‘అలా అయితే ఐదేళ్లూ ఒకే సీఎం’
సాక్షి,న్యూఢిల్లీః దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన తమిళనాడు స్పీకర్ ధన్‌పాల్ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు.పళనిస్వామి సర్కార్‌ను కాపాడేందుకు స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. మునిగే పడవను ఏ ఒక్కరూ కాపాడలేరని ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు.
తమిళనాడు స్పీకర్ నిర్ణయం సరైనదే అయితే ఎన్నికైన ఏ పార్టీ శాసనసభా పక్ష నేతను అసమ్మతి ఎమ్మెల్యేలు మార్చే అవకాశం ఉండదు కదా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం ఒకసారి సీఎంగా ఎన్నికైన వారు ఐదేళ్ల పాటు కొనసాగుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ధన్‌పాల్ నిర్ణయం మోసపూరిత చర్యగా చిదంబరం అభివర్ణించారు.