Reservations Cancel
-
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనకాడదు: చిదంబరం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడదని, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటా కల్పించే 103వ సవరణ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబంరం మాట్లాడుతూ.. కేంద్రలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రిజర్వేషన్లను పూర్తిగా రద్దే చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనకాడబోదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేసిందా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. రాజ్యాంగాన్ని బీజేపీ కచ్చితంగా సవరిస్తుందని, దాని కోసం వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.చదవండి: పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలుసార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రానప్పటికీ, బీజేపీ రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించడానికి అయినా తగ్గించడానికి అయినా వెనకాడదని పేర్కొన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లోనే పక్షపాతంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని విమర్శలు గుప్పించారు.అయితే జాతీయ రహదారులను నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో ఎన్డీయే సర్కార్ ఘనత సాధించిందని తెలిపారు. అలాగే డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ పురోగతి సాధించిందని తెలిపారు. నగదు అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పేమెంట్లు జరుగుతున్నాయని. ఇది అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. ''Modi government will not hesitate to take away reservations or dilute reservations'': @PChidambaram_INWhy did the Congress say 'Samvidhan khatre mein hai'' during the elections? What was the idea behind it?@PChidambaram_IN answers#ConclaveMumbai24 @Sardesairajdeep pic.twitter.com/eFcxV6Jtpi— IndiaToday (@IndiaToday) September 26, 2024 -
రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆప్ అగ్ర నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎం పదవి నుంచి తొలగిస్తారని పునరుద్ఘాటించారు. ‘అధికారంలోకి వస్తే భారీ కార్యక్రమం ఒకటుంటుందని బీజేపీ చెబుతోంది. రిజర్వేషన్లను తొలగించడమే ఆ కార్యక్రమం. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. మళ్లీ ఆ పార్టీకే అధికార పగ్గాలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతుంది’అని ఆయన అన్నారు. గురువారం కేజ్రీవాల్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో 75 ఏళ్లు దాటిన ఏ నేతకు కూడా ప్రభుత్వంతోపాటు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని, అటువంటి వారు రిటైర్ కావాల్సిందేనంటూ ప్రధాని మోదీ నిబంధన తెచ్చారు. ఈ ప్రకారమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు కొందరు రిటైరయ్యారు. మరికొందరిని తొలగించడమో, ఎన్నికల్లో టికెట్ నిరాకరించమో జరిగింది. మోదీ ఈ నిబంధన అమలుకు కృషి చేస్తున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు అడ్డుగా ఉంటారనుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌లాల్ ఖట్టర్ వంటి వారి కథను మోదీ ముగింపునకు తెచ్చారని విమర్శించారు. ‘అమిత్ షాకు ఆదిత్యనాథ్ అడ్డుగా ఉన్నారు. బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను సైతం పక్కన బెట్టడం ఖాయం’అని కేజ్రీవాల్ అన్నారు. చీపురుకు ఓటేస్తే..జైలుకెళ్లాల్సిన పనుండదు అమృత్సర్: తాను మళ్లీ జైలుకు వెళ్లరాదని భావిస్తే ఆప్కే ఓటేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. గురువారం ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. చీపురు గుర్తు బటన్‌ను మీరు నొక్కితే నేను మళ్లీ జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేజ్రీవాల్‌కు స్వేచ్ఛా లేక జైలా అనే విషయం ఆలోచించి మీరు బటన్ నొక్కండి. చీపురు గుర్తుపై నొక్కితే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించినట్లేనని గుర్తుంచుకోండి’అని ఆయన అన్నారు. -
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
అలీరాజ్‌పూర్/ఖర్గోన్: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలను కూడా గెల్చుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడుతుంటే కమలంపార్టీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాయని రాహుల్ ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని జోబాట్, సేగోన్ పట్టణాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంచేశారు. రాత్లాం–ఝబువా, ఖర్గోన్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.హక్కుల్ని లాగేద్దామని మోదీ ఆశపడుతున్నారు‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరాక ప్రజా ప్రయోజనాల కోసం 50 రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తుంది. కులగణన అనేది ప్రజల జీవన స్థితిగతులపై వాస్తవ గణాంకాలను అందిస్తుంది, దీంతో దేశంలో రాజకీయ గతే మారిపోతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఈసారి 400 ఖాయం అని బడాయిలుపోతున్నారుగానీ కనీసం వారికి 150 సీట్లుకూడా రావు. రాజ్యాంగాన్ని పరిరక్షించేది విపక్షాల ‘ఇండియా’ కూటమి మాత్రమే. రాజ్యాంగంలో ఉంది కాబట్టే గిరిజనులు, దళితులు, ఓబీసీలు లబ్ధిపొందగల్గుతున్నారు. జలం, జమీన్(భూమి), జంగల్(అడవి)పై గిరిజనులకు హక్కులున్నాయి. ప్రజల హక్కులను లాగేసుకోవాలని ప్రధాని మోదీ ఆశపడుతున్నారు. ఆ ఆశలు నెరవేరకుండా మేం అడ్డుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే‘‘వాళ్లు ఇప్పుడున్న రిజర్వేషన్లను లాక్కోవడం సంగతి పక్కనబెట్టండి. మేం ఆ రిజర్వేషన్లను 50 శాతం దాటేలా చేస్తాం. కోర్టులు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దగ్గరే నిలిపేశాయి. భూమి, అడవికి తొలి యజమానులైన మిమ్మల్ని ఆదివాసీలుగా మేం గుర్తిస్తున్నాం. బీజేపీ వాళ్లు మిమ్మల్ని వనవాసీలంటున్నారు. మీ హక్కుల పరిరక్షణ కోసమే అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు అమల్లో ఉన్నాయి. మీ అందరికీ చేకూరిన లబ్దిని మీకు దూరం చేయాలని వారు కుట్ర పన్నారు. విపక్షాల కూటమికి ఓటేసి అధికారం కట్టబెడితే కులగణన చేసి గిరిజనులు, దళితులు, ఓబీసీలు, జనరల్ కేటగిరీ పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాం. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ అబద్ధాలు చెప్పారు. మేం కోట్లాది మంది పేదలను లఖ్పతిలుగా మారుస్తాం’’ అని చెప్పారు.పాతికమందికే అన్ని ఇచ్చే కుట్ర‘‘రాజ్యాంగం, రిజర్వేషన్లు, గిరిజనుల అటవీభూములు, ప్రభుత్వరంగాన్ని కాపాడేందుకు మేం కష్టపడుతుంటే వీటిపై సర్వాధికారాన్ని అదానీ సహా ఓ పాతికమంది కుబేరులకు ధారాదత్తం చేద్దామని మోదీ ఆశపడుతున్నారు. మేం ఆ పని జరగనివ్వం’’ అని ప్రకటించారు. ఉపాధి కూలీ వేతనం రూ.400కు పెంచుతాం‘‘మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళల ఖాతాలో ఏటా రూ.1 లక్ష జమచేసి పేదరికం నుంచి బయటపడేస్తాం. పథకంలో భాగంగా మహిళకు నెలకు రూ.8,500 అందుతాయి. మేం గెలిస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. అందుకోసం చట్టం తెస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వీలైనంత త్వరగా రైతుల రుణాలను మాఫీచేస్తాం. గత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి నిరుద్యోగిత పెరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనంను రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. పెహ్లీ నౌకరీ పక్కా పథకం కింద యువతకు కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ కింద ఏటా రూ.1లక్ష జమచేస్తాం. తర్వాత ఉద్యోగాలిస్తాం’’ అని హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, మేడ్చల్ జిల్లా/చార్మినార్: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలన్నారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్‌షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్‌రెడ్డి, ఎంవీఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అమిత్ షా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం భారత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. కానీ, జడ్జీల నియామక ప్రతిపాదనల సమయంలో సరైన ప్రాతినిధ్యం లేని మహిళలు, బీసీలు, ఇతర వర్గాలకు చెందిన వారి విషయం దృష్టిలో ఉంచుకోవాలని జడ్జీలు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే నేత తిరుచి శివ అడిగిన ఒక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి దేశంలోని 25 హైకోర్టుల్లో సుమారు 60 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 69 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. ఇందులో, అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 10.30 లక్షల కేసులు, సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
* హార్దిక్ పటేల్ వెనక సంఘ్ పరివార్ హస్తం * రౌండ్ టేబుల్ చర్చలో బీసీ నేతల ఆందోళన సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయించేందుకు కుట్ర జరుగుతోందని బీసీ సంఘాలు భయాందోళన వ్యక్తం చేశాయి. గుజరాత్లో మానసిక పరిపక్వత లేని 22 ఏళ్ల హార్దిక్ పటేల్‌ను ముందుంచి తెర వెనక సంఘ్ పరివార్ శక్తులు కథ నడుపుతున్నాయని ఆరోపించాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పట్టీదార్లు చేస్తున్న ఆందోళన.. అసలు ఉద్యమమే కాదని, ఇది ఫక్తుగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమని అభిప్రాయపడ్డాయి. ‘గుజరాత్లో పటేళ్ల ఉద్యమం-సామాజిక పరిణామాలు’ అంశంపై బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. పటేళ్లను ఓబీసీల్లో చేరిస్తే పరిస్థితులు రణరంగమవుతాయని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణయ్య పేర్కొన్నారు. 80 శాతం మార్కులొచ్చినా పటేళ్లకు ఉద్యోగాలు రావడం లేదని, రిజర్వేషన్ల వల్ల 49 శాతం మార్కులొచ్చిన వారికీ ఉద్యోగాలొస్తున్నాయని హార్దిక్ పటేల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. గుజరాత్ జనాభాలో 14 శాతమే ఉన్న పటేళ్ల వద్దే ఆ రాష్ట్ర సంపదలో 65 శాతం ఉందన్నారు. బీసీ కోటాను 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఆరెస్సెస్ కుట్ర చేస్తోందని ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, సత్యనారాయణలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.