రాయ్‌బరేలీ సభలో రాహుల్
రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే, అదానీ, అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాయ్‌బరేలీలో నామినేషన్ వేశాక రాహుల్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ‘‘ నానమ్మ ఇందిరా గాం«దీ, నాన్న రాజీవ్‌గాం«దీ, అమ్మ సోనియాగాంధీ అందరూ రాయ్‌బరేలీ ప్రజల జీవితాలను బాగుచేసేందుకు పాటుపడ్డారు.
మా కుటుంబమంతా మీ కోసం పనిచేస్తే, మోదీ మాత్రం అదానీ, అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధిహామీ పథకానికి 24 ఏళ్లకాలానికి ఖర్చయ్యే మొత్తానికి సరిసమానమైన బడాపారిశ్రామికవేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మోదీ ఒక్కదెబ్బతో మాఫీచేశారు. మోదీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి. ఆ వేడుకలనే ప్రసారంచేశాయి’’ అని ఆరోపించారు.
పెళ్లి ఎప్పుడంటే?
సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచారసభలో రాహుల్ మళ్లీ అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. రాహుల్ మాట్లాడేటప్పుడు సభావేదికపై సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ‘నిన్ను వీళ్లేదో ప్రశ్న అడుగుతారట. సమాధానం చెప్పు’ అని ప్రియాంక చెప్పగా, ఏంటా ప్రశ్న అని రాహుల్ సభికులను అడిగారు. పెళ్లి ఎప్పుడు? అని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈసారి కొత్త సమాధానం చెప్పారు. ‘‘తొందరపడాలిక. త్వరలోనే చేసుకుంటా’’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు.
గతంలో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ‘‘ ఇన్నాళ్లు ఎందుకో పెళ్లి గురించి అంతగా పట్టించుకోలేదు’, ‘ పెళ్లి మీదకు మనసు పోలేదు’, ‘ మీరే అమ్మాయిని చూడండి’, ‘ అమ్మకు నచి్చతే ఓకే’ అంటూ వేర్వేరు సమాధానాలు చెప్పిన రాహుల్ సోమవారం ఇలా కొత్త సమాధానం చెప్పారు. తర్వాత ప్రియాంకను పొగిడారు.‘‘ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఎట్టకేలకు రాయ్‌బరేలీకి వచ్చా. కానీ ప్రియాంక మాత్రం మొదట్నుంచీ రాయ్‌బరేలీలో ప్రచార బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఆమెకు నా కృతజ్ఞతలు’ అని ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment