'మోడీని ప్రియాంక తండ్రిలా భావించదు'
సీమాంధ్ర, తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టో విభజన యాక్ట్లోనే పొందుపరిచామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... 2004 ఎన్నికల సందర్బంగా భారత్ షైనింగ్ అని బీజేపీ ప్రచారం చేసుకుందని, అయితే అది వట్టి బోగస్సే అని ఆయన తెలిపారు. 2003 -2004 నాటి ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి రేటు ఇప్పుడే బాగుందని చిదంబరం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తన కూతురు లాంటిదన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై చిదంబరం ఈ సందర్బంగా స్పందించారు. మోడీని ప్రియాంక తండ్రిలా భావిస్తుందని తాను భావించడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. అయితే ప్రియాంక గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని చిదంబరాన్ని విలేకర్లు కోరారు. ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యలపై చిదంబరంపై విధంగా స్పందించారు.
ఇటీవల నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా తనకు కుమార్తెతో సమానమని వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ గత నెల 27న ప్రసారం అయింది. అయితే ఆ ఇంటర్వ్యూపై ప్రియాంకా గాంధీ స్పందించింది. తాను రాజీవ్ గాంధీ కుమార్తెను మాత్రమే అని స్సష్టం చేసిన సంగతి తెలిసిందే.