Rae Bareli
-
రాయ్‌బరేలీలో రాహుల్ పర్యటన
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం సొంత నియో జక వర్గం యూపీలోని రాయ్‌బరేలీలో పర్యటించారు. మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం పొందిన కెప్టెన్ అన్షుమన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం ఢిల్లీ నుంచి లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌బరేలీలోకి రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు.స్థానిక అతిథిగృహంలో రాహుల్ గాంధీ కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి మంజు సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంజు సింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబానికి సాధ్యమైనంత మేర సాయం అందేలా చూస్తామని రాహుల్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం రాహుల్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక నేతలతో ముచ్చటించారు. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్‌ను సందర్శించారు. రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..ఆర్మీని రెండు వర్గాలుగా విడగొట్టే అగ్నివీర్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. -
నేడు రాయ్‌బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
రాహుల్ రెండు వారాల్లోగా తేల్చుకోవాలి
న్యూఢిల్లీ: రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకోవాలో తేల్చుకోవడానికి మరో 11 రోజులే మిగిలి ఉన్నాయి. చట్టం, రాజ్యాంగం నిబంధనల ప్రకారం ఏదైనా ఒక అభ్యర్థి రెండు చోట్ల నుంచి గెలుపొందితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రెండు వారాల్లోగా ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పి.డి.టి. ఆచారి శుక్రవారం తెలిపారు. 17వ లోక్‌సభ రద్దయినా.. కొత్త ప్రొటెం స్పీకర్ వచ్చేవరకు స్పీకర్‌గా ఓం బిర్లా కొనసాగుతారని, ఆయనకు రాహుల్ తన రాజీనామా లేఖను పంపాల్సి ఉంటుందని వివరించారు. రెండు వారాల్లోగా నెగ్గిన రెండు సీట్లలో ఒకదాన్ని వదులుకోకపోతే.. రెండు సీట్లూ కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆచారి తెలిపారు. రెండుసార్లు గెలిపించిన వయనాడ్ (కేరళ), తమ కుటుంబానికి కంచుకోట అయినా రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్)లలో రాహుల్ దేన్ని వదులుకుంటారో వేచిచూడాలి. -
రాహుల్ వయనాడ్ వదిలి.. రాయ్‌బరేలీ ఎంపీ అవుతారా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.తన జీవితమంతా రాయ్‌బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్‌ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్‌సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు. -
Sonia Gandhi: రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా
రాయ్‌బరేలి: ‘నా కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరాశపర్చడు’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శుక్రవారం రాయ్‌బరేలీలో ప్రచార సభలో పేర్కొన్నారు. ఎంపీగా 20 ఏళ్లు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందకు ధన్యావాదాలని అన్నారు. ‘నాకున్న ప్రతిదీ మీరిచి్చందే. కాబట్టి సోదరసోదరీమణులారా నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మీరంతా నన్ను మీ దానిగా భావిస్తారు’ అని అన్నారు. ఓటర్లతో భావోద్వేగ పూరితమైన బంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రాహుల్‌నీ మీ సొంతవాడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై రాహుల్, ప్రియాంక గాం«దీలు సోనియా పక్కన నిలబడ్డారు. ‘ఇందిరా గాం«దీ, రాయ్‌బరేలీ ప్రజలు నాకు నేర్పిన విలువలు, పాఠాలనే నేను రాహుల్, ప్రియాంకలకు నేర్పాను. అందరినీ గౌరవించండి. బలహీనుల పక్షాన నిలబడి వారిని కాపాడండి. అన్యాయాలను ఎదిరించండి. ప్రజల హ క్కుల కోసం పోరాడండి. భయపడొద్దు. పోరాటాలు, సంప్రదాయాల్లో మీ మూలాలు బలంగా ఉన్నాయి’ అని వారిద్దరికీ నేర్పానని సోనియా గాంధీ అన్నారు. సోనియా తొలిసారిగా 2004లో రాయ్‌బరేలి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేసేదాకా 20 ఏళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ బరిలో ఉన్నారు. 20 ఏళ్లు ఎంపీగా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు రాయ్‌బరేలీ ప్రజలు కలి్పంచారని, ఇది తన జీవితంలో అమూల్యమైన ఘట్టమని సోనియా పేర్కొన్నారు. గత 100 ఏళ్లుగా తన కుటుంబం మూలాలు ఇక్కడి నేలతో ముడిపడి ఉన్నాయన్నారు. ఈ బంధం ఎంతో పవిత్రమైనదని, గంగా మాతతో అవధ్, రాయ్‌బరేలి రైతులకు ఉన్న బంధం లాంటిదే ఇదని పేర్కొన్నారు. రాయ్‌బరేలీకి ఇందిరా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానముందని, ఆమె పనిని తాను దగ్గరగా గమనించానని, రాయ్‌బరేలీ ప్రజల పట్ల ఇందిరకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అనారోగ్య కారాణాలు వల్ల సోనియా గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కుమారుడి కోసం శుక్రవారం ప్రచారం చేయడం గమనార్హం. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సోనియాకు ముందు మాట్లాడిన రాహుల్ దేశంలోని యువత ఒక నిశి్చతాభిప్రాయానికి వచ్చారని, వారు మోదీని కోరుకోవడం లేదని తెలిపారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ప్రజాప్రభుత్వమని చెప్పారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపుతూ దీన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చింపి పాడేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాయ్‌బరేలీతో సమానంగా అమేథీని చూస్తా తాను గెలిస్తే అభివృద్ధి విషయంలో రాయ్‌బరేలి, అమేథీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమేథీలో మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి, తమ కుటుంబానికి నమ్మినబంటు కిశోరీలాల్ శర్మ తరఫున రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ‘రాయ్‌బరేలిలో అభివృద్ధి పనులకు రూ. 10 ఖర్చు చేస్తే అదే పది రూపాయలు అమేథిలోనూ ఖర్చు పెడతాం.. అది నా హామీ’ రాహుల్ పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు 40 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించినందుకు కిశోరీలాల్ శర్మకు ధన్యవాదాలు చెప్పారు. అగి్నవీర్ నియామక విధానాన్ని రద్దు చేసి పరి్మనెంట్ నియామక పద్ధతిని తీసుకొస్తామని.. దీంట్లో పెన్షన్‌కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. -
'నా కొడుకు రాహుల్‌ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ అధినేత్రి 'సోనియా గాంధీ' శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.రాహుల్ గాంధీకి తన (సోనియా గాంధీ) పట్ల చూపిన అదే ప్రేమ, ఆప్యాయతలను అందించాలని సోనియా గాంధీ ప్రజలను కోరారు. ''నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీవారిలా భావించినట్లే, అతనికి కూడా అదే ప్రేమ, ఆప్యాయతని అందించండి''. రాహుల్ మిమ్మల్ని మీరసపరిచేది లేదని అన్నారు.తమ కుటుంబానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చే రాయ్‌బరేలీ ఈ సారి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా తాను లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనడం లేదని సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈమె 2004 నుంచి రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది.ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ ప్రజలకు 20 ఏళ్ల పాటు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించారు. అదే నాకు పెద్ద ఆస్తి. రాయ్‌బరేలీకి చెందిన నా కుటుంబ సభ్యులు, చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.రాయ్‌బరేలీ మాదిరిగానే.. అమేథీ కూడా నా ఇల్లు అని పేర్కొంటూ.. నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్‌బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమైంది, ఇది నేటికీ కొనసాగుతోందని సోనియా గాంధీ అన్నారు.मैं आपको अपना बेटा सौंप रही हूं।: श्रीमती सोनिया गांधी जी📍 रायबरेली, यूपी pic.twitter.com/5kwxLtM8nt— Congress (@INCIndia) May 17, 2024 -
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే, అదానీ, అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాయ్‌బరేలీలో నామినేషన్ వేశాక రాహుల్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ‘‘ నానమ్మ ఇందిరా గాం«దీ, నాన్న రాజీవ్‌గాం«దీ, అమ్మ సోనియాగాంధీ అందరూ రాయ్‌బరేలీ ప్రజల జీవితాలను బాగుచేసేందుకు పాటుపడ్డారు. మా కుటుంబమంతా మీ కోసం పనిచేస్తే, మోదీ మాత్రం అదానీ, అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధిహామీ పథకానికి 24 ఏళ్లకాలానికి ఖర్చయ్యే మొత్తానికి సరిసమానమైన బడాపారిశ్రామికవేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మోదీ ఒక్కదెబ్బతో మాఫీచేశారు. మోదీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి. ఆ వేడుకలనే ప్రసారంచేశాయి’’ అని ఆరోపించారు. పెళ్లి ఎప్పుడంటే? సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచారసభలో రాహుల్ మళ్లీ అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. రాహుల్ మాట్లాడేటప్పుడు సభావేదికపై సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ‘నిన్ను వీళ్లేదో ప్రశ్న అడుగుతారట. సమాధానం చెప్పు’ అని ప్రియాంక చెప్పగా, ఏంటా ప్రశ్న అని రాహుల్ సభికులను అడిగారు. పెళ్లి ఎప్పుడు? అని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈసారి కొత్త సమాధానం చెప్పారు. ‘‘తొందరపడాలిక. త్వరలోనే చేసుకుంటా’’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ‘‘ ఇన్నాళ్లు ఎందుకో పెళ్లి గురించి అంతగా పట్టించుకోలేదు’, ‘ పెళ్లి మీదకు మనసు పోలేదు’, ‘ మీరే అమ్మాయిని చూడండి’, ‘ అమ్మకు నచి్చతే ఓకే’ అంటూ వేర్వేరు సమాధానాలు చెప్పిన రాహుల్ సోమవారం ఇలా కొత్త సమాధానం చెప్పారు. తర్వాత ప్రియాంకను పొగిడారు.‘‘ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఎట్టకేలకు రాయ్‌బరేలీకి వచ్చా. కానీ ప్రియాంక మాత్రం మొదట్నుంచీ రాయ్‌బరేలీలో ప్రచార బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఆమెకు నా కృతజ్ఞతలు’ అని ఆమెను అభినందించారు. -
రాయ్‌బరేలీ వ్యూహం
ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్‌లో రాహుల్ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్ శర్మ పంజాబ్ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! -
Lok sabha elections 2024: ‘రహస్య వ్యూహం’ ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్‌బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. అరంగేట్రం వయా ఉప ఎన్నిక ! వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్‌బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో రాహుల్ గెలిస్తే రాయ్‌బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్‌బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. -
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి రాహుల్ తన నామినేషన్ పత్రాలను రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ హర్షితా మాథుర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌తో బరిలో నిలిచారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షికాదాయం రూ.1.02 కోట్లు. మా కర్మభూమి రాయ్‌బరేలీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్‌బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్ వెల్లడించారు. -
PM Narendra Modi: డరో మత్.. భాగో మత్
బర్ధమాన్/కృష్ణనగర్/చైబాసా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా ్రస్తాలు విసిరారు. డరో మత్.. భాగో మత్(భయపడొద్దు.. దూరంగా పారిపోవద్దు) అంటూ రాహుల్‌కు సూచించారు. కేరళలోని వయనాడ్‌లో పోలింగ్ పూర్తికాగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకుముందే చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్‌లో ఓటమి తప్పదని గ్రహించి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌కు పారిపోయాడని, ఇప్పుడు అక్కడినుంచి రాయ్‌బరేలీకి వచ్చాడని పేర్కొన్నారు. ఈసారి అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్‌బరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు. భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని, తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు. ఇకనైనా భయపడడం, దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని బర్ధమాన్–దుర్గాపూర్, కృష్ణనగర్, బీర్భుమ్, బోల్పూర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో, జార్ఖండ్‌లోని చైబాసాలో ‘మహా విజయ్ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతోందని, ప్రజాదరణ కోల్పోతోందని, ఈ ఎన్నికల్లో ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కనీసం 50 సీట్లయినా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు(సోనియా గాం«దీ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి, రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా మాట్టాడారంటే.. దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ‘ఓటు జిహాద్’ దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్లో పాలుపంచుకున్నవారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలూ పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సందపపై ముమ్మాటికీ పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు. 15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మాత్రమే ఉంది. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది. ఎన్నికల్లో ఆ పారీ్టకి బుద్ధి చెప్పాలి. చిత్తుచిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. మూడు సవాళ్లపై సమాధానమేదీ? దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది. అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారీ్టలకు కట్టబెట్టాలని పథకం వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘జిహాదీ ఓటు బ్యాంక్’ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం. కాంగ్రెస్‌తోపాట విపక్ష కూటమికి నేను 3 సవాళ్లు విసురుతున్నా. మొదటిది.. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతం ఆధారం రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని, మతం ఆధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. మూడోది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కలి్పంచబోమని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదు. నాకు సమాధానం ఇవ్వడం లేదు. -
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
రాయ్‌బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. కాగా ప్రియాంకను రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.చదవండి:Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్‌సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.రాయ్‌బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు. -
భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ పోటీ నిర్ణయంపై బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వయనాడ్‌లో ఓడిపోతాడని తెలిసే రాహుల్ రాయ్‌బరేలీకి పారిపోయారన్నారు. ఇవాళ ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. భయం వద్దు(డరో మత్).. పారిపోవద్దు(భాగో మత్).. అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో తరచూ ‘భయం వద్దు డరో మత్’ అంటూ రాహుల్ గాంధీ చెబుతుంటారు).‘‘వాళ్ల అగ్రనేత పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. ఆమె (సోనియా గాంధీ) కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్ పారిపోయారు. ఇదే జరిగింది. ఇంతలా భయపడే వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు.వయనాడ్‌లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన తన ఓటమిని గానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలంతా స్పందిస్తున్నారు . అమేథీలో ఏం చేయని వారు.. రాయ్ బరేలీలో ఏం చేస్తారు? అని బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీ నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అది చూసే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయింది. -
Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సస్పెన్స్‌కు కాంగ్రెస్ తెరదించింది. అందరి ఊహలు పటాపంచల్ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఈయన గాంధీ, నెహ్రూ కుటుంబానికి చిరకాల విధేయుడు.కాగా రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజా ప్రకటనతో ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లే తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్ నుంచి మరోసారి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్.. అమేథీలో పోటీకి ఆయన ముందు నుంచి నిరాసక్తి చూపుతూ వస్తున్నారు. కానీ రాహుల్‌ను రాయ్‌బరేలీలో రంగంలోకి దింపి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. అయితే అమేథీలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఘోర ఓటమిని చవిచూశారు.2004 నుంచి 2014 వరకు రాయ్‌బరేలీలో ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. కానీ ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ పోటీకి మరో వ్యక్తి అవసరం వచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీ పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా..కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా 63 స్థానాల్లో ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సమాజ్‌వాదీపార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలో పోటీ చేస్తున్నాయి.ఎవరీ కిషోరీలాల్ శర్మకిషోరీలాల్ శర్మీ 1939 సెప్టెంబర్ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు.పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఆయనకు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. 1983లో తొలిసారి అమేథీకి వచ్చి అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరపున పనిచేస్తూ వస్తున్నారు. కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది.సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కేఎల్ శర్మ కీలక పాత్ర పోషించారు.రాహుల్ కోసం సోనియా గాంధీ సీటు వదులుకున్న తర్వాత అమేథీ, రాయ్‌బరేలీలో శర్మ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.25 ఏళ్లలో తొలిసారిగత 25 ఏళ్లలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమేథీ ఎన్నికల బరిలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. చివరిసారి 1998లో గాంధీయేతర కుటుంబ సభ్యుడిని అమేథీ నుంచి పోటీకి దింపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ సతీష్ శర్మను పోటీచేశారు. అయితేబీ జేపీ అభ్యర్థి సంజయ సిన్హ చేతిలో ఆయన ఓడిపోయారు. అంతకు ముందు 1996 ఎన్నికలలో శర్మ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా మోహన్ సింగ్‌పై విజయం సాధించారు. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్‌బరేలీ, ఇటు అమేధీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్‌బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్‌ను ఉంచారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాయ్‌బరేలీకి ఇద్దరు గాంధీలు? 40 ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతం?
ఉత్తరప్రదేశ్‌లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్‌గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్‌గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంకా గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని సమాచారం.రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్యానెల్లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే, గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లవుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. -
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్ దక్కేనా?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్‌గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్‌గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
Lok sabha elections 2024: కాంగ్రెస్‌లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్‌బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్‌తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్‌తో పాటు ఢిల్లీలోని డే స్కూల్‌కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్‌తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్‌బరేలీ ఎవరిది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్‌బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట. ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు ఎంతో కీలకం. సమాజ్‌వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్‌బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. -
అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్ వీడని మౌనం!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ఇంకా లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ రెండు లోకసభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఇంకా మౌనం వీడలేదు. పార్టీ అధిష్టానం తాజాగా యూపీ అభ్యర్థుల నూతన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ తన కంచుకోట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అమేథీ, రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలు పంపుతున్నారని సమాచారం. అయితే నామినేషన్ల చివరి రోజున ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం నుంచి వేరొకరికి వెళ్లేందుకు అనుమతించబోమని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా, మరొకరు రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్నారట. -
‘ప్రియాంకా గాంధీ జీ.. రాయ్‌బరేలీ మిమ్మల్ని పిలుస్తోంది!’
1950ల నుంచి కాంగ్రెస్ కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం. అయితే అదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సోనియా గాంధీ అనారోగ్య కారణంగా పోటీ నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంతకీ రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపాలని భావిస్తోంది? లేదంటే సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు రాయ్‌బరేలీలో పోస్టర్లు వేసి, పార్టీ నాయకత్వం ఆమెను లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు నియోజకవర్గంలో పోస్టర్లను విడుదల చేశారు. ‘ప్రియాంక గాంధీ జీ రాయ్‌బరేలీ పిలుస్తోంది. దయచేసి రండి కాంగ్రెస్‌ను ముందుకు నడిపించండి’ అంటూ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్‌ల ఫోటోలతో ఉన్న పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్‌కు కంచుకోట ఇక కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీకి గతంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన స్థానంలో రెండు దశబద్ధాలుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లనున్నారు. ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. దేశం మొత్తం రాయ్ బరేలీ వైపే చూపు 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేథీలో రాహుల్ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్‌బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. అందువల్ల, ఈ సీటుకు బీజేపీ అభ్యర్ధి ఎంపిక, సోనియా గాంధీ ఆ స్థానాన్ని ఖాళీ చేస్తే కాంగ్రెస్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అనే అంశంపై దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. కమలం వికససించాలని 2019 ఎన్నికల్లో సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది. సోనియా గాంధీ చేతిలో 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సింగ్, ఈసారి ఎవరిని ఎంచుకుంటే వారికే తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. రాయబరేలీలో అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటే వారి గెలుపుకోసం శ్రమిస్తాం. కమలం వికసించాలనేది నా సంకల్పం’ అని దినేష్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమోథీ బరిలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమైన అమేథీలో బీజేపీ తన అభ్యర్థిగా కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని నిలబెట్టుకుంది. ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె 2019లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలైనా.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలుపొందారు. అమేథీకి గతంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. -
Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), అప్నాదళ్ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్ ఎమ్మెల్యే మనోజ్ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. -
వైరల్ వీడియో: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
-
Viral Video: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్‌కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్ షాప్‌లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో లిక్కర్‌కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. రాయ్‌బరేలీ జిల్లాలోని గడాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌గంజ్ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్‌గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా?