న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడదని, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటా కల్పించే 103వ సవరణ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబంరం మాట్లాడుతూ.. కేంద్రలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రిజర్వేషన్లను పూర్తిగా రద్దే చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనకాడబోదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేసిందా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. రాజ్యాంగాన్ని బీజేపీ కచ్చితంగా సవరిస్తుందని, దాని కోసం వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చదవండి: పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రానప్పటికీ, బీజేపీ రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించడానికి అయినా తగ్గించడానికి అయినా వెనకాడదని పేర్కొన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లోనే పక్షపాతంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని విమర్శలు గుప్పించారు.
అయితే జాతీయ రహదారులను నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో ఎన్డీయే సర్కార్ ఘనత సాధించిందని తెలిపారు. అలాగే డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ పురోగతి సాధించిందని తెలిపారు. నగదు అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పేమెంట్లు జరుగుతున్నాయని. ఇది అభినందించదగిన విషయమని పేర్కొన్నారు.
''Modi government will not hesitate to take away reservations or dilute reservations'': @PChidambaram_IN
Why did the Congress say 'Samvidhan khatre mein hai'' during the elections? What was the idea behind it?@PChidambaram_IN answers#ConclaveMumbai24 @Sardesairajdeep pic.twitter.com/eFcxV6Jtpi— IndiaToday (@IndiaToday) September 26, 2024
Comments
Please login to add a commentAdd a comment