లెక్చర్లు ఇవ్వొద్దు: మోడీకి ప్రియాంక చురక
రాయబరేలీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉపన్యాస తీరును సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. పాఠశాల పిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలని మోడీకి ప్రియాంక సూచించారు. ఆయన విద్యాసంస్థలను ఉద్దేశించి ప్రసంగించడం లేదన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏబీసీ, ఎఆర్వీఎస్ తరహాలో లెక్చర్ ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగిచేటప్పుడు వారికి ఏం చేస్తారరో చెప్పండి... పాఠాలు చెప్పొద్దు అంటూ మోడీకి చురక అంటించారు. ఒకవేళ మీరు ప్రజలకు సర్దిచెప్పాలని చూస్తే గుజరాత్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తారని ప్రియాంక గాంధీ అన్నారు. గుజరాత్ మోడల్ గురించి ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. తక్కువ ధరలకు భూములను తన సన్నిహితులకు మోడీ కట్టబెట్టారని ఆరోపించారు