chidambaram
-
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనకాడదు: చిదంబరం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడదని, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటా కల్పించే 103వ సవరణ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబంరం మాట్లాడుతూ.. కేంద్రలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రిజర్వేషన్లను పూర్తిగా రద్దే చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనకాడబోదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేసిందా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. రాజ్యాంగాన్ని బీజేపీ కచ్చితంగా సవరిస్తుందని, దాని కోసం వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.చదవండి: పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలుసార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రానప్పటికీ, బీజేపీ రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించడానికి అయినా తగ్గించడానికి అయినా వెనకాడదని పేర్కొన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లోనే పక్షపాతంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని విమర్శలు గుప్పించారు.అయితే జాతీయ రహదారులను నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో ఎన్డీయే సర్కార్ ఘనత సాధించిందని తెలిపారు. అలాగే డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ పురోగతి సాధించిందని తెలిపారు. నగదు అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పేమెంట్లు జరుగుతున్నాయని. ఇది అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. ''Modi government will not hesitate to take away reservations or dilute reservations'': @PChidambaram_INWhy did the Congress say 'Samvidhan khatre mein hai'' during the elections? What was the idea behind it?@PChidambaram_IN answers#ConclaveMumbai24 @Sardesairajdeep pic.twitter.com/eFcxV6Jtpi— IndiaToday (@IndiaToday) September 26, 2024 -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు వ్యక్తులు , ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. కడలూరు సమీపంలోని చిదంబరం వద్ద ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియ రావాల్సి ఉంది.ఇదీ చదవండి: జడ్జిగారూ.. నా భార్యకు ఎనిమిది మంది భర్తలు -
10ఏళ్లగా ప్రధాని మోదీ ఏం చేశారు? కచ్చతీవుపై చిదంబరం కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా : 2019 కంటే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం జోస్యం చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని నమ్ముతున్నాను. కేరళలో రెండు ఫ్రంట్లు (యూడీఎఫ్- ఎల్డీఎఫ్) 20 సీట్లలో విజయం సాధిస్తాయి. బీజేపీ గెలవడం కష్టం. 2019 కంటే కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయని చిదంబరం అన్నారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లను గెలుచుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని పేర్కొంటూ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలలో ఇండియా కూటమికి ఎక్కువ విజయవకాశాలు ఉన్నాయంటూ నివేదికలు సైతం వస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కచ్చతీవు సమస్య ముగిసిందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని ప్రశ్నించారు. కచ్చతీవు సమస్య ముగిసింది. 50ఏళ్ల క్రితం ఒప్పందం కుదిరింది. 2014 నుంచి ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం నొక్కాణించారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్‌కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్‌ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్‌ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్‌గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్‌లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్‌కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్‌పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘కచ్చతీవు రచ్చ’: జైశంకర్‌కు చిదంబరం కౌంటర్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నమలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మనదేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఎవరు ఏం చేశారో కాదు.. ఎవరు ఏం దాచారో తెలుసు ఈ నివేదికపై విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ సైతం.. కాంగ్రెస్, డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని జయ శంకర్ అన్నారు. దెబ్బకు దెబ్బ వర్సెస్ ట్వీట్ ఫర్ ట్వీట్ కచ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు. ఎక్స్ వేదికగా జయ్శంకర్ ఊసరవెల్లిల్లా రంగుల్లు మార్చొద్దని అన్నారు. ‘టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్ ఫర్ ట్వీట్ అనేది ట్వీట్ కొత్త ఆయుధం’ అని పేర్కొన్నారు. చరిత్రలో జై శంకర్ అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్ శంకర్‌ను ఉద్దేశిస్తూ.. ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్ఎస్ఎస్- బీజేపీ మౌత్ పీస్ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు బీజేపీలో హయాంలోనూ జరిగింది మరో ట్వీట్లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. ‘గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చతీవు భారత్ తిరిగి తీసుకోవాల్సిందే ఇలా ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. -
బీజేపీకి అర్థం కావడం లేదు!.. మండిపడ్డ మాజీ ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 - 24లో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గుతున్నాయి. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం.. దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం బాగా తగ్గిపోయిందని చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటోంది. మంచి సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, నిజమైన వేతనాలు నిలిచిపోయాయి, నిరుద్యోగం పెరుగుతోంది.. గృహ వినియోగం తగ్గుతోంది. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు. కానీ ఇవన్నీ బీజేపీకి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అన్నారు. BJP claims that the Indian economy is in robust health in 2023-24, but has no explanation why net FDI inflows have dropped by 31 per cent FDI is a measure of the confidence that foreign investors have in a country, the government and its policies. Such confidence has declined… — P. Chidambaram (@PChidambaram_IN) March 28, 2024 -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవి సాధ్యం!.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాము. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ధర పెంచబోమని ప్రధాని 'నరేంద్ర మోదీ' హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత 'రాహుల్ గాంధీ' దేశానికి ఐదు హామీలు ఇచ్చారు. వాటన్నంటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు.. చెన్నైలోని కాంగ్రెస్ రాష్ట్ర సత్యమూర్తి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు. 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కాంగ్రెస్ చర్య తీసుకుంటుందని చిదంబరం వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి చర్యలను అరికట్టడానికి కూడా కొత్త చట్టం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. గ్యాస్ ధరలను రూ. 100 తగ్గించిన బీజేపీ ప్రభుత్వం.. ఇంధన ధరల తగ్గింపు, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలను ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చిదంబరం మండిపడ్డారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 7 వరకు, తమిళనాడుకు రూ. 17,300 కోట్లతో సహా దేశానికి రూ. 5.90 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు, వీటి ప్రస్తావన నాకు కనిపించలేదని అన్నారు. -
పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్‌లు లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్‌లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్‌చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్ సబ్స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం గతంలో పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్ సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే. ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్‌లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు. రక్షణ కలి్పంచండి: లోక్‌సభ స్పీకర్‌కు మొయిత్రా లేఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్‌సభ స్పీకర్ బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు. నిఘాకు రూ.1,000 కోట్లు! ‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్ నౌ, సిటిజెన్ ల్యాబ్ వంటి సంస్థలు సెపె్టంబర్‌లోనే ఇలాంటి యాపిల్ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్‌లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్ ఫైల్స్’ పేరిట ఫైనాన్షియల్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్‌చేశారు. కాగా, అలర్ట్ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
మైనార్టీలు భయంతో బతుకుతున్నారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. 2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్ఎస్తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్‌లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. -
చైనా దురాక్రమణ పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశ ఉత్తర సరిహద్దులోని భూభాగాన్ని చైనా దురాక్రమణ చేస్తోందని, దీన్ని ఆపడానికి భారత్ చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 2020లో జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిన మాటలే చైనా దురాక్రమణకు కారణమవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో జైరాం రమేశ్, పవన్ఖేరాలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, భద్రతా వైఫల్యం గురించి సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. దేశంలో రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి సవాల్ ఏర్పడిందని, ఓ పద్ధతి ప్రకారం వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అంశాల వారీగా చిదంబరం ఏం చెప్పారంటే.. ♦ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ... ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వట్లేదు. ఉదాహరణకు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేయడంలో భాగంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఎఫ్‌సీఐ బియ్యం ఇవ్వడం లేదు. బియ్యం ఇవ్వొద్దని పైనుంచి ఆదేశాలిచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా తీవ్ర నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, విపత్తు సహాయం కింద కూడా కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు. దీనికి కారణం అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే. ♦ మే 5 నుంచి మణిపూర్ తగలబడుతోంది. అప్పటి నుంచి దాదాపు 157 రోజులుగా ప్రధాన మంత్రి చాలాసార్లు చాలా దేశాలకు వెళ్లివచ్చారు. ఏషియా సమిట్, జీ8 దేశాల సమావేశాలకు హాజరయ్యారు. కానీ, ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లేందుకు రెండు గంటలు మాత్రమే పడుతుంది. అయినా అక్కడకు వెళ్లేందుకు సమయం దొరక్కపోవడం బాధ కలిగిస్తోంది. ♦ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో అసత్యాలు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవు. తాజాగా ఉగ్రవాదులు అక్కడ సైన్యంపై దాడి చేసి కల్నల్, మేజర్, డీఎస్పీ, రైఫిల్‌మెన్‌ను హత్య చేశారు. ఆ సమయంలో కేబినెట్ సమావేశం నిర్వహించి జీ20 సమావేశాలు విజయవంతం చేశామని సంబురాలు చేసుకున్నారు. ♦ మణిపూర్, కశ్మీర్లో అంతర్గత భద్రతకు భంగం ఒకవైపు, చైనా ఆక్రమణ మరోవైపు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చర్చలు జరిపినా ఉపయోగం లేదు. చైనా ఇంచు కూడా వెనక్కు తగ్గలేదు. చైనా పూర్వ స్థితిలోనే ఉందని మొన్నటివరకు అనుకున్నాం. కానీ నానాటికీ చైనా ఆక్రమణ ప్రమాదకర స్థాయికి వెళుతోంది. మనం భూభాగాన్ని కోల్పోతున్నాం. ♦ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. మేం దాన్ని తిరస్కరిస్తున్నాం. ఇది జరగాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇలా చేసేందుకు తగిన సంఖ్యాబలం కావాలని బీజేపీకి కూడా తెలుసు. కానీ, ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకే ఇలాంటి చర్చను కేంద్రం తెరపైకి తెస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లుకు సవరణను ఈ సమావేశాల్లో పెడుతున్నారని తెలిసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. ♦ రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమ దిశగా జరగాలని సీడబ్ల్యూసీ సభ్యులు అడిగారు. దీన్ని సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ♦ సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఇండియా కూటమి ఏర్పాటును స్వాగతించారు. సీట్ల సర్దుబాటు త్వరగా చేయాలని ఒకరిద్దరు సభ్యులు చెప్పారు. కానీ, ఆ సర్దుబాటు పని సీడబ్ల్యూసీది కాదు. 14 మంది సభ్యుల ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీది. ♦ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇక్కడ సమావేశాలు నిర్వహించడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నాయకులందరూ సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడారు. వారి రాష్ట్రాల పరిస్థితుల గురించి చెప్పారు. ♦ సనాతన ధర్మంపై సీడబ్ల్యూసీలో ఎలాంటి చర్చ జరగలేదు. మేము సర్వధర్మ సంభావ్ను నమ్ముతాం. తాము మాట్లాడింది మతాల గురించి కాదని, కుల వ్యవస్థ, కులాల పేరుతో అణచివేత, మహిళలు, దళితుల అణచివేత గురించి మాట్లాడామని డీఎంకే వర్గాలు చెప్పాయి. మేం ఆ వివాదంలోకి వెళ్లం. ♦ ఇండియా అంటేనే భారత్. ఇండియా భారత్‌గా మారినందుకు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇవన్నీ తప్పుడు వివాదాలు. అంబేడ్కర్ చెప్పినట్టు ఇండియా అంటేనే భారత్. మేం దాన్నే నమ్ముతాం. ♦ గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. క్రూడ్ ఆయిల్, అసోసియేటెడ్ గ్యాస్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. కానీ ఈ ధరలు పెంచడం ద్వారా కేంద్రం లబ్ధిపొందింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆ వాగ్దానాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం. -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
చిదంబరం తీరుపై రాహుల్ గాంధీ అసంతృప్తి?
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్‌నేత పి. చిదంబరం తీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కొంత కాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గత వారం రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇవ్వడం, ఎంపీ పదవి వ్యవహారంలో అనర్హత వేటుకు గురవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై కూడా చిదంబరం స్పందించక పోవడం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. సీనియర్ నేతగా, జాతీయ రాజకీయ అంశాలపై మంచి అవగాహన కలిగిన చిదంబరం మౌనంగా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో నిరసనలు సాగుతున్న సమయంలోనూ.. చిదంబరం ఏ ఒక్క చోటా కనిపించక పోవడాన్ని ఇక్కడి గ్రూపు నేతలు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో చిదంబరం వ్యవహారాన్ని రాహుల్ తీవ్రంగా పరిగణించారని, ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్నారనే వాదనలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. -
బస్టాండ్‌లో విద్యార్థి మెడలో తాళి కట్టిన మైనర్..చివరికి తిక్క కుదిరింది!
చెన్నై: నేటి యువత కొన్ని విషయాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వారు ప్రేమ పేరుతో పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇద్దరు టీనేజ్ విద్యార్థులు ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద మైనర్ బాలుడు పక్కన యూనిఫాం ధరించి కూర్చొని ఉన్న బాలిక మెడలో మంగళసూత్రం కట్టాడు. చుట్టూ ఉన్న స్నేహితులు వారిని పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహించడం వీడియోలో వినిపిస్తుంది. కాగా వీడియోలోని యువతి ఇంటర్ చదువుతున్నట్లు, ఆమెను పెళ్లి చేసుకున్న అబ్బాయి పాలిటెక్నిక్ విద్యార్థిగా తెలుస్తోంది. సరదా కోసం చేశారో, ఉద్ధేశ్యపూర్వకంగా ఇలా చేశారో తెలియదు కానీ వీరి ప్రవర్తన చట్టపరమైన చర్యలకు దారితీసింది. నెట్టింట్లో వీడియో చక్కర్లు కొట్టడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిదంబరం జిల్లా పోలీసులు తెలిపారు. చదవండి: ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’ అంతేగాక ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. టీనేజ్‌లో ఇలాంటి చర్యకు పాల్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఊరికే వదిలిపెట్టవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అబ్బాయితోపాటు అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో కాలేజీ, స్కూల్ అమ్మాయిల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిని గమనిస్తూ ఉండాలి. స్కూల్ బ్యాగ్, మొబైల్ ఫోన్‌ని పరిశీలిస్తూ ఉండాలి.’ అని కామెంట్ చేస్తున్నారు. காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq — SP Chhandak (@CHHANDAK175) October 10, 2022 -
చిదంబరానికి సీబీఐ షాక్
-
కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిశోర్ సమావేశం
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో 5 గంటలపాటు సమావేశమయ్యారు. ప్రియాంకా గాంధీ, అంబికా సోనీ, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో పీకే భేటీ కావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఏడాడి ఆఖర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీకే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారంటున్నారు. ఆయన శనివారం సోనియా గాంధీ సమక్షంలో పూర్తిస్థాయి ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 370 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. సోనియాతో మెహబూబా ముఫ్తీ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోమవారం సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశం ఇప్పటిదాకా భద్రంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతేనని మెహబూబా ముఫ్తీ కితాబిచ్చారు. మరిన్ని పాకిస్తాన్లను సృష్టించాలని అధికార బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. -
ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశం విస్తుపోయే ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్ నమూనాలను సేకరించే అధికారం పోలీసులు, జైలు వార్డెన్లకు కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అంతకుముందు ఈ బిల్లుపై చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ విజయసాయిరెడ్డి తూర్పారబట్టారు. నాడు కాంగ్రెస్ పాల్పడిన దుశ్చర్యల కారణంగానే తాను ఈ బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో, 2008లో అస్సాంలో, 2010లో పుణెలో బాంబు పేలుళ్లు, 2011లో ముంబైపై కసబ్ ముఠా దాడులు.. ఇలా దేశాన్ని నివ్వెరపరచిన ఈ ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కానీ నేడు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరుతున్నారుగా.. మరి హోం మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారు..’ అని చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులు అని పేర్కొన్నారు. చిదంబరం, గులాంనబీ ఆజాద్ కలసి తనపై, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉదాశీనత కారణంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచం దృష్టిలో నాడు భారత్ బలహీనమైన దేశంగా ముద్రపడిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని చెప్పారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అనుసరించిన విధానాల వల్ల దేశ భద్రతపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం కలిగిందని ప్రశంసించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి ప్రసంగానికి విపక్షాలు అంతరాయం కలిగించడంతో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహచర సభ్యుడు మాట్లాడుతుంటే వినే ఓపిక, సహనం లేకపోతే ఎలా అని అమిత్‌షా ప్రశ్నించారు. మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షా సూచించారు. దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపండి మహిళలపై జరిగే అత్యాచారం కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లును తక్షణమే ఆమోదించాలని హోంమంత్రి అమిత్‌షాకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శిక్షలు పడుతున్న కేసులు తక్కువ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో 1920లో చేసిన ఈ చట్టానికి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు హోంమంత్రి అమిత్‌షాను అభినందిస్తూ 2020 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో వివిధ నేరాలకు పడుతున్న శిక్షల శాతాన్ని వివరించారు. మర్డర్ కేసుల్లో 40 శాతం, రేప్ కేసుల్లో 39 శాతం, హత్యాయత్నం కేసుల్లో 24 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. శిక్షలు పడిన కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటానికి కారణం నేరస్తులను శిక్షించే బలమైన ఆధారాల సేకరణకు పోలీసుల వద్ద తగిన ఉపకరణాలు లేకపోవడమేనని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు. యూకేలో 2020–21లో 83.6 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అమెరికాలో 93 శాతం, జపాన్‌లో 99 శాతం నేరాలకు తగిన శిక్షలు పడ్డాయని చెప్పారు. సమర్థమైన విచారణకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్, సిస్టమ్స్ ఎంతైనా అవసరమన్నారు. నేరస్తుల వేలి, కాలిముద్రల సేకరణ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నదేమీ కాదని, అనేక క్రిమినల్ కేసుల్లో వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. ఉదాహరణకు 2013లో బుద్ధగయలో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఘటనాస్థలంలో బౌద్ధభిక్షువు ధరించే వస్త్రం దొరికిందని, వస్త్రంలో దొరికిన వెంట్రుకలు బాంబు దాడికి పాల్పడిన నిందితుడి వెంట్రుకలకు సరితూగాయని గుర్తుచేశారు. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా అవే కీలక సాక్ష్యంగా మారాయన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని మనం కచ్చితంగా వినియోగించుకుని తీరాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
కేంద్రం సెస్ తగ్గిస్తే రూ. 32కే లీటర్ పెట్రోల్
పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గిస్తే పెట్రోల్ రేట్లు బాగా తగ్గుతాయని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. పెట్రోల్‌పై సెస్ రూపంలో ఆయా సందర్భాల్లో కేంద్రం సొమ్మును వసూలు చేస్తోందని, సెస్ అనేది పన్ను కాదని గుర్తించాలన్నారు. కేంద్రం ఇలా ఆయా సమయాల్లో వేసిన సెస్‌ను తొలగిస్తే పెట్రోల్ లీటరు రూ.32కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. బుధవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. అక్కడి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు అనే మోదీ ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అమలులో వెనుకబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత పేరుతో నోట్లరద్దు అమల్లోకి తేగా, బ్లాక్‌మనీ మొత్తం వైట్‌గా మారిందన్నారు. తనకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని చిదంబరం గుర్తుచేసుకుంటూ.. ఓసారి తాను రూపొందించిన ఓ ముసాయిదా చట్టం ఫైలును పీవీ కనీసం చదవకుండానే సంతకం పెట్టారని అన్నారు. -
తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్ ఎన్నికల ఫలితాల ఎపిసోడ్ చివరి అంకానికి చేరినట్లు కనపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు బిహార్ కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ తెర ముందుకొచ్చారు. తన వల్లే పార్టీ రాష్ట్రంలో పరాజయం పాలైందని ఒప్పుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఓటమి గల కారణాలను వివరించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. గత 20 ఏళ్లలో ప్రత్యర్థులు గెలుస్తున్న సీట్లను తమకు కేటాయించడం వల్లే ఈ పరాజయం పొందామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తమకు బలంలేని చోట పోటీకి దిగామని, పరాజయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానని అన్నారు. వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్న చోట సరిచేయాలని అధినేతతో చెప్తానని అన్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆయన అంగీకరించారు. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయిన గెలవాలంటే పార్టీలో భారీ సంస్కరణలు అమలు చేయాలని అన్నారు. ఇంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టాలని పరోక్షంగా రాహుల్‌ని ఉద్ధేశించి బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ నానాటికీ బలహీన పడుతుందని, వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని మరో సీనియర్ నేత చిదంబరం సూచించారు. అంతేకాకుండా బిహార్‌లో సీట్ల ఎంపికలో సరిగా వ్యవహరించలేదని, ప్రతిపక్షాలు గత 20 ఏళ్లలో గెలుస్తున్న 25 సీట్లను అంటగట్టారని అన్నారు. అన్ని స్థానాల్లో కాకుండా 45 సీట్లలో పోటీకి నిలిపితే బాగుండేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కపిల్ సిబల్ అంటే చాలా గౌరవమని అన్నారు. పరాజయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్పిందని అన్నారు. బిహార్‌లో కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయానికి దగ్గరలో ఉండేదన్న వ్యాఖ్యలపై మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లోనూ పరాజయం తరువాత ఇవి తీవ్రమయ్యాయి. (చదవండి: కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు) -
‘న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్ల (సీఏఏ)కు సంబంధించి అనుబంధ చార్జిషీట్లో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్‌కు చెందిన యోగేంద్ర యాదవ్, ఇతర మేథావుల పేర్లను వెల్లడించిన ఢిల్లీ పోలీసులు నేర న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని కాంగ్రెస్ నేత పీ చిదంబరం అన్నారు. సమాచారం, చార్జిషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక దశలుంటాయని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. చదవండి : ‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు ఇంకా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డిస్క్లోజర్ స్టేట్మెంట్లో ఆర్థిక వేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ రాహుల్ రాయ్‌ల పేర్లున్నాయి. కాగా వీరిని తాము నిందితులుగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు అనుబంధ చార్జిషీట్ దాఖలు కావడంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. -
ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక సూచన చేశారు. ఆర్బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన తమ కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. తమ డ్యూటీ చేసుకోమని మొహమాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం) మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నా, జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వం ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్ఎస్ఎస్ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ ఆందోళనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్ జోన్లోకి జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో రెపో రేటును 4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. Governor @DasShaktikanta says demand has collapsed, growth in 2020-21 headed toward negative territory. Why is he then infusing more liquidity? He should bluntly tell the government ‘Do your duty, take fiscal measures’. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2020 -
లిక్విడిటీ బూస్ట్: చిదంబరం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ద్రవ్య లభ్యత కోసం సోమవారం రిజర్వు బ్యాంకు రూ.50,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించటాన్ని ఆయన స్వాగతించారు. ఆర్బీఐ సత్వర చర్య మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో నెలకొన్న ఆందోళనలకు ఊరటనిస్తుందని ఆయన ప్రశంసించారు. ప్రముఖ పెట్టుబడి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారత్‌లోని ఆరు పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో తన పెట్టుబడిని కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. అయితే పెట్టుడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సొమ్మును తిరిగి చెల్లిస్తామని స్పష్టత నిచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది. (మ్యూచువల్ ఫండ్లకు ఆర్బీఐ భారీ ప్యాకేజీ) చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్డౌన్ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతించిన చిదంబరం, పేదలు, వలస, రోజువారీ కార్మికుల జీవనోపాధి, మనుగడపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించేముందు ప్రధాని మోదీ పేదల జీవనంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.ఈ సంక్షోభ సమయంలో పేదలకు కనీస నగదు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, అదే మొదటి ప్రాధాన్యతగా వుండాల్సి వుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన మండి పడ్డారు. డబ్బు, ఆహారం ఉన్నా ప్రభుత్వం పేదలకు కేటాయించడంలో సుముఖత చూపలేదు. దీంతో వారి జీవితాలు, మనుగడ లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీంతో పేదలు 21+19 రోజులు ఆకలితో అలమటిస్తూ లాక్డౌన్ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. నా ప్రియమైన దేశమా శోకించు అని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని నాల్గవసారి జాతికిచ్చిన సందేశంలో కొత్తగా ఏమీలేదని మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు. లాక్డౌన్ సంక్షోభం నుంచి పేదలు ఎలా బయటపడతారనే దాని గురించి ప్రధాని ఏమీ చెప్పలేదు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన ఆర్థిక సాయంపై ఎలాంటి స్పందన లేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా జోడించలేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన చర్యలేవీ మోదీ ప్రస్తావించలేదని నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం, కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు రుణాలు ఇవ్వాలని చిదంబరం సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా, జీన్ డ్రేజ్, ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణుల సలహాలేవీ ప్రధాని చెవికి చేరకపోవడం శోచనీయమన్నారు. (కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పౌరులు సహకరించి క్రమశిక్షణను కొనసాగిస్తేనే కోవిడ్-19 వ్యతిరేక పోరాటం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) The poor have been left to fend for themselves for 21+19 days, including practically soliciting food. There is money, there is food, but the government will not release either money or food. Cry, my beloved country. — P. Chidambaram (@PChidambaram_IN) April 14, 2020 -
కస్సుబుస్సంటున్న ఖుష్బు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రానికే పరిమతం కాలేదు. తమిళనాడుకు సైతం గెలుపోటముల ఫలితాల సెగలు తాకాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యల కలకలం సృష్టించాయి. కేజ్రీవాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ సమాయత్తం అవుతున్నారు. ఈమేరకు పరోక్షంగా ట్వీట్ కూడా చేశారు. (చదవండి: చిదంబరంజీ.. మన దుకాణం మూసేద్దాం..!) గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్ పార్టీ 4 శాతం ఓట్లను సాధించింది. కనీసం ఒక్కసీటును కూడా గెలవకున్నా ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించగలిగింది. 11 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో అతిపెద్దపార్టీగా గుర్తింపుపొందింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆప్ సాధించిన విజయాలను తలచుకుంటూ కమల్‌హాసన్ జోరుపెంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీని మట్టికరిపించి ఆప్ ఆమోఘ విజయం సాధించడం కమల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికలను ఢీకొనాలని ఆయన ఆశిస్తున్నారు. మొత్తం 234 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ఇటీవల క్షేత్రస్థాయి నియామకాలతో పార్టీని బలోపేతం చేశారు. ఈనెల 21న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున ఎన్నికల బృందాన్ని ప్రకటిస్తారు. ఆ తరువాత నుంచి ఎన్నికల ప్రచార పర్యటనల్లోకి దిగుతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పనులను ప్రారంభించనున్నారు. అలాగే మొత్తం 234 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు సన్నద్దులు అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాలను అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయాన్ని అందుకునేందుకు మీరు మార్గం చూపారు. పార్టీ స్థాపనకు ముందుగానే కేజ్రీవాల్‌ను కలిసిన కమల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన బాణీని ఆచరణలో పెట్టి గెలుపు గుర్రం ఎక్కాలని తహతహలాడుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ఆమోఘ విజయం సాధించింది, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు చోటుచేసుకోవాలని ఆశిస్తున్నట్లు మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఢిల్లీ నుంచి మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కమల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలతో అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీని మట్టికరిపించి ఆప్ ఘనవిజయం సాధించింది, అవే పరిణామాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆశిస్తున్నారా అనే ప్రశ్నకు ‘ఖచ్చితంగా’ తమిళనాడులో కూడా జరగాలని కోరుకుంటున్నానని బదులిచ్చారు. రజనీతో రాజీ యత్నాలు.. కమల్ రాజకీయాల్లోకి దిగి పార్టీని స్థాపించారు. రాజకీయ ప్రవేశం చేసిన రజనీకాంత్ పార్టీని స్థాపించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే తరచూ రాజకీయపరిణామాలపై స్పందిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వెండితెరపైనే కాదు రాజకీయతెరపై కూడా వారిద్దరివి భిన్నధృవాలుగా సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా చాలా తేడాలున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. పౌరసత్వ చట్టంపై కమల్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రజనీ పరోక్ష మద్దతుదారుగా వ్యవహరిస్తుండగా, కమల్ తీవ్రవ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాబోయే ఎన్నికల్లో కమల్, రజనీ ఏకం కావాలనే అభిప్రాయం ఇటీవల బయలుదేరింది. సిద్ధాంతాలపరంగా ఎంతమాత్రం పొసగని రజనీ, కమల్ ఎలా ఎకం అవుతారనే వాదన కూడా వినిపిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకేలను ధీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే ఇద్దరూ ఏకమై ఎన్నికల బరిలో దిగకతప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ దశలో కొందరు రజనీ, కమల్ మధ్య రాజకీయ రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారు. ఖుష్బు కస్సుబుస్సు.. కాంగ్రెస్ పార్టీతీరు ఏమాత్రం బాగోలేదు, అందుకే ఢిల్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటి ఖుష్బు ట్విటర్ ద్వారా విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఏదో మాయాజాలం జరుగుతుందని ఎంతమాత్రం ఎదురుచూడలేదు, కాంగ్రెస్ పార్టీ మరలా పతనమైంది. మేము ప్రజలనాడికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా, సరైన మార్గంలో పయనిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే లేదనే బదులువస్తోంది. పార్టీకి పునర్వైభవం కోసం ఇప్పటి నుంచే శ్రమించాలి, ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ చేయలేము. క్షేత్రస్థాయి ఉంచి అధిష్టానం వరకు అనేక విషయాలపై సంస్కరించాలి. నీవు కోరే మార్పును నీతోనే ప్రారంభించు అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలు ఇపుడు అనుసరణీయం. భయాల నుంచి బయటకు రావాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. చిదంబరం వ్యాఖ్యల చిచ్చు.. బీజేపీ ఓటమికి కారణమైన ఆప్‌ను అభినందిస్తున్నానని చిందబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణమైనాయి. కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయానికి చింతించకుండా ఆమ్ ఆద్మీపార్టీ గెలుపును అభినందించడమా అంటూ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరంపై మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు షర్మిష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కారణాలపై విశ్లేషించుకోవాల్సిన తరుణంలో చిదంబరం మాటలు ఏమిటని నిలదీశారు. పార్టీ నేతలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. -
ఇది జాలి లేని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసమర్థమైందే గాక... పేదల వ్యతిరేకమైందని, జాలిలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ధ్వజమెత్తారు. వారం రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకూ నిధులు తక్కువగా కేటాయిం చడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మఫ్కమ్ ఝా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ‘కేంద్ర బడ్జెట్.. ఆర్థిక పరిస్థితి’’అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూ ముంగిట్లోకి చేరిందని, ఈ విషయాన్ని అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. బడ్జెట్లో దేశ ఆర్థిక స్థితి ఏమిటన్నది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పలేకపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు 8.2%గా ఉన్న స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో చేరేందుకు డిమాండ్ లేమి ఒక కారణమైతే... పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం రెండో కారణమని చిదంబరం అన్నారు. గత కొన్నేళ్లలో ఆటోమొబైల్ రంగంలోనే 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 296 వర్క్‌షాపులు మూతపడ్డాయన్నారు. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జీఎస్టీ, డీఆర్ఐ వంటి సంస్థల్లో తక్కువ స్థాయి అధికారులకూ విచక్షణాధికారాలు కట్టబెట్టడంతో కంపెనీలు వేధింపులు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సామాజిక కార్యకర్త డాక్టర్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలు మరింత పేదరికంలోకి.. గతేడాది బడ్జెట్లో అంచనాలు... పెట్టిన ఖర్చుల్లో భారీ అంతరం ఉందని, పన్ను వసూళ్లలో రూ.లక్ష కోట్ల వరకూ తగ్గుదల ఉంటే.. పెట్టిన ఖర్చు కూడా రూ.లక్ష కోట్ల వరకూ తక్కువగా ఉండటాన్ని మాజీ ఆర్థిక మంత్రి వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ వసూళ్లు రూ.లక్షల కోట్లు తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలని చిదంబరం తెలిపారు. వ్యవసాయానికి, ఆహార సబ్సిడీ నిధుల్లో కోత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని పేదలు మరింత పేదరికంలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు. -
రజనీకాంత్ అసలు రాజకీయం ఇదీ!
సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు, హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ, రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్పీఆర్ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు. చదవండి :సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు Disappointed with Mr.Rajnikanth’s statement on CAA. If he had asked me, I would’ve explained to him why the CAA is discriminatory and violates Art 14 of the Constitution. — P. Chidambaram (@PChidambaram_IN) February 5, 2020 -
బడ్జెట్ ప్రసంగం.. నాకేదీ గుర్తు లేదు!
న్యూఢిల్లీ : బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యంగంగా స్పందించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రేటింగ్ ఇవ్వమని విలేకర్లు అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. మీరు బడ్జెట్‌కు 1 నుంచి 10 వరకు ఎంత రేటింగ్ ఇస్తారన్న ప్రశ్నకు.. 1,0.. ఈ రెండు నెంబర్లలో ఏదైనా తీసుకోవచ్చంటూ సమాధానమిచ్చారు. అనంతరం బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ..160 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో తనకు ఏదీ గుర్తు లేదని అన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, గత ఆరు త్రైమాసికాలలో వృద్ధి రేటు క్షీణించిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంత సుధీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని తాను వినలేదంటూ ఎద్దేవా చేశారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
మళ్లీ ఈడీ ముందుకు చిదంబరం..
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంను ఏవియేషన్ స్కామ్‌కు సంబంధించి ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. ఆరు గంటల పాటు ఈడీ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి 2019 ఆగస్ట్ 23న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ చిదంబరానికి గతంలో సమన్లు జారీ చేయగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్ట్ 20న సీబీఐ ఆయనను అరెస్ట్ చేయడంతో హాజరు కాలేకపోయారు. ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో సంబంధిత ఫైల్‌కు పీ చిదంబరం ఆమోదం తెలిపారని తేలడంతో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 2009లో ఎయిర్‌బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయాలనే కాంట్రాక్టును పీ చిదంబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌ను భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముందుకు పంపినప్పుడు సదరు కంపెనీ శిక్షణా సదుపాయాలు, నిర్వహణ, మరమ్మత్తుల (ఎంఆర్ఓ) కేంద్రాలు అభివృద్ధి చేయాలనే షరతులను చేర్చి కొనుగోలు ఆర్డర్లో మాత్రం ఆ క్లాజ్‌ను తొలగించినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. -
జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం
న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ కేవలం 21 స్థానాల్లోనే ముందంజలో ఉంది. దీంతో కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీయే ప్రతిపక్షాలు జార్ఖండ్ ఫలితాలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్సీపీలు స్పందించగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం స్పందించారు. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అధికార పీఠాన్ని చేజిక్కిచుకోనున్న క్రమంలో బీజేపీపై చిదంబరం విమర్శలు గుప్పించారు. (సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!) ‘నరేంద్ర మోదీ, అమిత్ షా పాలనను మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రజలు తిరస్కరించారు. హర్యానాలో కూడా స్వల్ప మెజార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ బీజేపీ 2019 కథ. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్‌తో ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి ముందుకు రావాలి. బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడటం ఖాయం’ అని ట్వీట్ చేశారు.(జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం) ఇక ఇదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన,ఎన్సీపీ స్పందించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతోందని, వీటికి జార్ఖండ్ ఫలితాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాయి. ప్రధాని, అమిత్ షా, అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచి పెట్టారని, ప్రజాస్వామ్యం గెలిచిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. అమిత్ షా నేతృత్వంలోని పార్టీని గిరిజనులు, పేద ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. -
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే మిత్రపక్షాలు భారీ ర్యాలీ
-
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఈజ్ బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం సుప్రీంకోర్టులో లాయర్‌గా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఐఎన్‌ఎక్స్‌మీడియా కేసులో బెయిల్ లభించిన అనంతరం తన న్యాయవాద వృత్తిలో తిరిగి కొనసాగనున్నారు. బుదవారం ముంబైకి చెందిన గృహహింస కేసులో న్యాయవాదిగా ఆయన సుప్రీంకోర్టులో కనిపించారు. సీనియర్ న్యాయవాదులు, పార్టీ సహచరులు, తోటి రాజ్యసభ ఎంపీలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తో కలిసి ఆయన చీఫ్ జస్టిస్ కోర్టుకు హాజరయ్యారు కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో 106 రోజులకు గడిపిన ఆయనకు గత వారం (డిసెంబర్ 4) బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజకీయ-ఆర్థికవేత్త చిదంబరం. చెన్నైలయోలా కాలేజీ, మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నైలా కాలేజీల్లో చదువుకున్న చిదంబరంవృత్తిపరంగా న్యాయవాది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీయే కూడా పూర్తి చేశారు. సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లోనూ ఆయన న్యాయవాదిగా పనిచేశారు. చిదంబరం భార్య నళిని కూడా న్యాయవాదే. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన చిదంబరం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. -
రజనీ వస్తే అద్భుతమే : చిదంబరం
సాక్షి, చెన్నై : కథానాయకుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అద్భుతమే అని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వాదుల గళాన్ని నొక్కడమే లక్ష్యంగా బీజేపీ పాలకులు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మోదీ తీవ్ర ద్రోహం తలపెట్టి ఉన్నారని మండిపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శనివారం రాష్ట్రానికి ప్రపథమంగా వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. తొలి రోజు చెన్నైలో ఉన్న చిదంబరం ఆదివారం తిరుచ్చి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. పూల మాలల ధర కన్నా, ఉల్లి ధరే అధికంగా ఉందని చాటే దిశగా పలువురు అభిమానులు ఉల్లితో సిద్ధం చేసిన మాలను ఆయనకు అందజేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా చిదంబరం మీడియాతో మాట్లాడారు. దేశంలో 30 కోట్ల మంది ప్రజలు పూట గడవలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు వారీ కూలీలు, పనులు చేసుకుంటున్న వీరి జీవితాల్ని దెబ్బ తీయడమే కాకుండా, పూట గడవనీయకుండా కేంద్ర పాలకులు ఉన్నారని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాల కారణంగా ఆర్థిక ప్రభావం అన్నది పెరిగిందని ధ్వజమెత్తారు. రిజర్వు బ్యాంక్‌ను సైతం బెదిరించి కోట్లు రాబట్టుకుని, దానిని కార్పొరేట్ సంస్థలకు రాయితీలుగా ఇచ్చే పనిలో పడ్డారని మండి పడ్డారు. జీఎస్టీ అన్నది క్రమంగా పెరగడం ఖాయమన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీ 8 శాతానికి, 8 శాతం 12 శాతానికి, 12 శాతం నుంచి 18 శాతానికి పెరగడం ఖాయమని వివరించారు. ప్రజల వద్ద జీఎస్టీ పేరుతో దోసుకుని కార్పొరేట్ సంస్థలకు ఆపన్నంగా రాయితీలు కట్టబెట్టనున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు వేసిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ద్రోహం తలబెట్టి ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టారని, తాను ఏ మాత్రం డీలా పడలేదని, కామరాజర్, వివోసి వంటి వారు జైలు జీవితం గడిపి ఉన్నారని గుర్తుచేశారు. ప్రజా స్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వాదుల గళాన్ని నొక్కేయడం లక్ష్యంగా కేంద్రం ముందుకుసాగుతున్నదని, ఎన్ని కుట్రలు చేసినా తన గళం మరింతగా ప్రతిధ్వనిస్తుందన్నారు. ఈసందర్భంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మార్పు తధ్యమా..? అని ప్రశ్నించగా, ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఆయన వస్తే అద్భుతం జరుగుతుందా..? అని ప్రశ్నించగా, ఆయన వస్తే అద్భుతమే అని వ్యాఖ్యానించారు. -
లోక్‌సభనూ తాకిన ఉల్లి ఘాటు
న్యూఢిల్లీ: ఉల్లి కొయ్యకుండానే కంట కన్నీరు తెప్పిస్తోంది. నిరుపేదలకు ఏమున్నా లేకపోయినా గంజన్నం, ఉల్లిపాయ ముక్క ఉంటే చాలు. అదే పంచభక్ష్య పరమాన్నాలతో సమానం. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో ఏకంగా రూ.150 కి చేరుకుంది. దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ జీరో అవర్‌లో ఉల్లిపాయ ధరల అంశాన్ని లేవనెత్తారు. అక్రమ నిల్వల కారణంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, అ«దీర్ చౌదరి, గౌరవ్ గొగోయ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉల్లి ధరలపై నిరసనకు దిగారు. నిరుపేదలు నిత్యం ఆహారంలో వాడే ఉల్లి ధరల్ని తగ్గించడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. నేను ఉల్లిపాయలు ఎక్కువగా తినను: నిర్మలా సీతారామన్ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి ధరల్ని ప్రస్తావిస్తూ ఒక ఎంపీ మీరు ఉల్లిపాయలు తింటారా అన్న ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ‘నేను ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినను. అందుకే ఎవరూ పెద్దగా విచారించాల్సిన పని లేదు’ అని అన్నారు. దీంతో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆమె తనను తాను సరిదిద్దుకొని ఉల్లి ధరలకు కేంద్రం పలు చర్యలు తీసుకుందని, ఎగుమతులకు అడ్డుకట్టవేసి దిగుమతుల్ని పెంచుతోందని వెల్లడించారు. టర్కీ, ఈజిప్టుల నుంచి కేంద్రం ఉల్లిపాయల్ని దిగుమతి చేస్తోందని తెలిపారు. సీతారామన్‌పై సెటైర్లు సీతారామన్ ఉల్లిపాయలకు బదులుగా అవకాడోలు తింటారా అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నిస్తే అటు సామాజిక మాధ్యమాల్లోనూ సెటైర్లు హోరెత్తిపోతున్నాయి. ట్విట్టర్లో ఉల్లి ధరలు 9,793 ట్వీట్లతో ట్రెండింగ్‌లో ఉంటే, అందులో నిర్మలా సీతారామన్ హ్యాష్‌ట్యాగ్‌తో 7,990 ట్వీట్లు ఉన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అని అంటే , నేను గాలి అంతగా పీల్చను అని మీరు సమాధానమిస్తారా అంటూ కేంద్ర మంత్రిపై నెటిజన్లు వ్యంగ్యా్రస్తాలు విసురుతున్నారు. మార్కెట్లో అమెరికా డాలర్ కంటే శక్తిమంతమైనది భారత్‌లో ఉల్లిపాయే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తిపోతున్నాయి. పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీలు కట్! పార్లమెంటు క్యాంటీన్లలో రాయితీలతో కూడిన ఆహార పదార్థాలకు మంగళం పాడేయనున్నారు. భారీ సబ్సిడీలతో క్యాంటీన్లను నడపడం సరికాదన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచనకు దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారు అంగీకరించడంతో సబ్సిడీ ఆహారానికి త్వరలో తెరపడనుంది. ఫలితంగా ఏడాదికి సుమారు రూ. 17 కోట్లు ఆదాకానుందని అధికారులు తెలిపారు. సబ్సిడీల ఎత్తివేత నిర్ణయం అమల్లోకి వస్తే చాలా వరకూ ఆహార పదార్థాల ధరలు ఇప్పుడున్న దానికి రెట్టింపు కావచ్చు. -
మహా సంకీర్ణానికి చిదంబరం సలహా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దాదాపు 100 రోజుల నుంచి తిహార్ జైలులో గడుపుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మహారాష్ట్రలో కొలువుతీరనున్న సంకీర్ణ సర్కార్‌కు కీలక సూచన చేశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కార్ ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టాలని కోరారు. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రైతు సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా శిశుసంక్షేమం వంటి ప్రజా ప్రయోజనాలపై మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు జైలులో తనను కలిసిన కొద్దిసేపటి తర్వాత చిదంబరం ఈ మేరకు ట్వీట్ చేశారు. -
చిదంబరం బెయిల్: ఈడీకి సుప్రీం నోటీసులు
సాక్షి, ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్‌నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం వేసిన పిటిషన్‌పై స్పందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి బుధవారం సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిదంబరం చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నవంబర్ 25 లోగా తమ స్పందన దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపారు. జస్టిస్ ఎఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని నవంబర్ 26కు వాయిదా వేసింది. మూడు నెలల పాటు కస్టడీలో ఉన్నందున చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు విన్నవించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న చిదంబరం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో చిదంబరం కీలక పాత్ర పోషించినట్టు కోర్టు అభిప్రాయపడింది. దీనిపై చిదంబరం సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. చదవండి : చిదంబరానికి స్వల్ప ఊరట -
ఇవేం ద్వంద్వ ప్రమాణాలు?
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైలులో నిర్బంధంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా అనుమతించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ కోరడాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ జైల్లో ఉన్న చిదంబరంను విడుదల చేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. వెంటనే స్పందించిన విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వం ప్రమాణాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వ హయాంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో అక్రమంగా 16నెలలపాటు నిర్బంధించారని, అపుడు ఇదే చిదంబరం యూపీయే ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉండి సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్‌కు బెయిల్ రానీయకుండా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కనీసం పార్లమెంటు సమావేశాలకు హాజరుకానీయాలని కోరినా అదే సీబీఐని అడ్డుపెట్టుకుని హాజరుకానీయకుండా చేసిన చరిత్ర చిదంబరానిది, కాంగ్రెస్ పార్టీదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చరిత్ర ఉన్న చిదంబరాన్ని ఇపుడు పార్లమెంటు సమావేశాలకు హాజరుకానీయాలంటూ కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని అఖిలపక్ష సమావేశంలో తాము స్పష్టంచేశామని ఆయన విలేకరులకు వివరించారు. కాగా, ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని వ్యాఖ్యానించారని విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చిదంబరంను నవంబర్ 13 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. మరోవైపు చిదంబరం రిమాండ్‌ను మరొక రోజు పొడిగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. కాగా చిదంబరంను ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఈనెల 24న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. చిదంబరం కస్టడీ సమయంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరిన క్రమంలో విచారణ అసంపూర్తిగా సాగిందని, ఆయనను మరో రోజు తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న చిదంబరానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
ఈడీ కస్టడీకి చిదంబరం
-
ఇక ఈడీ కస్టడీకి చిదంబరం!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులోని నగదు అక్రమ చలామణికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న చిదంబరంను విచారించేందుకు, అవసరమైతే అరెస్ట్ చేసేందుకు ఈడీకి స్థానిక కోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది. చిదంబరంను బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి విచారించేందుకు జైల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఆదేశించారు. 55 రోజులుగా, ఆగస్టు 21 నుంచి, సీబీఐ, జ్యుడీషియల్ కస్టడీల్లోనే చిదంబరం ఉన్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. కోర్టు ఆవరణలోనే చిదంబరంను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ మహాజన్ కోర్టును కోరారు. అయితే, ఆయన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, బహిరంగంగా విచారించడం, అరెస్ట్ చేయడం సరికాదని జడ్జి తెలిపారు. సీబీఐ నన్ను అవమానిస్తోంది: చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ విచారిస్తున్న మరో కేసులో నిందితుడిగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అవమానపరిచేందుకే సీబీఐ కస్టడీ కోరుతోందని ఆరోపించారు. చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్విలు వాదించారు. జస్టిస్ ఆర్ బానుమతి నేతృత్వంలో సుప్రీం బెంచ్ ఎదుట వాదనలు వినిపించిన లాయర్లు ఈ కేసులో అంశాలన్నీ చిదంబరానికే అనుకూలంగా ఉన్నప్పటికీ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను గతంలో ఢిల్లీ హైకోర్టు విచారించినప్పుడు మూడు అంశాలపైనే సీబీఐ పదే పదే వాదించింది. అయితే విదేశాలకు వెళ్లిపోవడం, సాక్ష్యాలను తారుమారు చేస్తారు అనే విషయాల్లో సీబీఐ వ్యక్తం చేసిన అనుమానాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై బదులివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు శుక్రవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ హృషీకేష్ రాయ్‌ల నేతృత్వంలోని సుప్రీం బెంచ్ సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను బదులివ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన చిదంబరం ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ కింద తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ సెప్టెంబర్ 30న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అవినీతి కేసులో ఆగస్ట్ 21న అరెస్టయినప్పటి నుంచి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి 2017లో చిదంబరంపై ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. -
చిదంబరానికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. -
బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకటన వెలువడగానే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, నాయకులు ఆర్భాటం చేయడం సహజం. కానీ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసారి ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై దాడులకు పాల్పడుతూ వారికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా కేంద్రంలోని బీజేపీ కుట్రగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అవినీతిపరులను వదిలేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. వెరసి దేశంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార, విపక్ష విమర్శలు, ఆరోపణలకు ఈడీ ప్రధాన కేంద్రంగా మారింది. దీంతో తమపై రాజకీయ కక్షసారింపు కోసమే కేంద్రం ఈడీ అనే అస్త్రంను ప్రయోగిస్తోందని విపక్ష పార్టీల సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్దల చుట్టూ కేసుల ఉచ్చులే.. ఈడీ దాడులతో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌లు జైలులో ఉండగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై ఈడీ ఉచ్చు బిగుసుకుంది. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. దీనిపై ఆయన్ను త్వరలోనే విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పవార్‌పై ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ.. వేధిస్తున్నారని విపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. తాజాగా పవర్‌కు మద్దతుగా బీజేపీ మిత్ర పక్షం శివసేన కూడా స్వరం వినిపించింది. ఈ కుంభకోణంలో పవార్ తప్పేమీలేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అయితే పవార్‌ను కేసులో ఇరికించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీని వెనక ప్రధాన పాత్ర పోషించారని విమర్శిస్తోంది. అయితే అమిత్ షా రెండు రోజుల పర్యటన ముగిసిన తెల్లారే పవార్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. మరో కీలక నేత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎన్ఎన్ఎస్పీ) చీఫ్ రాజ్‌ఠాక్రేకు కూడా ఓ కేసు నిమిత్తం ఈడీ నోటీసు జారీ చేసింది. మరోవైపు కర్ణాకటలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌కు కఠిన పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో నెగ్గడం బీజేపీకి ఎంతో అవసరం. దీంతో సీనియర్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆగమేఘాల మీద ఈడీ శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ దాడి అనంతరం శివకుమార్ వద్ద రూ.300 కోట్లకు పైగా లెక్కలు చూపని ఆస్తి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మరోక్షణం ఆలస్యం చేయకుండా అతన్ని జైలుకు పంపింది. ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్యనూ ఈడీ విచారించింది. దీంతో ఎన్నికలను కొంత సునాయాసంగా ఎదుర్కొవచ్చని బీజేపీ భావిస్తోన్నట్లు హస్తం నేతలు విమర్శ. డీకే అరెస్ట్‌పై కన్నడ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనను టార్గెట్ చేశారని హస్తం నేతలు మండిపడుతున్నారు. వీడని వాద్రా కేసులు.. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రకటన వెలువడింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వెలువడటంతో కేసు విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన ఆయనను ఏ క్షణమైన ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా బికనీర్ భూముల కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడాని కూడా ఈడీ వదల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా భూలావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఆయన ఇదివరకే ఈడీ నుంచి నోటీసులను కూడా అందుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల జరుగుతుండటంలో అధికార బీజేపీకి ఆయనపై ఉన్న కేసులే ప్రధాన అస్త్రంగా మారాయి. ఇక చిదంబరం అరెస్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. కీలకమైన ఎన్నికలు, దేశంలో ఆర్థిక సంక్షోభం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఆయన్ని జైలుకు పంపారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. -
‘చిదంబరం ఆధారాలు మాయం చేశారు’
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చిదంబరం తరఫున కపిల్ సిబల్, సీబీఐ తరఫున తుషార్ మెహర్ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా.... ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాను చిదంబరం కలిశారు అనడానికి సాక్ష్యాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఆయనను కలిసేవారని.. అయితే వారిలో ఇంద్రాణీ ఉన్నారో లేరోనన్న విషయం ఆయనకు గుర్తులేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా... ‘సీబీఐ విచారణలో భాగంగా చిదంబరం ఇంద్రాణి కలిసినట్లు తేలింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారు. రిజిస్టర్‌ను చిదంబరం మాయం చేయించారు’ అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాను చిదంబరాన్ని కలిశానని, ఈ మేరకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఆమె మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ ఇదివరకే కోర్టుకు వెల్లడించింది. -
జైల్లో చిదంబరంతో సోనియా భేటీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సోమవారం కలిశారు. తీహార్ జైలుకు వెళ్లిన సోనియా, మన్మోహన్లు సుమారు అరగంట సేపు ఆయనతో మాట్లాడారు. చిదంబరం ఆరోగ్యం గురించి వాకబు చేసిన ఇద్దరు నేతలు ఆయనపై మోపిన కేసులను రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటామని, పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం, జీఎస్టీ రాయితీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని చిదంబరం, మన్మోహన్ సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. అధికారాన్ని వాడుకోలేదు వ్యక్తిగత లాభం కోసం ఆర్థిక మంత్రి హోదాను వాడుకోలేదని, అధికారులెవరినీ ప్రభావితం చేయలేదని మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. తనకు బెయిల్ ఇవ్వరాదంటూ కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టుకు ఆయన రీజాయిండర్ సమర్పించారు. తనపై ఇప్పటికే లుకౌవుట్ నోటీసు జారీ చేసిన సీబీఐ.. తాను విదేశాలకు పారిపోయే అవకాశముందని వాదించడం సరికాదని స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాకు వచ్చిన రూ.305 కోట్ల విదేశీ నిధులు అప్పటి నిబంధనల ప్రకారం 46.216 శాతం పరిమితికి లోబడే ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రజా ధనం ఏదీ ముడిపడి లేదని చెప్పారు. -
జైల్లోని పార్టీ నేతను కలిసిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సోమవారం ఉదయం తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మన్మోహన్ జైల్లో ఉన్న చిదంబరాన్ని పరామర్శించి.. కాసేపు ముచ్చటించారు. చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చిదంబరాన్ని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లాయర్ అయిన చిదంబరం బెయిల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది. -
‘తీహార్ జైల్లోనే చిదంబరం బర్త్‌డే’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం జైలు జీవితం తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తీహార్ జైల్లోనే సోమవారం తన 74వ జన్మదినం జరుపుకోనున్నారు.1945లో తమిళనాడులోని శివగంగ జిల్లా కనదుకథన్‌లో జన్మించిన చిదంబరం సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈనెల 19 వరకూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, చిదంబరం బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు ఈనెల 23న విచారించనుంది. ఈ కేసులో చిదంబరంను సెప్టెంబర్ 5న కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. నాటకీయ పరిణామాల మధ్య చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్ట్ 21న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ 305 కోట్ల విదేశీ నిధులకు ఆయన నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో చిదంబరంపై ఈడీ కూడా మనీ ల్యాండరింగ్ కేసును దాఖలు చేసింది. -
సరెండర్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
-
చిదంబరానికి సాధారణ ఆహారమే ...
న్యూఢిల్లీ : ఐన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంకు సాధారణ ఆహారమే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనకు ఇంటి ఆహారం అందించాలని న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. అయితే ఆ అభ్యర్థనను జస్టిస్ సురేశ్ కుమార్ ఖైత్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ వాదిస్తూ చిదంబరం వయస్సు 74 ఏళ్లు అని, ఆయన వయసును దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇంతలో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకొని.. చిదంబరం కంటే పెద్ద వయస్కుడైన ఇండియన్ నేషనల్ లోక్‌దల్ నాయకుడైన ఓంప్రకాశ్ చౌతాలాకు కూడా సాధారణ ఆహారమే ఇస్తున్నామని గుర్తుచేశారు. జైలులో ప్రతీఒక్కరిని సమానంగా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం చిదంబరంపై వస్తున్న ఆరోపణలకు ఏడేళ్ల కారాగారా శిక్షకు మాత్రమే అర్హుడని.. కానీ ఈ ఆరోపణలతో ఆయనకు ఏమాత్రం సంబంధం లేదని కపిల్ సిబల్ వాదించారు. ''ఈ కేసు ప్రీఛార్జ్‌షీట్ దశలో ఉంది. ఆగస్టు 21న పిటీషనర్ ఈ కేసులో అరెస్టయ్యారు. 2007లో జరిగిన ఐన్‌ఎఎక్స్ కేసులో చిదంబరంకు సంబంధం ఉందని'' తుషార్ మెహతా తిప్పికొట్టారు. ఇంతలో కోర్టు కలగజేసుకొని సెప్టెంబరు 5న అరెస్టైన చిదంబరంకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని ఇంత ఆలస్యంగా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఆ విషయాన్ని తెలిపేలోగానే కోర్టుకు మధ్యంతర సెలవులు వచ్చాయని కపిల్ సమాధానమిచ్చారు. అన్ని వాదనలు విన్న కోర్టు ఈ వ్యవహారంలో సీబీఐ స్సందించాలని కోరింది. కాగా, తదుపరి విచారణను సెప్టెంబర్ 23 కు వాయిదా వేసింది.(చదవండి : తీహార్ జైలుకు చిదంబరం) -
‘ఆ అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో నిర్బంధంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ఈ కేసులో ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎవరూ ఎందుకు అరెస్ట్ కాలేదని ప్రశ్నించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సంబంధిత ఫైళ్లను ప్రాసెస్ చేసి తనకు సిఫార్సు చేసిన డజను మంది అధికారులను అరెస్ట్ చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని తనను పలువురు ప్రశ్నిస్తున్నారని చిదంబరం ట్వీట్ చేశారు. తన తరపున ఈ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయాలని కుటుంబ సభ్యులను కోరుతూ చిదంబరం ట్వీట్ చేశారు. ఈ కేసులో చివరి సంతకం మీరు చేయగా, మిగిలిన ప్రక్రియను నడిపించిన అధికారులను ఎందుకు విడిచిపెట్టారని అడిగే వారికి తన వద్ద సమాధానం లేదని చెప్పుకొచ్చారు. ఏ అధికారీ తప్పు చేయలేదు..ఎవరినీ అరెస్ట్ చేయాలని తాను కోరుకోవడం లేదని చిదంబరం మరో ట్వీట్ చేశారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సెప్టెంబర్ 6న అరెస్ట్ అయిన చిదంబరంను జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం తిహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి బెయిల్
-
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంలో చిదంబరానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మనీల్యాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. కాగా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం స్వేచ్ఛగా ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. -
ఐఎన్ఎక్స్ మీడియా కేసు : చిదంబరానికి ఊరట
-
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 5వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది. చిదంబరంను ఇప్పుడే తీహార్ జైలుకు తరలించరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు పేర్కొంది. అరెస్ట్ వారెంట్‌కు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను ఈనెల 5న విచారణకు చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం తదుపరి కస్టడీ అవసరం లేదని, ఆయనను జ్యడిషియల్ కస్టడీ కింద తీహార్ జైలుకు తరలించాలని సీబీఐ వాదించింది. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సవాల్ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 5న విచారిస్తామని జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బొపన్నలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. దిగువ కోర్టుల అధికార పరిధిలో తాము జోక్యం చేసుకోరాదని తాము గుర్తెరిగామని వ్యాఖ్యానించింది. -
చిదంబరానికి స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వయసు రీత్యా తీహార్ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ విషయాన్ని ట్రయల్ కోర్టులో ప్రస్తావించాలని సూచించింది. సిబల్ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది. విదేశీ పెట్టుబడులను ఐఎన్ఎక్స్ మీడియాలోకి తరలించారనే ఆరోపణలతో చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా స్థాపకులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు తన కూతురు షీనా బోరా హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని వచ్చే సోమవారం పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తునట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు. -
చిదంబరంపై లై డిటెక్టర్ పరీక్షలు..?
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంపై లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతిని కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవినీతి కేసులో ఈనెల 30వరకూ సీబీఐ కస్టడీలో ఉండేందుకు కోర్టు అనుమతించడంతో దర్యాప్తు అధికారులు ఆయనను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా తాము అడిగే ప్రశ్నలకు చిదంబరం స్పష్టంగా సమాధానం ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు చిదంబరం, ఇంద్రాణి ముఖర్జీలను ఎదురెదుగా ఉంచి ముఖాముఖి ప్రశ్నించేందుకు కూడా సీబీఐ అధికారులు కోర్టు అనుమతిని కోరవచ్చని భావిస్తున్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలని కోరుతూ చిదంబరం అప్పీల్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. మంగళవారం వరకూ చిదంబరంను అరెస్ట్ చేయరాదని ఈడీని సుప్రీం కోర్టు కోరింది. -
చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో నాలుగు రోజులు పొడగిస్తూ చిదంబరానికి మళ్లీ షాకిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు కస్టడీని పొగడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. (చదవండి : చిదంబరానికి సుప్రీం షాక్) మరోవైపు సర్వోన్నత న్యాయస్ధానంలో కూడా చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. (చదవండి : చిదంబరం అరెస్ట్) -
చిదంబరానికి సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సర్వోన్నత న్యాయస్ధానంలో ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. చిదంబరంను అరెస్ట్ చేయడం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను సీబీఐ కాలరాసిందని చిదంబరం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. కోర్టు పరిధిలో విచారణ సాగుతున్న క్రమంలో సీబీఐ అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చిదంబరం చేసిన తప్పు ఇదే..
ఇస్లామాబాద్ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భారత తదుపరి ప్రధాని అవుతారని ఓ పాకిస్తాన్ నేత జోస్యం చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని పాక్ సెనేటర్, మాజీ దేశీయాంగ మంత్రి రెహమాన్ మాలిక్ వ్యాఖ్యానించారు. చిదంబరం అరెస్ట్‌ను కశ్మీర్ అంశంతో ఆయన ముడిపెట్టడం గమనార్హం. అణిచివేతకు గురైన కశ్మీరీల తరపున మాట్లాడినందుకే చిదంబరంను వేధిస్తున్నారని మాలిక్ చెప్పుకొచ్చారు. చిదంబరం తదుపరి భారత ప్రధాని అని..ఆయన ఎంతో సామర్ధ్యం కలిగిన రాజకీయ నేతని మాలిక్ కొనియాడటం విశేషం. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు నిర్ణయంపై మోదీ సర్కార్‌ను ప్రశ్నించడమే చిదంబరం చేసిన తప్పని పాక్ పత్రిక ది నేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ముస్లింల ఊచకోతకు ప్రధాని నరేంద్ర మోదీ ఆరెస్సెస్‌కు స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపించారు. కాగా మాలిక్ గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత భావిప్రధానిగా రాహుల్ గాంధీ అని అభివర్ణించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరవగా, అమేథి నియోజకవర్గంలో స్వయంగా రాహుల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పోటీచేసిన రాహుల్ అక్కడి నుంచి గెలుపొంది పరువు నిలుపుకున్నారు. -
చిదంబరం కేసు.. రెండ్రోజుల సంబరమేనా?
శక్తివంతమైన నేతలు వివిధ కేసుల్లో అరెస్టు కావడం, ఆ సమయంలో ప్రజలు ఏదో అద్భుతం జరిగిపోతుందని సంబరపడడం మామూలే. అయితే అలాంటి కేసులన్నీ తాత్కాలికంగా చప్పున వెలిగి తర్వాత ఆనవాలు లేకుండా ఆరిపోవడం జరుగుతున్న చరిత్ర. టూ జీ కుంభకోణమైనా, మరొకటైనా చివరకు జరిగింది మాత్రం ఇదే. యూపీఏ పాలనలో శక్తివంతమైన మంత్రి చిదంబరం తాజా అరెస్టు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియాకు 307 కోట్లరూపాయల నల్ల ధన ప్రవాహం, ఆ డబ్బు ఆయన కుమారుడికే చేరి నట్టు ఒక అవినీతి కేసు. అలాగే ఎయిర్ సెల్ మాక్స్ ఒప్పందాల్లో అడ్డగోలు లబ్ధి చేకూర్చినట్టు తద్వారా ఆయన చేతివాటంపై మరో కేసు. ఈ అవినీతి కేసుల్లో సీబీఐ,ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. గతంలో ఇవే కేసుల్లో ఓ ఇరవై సార్లు ఆయనకు అరెస్టు కాకుండా బెయిల్ దొరికింది కానీ ఈసారి అలా జరగలేదు. ఈ ఉదంతాన్ని కాంగ్రెస్ కక్షసాధింపు అంటుండగా, బీజేపీ తన ప్రమేయం లేదు, ఇది దర్యాప్తు సంస్థల ద్వారా చట్టం తన పని తాను చేసుకుపోవడం మాత్రమే అంటుంది. అయితే ఒక సామాన్యుడిగా ఒక శక్తిమంతుడు అవినీతి కేసులో అరెస్టు కావడాన్ని హర్షించవచ్చు గానీ, అది తాత్కాలికమే. తర్వాత సదరు కేసు అవకాశం బట్టీ నత్త నడక, అవసరం బట్టీ పరుగు నడక పడుతుంది. ఎప్పుడూ స్థిరం గా ఒకే వేగం అన్నది ప్రముఖుల కేసుల్లో ఉండే ప్రసక్తే లేదు. చివరి ఫలితం అన్నది అయితే సాక్ష్యాలు చాలక కొట్టివేయడమో, లేదా దశాబ్దాల తర్వాత దోషిగా నిలబెట్టడమో జరుగుతుంది. అప్పటికి ఆ ప్రముఖుడు ఫలితమేదైనా ఒకే లా తీసుకునే మానసిక స్థితిలో ఉంటాడు. సమాజం ఎటూ మరి చి పోతుంది. ఈ ధోరణి మారాలి. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం అన్ని కేసుల్నీ సమ దృష్టితో చూడాలి. కొన్ని ఇష్టం, కొన్ని కష్టంలా ఉండకూడదు. అంతవరకూ అవి నీతిని కట్టడి చెయ్యడం సాధ్యం కాదు. తాత్కాలిక సంబరాలు తప్ప, అంతిమ విజయాలు లేని అవినీతిపై పోరాటాలివి. డా.డి.వి.జి.శంకరరావు, మాజీఎంపీ, పార్వతీపురం -
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరానికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఆగస్ట్ 26 వరకూ ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోజుకు అరగంట పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. సీబీఐ అధికారులు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరాన్ని హాజరు పరిచారు. ఐఎన్ఎక్స్ మీడియాకు చిదంబరం లాభం చేకూర్చారని న్యాయస్ధానం ఎదుట సీబీఐ వాదించింది. మనీల్యాండరింగ్‌కు ఈ కేసు ఉదాహరణని పేర్కొంది. చిదంబరాన్ని కనీసం ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, బోన్లో కూర్చునేందుకు నిరాకరించిన చిదంబరం వాదనలు జరిగిన ఆసాంతం నిలబడే ఉన్నారు. వాడివేడి వాదనలు కేసు డైరీలో చిదంబరం పాత్ర ఉందని, మరింత లోతైన విచారణ అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున చిదంబరాన్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ఐఎన్ఎక్స్ కేసులో ఆధారాలతో చిదంబరాన్ని కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అడిగిన ఏ ప్రశ్నకూ చిదంబరం సమాధానం ఇవ్వలేదని, విచారణకు ఆయన సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిదంబరం అన్నీ తెలిసే అధికార దుర్వినియోగం చేశారని, ఐఎన్ఎక్స్ మీడియాకు అనుకూలంగా వ్యవహరించారని కోర్టు ఎదుట సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. అరెస్ట్‌పై విస్మయం ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను ఎందుకు అరెస్ట్ చేశారో అర్ధం కావడం లేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీకి ఇప్పటికే బెయిల్ వచ్చిందని రాజకీయ దురుద్దేశంతోనే చిదంబరాన్ని అరెస్ట్ చేశారని సిబల్ వాదించారు. సీబీఐ విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని అన్నారు. సీబీఐ వద్ద ప్రశ్నలు సిద్ధంగా లేవని, కేవలం 12 ప్రశ్నలే అడిగారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్ల తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఎఫ్ఐపీబీలో ఆరుగురు కార్యదర్శులు ఉంటారని, వారే ఐఎన్ఎక్స్లో విదేశీ నిధులకు ఆమోదం తెలిపినా వారిలో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. సీబీఐ ఏదో జరిగిందన్న మాత్రాన అది నిజం కాదని పేర్కొన్నారు.నేరాన్ని అంగీకరించకపోతే సహకరించలేదనడం సరైంది కాదని వాదించారు. సీబీఐ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు. విదేశాల్లో బ్యాంకు ఖాతాల్లేవు : చిదంబరం ఐఎన్ఎక్స్ కేసులో తాను సీబీఐ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చానని, ఈ వ్యవహారంలో తాను ఎవరినీ లంచం అడగలేదని చిదంబరం కోర్టుకు తెలిపారు. తనతో పాటు తన తనయుడి ఖాతాల వివరాలను సీబీఐకి అందచేశానని కోర్టుకు నివేదించారు. తనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు లేవని స్పష్టం చేశారు. ఇక అంతకుముందు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరంను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం చిదంబరంను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖర్షీద్‌లు ఆయనకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిదంబరం భార్య నళిని, కుటుంబ సభ్యులు కోర్టుకు తరలివచ్చారు. కాగా చిదంబరం బెయిల్ పిటిషన్ శుక్రవారం న్యాయస్ధానం ఎదుట విచారణకు రానుంది. -
‘ఇంద్రాణి స్టేట్మెంట్తో చిదంబరానికి చిక్కులు’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అరెస్ట్‌పై సీబీఐ, కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. చిదంబరం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయనను టార్గెట్ చేశారని ఆరోపించింది. చిదంబరంపై నమోదైన ఆరోపణలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని దర్యాప్తు సంస్థ అధికారులను సవాల్ చేసింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను లక్ష్యంగా చేసుకున్న సీబీఐ అధికారులు కార్తీ చిదంబరంపై నాలుగు సార్లు దాడులు చేయడంతో పాటు 20 సార్లకు పైగా సమన్లు జారీ చేసి వేధించారని మండిపడింది. అప్రూవర్‌గా మారి ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ స్టేట్మెంట్పై ఆధారపడి సీబీఐ ఈ కేసులో విచారణ సాగిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా దుయ్యబట్టారు. కుమార్తెను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నమహిళపై విశ్వాసం ఉంచిన సీబీఐ చిదంబరంపై భరోసా లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలున్న మహిళ స్టేట్మెంట్ ఆధారంగా సీనియర్ రాజకీయ నేతను అరెస్ట్ చేశారని పరోక్షంగా ఇంద్రాణి ముఖర్జియాను ప్రస్తావిస్తూ సుర్జీవాలా సీబీఐపై విరుచుకుపడ్డారు. కుమార్తెను హత్య చేసిన కేసులో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైన పీటర్, ఇంద్రాణి ముఖర్జియా దంపతులు 2015 ఆగస్ట్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
అజ్ఞాతం వీడిన చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం బుధవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. చిదంబరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి రావడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాను నిందితుడిని కాదని, చార్జిషీట్లో తన పేరుకూడా లేదని ఆయన చెప్పారు. తనకూ, తన కుమారుడికి ఈ కేసులో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఐఎన్ఎక్స్ కేసులో తన కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేదని చెప్పుకొచ్చారు. నిన్న రాత్రంతా తాను తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ గడిపానని చెప్పారు. మరోవైపు చిదంబరం కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. కాగా, అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. -
ఐఎన్ఎక్స్ కేసు : 20 గంటలుగా అజ్ఞాతంలో చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. -
చిదంబరం నివాసానికి సీబీఐ అధికారులు
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంటి వద్దకు మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకే ఆయన నివాసానికి వచ్చినట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే చిదంబరం ఇంట్లో లేకపోవడంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చిదంబరానికి భారీ షాక్.. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ షాక్ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో అరెస్ట్ అవకుండా ఉండేందుకు చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు అరెస్ట్ అవ్వకుండా చిదంబరంకు రక్షణ కల్పించాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. ఇప్పటికే చిదంబరంను కస్టడీకి కోరుతూ సీబీఐ, ఈడీలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను దర్యాప్తు సంస్థలు తప్పుబట్టాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం ఇలా చేస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. మరోవైపు చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. హైకోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో.. ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. చిదంబరం తరఫు లాయర్లు ఈ రోజే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు. -
‘అవును కశ్మీర్లో పరిస్థితి సాధారణమే.. కానీ’
చెన్నై: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. కశ్మీర్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని ప్రభుత్వం చెపుతున్న విషయాలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణస్థితికి వచ్చాయి. పాఠశాలలూ తెరుచుకున్నాయి. కానీ, విద్యార్థులు లేరు. పరిస్థితులు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. కానీ, ఇంటర్నేట్ సేవలు మరోసారి నిలిపేశారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కానీ మెహబూబా ముఫ్తి ఇంకా నిర్భంధంలోనే ఉన్నారు. మీరు ఇక్కడ ఏం జరుగుతుందోనని ఆలోచిస్తుంటే.. అక్కడ ఇది కొత్త సాధారణ పరిస్థితి అని దయచేసి అర్థం చేసుకోండి’ అని చిదంబరం ట్విటర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కశ్మీర్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా నిర్బంధంలో ఉంచడంపై ఆమె కూతురు ఇల్తిజా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన విషయాలను ప్రస్తావిస్తూ.. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కశ్మీర్ సాధారణంగా ఉందని కేంద్రం చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు సడలించడంతో కశ్మీర్లో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఎక్కడా విద్యార్థులు కనిపించడం లేదు. శ్రీనగర్ పట్టణంలో 190 ప్రాథమిక పాఠశాలలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ గత రెండు రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. -
ప్రధాని మోదీపై చిదంబరం ప్రశంసలు!
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలోని మూడు అంశాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశంసించారు. జనాభా పెరుగుదల భవిష్యత్తు తరాలను ఏ విధంగా నాశనం చేస్తుందో మోదీ వివరించిన విధానం బాగుందన్నారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని చేసిన ఈ మూడు ప్రకటనలను మనమందరం స్వాగతించాలి. చిన్న కుటుంబాలను కలిగి ఉండటమే దేశభక్తి, ప్లాస్టిక్ నిషేధం దిశగా చర్యలు, సంపద సృష్టికర్తలను గౌరవించాలి’’ అన్న మోదీ మాటలను చిదంబరం ట్విటర్లో ఉటంకించారు. కాగా ఎర్రకోటలో తన ప్రసంగంలో భాగంగా జనాభా విస్పోటనం, ప్లాస్టిక్ నిషేదం, సంపద సృష్టి కర్తలను గౌరవించడం తదితర అంశాలపై మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. సంపద సృష్టి గొప్ప జాతీయ సేవ అని మోదీ అన్నారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని, దీనిపై ఆక్టోబర్ 2 నాటికి మార్పు తీసుకు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ మూడు అంశాలపైన ప్రధాని దృక్పథం బాగుందని చిదంబరం కొనియాడారు. మొదటి, చివరి సందేశాలను ఉద్ధేశించి ప్లాస్టిక్ నిషేదం, జనాభా నియంత్రణ అంశంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనికోసం వందలమంది వాలంటీర్లు క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయాలని చిదంబరం సూచించారు. -
చిదంబరంపై విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చిదంబరం భూమికి భారమే తప్ప ఆయన వల్ల దేశానికి ఒరిగేదీమీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. కావేరి నది నీటి వివాదం సహా తమ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను చిదంబరం పరిష్కరించలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో చేసినట్లుగానే తమిళనాడును కేంద్ర భూభాగంగా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, అధికార ఏఐఎడీఎంకె దాన్ని వ్యతిరేకించదా అన్న చిదంబరం విమర్శలకు పత్రిగా పళనిస్వామి ఇలా స్పందించారు. చిదంబరం ఎన్నేళ్లు కేంద్రమంత్రిగా ఉంటే ఏం లాభం? ఆయన ఏయే పథకాలు తీసుకొచ్చారు (ప్రధానంగా తమిళనాడుకు)? దేశానికి ఆయన వల్ల ఏం ఉపయోగం.. భూమిపై భారం తప్ప అని ముఖ్యమంత్రి పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370, 35-ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజనపై కేంద్రంపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో హిందువుల శాతం అధికంగా ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారా అని బీజేపీని ప్రశ్నించారు. ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆర్టికల్ రద్దుకు కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తోందటూ ఈ విమర్శలను బీజేపీ తిప్పి కొట్టింది. -
ఒకవేళ కశ్మీర్లో హిందువులు ఎక్కువగా ఉంటే..
న్యూఢిల్లీ: ఒకవేళ జమ్మూకశ్మీర్‌లో హిందూ ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండి ఉంటే.. బీజేపీ ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని ఎప్పటికీ రద్దు చేసి ఉండేది కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్ ఈ రోజు ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఆర్టికల్ 371 కింద ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఒక్క జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఎందుకు తొలగించారు. ఎందుకంటే ఇది మతమౌఢ్యం కాబట్టి’ అని చిదంబరం బీజేపీపై ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఒకవేళ అక్కడ హిందువుల ఆధిక్యత ఉండి ఉంటే బీజేపీ ఈ నిర్ణయం తీసుకోనేది కాదని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చిదంబరం వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, కేంద్రం నిర్ణయానికి కాంగ్రెస్ మత కోణాన్ని ఆపాదిస్తోందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. దశాబ్దాల కింద కాంగ్రెస్ చేసిన చరిత్రాక తప్పిదాన్ని బీజేపీ ప్రభుత్వం సరిచేసిందని మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి పేర్కొన్నారు. -
సోనియా ఈజ్ బ్యాక్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ పార్టీలో గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. రాహుల్ తర్వాత తదుపరి పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారంటూ సాగిన ఊహాగానాలకూ తెరదించుతూ పార్టీ నూతన అధ్యక్షురాలిగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మరోసారి ఎంపికయ్యారు. రాహుల్ రాజీనామా తర్వాత తాత్కాలిక బాధ్యతలు స్వీకరించేందుకు నో చెప్పిన సోనియా ఎట్టకేలకు ఆ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. తదుపరి చీఫ్‌ను ఎన్నుకునేంత వరకు సోనియా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారని సీడబ్ల్యూసీ రాత్రి 11 గంటలకు తీర్మానం చేసింది. ఏఐసీసీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. తొలుత ఉదయం భేటీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రాత్రికి వాయిదా పడింది. తర్వాత రెండోసారి రాత్రి 9 గంటల సమయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. రాహుల్ రాజీనామా ఆమోదం శనివారం రెండోసారి జరిగిన భేటీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించింది. తర్వాత పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి సోనియాను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత పార్టీ సీనియర్ నేత ఆజాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2017, డిసెంబర్ 16న కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 52 సీట్లకు పరిమితం కావడంతో మే 25న అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. రాహుల్.. థ్యాంక్యూ: సీడబ్ల్యూసీ సీడబ్ల్యూసీ భేటీలో భాగంగా మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామని కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ అందించిన అద్భుతమైన నాయకత్వానికి సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు తెలుపుతోంది. పార్టీని క్రమశిక్షణ, అకింతభావంతో నడిపించారు. తన దూకుడుతో కాంగ్రెస్ యువనాయకత్వానికి రాహుల్ ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు’ అని వెల్లడించారు.కశ్మీర్లో పరిస్థితిపై, రాజకీయ నేతల నిర్బంధం, మీడియాపై ఆంక్షలను ఖండిస్తూ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందాన్ని అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కశ్మీర్‌పై కేంద్రం స్పందించాలి: రాహుల్ సీడబ్ల్యూసీ భేటీకి హాజరైన రాహుల్ గాంధీ సమావేశం కొనసాగుతుండగానే మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతుందో బయటపెట్టాల్సిన బాధ్యత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై ఉంది. అక్కడ భారీ హింస జరుగుతున్నట్లు, శాంతిభద్రతలు దిగజారుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి’ అని తెలిపారు. ఐదు సీడబ్ల్యూసీ బృందాల ఏర్పాటు.. కాంగ్రెస్‌కు పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం విషయమై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలు మన్మోహన్, ప్రియాంక, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, ఆజాద్, చిదంబరం తదితరులు శనివారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ శ్రేణులతో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ భేటీలో అంగీకరించారు. ఇందుకోసం ఈశాన్య, తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఐదు సీడబ్ల్యూసీ బృందాలను నియమించారు. ఈశాన్య సీడబ్ల్యూసీ బృందంలో అహ్మద్ పటేల్, అంబికాసోనీ, మాజీ సీఎం హరీశ్‌రావత్ ఉండగా, తూర్పు సీడబ్ల్యూసీ గ్రూపులో వేణుగోపాల్, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల బృందంలో ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియా, చిదంబరం ఉండగా, పశ్చిమ రాష్ట్రాల సీడబ్ల్యూసీ గ్రూపులో ఆజాద్, ఖర్గే, ఆంటోనీ, మోతీలాల్ వోరా ఉన్నారు. అలాగే దక్షిణ రాష్ట్రాల బృందంలో మన్మోహన్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ సభ్యులుగా ఉన్నారు. ఈ సీడబ్ల్యూసీ బృందాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు జరిపాయి. మెజారిటీ నేతలు మద్దతిచ్చినా.. ఈ సందర్భంగా మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. కొంతమంది నేతలు మాత్రం ప్రియాంక పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్, తెలంగాణ తరఫున ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డిలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సీడబ్ల్యూసీ బృందాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని రాహుల్ తిరస్కరించారు. సంప్రదింపులకు మేం దూరం: సోనియాగాంధీ గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న వాదనలకు తెరపడింది. నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు తాము దూరంగా ఉంటా మని సోనియాగాంధీ తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీకి ముందు ఆమె మీడియాతో మాట్లా డుతూ.. ‘నేను, రాహుల్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశాం. కాబట్టి శనివారం జరిగే సీడబ్ల్యూసీ సంప్రదింపుల సమావేశాలకు హాజరై పార్టీ నేతల అభిప్రాయాలను ప్రభావితం చేయాలనుకోవడం లేదు. అందుకే ఈ అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో మేం పాల్గొనడం లేదు’ అని స్పష్టం చేశారు. సంప్రదింపుల బృందాల్లో తమ పేర్లను పొరపాటున చేర్చిఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ ఏడాదిలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధ్యక్షుడిని ఎంత త్వరగా ఎంపికచేస్తే అంత మంచిదని పార్టీ హైకమాండ్‌కు నేతలు సూచించినట్లు పేర్కొన్నాయి. సోనియా... శక్తిమంతమైన మహిళ అసలు పేరు: సోనియా మైనీ తల్లిదండ్రులు: స్టెఫానో మైనీ, పౌలా ప్రిడెబాన్ జననం: డిసెంబర్ 9, 1946 ( ఇటలీలో) ఉన్నత విద్యాభ్యాసం: కేంబ్రిడ్జి, బ్రిటన్ పెళ్లి: 1968లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సంతానం: రాహుల్, ప్రియాంక 1991లో రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించారు. అనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో 1997లో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగి, 2017లో కొడుకు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండగా పార్టీకి చెందిన ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ (2004– 2014) రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. 1999లో అమేథీ నుంచి, ఆ తర్వాత రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె ప్రత్యక్షంగా ఏ ప్రభుత్వ హోదాలో లేనప్పటికీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. -
రాయని డైరీ
ఆర్టికల్ 370 రద్దు మీద స్టేట్మెంట్ రిలీజ్ చెయ్యడానికి అంతా కూర్చొని ఉన్నాం. గులామ్ నబీ ఆజాద్, పి.చిదంబరం ఆర్టికల్ 370 హిస్టరీ గురించి చెప్పారు. ‘త్రీసెవెంటీ హిస్టరీ మాకు తెలుసు. ప్రెజెంట్ ఏమిటో చెప్పండి’ అన్నారు పంజాబ్ స్టేట్ చీఫ్ సునీల్ జాఖడ్. ఆజాద్ ఆయన వైపు అసహనంగా చూసి, ‘మీరు ప్రెజెంట్‌లోనే ఉన్నారా?’ అని అడిగారు. ‘ప్రెజెంట్‌లోనే ఉన్నాను. ఎట్ ప్రెజెంట్ కాంగ్రెస్‌లోనే ఉన్నాను. చెప్పండి. మీరేం చెబితే అది వినాలని ఉంది’ అన్నారు జాఖడ్. ఆజాద్‌ని ఆగమన్నట్లు చూసి... ‘నేను చెప్పొచ్చా జాఖడ్‌జీ ప్రెజెంట్ ఏమిటో..’ అన్నారు చిదంబరం. ‘ఎవరు చెప్తే ఏంటి? చెప్పాల్సింది చెప్పాలి గానీ’ అన్నట్లు చూశారు జాఖడ్. ‘త్రీసెవెంటీకి ప్రెజెంట్ లేదు. కశ్మీర్‌కు ఫ్యూచర్ లేదు’ అని చెప్పారు చిదంబరం. ‘నేనడిగింది త్రీసెవెంటీ ప్రెజెంటూ, కశ్మీర్ ఫ్యూచరూ కాదు. మన పార్టీ ప్రెజెంట్ ఏమిటని! మన ప్రెజెంట్ ఏమిటో తెలిస్తే, మన ఫ్యూచర్ ఏంటో కూడా తెలుస్తుంది’ అన్నారు జాఖడ్. ఆయనెందుకో సమావేశం మొదలైనప్పట్నుంచీ ఉత్సాహలేమితో బాధపడుతున్నారు. ఆజాద్‌కి ముందే చెప్పాను. ‘సీడబ్ల్యూసీ సమావేశాన్ని నలుగురైదుగురితో కానిచ్చేద్దాం. స్టేట్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు వద్దు’ అని. ‘వాళ్లందర్నీ కలుపుకుంటేనే నలుగురైదుగురు అవుతున్నారు రాహుల్జీ’ అన్నారు ఆయన! ‘త్రీసెవెంటీపై మన స్టాండ్ ఏమిటో ఆల్రెడీ పార్లమెంటులో చెప్పేశాం కదా. పార్లమెంటులో చెప్పాక కూడా, మళ్లీ మనకి మనం మన స్టాండ్ ఏమిటో చెప్పుకోవడం ఏమిటి? చెప్పు కోడానికి ఈ మీటింగ్ ఏమిటి?’’ అన్నారు జాఖడ్. ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, వేణు గోపాల్.. జాఖడ్ వైపు చూశారు. ఆ చూడ్డం నిశితంగా, పరిశీలనగా ఉంది. అంత నిశితంగా ఏం పరిశీలిస్తున్నారు జాఖడ్‌లో! జాఖడ్‌ని చూశాక నా వైపు చూశారు. కాంగ్రెస్‌కు ఎట్టకేలకు ఒక కొత్త అధ్యక్షుడు దొరికాడు అన్నట్లుగా ఉంది వారి చూపు! కాంగ్రెస్‌లో ప్రశ్నించినవాళ్లు పాత అధ్యక్షులు అయినట్లు గుర్తుంది కానీ, కొత్త అధ్యక్షులు అయినట్లు గుర్తు లేదు మరి! ‘పార్లమెంట్లో మన స్టాండ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే జాఖడ్. పార్టీలోని వారికే పార్టీ స్టాండ్ ఏమిటో తెలియాలి. అందుకే ఈ మీటింగ్. మనలోనే కొందరు త్రీసెవెంటీ రద్దును సమర్థిస్తున్నారు. మిగతా కొందరు ఆ సమర్థించే వాళ్లను సమర్థిస్తూ, రద్దును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక పార్టీలో ఉన్నవాళ్లంతా ఒక స్టాండ్ మీద లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మీటింగులు తప్పవు’ అన్నారు ఆంటోనీ. జాఖడ్ ప్రశ్నించడం మానలేదు. ప్రశ్నిం చాలనుకున్న వారందరి ప్రతినిధిగా ఆయన సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చినట్లున్నారు. ‘‘ఇప్పుడీ త్రీసెవంటీ సమావేశం తర్వాత మన రిలీజ్ చెయ్యబోయే స్టేట్మెంట్.. పార్టీలో అంతా ఒకే మాట మీద ఉండాలనా, పార్టీలో ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉన్నా పర్వా లేదనా?’’ అని అడిగారు జాఖడ్. ‘ఎవరికి వారిగా ఉంటూనే అందరూ ఒకే పార్టీగా ఉండాలని రాహుల్ బాబు ఆశిస్తున్నారు’ అని, నా వైపు చూశారు అహ్మద్ పటేల్. ఆయనతో నేనెప్పుడు ఆ మాట అన్నానో నాకు గుర్తుకు రావడం లేదు! ‘‘ఎవరికి వాళ్లుగా ఉండేవాళ్లు ఒకే పార్టీగా గానీ, ఒకే పార్టీలో గానీ ఎందుకు ఉంటారు పటేల్జీ? కన్ఫ్యూజన్లో బీజేపీలోకి వెళ్లిపోతారు’’ అన్నారు జాఖడ్. పార్టీలో డెమోక్రసీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువైనట్లుంది! కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోగానే పార్టీకి డెమోక్రసీ అవసరమా, కన్ఫ్యూజన్ అవసరమా అనే దానిపై తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయించాలి. -
వెళ్లి నియోజకవర్గం మీద శ్రద్ధపెట్టండి!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశాల్లో పర్యటించడానికి పూచీకత్తుగా గతంలో తాను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు సమర్పించిన రూ. 10 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అప్పు తెచ్చి సుప్రీంకోర్టుకు డబ్బు కట్టానని, దానిపై ప్రస్తుతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, కాబట్టి రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలని కార్తీ చిదంబరం అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా.. వెళ్లి తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని కార్తీకి సూచించింది. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి 3లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో కార్తీ చిదంబరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ద్వారా ఇప్పించిన అనుమతుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కార్తీ ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు రూ. 10 కోట్లు పూచీకత్తు చెల్లించి.. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు. -
మోదీజీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉంది..
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మోదీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ తన నమ్మకాలపై ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ‘మోదీ జీ పోరు ముగిసింది. మీ ఖర్మ ఫలం ఎదురు చూస్తోంది. మీలో ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. మా తండ్రి మీద మీరు చేసిన వ్యాఖ్యల ద్వారా మీరేంటో చెబుతున్నాయి. ఇక మిమ్మల్ని ఏవీ కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత... రాహుల్’ అంటూ ట్వీట్ చేశారు. Modi Ji, The battle is over. Your Karma awaits you. Projecting your inner beliefs about yourself onto my father won’t protect you. All my love and a huge hug. Rahul — Rahul Gandhi (@RahulGandhi) 5 May 2019 కాగా ఎన్నికల ప్రచారలంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ర్యాలీలో‘ రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ’ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా మోదీ విమర్శలపై స్పందిస్తూ తన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. రాజీవ్ త్యాగాన్ని కూడా ప్రధాని అవమానిస్తున్నారని ప్రియంక విమర్శించారు. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాగే మోదీ వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి చిదంబరం స్పందిస్తూ.. అసలు మోదీకి ఏమైనా తెలుసా?. రాజీవ్ వచ్చిన ఆరోపణలు నిరధారమంటూ ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం మోదీ తెలుసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, చిదంబరం -
చిదంబరం అధికార దుర్వినియోగం
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) స్కామ్ కేసులో 63 మూన్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా తాను బాధితుడినన్న వాదనను లేవనెత్తారు. దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈకి లబ్ధి కలిగించాలన్న దురుద్దేశంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ఎస్ఈఎల్ దెబ్బితినేలా వ్యవహరించారని ఆరోపించారు. రూ.10వేల కోట్ల పరిహారం కోరుతూ చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేపీ కృష్ణన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్ఎంసీ) మాజీ చైర్మన్ రమేష్ అభిషేక్‌లకు ఈ వారంలోనే 63 మూన్స్ లీగల్ నోటీసులను కూడా పంపించింది. ‘‘ఎన్‌ఎస్‌ఈఎల్‌ను అంతం చేయాలన్న దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు ఇది. ఎక్సేంజ్ విభాగం నుంచి మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర జరిగింది’’ అని జిగ్నేష్ షా మీడియాకు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ దేశంలోనే తొలి కమోడిటీ స్పాట్ ఎక్సేంజ్. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (63మూన్స్ పూర్వపు పేరు) పూర్తి అనుబంధ కంపెనీ ఇది. అయితే, ఇన్వెస్టర్లు బుక్ చేసుకున్న ఆర్డర్లను గోదాముల నుంచి డెలివరీ చేయకపోవడంతో రూ.5,600 కోట్ల మేర అవకతవకలు 2013 జూలై 31న వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ఎస్ఈఎల్ నిలిపివేతకు ఆదేశించింది. ఇదే కేసులో షా 2014 మే నెలలో అరెస్ట్ అయ్యారు. దాంతో దాదాపు అరడజను ఎక్సే్చంజ్లపై ఆయన నియంత్రణ కోల్పోవాల్సి వచ్చింది. ‘‘నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌ను ప్రైవేటు కేసుగా పేర్కొన్నారు. కంపెనీ, వాటాదారుల ద్వారా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుందని ప్రకటించారు. మరి ఎఫ్ఎంసీ ద్వారా ఎందుకు పరిష్కరించలేదు?’’ అని షా సందేహాలు వ్యక్తం చేశారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చిదంబరంను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను అధికారులు దాదాపు 3గంటలపాటు విచారించారు. ఇదే కేసు విషయంలో కొడుకు కార్తిని గురువారం 6గంటలపాటు ప్రశ్నించింది. కార్తికి దేశవిదేశాల్లోని రూ.54 కోట్ల విలువైన ఆస్తులను ఈ కేసులో అటాచ్ చేసింది. 2007లో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను అతిక్రమించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొన్న కార్తి, ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జీపై ఈడీ కేసు పెట్టింది. కార్తి తన పలుకుబడిని ఉపయోగించి ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్‌ఐఎఫ్‌బీ క్లియరెన్స్ ఇప్పించడం కోసం ముడుపులు స్వీరించారనే ఆరోపణలతో సీబీఐ గతేడాది ఫిబ్రవరి 28న ఆయనను అరెస్టు చేసింది. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకి వచ్చారు. -
‘రైల్వే నియామకాల పేరుతో మరో టోకరా’
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల్లో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం పెదవివిరిచారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ మరో మోసపు ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులపై రైల్వే మంత్రిత్వ శాఖ హఠాత్తుగా మేలుకొందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రైల్వేల్లో 2,82,976 పోస్టులు ఖాళీ ఉంటే కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని మరో మోసంతో ముందుకొస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇదే పరిస్ధితి ఉందని, ఓవైపు ఖాళీ పోస్టులుంటే, మరోవైపు నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 2021 నాటికి రైల్వేలు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రానున్న రెండేళ్లలో 2.3 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
కాంగ్రెస్ ‘వార్ రూమ్’ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు బుధవారం ఏఐసీసీ వార్ రూమ్‌లో భేటీ అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని, ఈ లోపే క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుందని భేటీలో నిర్ణయించారు. గత నెలలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతలో ఇంకా వెనకబడే ఉన్నామని పలువురు ప్రస్తావించారు. ఎన్డీయేను అధికారం నుంచి దింపేందుకు అవసరమైన వ్యూహాలపై భేటీలో చర్చించారు. అయితే, విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడం బీజేపీకి లాభించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ప్రస్తావించిన ఖర్గే, అహ్మద్ పటేల్ తదితర నేతలు వాటిని అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. కీలక రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుపై ఒక అవగాహన, స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు, రాష్ట్రాల్లోని పీసీసీలకు మధ్య సమన్వయం అవసరమని పలువురు సూచించారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ‘ఏక వ్యక్తి సైన్యం’లా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన సంస్థాగత బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, పార్టీలో రాష్ట్రాల వారీగా సీనియర్లు, యువ నేతల మధ్య సయోధ్యకు, సహకారానికి రాహుల్ ప్రయత్నించాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు విజయావకాశాలు బలంగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందన్నారు. -
జీఎస్టీపై మోదీ సర్కార్ జిమ్మిక్కులు..!
సాక్షి, న్యూఢిల్లీ : పలు వస్తువులను ఒకే జీఎస్టీ శ్లాబ్ కిందకు తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. జీఎస్టీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. జీఎస్టీలో సింగిల్ శ్లాబ్ ఉండాలని గతంలో విపక్షాలు చేసిన సూచనను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీలో ఈ దిశగా మార్పులు చేస్తుండటాన్ని చిదంబరం వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. నిన్నటి వరకూ జీఎస్టీలో ఒకే ఒక్క శ్లాబ్ ఉండాలన్న ఉద్దేశం పనికిమాలినదిగా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు ఇదే తమ లక్ష్యంగా చెప్పుకొస్తోందని చిదంబరం మోదీ సర్కార్‌కు చురకలు వేశారు. జీఎస్టీ స్టాండర్డ్ రేటు ప్రయోజనాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నివేదికను తోసిపుచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆమోదించిందని అన్నారు. నిన్నటివరకూ సుబ్రమణియన్ నివేదికను చెత్తబుట్టలో వేయగా హఠాత్తుగా అది ప్రస్తుతం ఆర్థిక మంత్రి టేబుల్‌పైకి వచ్చి చేరిందని, ప్రభుత్వ ఆమోదం పొందిందని ఎద్దేవా చేశారు. గత ఏడాది జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 18 శాతం పన్ను శ్లాబ్‌ను స్టాండర్డ్ రేట్గా పరిగణించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను చాలాకాలంగా పట్టించుకోని ప్రభుత్వం తాజాగా 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించడం గమనార్హం. -
ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఊరట లభించింది. వీరికి సీబీఐ, ఈడీ కేసుల్లో మధ్యంతర ఊరటను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సమీకరించేందుకు సమయం కావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సీబీఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు. కాగా దర్యాప్తుకు చిదంబరం ఎంతమాత్రం సహకరించడం లేదని ఆయన ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపిస్తూ తెలిపింది.