ఆయనకు రియా రెండో సంతానం. నటి సోనమ్ కపూర్‌కి చెల్లి. వాళ్లమ్మ సునీతా కపూర్ జ్యూలరీ డిజైనర్. ‘మా చిన్నప్పుడు మా అమ్మ, పిన్ని ఇద్దరూ పెయింటింగ్ వేస్తుంటే అదేంటో నాకు తెలిసేది కాదు.. గోడల మీద పెయింట్ వేసినట్టే అనిపించేది. నాకు ఊహ తెలిశాక ఒకసారి మా అమ్మ పెయింట్ చేసిన చిన్న ఫ్రేమ్‌లో ఒక ఇంటర్నేషనల్ జ్యూలరీ బ్రాండ్ లాకెట్‌ను చూశాను. అప్పుడు తెలిసింది మా అమ్మ పెయింటింగ్ వాల్యూ! అప్పటి నుంచి నాకు డిజైనింగ్.. ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది’ అని చెబుతుంది తన స్టయిలింగ్ పునాది ఎక్కడ పడిందో గుర్తుచేసుకుంటూ! అయినా అకడెమిక్‌గా ఆర్ట్స్‌ని ఎంచుకుంది. న్యూయార్క్‌లో ‘డ్రమటిక్ లిటరేచర్’ చదివింది.దానికి తగ్గట్టే తొలుత నిర్మాతగా మారింది ‘ఆయశా’ చిత్రంతో! తర్వాత ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్, థాంక్యూ ఫర్ కమింగ్, క్రూ సినిమాలనూ ప్రొడ్యూస్ చేసింది. ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్ మూవీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకరకంగా ఆ సినిమాలతోనే ఆమె స్టయిలింగ్ కెరీర్ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ‘ఆయశా’ స్టయిలిస్ట్ అయిన పర్నియా కురేశీకి రియా అసిస్టెంట్‌గా వ్యవహరించింది. ఆ లెక్కన ఆమె తొలి క్లయింట్ తన సోదరి సోనమ్ కపూరే! రియా పూర్తి స్టయిలిస్ట్‌గా మారింది మాత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్‌కి సోనమ్‌ను తీర్చిదిద్ది! అప్పటి నుంచి అక్కకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ అయింది.తన బ్యానర్లోని సినిమాల కథానాయికలకూ తనే స్టయిలింగ్ చేస్తోంది. అలా కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, టబు, కృతి సనన్ మొదలైన హీరోయిన్లకూ స్టయిలింగ్ చేసింది రియా! ప్రముఖ స్టయిలిస్ట్‌లు అభిలాషా దేవ్నానీ, తాన్యా ఘావ్రీలతోనూ పనిచేసింది. అక్కతో కలసి ‘రిసోన్’అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్టార్ట్ చేసింది. అంతేకాదు వీగన్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘ద సీఐఏ స్టోర్’తోనూ కలసి ప్లస్ సైజ్ మహిళల కోసం ‘ఆర్కే’ పేరుతో షూస్‌ని డిజైన్ చేసింది. ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది రియా కపూర్!కొత్తగా ఆలోచించడం.. కొత్తగా చేయడం.. ఆ క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. నా జర్నీని మోటివేట్ చేసేది అదే! స్టయిల్ అంటే సెలబ్రేటింగ్ ద మూడ్. మన కట్టుబొట్టు ద్వారా మన మూడ్‌ని అవతలి వాళ్లకు కమ్యూనికేట్ చేయడం! ఆత్మను పట్టుకోవడం! ఇంకా చెప్పాలంటే కంఫర్ట్! ఫ్యూచర్ అంతా క్రూయల్టీ ఫ్రీ ఫ్యాషనే! అంటే వీగన్ ఫ్యాషన్! ఈ రంగంలోకి వచ్చే వాళ్లెవరైనా ఫలితాన్ని ఆశించి కాదు.. ఆ ప్రయాణాన్ని నమ్మి రావాలి! – రియా కపూర్ -
అది ఫేక్ న్యూస్.. అంబానీ బుక్ చేసుకోలేదు
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.అనంత్, రాధికల వివాహానంతరం లండన్‌కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్‌ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్‌లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది. View this post on Instagram A post shared by Stoke Park (@stokepark) -
ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్బుక్ హ్యాండిల్లో షేర్ చేశారు.అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు. -
అనంత్ అంబానీ పెళ్లిలో లాలూకు ప్రత్యేక స్వాగతం
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన ఫార్మా టైకూన్ వీరేన్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ యాదవ్ కూడా ఉన్నారు.లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతి కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. లాలూ కుటుంబ సభ్యులను అనంత్ అంబానీ చిన్నాన్న అనిల్ అంబానీ, చిన్నమ్మ టీనా అంబానీ ప్రత్యేకంగా స్వాగతించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో సహా వివాహానికి వచ్చారు. అలాగే గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భార్యతో కలిసి వచ్చారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహానికి హాజరయ్యారు. बिहार के पूर्व सीएम और RJD अध्यक्ष लालू यादव शादी में शामिल होने पहुँचे#BiharNews #anantambaniwedding #AnantRadhikaWedding #AnantAmbani #MukeshAmbani #LaluPrasadYadav pic.twitter.com/JSym9IpQOO— India TV (@indiatvnews) July 12, 2024 -
ఫ్యాషన్ ఐకాన్ లేడీస్ : నీతా అంబానీ, ఇషా, శ్లోకా మెహతా (ఫోటోలు)
-
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
అనంత్-రాధిక సంగీత్‌లో అదరగొట్టిన అందాల తారలు (ఫోటోలు)
-
ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
'అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్'ల వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు మొదలైపోయాయి. నీతా అంబానీ మొదటి శుభలేఖను కాశీ విశ్వనాధునికి సమర్పించారు. అనంత్ అంబానీ పలువురు సినీ తారలను, ఇతర ప్రముఖులను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అద్భుతంగా ఉన్న అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు ధర ఎంత ఉంటుందని సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంబానీల ఒక్క వెడ్డింగ్ కార్డు ధర రూ. 6.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇది మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు.గతంలో ముకేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి కార్డును కూడా రూ. 3 లక్షల ఖర్చు పోయేట్టు తయారు చేయించినట్లు సమాచారం. కాగా ఇప్పుడు కొడుకు వెడ్డింగ్ (ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు) కార్డు కోసం ఏకంగా రూ. 6.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీతారలు హాజరు కానున్నారు. కాగా వీరి పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.ఇదీ చదవండి: అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రికUnboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024 -
అంబానీ వారసురాలు ఇషా అంబానీ ఫ్యాషన్ ట్రెండీ లుక్స్ (ఫొటోలు)
-
అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్‌ల వరకు ప్రతీదీ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్ నెట్టింట తెగ వైరల్‌గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!సాధారణంగానే ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు. ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్ తాగవు..ఆర్ఓ వాటర్‌ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.ఈ పాలల్లో ఉండే పోషకాలు..హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట. (చదవండి: మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!) -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే, అదానీ, అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాయ్‌బరేలీలో నామినేషన్ వేశాక రాహుల్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ‘‘ నానమ్మ ఇందిరా గాం«దీ, నాన్న రాజీవ్‌గాం«దీ, అమ్మ సోనియాగాంధీ అందరూ రాయ్‌బరేలీ ప్రజల జీవితాలను బాగుచేసేందుకు పాటుపడ్డారు. మా కుటుంబమంతా మీ కోసం పనిచేస్తే, మోదీ మాత్రం అదానీ, అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధిహామీ పథకానికి 24 ఏళ్లకాలానికి ఖర్చయ్యే మొత్తానికి సరిసమానమైన బడాపారిశ్రామికవేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మోదీ ఒక్కదెబ్బతో మాఫీచేశారు. మోదీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి. ఆ వేడుకలనే ప్రసారంచేశాయి’’ అని ఆరోపించారు. పెళ్లి ఎప్పుడంటే? సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచారసభలో రాహుల్ మళ్లీ అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. రాహుల్ మాట్లాడేటప్పుడు సభావేదికపై సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ‘నిన్ను వీళ్లేదో ప్రశ్న అడుగుతారట. సమాధానం చెప్పు’ అని ప్రియాంక చెప్పగా, ఏంటా ప్రశ్న అని రాహుల్ సభికులను అడిగారు. పెళ్లి ఎప్పుడు? అని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈసారి కొత్త సమాధానం చెప్పారు. ‘‘తొందరపడాలిక. త్వరలోనే చేసుకుంటా’’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ‘‘ ఇన్నాళ్లు ఎందుకో పెళ్లి గురించి అంతగా పట్టించుకోలేదు’, ‘ పెళ్లి మీదకు మనసు పోలేదు’, ‘ మీరే అమ్మాయిని చూడండి’, ‘ అమ్మకు నచి్చతే ఓకే’ అంటూ వేర్వేరు సమాధానాలు చెప్పిన రాహుల్ సోమవారం ఇలా కొత్త సమాధానం చెప్పారు. తర్వాత ప్రియాంకను పొగిడారు.‘‘ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఎట్టకేలకు రాయ్‌బరేలీకి వచ్చా. కానీ ప్రియాంక మాత్రం మొదట్నుంచీ రాయ్‌బరేలీలో ప్రచార బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఆమెకు నా కృతజ్ఞతలు’ అని ఆమెను అభినందించారు. -
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎందుకు సైలెంట్ అయ్యారు ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.తెలంగాణ గడ్డమీద నుంచితెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్‌లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.పదునైన అస్త్రాలను రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు -
కుబేరుడి కాబోయే కోడలికి స్టార్ హీరోయిన్ స్పెషల్ పార్టీ (ఫోటోలు)
-
Nita Ambani 1st Salary: ‘నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారు’
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ టీచర్‌గా, వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, నృత్యకారిణిగా, సేవకురాలిగా..ఇలా తన లైఫ్‌లో ఎన్నో పాత్రలు పోషించారు. జీవితంలో ఎదిగేందుకు చాలాకష్టపడినట్లు ఐకానిక్ టాక్ షో విత్ సిమి గరేవాల్ ఎపిసోడ్లో వెల్లడించారు. ఈమేరకు అప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నీతా అంబానీ నర్సరీ స్కూల్లో టీచర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీతో 1985లో వివాహం జరగడానికంటే ఏడాది ముందు నుంచే ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? ముఖేష్ అంబానీని పెళ్లాడిన తర్వాత కూడా సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్లో టీచర్‌గా కొనసాగినట్లు తెలిపారు. అప్పుడు తన వేతనం నెలకు రూ.800 ఉండేదని నీతా అంబానీ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనను చూసి చాలా మంది ఎగతాలిగా నవ్వేవారని చెప్పారు. కానీ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Elite Learning Minds (@elite_learning_minds) -
అంబానీ ప్రీవెడ్డింగ్‌లో నాటు నాటు పాట
-
ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..?
-
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్‌కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్‌తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్‌కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్‌ను భారత్‌లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
టెంట్లు వేస్తూ దేవాలయాలు నిర్మిస్తున్న అంబానీ.. ఎందుకంటే..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వివాహ వేడుక జరుగనుంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జులై 12న ఏర్పాటు చేశారు. దీంతో అంబానీ కుటుంబం ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది. వారం రోజుల క్రితం లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అయితే, జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్‌లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్‌లు ఉండేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక దేవాలయాలు రూపొందిస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే వీటిలో సకల సదుపాయాలూ ఉండనున్నాయి. An Auspicious Beginning Ushering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) February 25, 2024 అతిథుల లిస్ట్.. ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్! కోడలికి ఖరీదైన గిఫ్ట్‌లు.. ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమకు కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
Vibrant Gujarat Summit: 2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్..?
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్‌గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్‌లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు తెలిపారు. జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులకు భారత్ ప్రాతినిధ్యం వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 దేశాలు పాల్గొననున్నట్లు చెప్పారు. గుజరాత్లో పెట్టుబడి అవకాశాలను పెంచడానికి సేల్స్‌ఫోర్స్, అబాట్, బ్లాక్‌స్టోన్, హెచ్ఎస్బీసీ, యూపీఎస్, మైక్రోన్, సిస్కో, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం వంటి దాదాపు 35 ఫార్చ్యూన్ అమెరికన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సదస్సును 20 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహించడం గొప్పవిషయం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లో భారీ పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.12 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. అందులో మూడోవంతు గుజరాత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. దాంతో ప్రభుత్వ సహకారంతో చాలామందికి ఉపాధికల్పిస్తున్నట్లు చెప్పారు. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: 2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా.. ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ 2003లో ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో ఎడిషన్ సదస్సుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సదస్సులో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్), ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్‌ను ప్రదర్శించనున్నారు. -
అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా
ఈక్విటీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన చాలామంది మార్కెట్ అవర్‌లో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఎలాంటి టెన్షన్ పడకుండా, నిశ్చింతగా ఉంటారు. అయితే కేవలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికే ఇలాంటి ఆందోళన పరిస్థితులుంటే.. కంపెనీలు స్థాపించి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్ అంబానీ పరిస్థితేంటో ఊహించండి.. కానీ ఆయన చాలా విషయాలు పట్టించుకోరని కేడియా సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కేడియా అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. విజయ్ కేడియా ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చాలా మంది ట్రేడింగ్‌కు సంబంధించి ఆందోళన చెందుతుంటారు. అయితే మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి కొందరు ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే బుల్ మార్కెట్ లేదా బేర్ మార్కెట్‌ను పట్టించుకోకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటి వారు ప్రధానంగా బిజినెస్ మోడల్‌పై దృష్టిసారిస్తారు. మంచి బిజినెస్ మోడల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ట్రెండ్‌ను పట్టించుకోరు. కంపెనీ ప్రమోటర్లు తమ వ్యాపారాలను విస్తరింపజేసి, అది బుల్ మార్కెటా? లేదా బేర్ మార్కెటా? అని నిర్ధారించుకోరు. మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి ప్రమోటర్లు నిర్ణయం తీసుకోరు’ అని కెడియా చెప్పారు. ‘ప్రధానంగా కంపెనీ ప్రమోటర్లు, వ్యవస్థాపకులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆర్థిక పోకడలు ఎలా ఉన్నాయి? అదే సెగ్మెంట్లోని ఇతర కంపెనీల ట్రెండ్ ఎలా ఉందో చూస్తారు. మార్కెట్ ట్రెంట్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ముఖేష్ అంబానీని అడిగితే తనకు తెలియదు. ఆయన నిర్ణయాలపై బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఆధారపడుతుంది. కానీ తాను మార్కెట్‌ను అనుసరించరు’ అని కేడియా వివరించారు. ఇదీ చదవండి: ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..? మార్కెట్ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటుందని కేడియా చెప్పారు. గత రెండేళ్లలో మార్కెట్లో చాలా అనిశ్చితులు నెలకొన్నాయన్నారు. యుఎస్ మాంధ్యం, ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్లు, రెండు ప్రధాన దేశాల మధ్య యుద్ధాలు, ఎన్నికలు.. ఇవన్నీ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు చెప్పారు. -
ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!
ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌ను విస్తరిస్తూ మార్కెట్‌ను ఏలుతున్నారు. నెమ్మదిగా ఆయన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగిస్తున్నారు. అందులో ఇషాఅంబానీ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతోంది. ఇషా రిలయన్స్ రిటైల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కంపెనీని దశల వారీగా విస్తరిస్తూ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల కంపెనీగా మలిచింది. కంపెనీ అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 7వేల టౌన్‌ల్లో సుమారు 18వేల స్టోర్లతో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్ అభివృద్ధి వెనుక ఇషా అంబానీతోపాటు కంపెనీలో ఉన్నత స్థానంలోని వ్యక్తుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే బర్బెరీ, స్టీవ్ మాడెన్, అర్మానీ, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడానికి ఇషా అంబానీ ఎంతో కృషి చేసింది. రోజూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీకి సారథిగా ఉండడం కొంత కష్టమైన పని. అయితే కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులను ఆమె నియమించుకున్నారు. రిలయన్స్ రిటైల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, గ్రాసరీ, ఫార్మా రిటైల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించింది. 2020లో అమెరికా పెట్టుబడి సంస్థ సిల్వర్‌లేక్ 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో కేకేఆర్ సంస్థ 1.28 శాతం వాటా(రూ.5500 కోట్లు) కలిగి ఉంది. 2021లో ఫ్యూచర్గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం ఏకంగా 3,300 స్టోర్లను ప్రారంభించింది. 78 కోట్ల మంది ఈ స్టోర్లను కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇదీ చదవండి: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..! రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో 7000 టౌన్‌ల్లో మెుత్తం 18000 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. కంపెనీలో 2.45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇషా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రిలయన్స్ రిటైల్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబానీ కుమార్తె ఈశా అంబానీ-ఆనంద్ పిరమాల్ దంపతులకు గతేడాది కవలలు జన్మించారు. వారికి కృష్ణ, అదియాగా పేరు పెట్టారు. వారి మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం నిర్వహించారు. -
డేవిడ్ బెక్హాంకు అంబానీ అదిరిపోయే ట్రీట్..!
-
మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు
ప్రసిద్ధ కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్‌కోటక్ కుమారుడు జైకోటక్ మాజీ మిస్ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్డేట్’ ఇన్‌స్టా హ్యాండిల్లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్ ఇండియా) యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు. జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సాధించింది. 2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఇజం సినిమాలో నటించారు. Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ ముందే రిలయన్స్ రిటైల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్‌కార్డులను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డులను విడుదల చేయనుంది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సమాచారం. రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో విడుదల చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై ఆఫర్లు పొందనున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.499. ఏడాదిలో కార్డు ద్వారా రూ.1,00,000 ఖర్చు చేసిన వినియోగదారులకు వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి. వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్లు అందించబడుతున్నాయి. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.2,999. రూ.3,00,000 వార్షిక ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు. డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్‌మైషోలో ప్రతి నెలా రూ.250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు అందిస్తున్నారు. -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..అంబానీకి వరుసగా మూడో బెదిరింపు ఈమెయిల్
ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్ వస్తున్నాయి. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది. తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు. -
‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’..మిడిల్ ఈస్ట్‌లో తిరుగులేని బిజినెస్‌మ్యాన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అందరికీ తెలుసు. అయితే మిడిల్ ఈస్ట్‌లో తిరుగులేని బిజినెస్‌మ్యాన్.. ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ అని పిలిచే మిర్వాయిస్ అజీజీ (Mirwais Azizi) గురించి చాలా మందికి తెలియదు. ఆయన నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటీ.. వాటి విలువ ఎంత.. ఎందుకు ఆయన్ను ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ (Mukesh Ambani of Afghanistan) అంటారు.. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు. ఆయన్ను తరచుగా 'ముఖేష్ అంబానీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుస్తారు. దుబాయ్ నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మిర్వాయిస్ అజీజీ, అజీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు, ఛైర్మన్. అజీజీ 1989లో వ్యాపారాన్ని ప్రారంభించారు. రియల్టీ, బ్యాంకింగ్, పెట్టుబడి, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అయిన అజీజీ బ్యాంకుకు మిర్వాయిస్ అజీజీ చైర్మన్‌గా ఉన్నారు. 2006లో 7.5 మిలియన్ డాలర్ల ఈక్విటీ మూలధనంతో ఈ బ్యాంకును స్థాపించారాయన. ఆ బ్యాంక్ ఈక్విటీ మూలధనం ఇప్పుడు 80 మిలియన్ డాలర్లు. 2018 మార్చిలో అజీజీ పేరు "అరేబియన్ బిజినెస్ 100 ఇన్స్పైరింగ్ లీడర్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" జాబితాలో ఉంది. ఆసియా సెంటినెల్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో విక్రయించే 70 శాతం పెట్రోలియం ఉత్పత్తులను నిర్వహించేది అజీజీనే. అజీజీ బ్యాంక్ అధినేత మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్లోని లగ్మన్లో అజీజీ పష్టూన్ల కుటుంబంలో 1962లో జన్మించారు. కాబూల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1988లో దుబాయ్ వెళ్లారు. 2006లో అజీజీ బ్యాంక్‌ని స్థాపించారు. 2007లో అజీజీ డెవలప్‌మెంట్స్‌ను ఏర్పాటు చేశారు. మిర్వాయిస్ అజీజీ బఖ్తర్ బ్యాంకు (ప్రస్తుతం ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్)కు కూడా అధినేత. నివేదికల ప్రకారం.. అజీజీ డెవలప్మెంట్స్ ప్రస్తుతం దుబాయ్ అంతటా 45 బిలియన్ దిర్హమ్ల విలువైన 200 ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. అజీజీ పెట్రోలియం వ్యాపారం అజీజీ హొటాక్ గ్రూప్ పది దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అజీజీ ఈ వ్యాపారాన్ని 80 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించాడు. అజీజీ భార్య పేరు పారిగుల్. ఈ దంపతులకు ఫర్హాద్ అజీజీ, ఫవాద్ అజీజీ, జవాద్ అజీజీతో సహా ఏడుగురు సంతానం ఉన్నారు. మిర్వాయిస్ అజీజీ నెట్‌వర్త్ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఆయనకున్న వివిధ వ్యాపారాల విలువల ఆధారంగా ఆయన్ను బిలియనీర్‌గా భావిస్తారు. -
రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపుతామంటూ అంబానీకి ఈమెయిల్..నిందితుడు ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని ఒక వ్యక్తి అంబానీని ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు చెప్పారు. "మీరు మాకు రూ.20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఈమెయిల్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఈమెయిల్ అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ధ్రువపరిచారు. అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపుకు సంబంధించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. (ఇదీ చదవండి: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం) అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ అనామక కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. -
దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్ ఇంటర్నెట్ను ప్రారంభించిన జియో
న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్ఫైబర్ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్ఫైబర్తో ఇంకా కొన్ని ఇంటర్నెట్ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ(మీడియం ఎర్త్ ఆర్బిట్-ఎంఈఓ) కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది. జియోస్పేస్‌ఫైబర్ ఇప్పటికే గుజరాత్ గిర్, ఛత్తీస్‌గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. -
ద్వారకాధీశ్ దేవాలయంలో అంబానీ పూజలు
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది. #WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj — ANI (@ANI) October 25, 2023 -
‘ఫోర్బ్స్’ కుబేరుల్లోనూ అంబానీకే పట్టం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఈసారి 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల మేర కరిగిపోవడం ఇందుకు కారణం. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్ ఒక హాట్‌స్పాట్‌గా ఉంటోందని తెలిపింది. కుబేరుల సంపద మరింతగా పెరగడంతో, టాప్ 100 లిస్టులోకి చేరాలంటే కటాఫ్ మార్కు 2.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆసియా వెల్త్ ఎడిటర్ నాజ్నీన్ కర్మాలీ వివరించారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యక్తి ర్యాంకు సంపద (బి.డాలర్లలో) ముకేశ్ అంబానీ 1 92 గౌతమ్ అదానీ 2 68 శివ నాడార్ 3 29.3 సావిత్రి జిందాల్ 4 24 రాధాకిషన్ దమానీ 5 23 సైరస్ పూనావాలా 6 20.7 హిందుజా కుటుంబం 7 20 దిలీప్ సంఘ్వి 8 19 కుమార బిర్లా 9 17.5 షాపూర్ మిస్త్రీ, కుటుంబం 10 16.9 తెలుగువారిలో మురళి దివి 33 6.3 పి.పి. రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54 4.05 ‘డాక్టర్ రెడ్డీస్’ కుటుంబం 75 3 ప్రతాప్ రెడ్డి 94 2.48 పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి 98 2.35 -
Radhika Merchant: కాబోయే పెళ్లి కూతురు రాధికా ట్రెండీ లుక్స్
-
అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వింటుంటాం. అయితే అంబానీ సోదరీమణులు అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికీ తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. అందుకే వారి గురించిన సమాచారం బయటకు రాదు. ముఖేష్, అనిల్ అంబానీ సోదరీమణుల పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. నీనా కొఠారి ఏం చేస్తుంటారు? 1986లో హెచ్‌సి కొఠారీ గ్రూప్ చైర్మన్ భద్రశ్యామ్ కొఠారితో నీనా వివాహం జరిగింది. అయితే భద్రశ్యామ్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు. హెచ్‌సీ కొఠారి గ్రూప్ ప్రధానంగా చక్కెర, కెమికల్, పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంది. నీనాకు కూతురు నయనతార, కొడుకు అర్జున్ కొఠారి ఉన్నారు. వీద్దరికీ పెళ్లయింది. నయనతార కేకే బిర్లా మనుమడు షమిత్ను వివాహం చేసుకుంది. ఆమె ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్‌కూ నీనా హాజరవుతుంటారు. దీప్తి సల్గాంకర్ ఎక్కడుంటారు? అంబానీ కుటుంబంలో మొదట దీప్తి ప్రేమ వివాహం చేసుకుంది. దీప్తికి 1983లో దత్తరాజ్ సల్గాంకర్తో వివాహం జరిగింది. దీప్తి తండ్రి ధీరూభాయ్.. రాజ్ తండ్రి వాసుదేవ్ సల్గాంకర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే భవనంలో ఉండేవారు. దత్తరాజ్ సల్గాంకర్..ముఖేష్ అంబానీ మంచి స్నేహితులు. దీప్తి సల్గాంకర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవాలో ఉంటున్నారు. ఆమె భర్త దేశంలోని ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు సల్గావ్కర్ యజమాని. అలాగే ఖనిజ మైనింగ్, ఇనుప ఖనిజం ఎగుమతి, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగాలకు చెందిన వీఎం సల్గావ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు యజమాని. ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు ధీరూభాయ్ అంబానీ 1978లో ముంబైలోని ఉషాకిరణ్ సొసైటీలోని 22వ అంతస్తులో ఉండేవారు. ఈ భవనంలోని 14వ అంతస్తులో వ్యాపారవేత్త బాసుదేవ్ సల్గావ్కర్ తన కుటుంబంతో కలిసి ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఒకరి ఇంటికి ఒకరు వస్తూవెళుతూ ఉంటేవారు. ఈ నేపధ్యంలోనే రాజ్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులయ్యారు. తరువాతి కాలంలో రాజ్ సల్గావ్కర్.. ముఖేష్ అంబానీ సోదరి దీప్తితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పెళ్లికి అంగీకరించారు. దీప్తి, రాజ్‌ల వివాహం 1983లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రమ్, కూతురు ఇషేత. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్‌ఫోలియో స్ప్రెడ్‌లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. -
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. రూ. 4700 కోట్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ.. ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! -
అప్పు తీసుకుంటున్న అంబానీ ఎందుకో తెలుసా
-
స్టైలిష్ దుస్తులను మార్కెట్ లోకి తెస్తున్న ఈషా అంబానీ
-
గిఫ్ట్ ఇవ్వడంలో అంబానీ స్టైలే వేరు - ఇదే నిదర్శనం
పండగలకో పబ్బాలకో బోనస్ ఇచ్చే యజమానులను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేసే యజమానులు చూసుంటారు. కానీ అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్తగా కీర్తించబడుతున్న అంబానీ ఈ విషయంలో కూడా 'అంతకు మించి' అనే చెప్పాలి. తన ఉద్యోగికి ఏకంగా రూ. 1,500 కోట్లు ఖరీదు చేసే ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 'రైట్ హ్యాండ్'గా పిలువబడే 'మనోజ్ మోదీ'కి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అంతే కాకుండా ఈయన ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ ఇంబానీ మరియు ఇషా అంబానీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోదీ హస్తం ఉంది. మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
కొత్తరంగంలోకి రిలయన్స్ ఐస్‌క్రీమ్
-
ఏటీఎం కార్డు లేకున్నా డిజిటల్ చెల్లింపులు బిగ్ బజార్ కోసం అంబానీ, అదానీ పోటీ
-
బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మరో కీలక అడుగు వేసింది. కరోనా విస్తరణ, సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక ఈ లేఖ రాసింది. చైనా వస్తువులను ఉపయోగించడం మానుకోవాలంటూ అంబానీ, టాటా, గోద్రేజ్, ప్రేమ్‌జీ, మిట్టల్‌కు తదితర 50 మంది దిగ్గజాలనుద్దేశించి సీఏఐటీ ఈ లేఖ రాసింది. భారత ప్రజలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, భారతీయ పరిశ్రమ కెప్టెన్లలో ఒకరిగా భావిస్తారనీ తామూ అదే నమ్ముతున్నామని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ సామూహిక ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది భారతదేశాన్ని 'స్వయం ఆధారిత భారత్' గా మార్చడానికి దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. ఈ లేఖను పంపిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాబితాలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అజీం ప్రేమ్ జీ, కుమారం మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, విక్రమ్ కిర్లోస్కర్, సునీల్ భారతి మిట్టల్, రాహుల్ బజాజ్, శివ్ నాదర్, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్ కోటక్, నుస్లీ వాడియా, శశి మధుకర్ పరేఖ్, హర్ష్ మారివాలా, డాక్టర్ సతీష్ రెడ్డి, పంకజ్ పటేల్ , నీలేష్ గుప్తా తదితరులు ఉన్నారు. కాగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి వంటి వ్యాపారాలు చైనా దిగుమతులు, ప్రధానంగా విడిభాగాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి, దీంతో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు మారుతి, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులను తగ్గించడం రాత్రికి రాత్రికి సాధ్యం కాదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. గత 15 సంవత్సరాలకు పైగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడులు పెట్టాం. చాలా విశ్వసనీయమైన, స్నేహితులున్నారు. అకస్మాత్తుగా నిలిపివేయాలంటే ఎలా అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. ఒక సంస్థగా, దేశంగా ఇది ఎంత వరకు సబబో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మరోవైపు రాబోయే 3 సంవత్సరాల్లో ఆటోమోటివ్ రంగంలో విడి భాగాల దిగుమతులు, ఇతర సాధనాలపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించడం సాధ్యమని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. చైనాలోని వ్యూహాన్ నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, సరిహద్దు వెంబడి చైనా దుశ్చర్య కారణంగా గాల్వన్ ప్రావిన్స్‌లో 20 మంది సైనికుల మరణం తరువాత చైనా బహిష్కరణ ప్రచారాన్ని సీఏఐటీ ఉధృతం చేసింది. దాదాపు 500 ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. 2021 డిసెంబర్ నాటికి 100,000 కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) రూపాయల దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20లో చైనా నుండి 65.26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంది. 2019-20లో 81.86 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఇండియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
ముఖేశ్ ఇంట దివాళీ సంబరాలు..!!
-
జియో సృష్టించిన మరో అద్భుతం
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త అందిస్తూ.. సాంకేతికతలో విప్లవంలా జియో మరో కొత్త శకం ఆరంభించింది. జియో లైవ్ టీవీ యాప్‌లో మార్పులు చేస్తూ.. ప్రస్తుత మ్యాచ్ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. జియో ప్రవేశపెట్టిన ఈ పరిజ్ఞానం ద్వారా క్రికెట్ మ్యాచ్‌ను ఐదు కెమెరా యాంగిల్స్‌లో వీక్షించవచ్చు. అంతే కాకుండా ఆడియోను గ్రౌండ్ మధ్య వికెట్ల వద్ద ఉన్న మైక్ నుంచి వినోచ్చు. మనకు కావాల్సిన భాషలో (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ) కామెంట్రీని వినోచ్చు. ఇంకా, మ్యాచ్ స్కోర్, బంతులు, రన్‌రేట్, వంటి గణంకాలను మనకు నచ్చినప్పుడు, కావాల్సినప్పుడు ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. మ్యాచ్‌లో ఎదైన బంతిగాని, వికెట్ గాని, సిక్స్‌గాని మిస్ అయితే క్యాచ్ అప్ ద్వారా మళ్లీ వెనక్కి వెళ్లి వీక్షించవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కొత్త జియో లైవ్ టీవీ యాప్ అందుబాటులోకి రానుంది. క్రీడల్లో ఏఆర్, వీఆర్, ఇమ్మెర్సివ్ వ్యూయింగ్లో రాబోయే రోజుల్లో జియో విశేషమైన అనుభవాన్ని అందించడానికి కొనసాగుతుంది అని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. ఇటివల జియో ఉత్తమ మొబైల్ వీడియో కంటెంట్ ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ మొబైల్ (గ్లిమో) అవార్డును గెల్చుకుంది. మార్చి నుంచి కొలంబోలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ నిదహస్ ట్రోఫీకి ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మ్యాచ్ వీక్షణలో కొత్త అనుభూతిని పొందటానికి జియో టీవీ యాప్‌ను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. లేని వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. -
రాష్ట్రాన్ని అంబానీకి అమ్మేసే కుట్ర
నెహ్రూనగర్: రాష్ట్రాన్ని అమ్మేయడానికేనా రిలయన్స్ అధినేత అంబానీతో సీఎం చర్చలు జరిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ ఆరోపించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్య, సాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ పెట్టుబడులు తీసుకొచ్చి అన్నదాతను రోడ్డున పడేయాలని చూస్తున్నావా అంటూ మండిపడ్డారు. అంబానీతో కలవడంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు యూనిట్ కరెంట్ చార్జీ రూ.2.75 పైసలు ఉంటే టీడీపీ అధికారంలోకి రాగానే రూ.9 వసూలు చేస్తున్నారని తెలిపారు. పెట్రోలు, డీజీల్ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ పెట్టుబడులకు వ్యతిరేకం కాదని, అన్యాయం జరిగితే మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిలారి రోశయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి మందపాటి శేషగిరిరావు, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో రూ.50 లక్షల కోట్లు
ముంబై: ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో దేశీయ స్టాక్ మార్కెట్ల సంపద రూ.50 లక్షల కోట్ల మేర పెరుగుదల నమోదు చేసింది. వీటిలో కార్పొరేట్ దిగ్గజాలైన టాటా, బిర్లా, అంబానీ, బజాజ్ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువే రూ.లక్ష కోట్ల చొప్పున పెరగడం విశేషం. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, వేదాంత, గోద్రేజ్, మహింద్రా, హిందుజా, ఐటీసీలు కూడా ఈ కాలంలో మార్కెట్ విలువ పరంగా చెపపుకోతగ్గ వృద్ధినే సాధించాయి. కానీ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల మార్కెట్ విలువ పెరుగుదల ఈ స్థాయిలో లేదు. కొన్ని పీఎస్‌యూలు ఇన్వెస్టర్ల సంపదను కరిగించేస్తే, కొన్ని మాత్రం గణనీయమైన లాభాల్నే పంచి పెట్టాయి. ఈ మూడేళ్ల కాలంలో మొత్తం రూ.50 లక్షల కోట్ల మేర జరిగిన సంపద వృద్ధిలో బీఎస్ఈ పీఎస్‌యూ సూచీలోని కంపెనీల వాటా 8 శాతమే. అంటే ఇవి వాటి మార్కెట్ విలువను కేవలం 22 శాతం వృద్ధితో రూ.3.65 లక్షల కోట్ల మేరే పెంచుకోగలిగాయి. మోదీ సర్కారు మూడేళ్ల పాలనలో సెన్సెక్స్ పెరుగుదల 26 శాతంగా (6,000 పాయింట్లు) ఉంది. మొత్తం మీద దేశీయ స్టాక్‌మార్కెట్ల విలువ రూ.75 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.125 లక్షల కోట్ల స్థాయికి వృద్ధి చెందింది. ఈ మొత్తం విలువలో పీఎస్‌యూ కంపెనీల వాటా 16 శాతం. ఈ సంపద వృద్ధిలో అధిక భాగం ప్రమోటర్లకే చెందగా, ఆ తర్వాత ఎక్కువగా లాభపడిన వారిలో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల వాటా కంపెనీల్లో సగటున 10 శాతంలోపే ఉండడంతో వారికి దక్కింది కూడా తక్కువగానే ఉంది. -
అయ్యో.. 11 మందికి బిలీనియర్ ట్యాగ్ పోయింది!
నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో 11 మంది తమ బిలీనియర్ ట్యాగ్ ను కోల్పోయారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో వీరు బిలీనియర్ జాబితా నుంచి కిందకి పడిపోయినట్టు తాజా సర్వేలో వెల్లడైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వం తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలతో భారత్ ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొందని హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రీసెర్చర్, మేనేజింగ్ డైరెక్టర్ రెహమాన్ జునైడ్ తెలిపారు. పారదర్శకతమైన కరెన్సీ ఎకనామిక్స్ పారశ్రామికవేత్తల్లో సానుకూల ప్రభావాన్ని నెలకొల్పుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నేడు విడుదల చేసిన రిచెస్ట్ ఇండియన్స్ 2017 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ ర్యాంకిగ్స్ లో ఆయన 28 స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత దేశీయంగా రెండో ర్యాంకింగ్ లో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ(గ్లోబల్ గా 74) , మూడో స్థానంలో దిలీప్ సంఘ్వీ(గ్లోబల్ గా 74), నాలుగో ర్యాంక్ లో పల్లోజి మిస్త్రీ(గ్లోబల్ గా 97)లు ఉన్నారు. ఈ రిపోర్టు ప్రకారం 132 మంది భారతీయులు లేదా భారతీయ సంతతి బిలీనియర్ల నికర సంపద 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. 42 మంది బిలీనియర్లకు ముంబై నిలయంగా ఉండగా.. దాని తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్ లు ఉన్నాయి. గ్లోబల్ గా బీజింగ్, న్యూయార్క్ ను అధిగమించింది. ''బిలీనియర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'' గా బీజింగ్ అగ్రస్థానంలో నిలిచింది. -
జియో డేటా రెట్టింపు : అంబానీ
-
జియో డేటా రెట్టింపు : అంబానీ
వచ్చే నెలల్లో ప్రస్తుతమున్న జియో డేటాను రెట్టింపు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. టెలికాం కంపెనీలతో సమానంగా ఛార్జీలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి 20 శాతం అత్యధికంగా డేటాను అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ ప్రారంభిస్తామని అంబానీ చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ చార్జస్, నో హిడెన్ చార్జస్ అని అంబానీ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2017 వరకు అన్ని గ్రామాలను జియో కవర్ చేస్తుందని అంబానీ పేర్కొన్నారు. నెలకు 100 కోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడుతున్నారని అంబానీ చెప్పారు. అంటే రోజుకు 3.3 కోట్ల జీబీ వాడుతున్నారని తెలిపారు.దేశంలోనే అతిపెద్ద డేటా కన్జ్యూమర్ గా జియో ఉందని పేర్కొన్నారు. డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందని, జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో భారత్ 150వ స్థానంలో ఉందని తెలిపారు. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులు చేరుకున్నామని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. సంబంధిత వార్తలు.. జియో యూజర్లకు బంపర్ ఆఫర్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది! -
ఇది ‘భారతీయ శకం’ కావాలి
యువతకు ముకేశ్ పిలుపు • ముంబై వర్సిటీ 160వ స్నాతకోత్సవంలో ప్రసంగం ముంబై: భారత శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో చాటిచెప్పేందుకు దేశంలోని యువత, విద్యార్థులు పాటుపడాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దాన్ని ‘భారతీయ శకం’గా మార్చేందుకు కృషిచేయాలని కోరారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, యంత్రాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మానవీయ కోణం మాత్రం కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ముంబై విశ్వవిద్యాలయం 160వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ముకేశ్ ఈ వ్యాఖ్య లు చేశారు. ‘మానవ చరిత్రలో ప్రపంచం ఇప్పుడు మౌలికంగా కొత్త దశలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రిక ఉత్పాదకత కోసం నీరు, ఆవిరి శక్తిని ఉపయోగించుకున్నారు. ఆతర్వాత విద్యుత్ శక్తితో భారీస్థాయి ఉత్పాదకతను సాధించగలిగాం. ఇక మూడో పారి శ్రామిక విప్లవంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ వినియోగం కీలకంగా నిలిచాయి. ఇప్పుడు నడుస్తున్న నాలుగోది.. డిజిటల్ విప్లవం. దీనిద్వారా భౌతిక, డిజిటల్, బయలాజికల్ ఆవరణాల మధ్య నెలకొన్న తెరలన్నీ కలగలిసిపోతున్నాయి. ఒక సరికొత్త ప్రపంచం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. గతంతో పోలిస్తే ఇది చాలా విభిన్నమైనది’ అని అంబానీ పేర్కొన్నారు. ప్రపంచం మీ మునివేళ్లపై... ‘ఇప్పుడు మనమంతా సాంకేతిక విప్లవం ముంగిట్లో నిలుచున్నాం. ప్రజల జీవన గమనం, ఇతరులతో మన సంబంధాలు, పనితీరుకు సంబంధించి మూలాలను ఇది మార్చేయనుంది. ఉదాహరణకు కొత్త పరిజ్ఙానాల ఆధారంగా పుట్టుకొచ్చిన కొన్ని వ్యాపారాలన్నీ రాత్రికిరాత్రే ఆవిర్భవించాయి. పదేళ్లక్రితం వాటిని మనం ఊహించలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు ఈ వ్యాపారాలు బహుళజాతి కార్పొరేట్ దిగ్గజాలుగా విస్తరించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి చేరాయి. భవిష్యత్తులో ప్రపంచ జీడీపీలో 65 శాతం గడిచిన రెండు దశాబ్దాల్లో పురుడుపోసుకున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన వ్యాపారాల ద్వారానే సమకూరనుంది. గడిచిన 300 ఏళ్ల నాగరికతలో ప్రపంచం సాధించినదాని కంటే మరెంతో ప్రగతిని వచ్చే 30 ఏళ్లలోనే మనం చూడబోతున్నాం’ అన్నారు. మానవ చరిత్రలో నిజమైన చరిత్రాత్మక దశలో ప్రస్తుత తరం పట్టభద్రులవుతున్నారని... ఇదే అత్యంత విద్యావంతమైన తరమని అంబానీ పేర్కొన్నారు. ‘ప్రపంచం ఇప్పుడు మీ మునివేళ్లపై ఆవిష్కృతమవుతోంది. అవకాశాలు కోకొల్లలు. అయితే, మానవీయ కోణంలోనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉంది. ఇప్పటికీ కోట్లాది మంది సరైన తిండి, నీరు, ఇళ్లు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఈ సవాళ్లను అధిగమించి ఒక సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి అందరూ పాటుపడాలి’ అని ముకేశ్ విద్యార్థులకు సూచించారు. ముంబై వర్సిటీలోనే తాను కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నానని.. 4 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటానని ఎన్నడూ ఊహించలేదని అంబానీ వ్యాఖ్యానించారు. -
అంబానీల ఇంట పెళ్లికళ
-
ముకేశ్ అంబానీ..టెలికం ‘డేటాగిరి’!
జనవరి 1 నుంచి రిలయన్స్ జియో వాణిజ్య సేవలు షురూ • రూ.50కే 1జీబీ డేటా, ఉచితంగా వారుుస్ కాల్స్.. రోమింగ్ • ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు.. నాలుగు నెలలు పూర్తిగా ఉచితం • ఏజీఎంలో మొత్తం 10 రకాల టారిఫ్‌లను ప్రకటించిన అంబానీ • 2017 డిసెంబర్ వరకూ రూ.15,000 విలువైన జియో యాప్స్ వాడకం ఫ్రీ ముంబై: దేశీ టెలికం రంగంలో పెను సంచలనానికి రిలయన్స ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తెరతీశారు. రిలయన్స జియో పేరిట టెలికం సేవల్లోకి అరంగేట్రం చేస్తున్న ముకేశ్... ఉచితంగా వారుుస్ కాల్స్, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌తో పాటు అత్యంత చౌక 4జీ డేటా టారిఫ్‌లతో ఇతర టెలికం కంపెనీల్లో వణుకు పుట్టించారు. కనీవినీఎరుగని ధర యుద్ధానికి దిగారు. గురువారం ఇక్కడ జరిగిన రిలయన్స ఇండస్ట్రీస్ 42వ వార్షిక వాటాదారుల సమావేశంలో (ఏజీఎం) జియో ప్రణాళికలను పూర్తి స్థారుులో ప్రకటించారు. ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలను తమ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31 వరకూ అంటే నాలుగు నెలలపాటు ఉచితంగా జియో సేవలన్నీ లభిస్తాయని చెప్పారు. వాణిజ్యపరంగా పూర్తిస్థారుు సేవలు మాత్రం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ముకేశ్ పేర్కొన్నారు. దాదాపు 90 నిమిషాల పాటు ఏజీఎంలో ప్రసంగించిన అంబానీ... ఇందులో 60 నిమిషాలు జీయోకి సంబంధించిన ప్రకటనలకే కేటారుుంచడం గమనార్హం. మొత్తంమీద దేశంలో మొబైల్ డేటా వినియోగం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో ముకేశ్ అత్యంత చౌక టారిఫ్‌లతో రానున్న కాలంలో ‘డేటాగిరీ’ చేయనున్నారన్నది పరిశ్రమ విశ్లేషకుల అంచనా. డేటాతో వారుుస్ కాల్స్ ఫ్రీ... రిలయన్స జియో జనవరి 1 నుంచి ప్రారంభించే వాణిజ్య సేవలకు మొత్తం 10 రకాల డేటా ప్లాన్లను ప్రకటించింది. అప్పుడప్పుడూ డేటా(నెట్ సర్ఫింగ్) ఉపయోగించే యూజర్లకోసం రోజుకు కనిష్టంగా రూ.19 టారిఫ్ మొదలుకొని.. తక్కువగా డేటా వాడేవారికి నెలకు రూ.149 చొప్పున డేటా ప్యాకేజీని అందిస్తోంది. భారీస్థారుులో డేటా వినియోగించే యూజర్ల కోసం నెలకు రూ.4,999 ప్లాన్ కూడా ఉంది. ఇతర ప్లాన్లలో రూ.299; రూ.499, రూ.999; రూ.1,499; రూ.2,499; రూ.3,999 ఉన్నారుు. మొత్తంమీద ఈ ప్యాకేజీలన్నింటితో కూడా అపరిమిత వారుుస్ కాల్స్‌ను జియో ఆఫర్ చేస్తోంది. ‘‘కస్టమర్లు ఇకపై వారుుస్ లేదా డేటా సేవల్లో ఏదోఒకదానికి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రెండింటికీ అవసరం లేదు. ఇక వారుుస్కాల్స్కు కస్టమర్లు సొమ్ము చెల్లించే రోజులు పోరుునట్లే. జియో కస్టమర్లు వారుుస్ సేవలకు ఎన్నడూ చెల్లించాల్సిన అవసరం లేదు. మేం తీసుకొస్తున్న ప్యాకేజీలు మొత్తం టెలికం పరిశ్రమ స్వరూపానే మార్చేయనున్నారుు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్యాకేజీలతో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ లభిస్తుందన్నారు. ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమలో 22,000కు పైగా టారిఫ్లున్నాయని.. వీటన్నింటినీ జియో సరళీకరించిందని వెల్లడించారు. ఎంత ఎక్కువ వాడితే అంత చౌక... ఒక జీబీకి రూ.50 లేదా ఒక్కో ఎంబీకి 5 పైసలు మాత్రమే డేటా చార్జీ వసూలు చేస్తామని.. ప్రపంచంలోనే ఇది అత్యంత చౌక రేటని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కస్టమర్లు ఎంత ఎక్కువ డేటా వాడితే అంత తక్కువ రేటుకు సేవలు అందుకోవచ్చని చెప్పారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా ప్యాక్స్ ఒక్కో జీబీకి దాదాపు రూ.250 వరకూ వసూలు చేస్తున్నారుు. జియోతో ఇది 5-10 రెట్లు తక్కువకే లభిస్తుంది. మొత్తంమీద యూజర్లు వాడే డేటానుబట్టి ఒక జీబీ రూ.25-50కే లభిస్తుంది’ అని ఆయన వివరించారు. రూ.2,999 నుంచి జియో 4జీ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయని ముకేశ్ చెప్పారు. రూ.15,000 విలువైన జియో యాప్స్ సబ్స్కిప్ష్రన్ వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ తమ జియో కస్టమర్లకు ఉచితంగా (కాంప్లిమెంటరీ) ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్... ముకేశ్ అంబానీ జియో సేవలకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక రారుుతీ ఆఫర్‌ను ప్రకటించారు. జియో ప్రధాన టారిఫ్‌లపై విద్యార్థులు అదనంగా 25 శాతం డేటాను వినియోగించుకోవచ్చని చెప్పారు. జియో అప్లికేషన్లను (యాప్స్) అన్‌లిమిటెడ్‌గా వాడుకునే అవకాశం, ఇంటర్నేషన్ల్ కాలింగ్‌కు అత్యంత తక్కువ రేట్లతో పాటు ఎంట్రప్రైజ్లకు (కంపెనీలు) ప్రత్యేక సొల్యూషన్స కూడా లభిస్తాయన్నారు. ఇక ‘జియో డిజిటల్ ఇండియా స్టార్టప్ ఫండ్’ను కూడా నెలకొల్పనున్నామని.. ప్రధానమైన నగరాల్లో ‘డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్’ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. దేశంలో వేలాది యువ ఎంట్రప్రెన్యూర్స్ తమ డిజిటల్ వెంచర్లను జియో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించుకోవడానికి వారితో జట్టుకడతామని ముకేశ్ చెప్పారు. పాత టెల్కోలపై విసుర్లు... టెలికం రంగంలో పోటీ విషయంలో ఇప్పుడున్న టెలికం కంపెనీలపైనా ముకేశ్ గురిపెట్టారు. ‘పోటీ విషయంలో ఎవరైనా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అంతేకాని టెల్కోలు తమ మార్కెట్ పవర్‌ను దుర్వినియోగం చేసి ఇతర కంపెనీలకు అడ్డం కులు సృష్టించడం మంచిదికాదు. ఇంటర్‌కనెక్టివిటీ సమస్యలతో గతవారంలో జియో కస్టమర్లు 5 కోట్ల కాల్డ్రాప్లతో ఇబ్బందిపడ్డారు. ఇకనైనా ఎలాంటి జాప్యం లేకుండా జియో నెట్‌వర్క్‌తో ఇంటర్‌కనెక్టివిటీని కల్పించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఇతర టెల్కోలకు ఉంది. అంతేకాకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) ఉపయోగించుకొని జియో నెట్‌వర్క్‌కు మారే హక్కు కస్టమర్లకు ఉంటుంది. దీన్ని టెల్కోలు అడ్డుకోరాదు. ’ అన్నారు. ఆర్బిట్రేషన్‌పై వెనక్కితగ్గం...: ముకేశ్ కేజీ-బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిపై ప్రభుత్వంతో తలెత్తిన వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) ప్రక్రియ నుంచి ఆర్ఐఎల్ వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ముకేశ్ పేర్కొన్నారు. కేజీ-డీ6లో క్షేత్రాల్లో ఆర్ఐఎల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోవడంతో కేంద్రం భారీ మొత్తంలో జరిమానా(2.75 బిలియన్ డాలర్ల వ్యయాన్ని రికవరీ చేసుకోవడానికి అంగీకరించలేదు) విధించడం తెలిసిందే. ఇప్పుడు ‘డేటాగిరి’ చేయాలి భారతీయులుగా మనం ‘గాంధీగిరి’ని కొనియాడాలి, ప్రశంసించాలి. ఇప్పుడు అందరం ‘డేటాగిరి’ చేయాలి. అపరిమిత ఉచిత డేటాతో అపరిమిత మంచి పనులు చేయడానికి ఇదొక అవకాశం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం సాకారం కోసం జియో సేవలు తోడ్పడతారుు. ప్రపంచంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్‌లో భారత్ 155 నుంచి ఏకంగా 10వ ర్యాంకుకు ఎగబాకుతుంది’ - ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధిపతి 10 కోట్ల మంది యూజర్లు లక్ష్యం... సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది యూజర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యంగా ముకేశ్ ప్రకటించారు. తద్వారా జియో టీమ్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. జియో నెట్వర్క్ దేశవ్యాప్తంగా 18,000 నగరాలు-పట్టణాలు, 2 లక్షలకు పైగా గ్రామాల్లో అందుబాటులోకి రానుంది. 2017 మార్చినాటికి దేశంలో 90 శాతం ప్రజలకు జియో సేవలు లభ్యమయ్యేలా చేయాలన్నది ముకేశ్ ప్రణాళిక. ‘జియో నెట్‌వర్క్‌ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించాం. 5జీ, 6జీ టెక్నాలజీలు వచ్చినా మరింత డేటాకు సపోర్ట్ చేసేవిధంగా అప్‌గ్రేడ్ చేసుకోగలం’ అని ఆయన వివరించారు. సెకండ్‌కు ఒక గిగాబైట్ డేటా స్పీడ్‌ను జియో నెట్వర్క్ అందించగలదని ముకేశ్ హామీనిచ్చారు. జపాన్‌లో ఒక జీబీ డేటాకు 30 డాలర్లు, దక్షిణ కొరియాలో 18 డాలర్లు, చైనాలో 15 డాలర్లు, స్పెరుున్లో 7.5 డాలర్లు, దక్షిణాఫ్రికాలో 6 డాలర్లుగా ఉన్నాయని అంబానీ తెలియజేశారు. భారత్‌లో 3.5 డాలర్లుగా ఉండగా.. దీన్ని జియో 1 డాలరు(రూ. 67) లోపునకు తీసుకొస్తోందని చెప్పారు. జియోపై ఎవరేమన్నారంటే... దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎరుుర్‌టెల్... రిలయన్స జియో టెలికంకు స్వాగతం పలికింది. ‘డిజిటల్ వరల్డ్‌లోకి జియోను ఆహ్వానిస్తున్నాం. ఒక బాధ్యతగల టెల్కోగా నియంత్రణపరమైన అన్ని అంశాలనూ ఎల్లప్పుడూ మేం పాటిస్తాం’అని ఎరుుర్‌టెల్ పేర్కొంది. బీటా సేవల పేరుతో జియో పూర్తిస్థారుు సేవలను అందిస్తోందని, ఇష్టానుసారంగా డేటాను ఆఫర్చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోందంటూ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ)ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై పాత టెల్కోలు జియోకు మధ్య వివాదం కొనసాగుతోంది. కాగా, వారుుస్, డేటా టారిఫ్‌లకు సంబంధించి జియో ప్రకటించిన టారిఫ్‌లు, రేట్లు కచ్చితంగా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుందని.. టెలికం విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీన్ని ‘నాకౌట్ పంచ్’గా అభివర్ణిస్తున్నారు. ‘దేశీ టెలికం రంగం స్వరూపాన్ని మార్చేసే విధంగా(గేమ్ చేంజర్) జియో టారిఫ్‌లు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్లతో ఆదాయం భారీగానే ప్రారంభమ్యే అవకాశం ఉన్నప్పటికీ.. నిర్వహణపరమైన బ్రేక్-ఈవెన్(లాభనష్టాలు లేని స్థారుు)ను జియో ఎప్పటికల్లా సాధిస్తుందన్నది ప్రధానంగా ఆందోళనకలిగించే అంశమని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ ధర్మేష్ కాంత్ అభిప్రాయపడ్డారు. ‘రిలయన్స జియో ఆఫర్ కస్టమర్లకు ప్రయోజనం అందిస్తుందని.. అరుుతే, ఈ టారిఫ్‌లతో ఇతర టెలికం కంపెనీలు పోటీలో లేకుండా పోతాయన్న వాదన సరికాదని సీఓఏఐ పేర్కొంది. జియో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ పెరిగిన తర్వాత మెరుగైన సేవల నాణ్యతను కొనసాగించడం ఆ కంపెనీకి అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మథ్యూస్ అన్నారు. టెలికం షేర్లు కుదేల్... రిలయన్స జియో ప్రకటించిన అత్యంత చౌక టారిఫ్‌లు ప్రస్తుత టెలికం కంపెనీల షేర్లను కకావికలం చేశారుు. దేశీ స్టాక్ మార్కెట్లో లిస్టరుున ఉన్న భారతీ ఎరుుర్‌టెల్, ఐడియా, ఆర్‌కామ్ స్టాక్స్ కుదేలయ్యారుు. గురువారం ఒక్కరోజే లిస్టెడ్ టెల్కోల మార్కెట్ విలువ రూ.16,997 కోట్లు ఆవిరికావడం జియో ప్రకంపనలకు నిదర్శనం. ఐడియా సెల్యులార్షేరు ధర ఇంట్రాడేలో అత్యధికంగా 11 శాతం దిగజారి 52 వారాల కనిష్టానికి(రూ.83.20) పడిపోరుుంది. చివరకు 10.48 శాతం నష్టంతో రూ.83.70 వద్ద ముగిసింది. ఇక భారతీ ఎరుుర్‌టెల్ షేరు కూడా 9 శాతం కుప్పకూలి చివరకు 6.4 శాతం క్షీణతతో రూ.311 వద్ద స్థిరపడింది. మరోపక్క, ఆర్‌కామ్ షేరు 10.11 శాతం వరకూ క్షీణించింది. తుదకు 8.8 శాతం నష్టంతో 49.15 వద్ద ముగిసింది. ఇక టాటా టెలీసర్వీసెస్(మహారాష్ట్ర) 2.83 శాతం పడి రూ.6.19 వద్ద క్లోజైంది. బీఎస్ఈ టెలికం ఇండెక్స్ 5.67 శాతం పడిపోరుుంది. -
అంబానీ ఇళ్లా.. మజాకా!!