న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం భారత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. కానీ, జడ్జీల నియామక ప్రతిపాదనల సమయంలో సరైన ప్రాతినిధ్యం లేని మహిళలు, బీసీలు, ఇతర వర్గాలకు చెందిన వారి విషయం దృష్టిలో ఉంచుకోవాలని జడ్జీలు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే నేత తిరుచి శివ అడిగిన ఒక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి దేశంలోని 25 హైకోర్టుల్లో సుమారు 60 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 69 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. ఇందులో, అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 10.30 లక్షల కేసులు, సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment