kiren rijiju
-
ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త.. వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి
ఈటానగర్: దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నదులు, సరస్సులు మంచుతో గడ్డ కడుతున్నాయి. ఇక, పలు పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల వారు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకులు ప్రమాదానికి గురైన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన సెలా పాస్ వద్ద సరస్సు మంచుతో గడ్డకట్టింది. దీంతో,.సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం సరస్సు వద్దకు వెళ్లిన పర్యాటకుల బృందం అక్కడికి చేరుకుంది. అనంతరం, వారు సరస్సులోకి దిగారు. ఒకచోట గడ్డకట్టిన మంచు పగుళ్లు రావడంతో కొందరు పర్యాటకులు గడ్డకట్టిన నీటిలో పడిపోయారు. దీంతో, మంచు గడ్డ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న పర్యాటకులు వారిని కాపాడారు.ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు(Kiren Rijiju) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్బంగా కిరణ్ రిజుజు.. గడ్డకట్టిన ప్రదేశాల వద్దకు పర్యాటకులు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో స్థానిక గైడ్స్ సలహాలు తీసుకోవడం మంచిది. మంచుపై నడిచే సమయంలో హిమాపాతం గురించి తెలుసుకోండి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కారణంగా వెచ్చని బట్టలు ధరించి ఆనందించండి. మీ భద్రత ముఖ్యం అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.At Sela Pass in Arunachal Pradesh. My advice to tourists: Walk on the Frozen Lakes with experienced people, drive carefully on slippery snow roads and be aware of snow avalanche. Temperatures is freezing so wear warm clothes and enjoy. Your safety is important. pic.twitter.com/UWz8xOzd57— Kiren Rijiju (@KirenRijiju) January 5, 2025 -
విపక్షాల తీవ్ర ఆందోళన.. జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) పంపింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.బిల్లును సమర్ధించుకున్న రిజిజుమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టంలోని సమస్యలను పరిష్కరించలేకపోయినందున తమ ప్రభుత్వం సవరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ‘మీకు చేతకాకపోవడంతో ఈ సవరణలు తీసుకురావాల్సి వచ్చింది. మేం ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఈ బిల్లుకు మద్దతివ్వండి, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందుతారు.. కొందరు వక్ఫ్ బోర్డులను కబ్జా చేశారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మాఫియాగా మారాయని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. నేను వారి పేర్లను బహిరంగంగా చెప్పి వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయలేను’ అని రిజిజు తెలిపారు.ఇది రాజ్యాంగ విరుద్ధ బిల్లు: కాంగ్రెస్ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం మత స్వేచ్చను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే నిబంధనను ఆయన వ్యతిరేకించారు. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: వైఎస్సార్సీపీ ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.రాజకీయ కుట్రతోనే సవరణ బిల్లు: ఎస్పీరాజ్యంగ స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ తమ కమ్యూనిటీకి చెందని వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అంతకముందు వక్ఫ్ బోర్డులకు చెందిన భూములను సవరణల ముసుగులో విక్రయించాలని బీజేపీ భావిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డ్ సవరణలన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. రక్షణ, రైల్వే, నాజుల్ భూముల మాదిరి వక్ఫ్ భూములను విక్రయించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.స్టాండింగ్ కమిటీకి పంపాలి: ఎన్సీపీబిల్లును సభకు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు జరపలేదని ఎన్సీపీ(శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఇత ఉన్నపళంగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్ బోర్డులో అకస్మాత్తుగా ఏమి జరిగింది అని ప్రశ్నించారు.ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. హిందూ దేవాలయాలను నిర్వహించడం క్రిస్టియన్, ముస్లింలకు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ బషీర్, సిపిఎంకు చెందిన కె రాధాక్రిష్ణ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు మత స్వేచ్ఛకు భంగం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారుకాగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని తీసుకువచ్చారు. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయిరాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారులు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణలు తొలగింపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడడమే ఈ చట్టం లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్లను సవరించాలని కోరుతూ కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. అంతేగాక వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలో వివాదాస్పద అంశంగా మారింది. -
శాం పిట్రోడాకు కీలక బాధ్యతలు.. ప్రధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్ రిజిజు
లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగిబాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ.. శాం పిట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని అన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘ప్రధాని మోదీ ఊహించినట్లే.. రాహుల్ గాంధీ సలహాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా , ఈశాన్య ప్రజలు చైనీస్‌గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా కకనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారు. ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారు’. అని పేర్కొన్నారు.ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు. ‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్‌తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు.అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’ అని మోదీ ఆ వీడియోలో అన్నారు.కాగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్‌లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా పార్టీ నియమించింది. -
కిరణ్ రిజిజు V/s జైరాం రమేష్.. ఎక్స్ వార్
న్యూ ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ శాసనసభ్యుడు భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతోంది. జూన్ 26న స్పీకర్ ఎన్నికల జరగనుంది.కాగాసమావేశాల్లో తొలి రోజే నీట్-యూజీ, యూజీసీ-నెట్లో అవకతవకలు, ప్రొటెం నియామకంపై వివాదం, స్పీకర్ ఎన్నికల వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది.అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది.పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిరణ్ రిజుజు సోమవారం ఉదయం18వ లోక్‌సభ సభ్యులకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీలకు స్వాగతం. నేడు(జూన్ 24) లోక్‌సభ మొదటి సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సభను సమర్ధవంతంగా నడిపేందుకు సభ్యుల నుంచి సమన్వయం కోసం ఎదురుచూస్తున్నారుఈ పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాటల కంటే చర్యలు ముఖ్యమని, చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలని కౌంటర్ ఇచ్చారు.జైరాం రమేష్ ట్వీట్‌పై కేంద్రమంత్రి రిజిజు బదులిచ్చారు. మీరు సానుకూలంగా సహకరించడమే సభకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. "ఖచ్చితంగా. జైరాం రమేష్ జీ. మీరు తెలివైన సభ్యులు. మీరు సానుకూలంగా సహకరిస్తే సభకు విలువైన ఆస్తి అవుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అలాగే ఉంటాయి. కానీ మనమంతా దేశానికి మాసేవ చేసేందుకు ఐక్యంగా ఉన్నాం. భారతదేశపు గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించడంలో మీ సహకారం ఓసం ఎదురుచూస్తున్నాం." అని తెలిపారు.అయితే ఈ సంభాషణ ఇక్కడితో ఆగలేదు. కేంద్రమంత్రి ట్వీట్‌కు మరోసారి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ... "ధన్యవాదాలు మంత్రి. నా తెలివితేటలకు మీ సర్టిఫికేట్.. ఎన్టీయే గ్రేడింగ్ కాదని నేను భావిస్తున్నాను. దీనికేమైనా గ్రేస్ మార్కుల ఉన్నాయా?" అంటూ పంచ్‌లు విసిరారు. -
తీర ప్రాంత శోధన కోసం ఎన్‌సీసీఆర్ కేంద్రం
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్‌సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్‌కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు. ఇప్పటివరకూ ఎన్‌సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్!
న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగింది కానీ.. మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్! -
‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించింది. న్యాయవ్యవస్థతో ఎలాంటి బేధాభిప్రాయాలు పొడచూపకూడదనే ఉద్దేశంతోనే ఈయన శాఖను మార్చారని తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల స్వతంత్ర మంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్కు న్యాయశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ ర్యాంక్‌లేని ఒక స్వతంత్ర హోదా మంత్రికి కీలకమైన న్యాయశాఖను అప్పగించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఎందుకు మార్చారు ? సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలను సొంతంగా సుప్రీంకోర్టే కొలీజియం పేరిట నియమించుకోవడం ఎక్కడా లేదని, ఇదొక ఏలియన్ విధానం అని, మాజీ జడ్జీలు దేశవ్యతిరేక గ్యాంగ్‌లుగా తయారయ్యారని రిజిజు గతంలో ఆరోపించారు. దీంతో తమ బాధ్యతలు, విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఘాటుగా బదులిచ్చింది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో రిజిజు వ్యాఖ్యలు విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆయనను తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లూ మరో మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించిన భూ విజ్ఞానశాస్త్ర శాఖను రిజిజుకు అప్పగించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రిజిజు, మేఘ్వాల్ శాఖలను మార్చుతున్నట్లు గురువారం రాష్ట్రపతిభవన్ ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. కాగా, బాధ్యతలు మారడంపై రిజిజు స్పందించారు. ‘ భూ విజ్ఞాన శాఖలో ప్రధాని మోదీ దార్శనికతను సుసాధ్యం చేసేందుకు శాయశక్తుల కృషిచేస్తా. ఇంతకాలం న్యాయశాఖ మంత్రిగా కొనసాగడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్సహా మొత్తం న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ మేరకు రిజిజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సుప్రీం కోర్టు కొలీజియంకి సంబంధించిన సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కొలీజియం ఇష్యూ అంతా మైండ్‌గేమ్‌గా అభివర్ణించారు. దీనిపై తాను మాట్లాడనని కూడా చెప్పారు. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్‌లో 4జీ సేవల కోసం 254 మైబెల్ టవర్లను అంకితం చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ..కఠినమైన భూభాగాలను కలిగిన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత స్థానికులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌లోని తపిర్ గావో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహస్తున్నారు. కాగా, ఆయన కొలీజియంని మన రాజ్యాంగానికి విరుద్ధమైనదిగా కూడా పిలివడం గమనార్హం. (చదవండి: ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్ గాంధీ) -
కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం..
జమ్మూ కశ్మీర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయపట్టడారు. . ఈ ఘటనలో కిరణ్ రిజిజుతో సహా ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని. విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #BREAKING Law Minister @KirenRijiju survived an accident when his Bullet proof car was hit by a full loaded truck near Banihal in Jammu and Kashmir. The car got little damaged but fortunately no one was hurt..@ABPNews pic.twitter.com/tMvkTUVI4e — Ashish Kumar Singh (ABP News) (@AshishSinghLIVE) April 8, 2023 కాగా కేంద్రమంత్రి కిరణ్ రిజుజు శనివారం జమ్మూ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజకీయ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. . కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిని ప్రభుత్వం చూస్తూ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్! -
216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరీశీలనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో 216 జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫారసులు అందాల్సి ఉందని వివరించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 10వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవన్నారు. 25 హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జీ పోస్టులకు గాను 334 ఖాళీలున్నాయన్నారు. జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. -
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?!
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?! -
తెలంగాణ హైకోర్టులో ఎన్ని లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,53,358, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. అంతేగాక ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఈ నెల 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం 59,87,477 కేసులు పెండింగ్ ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. -
న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం భారత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. కానీ, జడ్జీల నియామక ప్రతిపాదనల సమయంలో సరైన ప్రాతినిధ్యం లేని మహిళలు, బీసీలు, ఇతర వర్గాలకు చెందిన వారి విషయం దృష్టిలో ఉంచుకోవాలని జడ్జీలు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే నేత తిరుచి శివ అడిగిన ఒక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి దేశంలోని 25 హైకోర్టుల్లో సుమారు 60 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 69 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. ఇందులో, అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 10.30 లక్షల కేసులు, సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
కొలీజియం సిఫార్సులపై సాగదీత...
ముంబై: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సాధారణ పౌరునిగా కొలీజియంతో పాటు ప్రతి వ్యవస్థనూ విమర్శించవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మాత్రం నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడి ఉండాల్సిందే’’ అన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెడుతున్న వైనాన్ని ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు. ‘‘నిర్భీతితో కూడిన స్వతంత్ర న్యాయమూర్తులు లేకుండా పోతే పరిస్థితేమిటి? న్యాయ వ్యవస్థ మన చివరి ఆశా కిరణం. అది కూడా కుప్పకూలితే దేశానికిక చీకటి రోజులే. తప్పో, ఒప్పో.. 1993 నాటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ పుట్టుకొచ్చింది. దాన్ని గౌరవించడం కేంద్రం విధి. ఎందుకంటే అన్ని వ్యవస్థలూ సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడాల్సిందే’’ అన్నారు. తనకు అనుకూలమైన కొలీజియం వచ్చి పాత సిఫార్సులపై పునరాలోచన చేస్తుందనేది కేంద్రం వైఖరి అని అభిప్రాయపడ్డారు. అందుకే కొలీజియం సిఫార్సులపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించని పక్షంలో దాన్ని అంగీకారంగానే పరిగణించేలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాలన్నారు. -
తప్పో.. ఒప్పో.. అంగీకరించడం మీ విధి: నారిమన్
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే.. ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్ కిరెన్ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్ అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారీమన్.. ఆగస్టు 2021లో రిటైర్ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు. -
జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్‌తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది. -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
5 కోట్లకు పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు -
ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు: సుప్రీం కోర్టు ఖండన
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని, అనర్హులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని, న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని పదునైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు. అయితే న్యాయమంత్రి వ్యాఖ్యలను ఇవాళ సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఇవాళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ టీవీ చర్చా వేదికలో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న ఆయన అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అత్యున్నత న్యాయస్థానం. అలా జరిగి ఉండకూదని బెంచ్ వ్యాఖ్యానించింది. కొలీజియం ప్రతిపాదిత పేర్ల ఆమోద జాప్యానికి సంబంధించిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో.. అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలను కేంద్రం ఆలస్యం చేస్తోందని ధ్వజమెత్తింది కూడా. కొలీజియంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఒకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ ఒకరు ఉన్నతస్థాయిలో(మంత్రి కిరెన్ను ఉద్దేశించి) ఉన్నప్పుడు.. అలా జరిగి ఉండకూడదు అని పేర్కొంది. అయితే ఆ సమయంలో కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్.. ‘‘కొన్నిసార్లు మీడియా తప్పుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయ’ని వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ను ఉద్దేశిస్తూ జస్టిస్ కౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మిస్టర్ అటార్నీ జనరల్.. నేను కూడా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోను. కానీ, ఈ వ్యాఖ్యలు చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి.. అదీ ఓ ఇంటర్వ్యూలో వచ్చాయి. ఇంతకంటే ఏం చెప్పలేను. అవసరమైతే నిర్ణయం తీసుకుంటాం అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇక న్యాయశాఖ నియామకాల్లో జాప్యంపై, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC) మస్టర్‌ను ఆమోదించకపోవడమే ప్రభుత్వం సంతోషంగా లేకపోవడానికి కారణమా, అందుకే పేర్లను క్లియర్ చేయలేదా? అని కోర్టు సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించింది. కొలీజియం సిఫార్సులపై ప్రభుత్వం సిట్టింగ్‌పై సుప్రీంకోర్టు తన రిజర్వేషన్లను పేర్కొనకుండా పేర్లను వెనక్కి తీసుకోదంటూ చెబుతూ.. న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించింది. దయచేసి త్వరగతిన పరిష్కరించండి. ఈ విషయంలో మమ్మల్ని న్యాయపరమైన నిర్ణయం తీసుకునేలా చేయొద్దు అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల జాప్యంపై.. కోర్టు మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను కోర్టు కోరింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇవ్వడంతో కేసు విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేశారు. ఇదీ చదవండి: కొలీజియంపై కిరెన్ రిజిజు.. మౌనంగా ఉంటామనుకోవద్దని వ్యాఖ్య -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి
న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు. నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలందించారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం) -
ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది
-
‘ఏపీ హైకోర్టును తరలించాలనే ప్రతిపాదన అందింది’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కర్నూల్‌కు హైకోర్టు తరలింపు హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూల్‌కు హైకోర్టు తరలింపు అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. ‘ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది. కర్నూల్‌కు తరలింపుపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్గ్ర ప్రభుత్వమే భరిస్తుంది.హైకోర్టును కర్నూల్‌కు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు కిరణ్ రిజిజు. -
అంతంత ఫీజులు సామాన్యుడు ఎలా భరించగలడు?
జైపూర్: పౌరులకు ఉచిత న్యాయసేవను అందిస్తున్న దేశాల్లో మనది ఒకటి. అలాంటి దేశంలో కేసుల కోసం లక్షల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులు ఉంటున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యల చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగకుండా ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న అధిక లీగల్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్లో మంత్రి రిజిజు మాట్లాడుతూ.. “డబ్బున్నవాళ్లు బడా లాయర్లను నియమించుకుంటారు. అంతెందుకు సుప్రీంకోర్టులో ఉన్న కొందరు న్యాయవాదుల ఫీజులను సామాన్యులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వాదన కోసం రూ.10-15 లక్షలు వసూలు చేస్తే.. అసలు సామాన్యుడు ఎలా చెల్లించగలడు?. పేదలకు న్యాయం ఎలా అందుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా! అని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. జూలై 18, సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 71 వాడుకలో లేని చట్టాలను రద్దు చేస్తామని న్యాయ మంత్రి వెల్లడించారు. आज जयपुर में राष्ट्रीय विधिक सेवा प्राधिकरण की 18वी अखिल भारतीय बैठक के उद्घाटन समारोह में भाग लेंगे। pic.twitter.com/ADBCN4a9zo — Kiren Rijiju (@KirenRijiju) July 16, 2022 ఇక న్యాయ సేవల సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా జరిగిన ప్రచారంపైనా గెహ్లట్ స్పందించారు. “సస్పెండ్ చేయబడిన బిజెపి los నూపుర్ శర్మ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులపై దుష్ప్రచారం ప్రారంభించడం చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. పనిలో పనిగా బీజేపీపై విరుచుకుపడిన గెహ్లాట్.. హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. “దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా(రాజస్థాన్) ప్రభుత్వం ఎలా మనుగడ సాగించిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లక్ష్మణ రేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తీవ్రంగా స్పందించారు. రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్ర న్యాయశాఖ మంత్రికిరణ్ రిజిజుకు లేదని ఘట్టి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13వ సెక్షన్‌ను చదువుకోవాలని కేంద్ర మంత్రికి చిదంబరం హితవు పలికారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ప్రభుత్వాలు చట్టాలను చేయలేవని అలాంటి చట్టాలను అనుమతించరని చిదంబరం అన్నారు. దేశద్రోహ చట్టం రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని, రాజుల గుర్రాలు, రాజులందరూ ఆ చట్టాన్ని రక్షించలేరని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా న్యాయశాఖతో సహా రాజ్యాంగ వ్యవస్థలన్నీ లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదనిసుప్రీం వ్యాఖ్యానించింది. అయితే దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి. ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు. The Law Minister of India has no authority to draw any arbitrary Lakshman Rekha He should read Article 13 of the Constitution The Legislature cannot make a law, nor can a law be allowed to remain on the statute book, that violates the Fundamental Rights — P. Chidambaram (@PChidambaram_IN) May 12, 2022 -
Sedition Order: లక్ష్మణ రేఖను గౌరవించాలి.. దాటకూడదు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం విషయంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్షలు పూర్తయ్యేదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలంటూ కేంద్రానికి చెప్పింది. అంతేకాదు కొత్త కేసులు.. అరెస్టులు నమోదు చేయొద్దని చెబుతూనే.. ఇప్పటికే రాజద్రోహం కింద అరెస్టయిన వాళ్లు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు Kiren Rijiju కోర్టు ఆదేశాలపై.. ‘కోర్టులకు ఉన్న స్వతంత్ర్య హోదాను, వాటిని తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్ర్య హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా అంటూ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో భారతీయుల అణచివేతకు కారణమైన ఐపీసీ సెక్షన్ 124-ఏను.. ఇప్పటికీ అమలు చేస్తుండడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తంకాగా, కేంద్రం మాత్రం ఈ సెక్షన్‌పై దోబుచులాడుతూ వస్తోంది. తాజాగా ఈ సెక్షన్ సవరణ సమీక్షకు తాము సిద్ధమంటూ అఫిడవిట్లో పేర్కొనడం.. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో రాజద్రోహం సెక్షన్‌కు ఇప్పుడు బ్రేకు పడింది. చదవండి: ‘రాజద్రోహం చట్టం’పై స్టే విధించిన సుప్రీంకోర్టు -
అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా
న్యూఢిల్లీ: ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17ఏళ్ల యువకుడు మిరామ్ టారోర్‌ను విడుదల చేసేందుకు చైనా ఎట్టకేలకు ఒప్పుకుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఎప్పుడు ఆ పిల్లాడిని అప్పగిస్తారనేది తేదీ, సమయం త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)తో ఇండియన్ ఆర్మీ మాట్లాడుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా సానుకూలంగా స్పందించి తమ వద్ద ఉన్న యువకుడిని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఎక్కడ అప్పగించాలో కూడా స్థలాన్ని సూచించిందని, అయితే దీనికి సంబంధించి త్వరలో తేదీ,, సమయం త్వరలోనే తెలియజేస్తారని అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగిందని కిరణ్ రిజుజు అన్నారు. Hotline exchanged on Republic Day by Indian Army with Chinese PLA. PLA responded positively indicating handing over of our national and suggested a place of release. They are likely to intimate date and time soon. Delay attributed to bad weather conditions on their side. https://t.co/CX7pu2jIRV — Kiren Rijiju (@KirenRijiju) January 26, 2022 అంతకుముందు తప్పిపోయిన యువకుడి ఆచూకీని గుర్తించిన భారత సైన్యం అతడి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను చైనా ఆర్మీకి పంపించినట్లు మంత్రి రిజుజు చెప్పారు. కాగా, జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన పదిహేడేళ్ల మిరామ్ టారోన్ అనే యువకుడు బిషింగ్ ఏరియాలోని షియుంగ్ లా ప్రాంతంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి చైనానే ఆ యువకుడిని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం తమ భూభాగంలో ఒక భారతీయ బాలుడు దొరికాడని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. చదవండి: 17 Year Old Boy Miran Taron: ‘మిస్సింగ్’ మిరమ్ తరోన్ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన దీంతో యువకుడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారంటూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ ఆరోపించారు. సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట అతడిని కిడ్నాప్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 2020లో ఇలాంటి సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లా నుంచి ఐదుగురు యువకులను పీఎల్ఏ అపహరించి వారం తర్వాత వారిని విడుదల చేసింది. చదవండి: 2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!! -
సెంట్రల్ విస్టా 60 శాతం పూర్తి
న్యూఢిల్లీ: ఈ నెల చివరికల్లా పూర్తికావాల్సిన ఢిల్లీలోని సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్ట్‌లో 60 శాతం పనులు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా పూర్తికావాల్సిన కొత్త పార్లమెంట్ భవంతి పనులు 35 శాతం పూర్తయినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర భవనాలు, పట్టణాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ గురువారం లోక్‌సభలో చెప్పారు. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్, కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం నిర్మిస్తారు. పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,289 కోట్లు కేటాయించినట్లు కౌశల్ చెప్పారు. ‘న్యాయవ్యవస్థ’పై 1,622 ఫిర్యాదులు గత ఐదేళ్ల కాలంలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై, న్యాయస్థానాల్లో అవినీతి ఘటనలపై 1,622 ఫిర్యాదులు అందినట్లు కేంద్రం వెల్లడించింది. ఆయా ఫిర్యాదులు కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు, పర్యవేక్షణా వ్యవస్థ(సీపీజీఆర్ఏఎంఎస్)లో నమోదయ్యాయని ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో చెప్పారు. హైకోర్టు జడ్జీలపై వచ్చిన ఫిర్యాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చెంతకొస్తాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై ఇచ్చిన ఫిర్యాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకొస్తాయి. ఫిర్యాదులను ‘అంతర్గత విచారణ’లో విచారిస్తారు. తొమ్మిదిన్నర రోజులకు సరిపడా బొగ్గు.. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్ నెలలో బొగ్గు నిల్వలు కాస్త మెరుగుపడ్డాయి. కానీ, ఆ నిల్వలు కేవలం తొమ్మిదిన్నర రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత రెండు నెలలతో పోలిస్తే నవంబర్‌లో 18.95 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లోక్‌సభలో గురువారం చెప్పారు. ఇవే కేంద్రాల వద్ద సెప్టెంబర్‌లో 10.37 మిలియన్ టన్నుల నిల్వలుండగా అక్టోబర్‌లో కేవలం 8.07 మిలియన్ టన్నుల నిల్వలే ఉన్నాయి. దేశంలోనే 136 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌లో మొత్తంగా 18.958 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇవి తొమ్మిదిన్నర రోజులకే సరిపోతాయి. వాస్తవానికి ప్రతీ ఏటా ఫిబ్రవరి–జూన్ కాలానికి బొగ్గు గనుల దగ్గర్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద 17 రోజులకు సరిపడా నిల్వలు, బొగ్గు గనులకు సుదూరంగా ఉన్న విద్యుత్ కేంద్రాల్లో 26 రోజులకు సరిపడా నిల్వలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం తాజాగా నిబంధనలను సవరించింది. -
న్యాయ వ్యవస్థలోకి చిట్టీ.. ది రోబో
దేశంలో కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేసే అవకాశాన్ని కృత్రిమ మేధ (ఏఐ) కల్పించనుంది! కేసుల నిర్వహణ, చట్టాల ఆన్లైన్ సమాచారం,అల్గారిథం ఆధారిత సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా న్యాయస్థానాల పనితీరు మెరుగుపరచడంలో ఏఐ దోహదపడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా పేర్కొన్నారు. అంటే మంత్రి వ్యాఖ్యలను మరో విధంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థలోకి చిట్టీ ది రోబోని ప్రవేశపెడతారన్నమాట. ఎంత పెద్ద పనులైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సత్వరం చేస్తూ న్యాయ ప్రకియలో వేగం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటైజేషన్ బాట పట్టిన భారత న్యాయ వ్యవస్థకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఏఐ ఏ రకంగా సాయపడగలదో ఓసారి పరిశీలిద్దాం. ప్రపంచ దేశాల్లో న్యాయస్థానాలకు కృత్రిమ మేధ (ఏఐ) అవసరం అవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాతోపాటు కొన్ని ఇతర పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రధానంగా ఆరు రకాలుగా న్యాయ, చట్ట వ్యవస్థలకు ఉపయోగపడుతోంది. అవి ఏమిటంటే ఈ–డిస్కవరీ, ఆటోమేషన్, లీగల్ రీసెర్చ్, డాక్యుమెంట్ మెనేజ్మెంట్, కాంట్రాక్ట్ అండ్ లిటిగేషన్ డాక్యుమెంట్ అనలటిక్స్ అండ్ జనరేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్. వాటి గురించి క్లుప్తంగా... చిటికెలో దశాబ్దాల వివరాలు... కొన్ని దశాబ్దాలపాటు కోర్టుల్లో నమోదైన కేసులు.. వాటి తాలూకూ సూక్ష్మస్థాయి వివరాలను వెతకడం ఆషామాషీ కాదు. కానీ కృత్రిమ మేధ మాత్రం ఈ పనులను చిటికెలో చేసిపెడుతుంది. డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి కేసుకు సంబంధించిన గత తీర్పులు, వాదనలను గుర్తించి అందించేందుకు ఈ–డిస్కవరీ ఉపయోగపడుతుంది. న్యాయవాదుల కంటే ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మెరుగైందట! కళ్లముందే నిపుణుల అభిప్రాయాలు... ఏదో ఒక కేసులో నిపుణుడు ఇచ్చిన వివరాలు న్యాయస్థానాల రికార్డుల్లో ఉండే ఉంటాయి. కేసును బట్టి ఆయా అంశాలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు, వివరాలను అవసరమైనప్పుడు అందుకొనేందుకు వీలుగా ఎక్స్పర్టీస్ ఆటోమేషన్‌ను ఉపయగిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వీలునామాల తయారీలో ఉపయోగిస్తున్నారు కూడా. అంతేకాకుండా లాయర్ అవసరం లేకుండానే కోర్టులో కేసులు వేసేందుకు, కేసు వివరాలను సరైన రీతిలో పొందుపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒప్పందాల విశ్లేషణలో ప్రత్యేక ముద్ర... వ్యక్తులు, కంపెనీలు, సంస్థల మధ్య కుదిరే అనేక రకాల కాంట్రాక్టుల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా.. సమస్యలు రావడం, కోర్టు కేసులకు దారితీయడం కద్దు. ఈ పరిస్థితి రాకుండా.. కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా విశ్లేషించి, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులేవీ రాకుండా జాగ్రత్త పడేందుకూ ఏఐని ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఇటీవలి కాలంలో వీటి వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిపోతోంది. తీర్పుల అంచనాకూ దోహదం.. ఫలానా కేసులో తీర్పు ఎలా వస్తుందో ఊహించడం కష్టమే. న్యాయసూత్రాలు పక్కాగా తెలియడంతోపాటు కేసు పూర్వాపరాలపై కచ్చితమైన అంచనాలు అవసరమవుతాయి. కానీ కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు ఇప్పుడు తీర్పులను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. వాటి కచ్చితత్వం ఎంత అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియకున్నా ఆ ప్రయత్నమైతే జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ న్యాయ పరిశోధనలోనూ తనదైన ముద్ర... దేశం మొత్తమ్మీద ఒకే రకమైన న్యాయసూత్రాలు ఉండటం కష్టమే. కొన్ని విషయాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. ఈ తేడా దేశాలకూ వర్తిస్తుంది. ఈ వివరాలన్నీ అవసరానికి తగ్గట్టు మీకు అందించేందుకు లీగల్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో లేదా ప్రశ్న, జవాబుల రూపంలోనూ అవసరమైన వివరాలను అందించడం దీని ప్రత్యేకత. లక్షల గంటలు పట్టే పని సెకన్లలోనే... కోర్టు కేసుల్లో మాత్రమే కాదు.. కంపెనీల్లోనూ కాంట్రాక్ట్‌ల రూపంలో బోలెడన్ని దస్తావేజులు ఉంటాయి. వాటి సక్రమ నిర్వహణ ఎంతో అవసరం. ఇందుకు సరిగ్గా సరిపోయే ఏఐ సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్. ఇటీవల జేపీ మోర్గాన్ అనే సంస్థ ఇలాంటి సాఫ్ట్వేర్ సాయంతో న్యాయవాదులు 3.6 లక్షల గంటల్లో చేసే పనిని సెకన్లలో పూర్తి చేసేసింది. -
Viral Video: కేంద్ర మంత్రి డ్యాన్స్.. ప్రధాని మోదీ స్పందన
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రాల్లో సాంప్రదాయ నృత్యాలు, ఆచార వ్యవహారాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఓ గ్రామంలో ఆయన నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాటలు నృత్యాలతో కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. ప్రజలంతా కరతాల ధ్వనులు చేస్తుంటే.. ఒక్కొక్కరిగా వచ్చి తమ సంప్రదాయ నృత్యం చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కూడా నృత్యం చేసి అక్కడి ప్రజలను ఉత్సాహపరిచారు. తాను చేసిన సంప్రదాయ డ్యాన్స్ వీడియోను కిరణ్ రిజిజ్ తన ట్వీటర్ ఖాతాలో షేర్చేశారు. ప్రస్తుతం ఆయన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి నృత్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ కూడా ఓ మంచి డ్యాన్సర్, అద్భుతమైన అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని చూడటం చాలా ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు. Our Law Minister @KirenRijiju is also a decent dancer! Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD — Narendra Modi (@narendramodi) September 30, 2021 -
హైకోర్టు జడ్జీలుగా సుప్రీం కొలీజియం నుంచి 80 పేర్లు
న్యూఢిల్లీ: గత సంవత్సర కాలంలో వేర్వేరు హైకోర్టుల్లో జడ్జీలుగా నియమాకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 80 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పేర్లలో 45 మందిని జడ్జీలుగా నియమించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. మిగతా వారి నియామకానికి సంబంధించిన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల వద్ద వేర్వేరు దశల్లో కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1,098 మంది జడ్జీల నియామకానికి అనుమతి ఉండగా ప్రస్తుతం 645 మంది జడ్జీలు విధుల్లో ఉన్నారు. 453 జడ్జీ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ► 2020 ఏడాదిలో సివిల్స్ పరీక్షను రాయలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద పరిశీలనలో లేదని సిబ్బంది శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
Team Modi: బాధ్యతల్లో కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రైల్వే, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు. -
77మంది మంత్రులతో మోదీ నూతన కేబినెట్
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. 43 మంది కొత్తవారి ప్రమాణస్వీకారం అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్ కొలువు దీరింది. కేంద్ర కేబినెట్లో కొత్తగా 36 మందికి చోటు దక్కగా.. 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో ఏడుగురు పాతవారికి, కొత్తగా 8 మందికి కేబినెట్ హోదా దక్కింది. పాతవారిలో కిషన్‌రెడ్డి, హర్దీప్సింగ్ పూరి, ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజుకు కేబినెట్ హోదా దక్కింది. గతంలో వీరు సహాయ మంత్రులుగా పని చేశారు. ఇక కేబినెట్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ నుంచి నలుగురు చొప్పున కేంద్ర కేబినెట్లో చోటు దక్కగా.. గుజరాత్ నుంచి ముగ్గురికి, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఇద్దరు చొప్పున చోటు దక్కించుకున్నారు. అసోం, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, త్రిపుర, మణిపూర్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కిషన్ రెడ్డికి మాత్రమే చోటు దక్కింది. ఆయనకు పదోన్నతి లభించింది. -
యూనివర్సాలిటీ కోటాలో ఒలింపిక్స్‌కు మానా
ఒలింపిక్స్ పోటీలకు మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపికైంది. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు ఎన్నికైనట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) శుక్రవారం ధృవీకరించింది. దీంతో భారతదేశం నుంచి ఒలింపిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా మానా పటేల్ నిలిచింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్.. శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాష్‌లతో కలిసి మానా పటేల్ ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సాలిటీ కోటా ద్వారా పోటీల్లో సత్తా చాటే ఓ మేల్, ఓ ఫిమేల్ అథ్లెట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మానా పటేల్ ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అభినందించారు. 21 ఏళ్ల వయసు గల మానా పటేల్ జాతీయ క్రీడల్లో 50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. మానా పటేల్ 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో స్వర్ణం సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. పటేల్ 72 వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు. 2018 లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో పటేల్ మూడు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లను కైవసం చేసుకున్నారు. 2019లో గాయం తర్వాత ఈ ఏడాదే ఆమె తిరిగి పూల్‌లో దిగింది. -
గల్వాన్ ఘటన: ఈ కుర్ర జవాన్ ఎవరో తెలుసా!
ఇంఫాల్: పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు చైనా శనివారం కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది. అయితే ఈ వీడియోల్లో ఆవేశంతో చైనా దళాలను హెచ్చరిస్తూ ఓ కుర్ర జవాను భారత సైన్యాన్ని నడిపించినట్లు కనిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. ఇంతకీ అతడు ఎవరా అని తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే చైనా ఈ వీడియోలను విడుదల చేసిన తర్వాత కూడా భారత్ అతడి వివరాలను వెల్లడించడంలో గొప్యత పాటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర యువజన వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ఈ కుర్ర ఆఫీసర్ ఎవరన్నది ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘ఇతడు మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా మనినగ్భా రంగ్నామి. 2018లో సైన్యంలో చేరిన ఈ కుర్ర ఆఫీసరు ప్రస్తుతం 18వ బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టు’ ఆయన పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ సైతం ట్వీట్ చేసి కెప్టెన్ రంగ్నామీపై ప్రశంసలు కురిపించారు. ‘మీట్ మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా. ఇతడు గల్వాన్ లోయ వద్ద చైనాకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో భారత దళాన్ని నడిపించాడు. దేశం కోసం నిలబడి అతడు చూపించిన శౌర్యం మనందరినీ గర్వించేలా చేసింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా అతడిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. Meet Capt. Soiba Maningba Rangnamei from Senapati District, Manipur of 16 Bihar, leading his men in Galwan during the confrontation against the Chinese PLA. The valour you have shown while standing up for the Nation has made all of us proud. pic.twitter.com/YUuyGzWtaa — N.Biren Singh (@NBirenSingh) February 20, 2021 చదవండి: గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా ఎట్టకేలకు దిగొచ్చిన చైనా -
అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్
న్యూఢిల్లీ: ఒలంపియన్, షూటర్ మను భాకర్‌కు ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదరయ్యింది. ఆయుధాలు తీసుకెళ్లడానికి వీలు లేదంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అంతేకాక డబ్బులు కూడా డిమాండ్ చేశారు. చివరకు మంత్రి కిరెణ్ రిజుజు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు మను భాకర్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘షూటింగ్ ట్రైనింగ్ నిమిత్తం నేను మధ్యప్రదేశ్ భోపాల్‌లోని షూటింగ్ అకాడమీకి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నాతో పాటు తీసుకెళ్లడం తప్పని సరి. ఈ క్రమంలో నేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాను. ఏఐ 437 విమానంలో నేను ప్రయాణించాల్సి ఉంది. కానీ ఎయిర్‌పోర్టు సిబ్బంది నన్ను విమానం ఎక్కడానికి అనుమతించలేదు. అన్ని పత్రాలు చూపించినప్పటికి వారు నన్ను డబ్బులు అడిగారు. డీజీసీఏ అనుమతి ఇచ్చినప్పటికి వారు 10,200 చెల్లించాలని తెలిపారు’’ అన్నారు ‘‘వారిలో ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఇన్ చార్జ్ మనోజ్ గుప్తా, మిగతా సిబ్బంది నన్ను దారుణంగా అవమానించారు. నన్ను క్రిమినల్ కన్నా దారుణంగా చూశారు. కాస్త మర్యాదగా ప్రవర్తించమని నేను వారిని కోరాను. ప్రతిసారి ఇలా ఆటగాళ్లను అవమానించకండి.. వారి దగ్గర డబ్బులు అడగకండి’’ అంటూ ట్వీట్ చేశారు మను భాకర్. దాంతో పాటు కేంద్ర మంత్రి కిరెణ్ రిజుజు, హర్దీప్ సింగ్ పూరిని ట్యాగ్ చేశారు. IGI Delhi .Going to Bhopal (MP Shooting Acadmy For my training i need to carry weapons and ammunition, Request @airindiain Officials to give little respect or at least don’t Insult players every time &please don’t ask money. I Have @DGCAIndia permit @HardeepSPuri @VasundharaBJP pic.twitter.com/hYO8nVcW0z — Manu Bhaker (@realmanubhaker) February 19, 2021 ఈ ట్వీట్‌పై కిరెణ్ రిజుజు స్పందించారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో మాట్లాడి వివాదానికి ముగింపు పలికారు. అనంతరం కిరెణ్ రిజుజుకు కృతజ్ఞతలు తెలిపారు మను భాకర్. ప్రస్తుతం ఈ వివాదంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘దేశాన్ని దోచుకుని.. దొంగ పత్రాలతో ఇక్కడి నుంచి పారిపోయే వారికి మర్యాద ఇస్తారు.. అంతర్జాతీయ వేదిక మీద దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసేవారి విషయంలో ఇలా ప్రవర్తించడం దారుణం’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. దీనిపై ఎయిర్ ఇండియా సిబ్బంది స్పందించింది. డబ్బులు అడిగిన మాట వాస్తవమే కానీ అది లంచం కాదని .. ఆయుధాలను తీసుకెళ్లేందుకు చెల్లించాల్సిన చార్జీలుగా పేర్కొన్నది. అంతేకాక ఎయిరిండియా క్రీడాకారులను ఎన్నటికి అవమానించదని.. వారిని ప్రోత్సాహిస్తుందని.. గౌరవిస్తుందని తెలిపింది. చదవండి: ‘ఎవరికీ క్రీడలంటే పరిజ్ఞానం లేదు’ 'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి! -
11 గంటల్లో 180 కి.మీ పరుగు!
న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ వీరులను స్మరించుకుంది. వారి గౌరవార్థం 180 కిలోమీటర్ల బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించింది. 930 బీఎస్ఎఫ్ సైనికులతో డిసెంబర్ 13 అర్థరాత్రి నుంచి 14 వ తేదీ ఉదయం వరకు రాజస్తాన్‌లోని అనూప్‌ఘర్‌లో ఈ ర్యాలీ కొనసాగింది. బీఎస్ఎఫ్ ప్రయత్నాన్ని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కొనియాడారు. బ్యాటర్ రిలే ర్యాలీలో పాల్గొన్న సైనికులపై ప్రశంసలు కురిపించారు. 930 మంది బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా 1971 యుద్ధ వీరుల గౌరవార్థం బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించారని ట్విటర్లో పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. కాగా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు భారత్ 1971లో యుద్ధ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీపై భారత ఆర్మీ పట్టు సాధించింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీ, అతని 93 వేల సైనిక బలగంతో భారత్ ఎదుట లొంగిపోయారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. ఇక ఈ యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతియేడు డిసెంబర్ 16న విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. (చదవండి: రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ, గుర్తు అదేనా ?) -
సింధు.. షాక్‌కు గురి చేశావ్: స్పోర్ట్స్ మినిస్టర్
న్యూఢిల్లీ: తాను రిటైర్మెంట్ ప్రకటించినంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ప్రకటనపై అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ‘నేను రిటైరయ్యాను’ అని సింధు చేసిన పోస్ట్ గందరగోళానికి గురి చేసింది. అయితే అది బ్యాడ్మింటన్ ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పిన ప్రకటన కాదని తర్వాత తెలియడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు ఇంత వ్యంగ్యం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. కాగా, సింధు చేసిన ప్రకటనపై కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజుజు సైతం స్పందించారు. ఒక చిన్నపాటి షాక్‌కు గురి చేశావంటూ ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. ‘ సింధు.. నువ్వు మినీ షాకిచ్చావ్. నీ శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను కచ్చితంగా చెప్పగలను.. నీ బలం, నీ శక్తితో మరెన్నో విజయాలను భారత్‌కు అందిస్తావని ఆశిస్తున్నా’ అని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇస్తున్నాననే క్రమంలోనే సింధు ‘ఐ రిటైర్’ అంటూ పోస్ట్ చేసి గందరగోళానికి తెరతీసింది. ఇంత ఆకస్మికంగా సింధు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. డెన్మార్క్ ఓపెన్ చివరది అంటూ వెల్లడించడం ఇంకా అయోమయానికి గురి చేసింది. కాగా, కరోనా కారణంగా ఆటకు కాస్త విరామం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సింధు ఇలా చేసిందని భావిస్తున్నారు. ఇక కిరెన్ రిజుజు ట్వీటర్ పోస్ట్ కూడా సింధు పూర్తిగా ఆటకు స్వస్తి పలకలేదని విషయాన్ని తెలియజేస్తోంది. You actually gave a mini shock @Pvsindhu1 but I had unflinching faith in your power of determination. I'm sure you have the strength and stamina to bring many more laurels for India 🇮🇳! https://t.co/D4VIT7Poyv — Kiren Rijiju (@KirenRijiju) November 2, 2020 ‘కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి.‘డెన్మార్క్ ఓపెన్ జరగలేదు. కానీ, నేను ప్రాక్టీస్ చేయటం మానలేదు. ఏషియా ఓపెన్‌కు ప్రిపేర్ అవుతున్నాను. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడేవరకు పోరాడుతూనే ఉంటాను’ అని సింధు పోస్ట్ చేశారు. -
ఆ ఐదుగురు చైనాలోనే ఉన్నారు
న్యూఢిల్లీ: గత వారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ వైపు ఉన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ధృవీకరించిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇప్పుడే చెప్పలేం) China's PLA has responded to the hotline message sent by Indian Army. They have confirmed that the missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover the persons to our authority is being worked out. — Kiren Rijiju (@KirenRijiju) September 8, 2020 అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబన్సిరి జిల్లా నుంచి శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు దీని గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడే చెప్పలేం
న్యూఢిల్లీ: స్టేడియాల్లోకి ప్రేక్షకులను ఎప్పుడు అనుమతిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌కు చెందిన అప్లికేషన్‌ను శుక్రవారం ఆన్లైన్లో ప్రారంభించిన ఆయన కరోనా వ్యాప్తి ఉన్నంత కాలం ఈ విషయంపై స్పష్టతనివ్వలేమని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అంశంపై ఇప్పుడే మాట్లాడలేను. వీలైనంత తొందరగా ప్రేక్షకులతో స్టేడియాలు కళకళలాడాలని నేనూ కోరుకుంటున్నా. దానికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే అందరికీ ప్రధానం. దీనికి స్థానిక అధికార యంత్రాంగాలు ఒప్పుకోవాలి. వారి నిర్ణయానికే మేం కూడా కట్టుబడతాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి వారికే అవగాహన ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2028 ఒలింపిక్స్ నాటికి భారత్ పతకాల జాబితాలో టాప్–10లో ఉండాలన్న లక్ష్యంపై కొందరు విమర్శలు చేస్తున్నారని రిజుజు వెల్లడించారు. ‘టాప్–10లో ఎలా ఉంటామని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు పంచుకోవచ్చు. వారి మాటల్ని నేను పట్టించుకోను. మనం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలి. వరల్డ్ చాంపియన్‌ను తయారు చేసేందుకు కనీసం 8 ఏళ్లు అవసరం. మేం అదే పనిలో ఉన్నాం’ అని అన్నారు. -
తొలిసారి వర్చువల్‌గా క్రీడా పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి. ఈ ఏదాడి కోవిడ్ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్ నాటికి పతకాల సాధనలో భారత్ టాప్-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్‌లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు. (చదవండి: ఇదే నా నిరసన... ) ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చండీగఢ్, కోల్‌కతా, సోనపట్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది మొత్తం 74 మందికి అవార్డులు ప్రకటించగా.. వారిలో ఐదుగురికి రాజీవ్ ఖేల్ రత్న.. 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డులు అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. అవార్డు దక్కిన వారిలో కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారిలో రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వినేశ్ ఫోగట్ హాజరు కాలేదు. ఇక రోహిత్ శర్మ యూఏఈలోని ఐపీఎల్ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు. -
‘ఎవరికీ క్రీడలంటే పరిజ్ఞానం లేదు’
న్యూఢిల్లీ: భారతదేశంలో దురదృష్టవశాత్తూ సరైన క్రీడా సంస్కృతి లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సరిగ్గా చెప్పాలంటే మన సమాజంలో ఎక్కువ మందికి క్రీడలపై కనీస పరిజ్ఞానం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరిని క్రీడల్లో ప్రోత్సహించే దిశలో జరిగిన ఘటనలు దీనికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. తన సహచర పార్లమెంట్ సభ్యులకు కూడా ఆటలంటే అవగాహన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కోవిడ్ సమయంలో తండ్రిని రిక్షాలో కూర్చొబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతి కుమారి, గ్రామీణ క్రీడల్లో ఆకట్టుకున్న శ్రీనివాస గౌడ, రమేశ్ గుర్జర్ల ఉదాహరణలు చూడండి. ఆ అమ్మాయిది నిజానికి విషాదం. కానీ నా తోటి ఎంపీలు ఆమె సైక్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తుందని చెప్పారు. అసలు సైక్లింగ్‌లో ఎన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఒలింపిక్ పతకం గెలవాలంటే ఏం చేయాలో వారికి తెలుసా? ఏదో చదివింది చెప్పేస్తుంటారు. ఎద్దులతో కలిసి పరుగెత్తిన శ్రీనివాస్ కూడా ప్రొఫెషనల్ అథ్లెట్ అయ్యే అవకాశం లేదని నాకు నిపుణులు చెప్పారు. కానీ కొందరేమో బోల్ట్‌తో పోల్చడం మొదలు పెట్టారు. ఎక్కువ శాతం మందికి క్రీడల గురించి ఏమాత్రం తెలీదని మనకు అర్థమవుతుంది. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది’ అని రిజిజు విశ్లేషించారు. ఒలింపిక్స్‌లో ఎప్పుడో ఒకసారి సాధించే విజయాలకు పొంగిపోయి సంబరాలతో సరిపెట్టకుండా అలాంటి విజయాలు మళ్లీ మళ్లీ సాధించేలా ప్రయత్నించాలని రిజిజు సూచించారు. -
పరుగుల రాణికి యువీ బర్త్‌డే విషెస్
పరుగుల రాణి పీటీ ఉష జన్మదినం సందర్భంగా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నేడు 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు ఆమెకు ట్విటర్ వేదికగా పుట్టనరోజలు శుభాకాంక్షలు తెలిపారు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పరుగుల రాణిగా మన్నలందుకున్న పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పోరాట పటిమ, అద్భుతమైన విజయాలు చూస్తూ పెరిగాం. మీ స్ఫూర్తి మమ్మల్ని భారతీయులుగా గర్వించేలా చేసింది. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో పనిచేస్తున్నారు. మీకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’అని యువీ ట్వీట్ చేశాడు. ‘లెజండ్, భారతీయ నిజమైన గోల్డె్ గర్ల్ పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఇప్పటికీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమెకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’అని కిరణ్ రిజుజు ట్విటర్లో పేర్కొన్నారు. దాంతోపాటు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను పోస్టుకు జత చేశారు. కాగా, పీటీ ఉష 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి పలు అద్భుత విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలు, 1982 ఢిల్లీ ఆసియా క్రీడలు, 1990 ఆసియాడ్‌లో పాల్గొని 4 బంగారు పతకాలు, 7 రజత పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో రిటైర్ అయిన ఉష భావి అథ్లెట్ల శిక్షణ కోసం ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను నెలకొల్పి సేవలందిస్తున్నారు. -
పునర్విభజన కమిటీలోకి ఎంపీలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిరేన్ రిజిజు, జితేంద్ర సింగ్ సైతం ఉన్నారు. 26న వెలువడిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌కు కిరేన్ రిజిజు, తపిర్ గావో ప్రాతినిధ్యం వహిస్తారు. అస్సాంకు పల్లవ్ లోచన్ దాస్, అబ్దుల్ ఖలేక్, రాజ్‌దీప్ రాయ్, దిలీప్ సైకియా, నబ సరానియా, మణిపూర్‌కు లోర్హో ఫోజ్, రంజన్ రాజ్‌కుమార్, నాగాలాండ్‌కు టోఖెహో యెఫ్తోమి ప్రాతినిధ్యం వహిస్తారు. జమ్మూకశ్మీర్‌కు ఫరూక్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ లోనె, హస్నైన్ మసూదీ, జుగల్ కిశోర్ శర్మ, జితేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కేంద్రం మార్చి 6న పునర్ విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. పునర్విభజన చట్టం2002, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వీరు పాలుపంచుకుంటారు. -
కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ భవిష్యత్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల ఆధారంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. క్రీడా టోర్నమెంట్లు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా కట్టడిపైనే ఉంది’ అని కిరణ్ రిజిజు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడితే... అవే తేదీల్లో భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. -
జాతీయ క్రీడా అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత, భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంపిక ప్రక్రియను మార్చాలని పేర్కొంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు శుక్రవారం లేఖ రాశాడు. ప్రస్తుతం అమలవుతోన్న విధానంలో వివక్ష ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రస్తుత విధానంలో అవార్డుల కోసం ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. అందులో నుంచి క్రీడా కమిటీ కొన్నింటిని ఎంపిక చేస్తుంది. ఈ ఎంపికను క్రీడా కమిటీ సభ్యులు ప్రభావితం చేయొచ్చు. ఇందులో పారదర్శకత లేదు’ అని అమిత్ లేఖలో రాసుకొచ్చాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఈ ప్రక్రియలో మార్పు రావాల్సిందే కాబట్టి అందుకు తానే ముందుకొచ్చానని అమిత్ తెలిపాడు. ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ, ‘సాయ్’ అధికారుల దగ్గర అవార్డు నామినీల జాబితా ఉందని పేర్కొన్న అమిత్... ఎవరికి అవార్డు దక్కుతుందో, ఎవరికి దక్కదో వారికి తెలుసని పేర్కొన్నాడు. గతంలో రెండు పర్యాయాలు ‘అర్జున’ అవార్డు కోసం అమిత్ నామినేట్ అయినప్పటికీ డోపింగ్ ఆరోపణలతో అతని పేరు తిరస్కరణకు గురైంది. భారత్ తరఫున నిలకడగా రాణిస్తోన్న తనకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 2012లో చికెన్‌పాక్స్ చికిత్సలో భాగంగా తీసుకున్న ఔషధాల కారణంగా అమిత్ డోపింగ్‌లో పట్టుబడి ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ నేపథ్యమున్న క్రీడాకారులు జాతీయ క్రీడా పురస్కారాలకు అనర్హులని కేంద్ర క్రీడా శాఖ గతంలో పేర్కొనడంతో అమిత్‌కు జాతీయ క్రీడా అవార్డులు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
వార్తా సంస్థపై కేంద్రమంత్రి ఫైర్.. ఏమైందంటే..
ఢిల్లీ : ఇటీవలి అరుణాచల్‌ప్రదేశ్‌లో తినడానికి అన్నంలేక పామును చంపి తిన్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఓ ప్రముఖ వార్తాసంస్థ ప్రచురించిన ఈ వార్తలో నిజం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశంలోనే పేరున్న వార్తాసంస్థ అయి ఉండి తప్పుడు వార్తను ఎలా ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. దేశంలో అన్నం లేకపోతే పాములను తినడం ఎక్కడైనా జరిగిందా అంటూ ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్ అరుదైన పాములకి నిలయం అని, అక్కడ ఎవరూ పాములని చంపి తినరని స్పష్టం చేశారు. సదరు వార్తాసంస్థ కథనాన్ని జోడిస్తూ వాస్తవాలు ధ్రువీకరించకుండా ఏది పడితే అది రాస్తే ఎలా అంటూ ట్విటర్లో వేదికగా ఫైర్ అయ్యారు. Dear @ndtv please don't make stories without verification! I'm dead against hunting and killing of animals so is the State Govt. But to say that there's no rice left for the people leading to killing of cobra is rubbish! No one hunts snakes for consumption in Arunachal Pradesh. https://t.co/s07bX1rbEq — Kiren Rijiju (@KirenRijiju) April 20, 2020 ఇక అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వార్తను తప్పుపట్టింది. తమ రాష్ట్రంలో వచ్చే 3 నెలలకు సరిపడా బియ్యం ఉందనీ, పేదలందరికీ తాము ఉచిత రేషన్ కింద బియ్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం 20వేల మంది ఈ ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు 492 మందిని అరెస్టు చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన 750 వాహనాదారులపై కేసు నమోదుచేసి వాహనాలు సీజ్ చేసినట్లు డీజీపీ ఆర్పి ఉపాధ్యాయ తెలిపారు. -
ఏప్రిల్ 15 వరకు ఆటల్లేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కోవిడ్–19) వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా జాతీయ స్పోర్ట్స్ సమాఖ్యలకు (ఎన్ఎస్ఎఫ్) క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు దేశంలో ఎటువంటి టోర్నమెంట్లను, సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహించరాదని స్పష్టం చేసింది. దాంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు ఒలింపిక్స్ సన్నాహక క్యాంపుల్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యేలా చూడాల్సిన భాద్యతను ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అప్పగించింది. వారిని క్యాంపుతో సంబంధం లేని కోచ్‌లు గానీ, ఏ ఇతర సిబ్బంది గానీ కలవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒలింపిక్స్ కోసం సన్నద్ధం అవుతున్న క్రీడాకారులు మాత్రమే ప్రస్తుతం శిక్షణ శిబిరాల్లో ఉన్నారు.’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో టోర్నమెంట్లు ముగించుకుని దేశానికి వస్తున్న అథ్లెట్లపై నిఘా ఉంచామని రిజిజు అన్నారు. వారు దేశంలో అడుగుపెట్టిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 15 తర్వాతే ఐపీఎల్‌పై నిర్ణయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రిజిజు... ఏప్రిల్ 15 తర్వాతే ఐపీఎల్‌పై స్పష్టమైన నిర్ణయం రావచ్చన్నారు. అంతేకాకుండా ఐపీఎల్ అనేది బీసీసీఐ చేతుల్లో ఉందని... అది ఒలింపిక్ క్రీడ కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో తాము ఆటగాళ్ల, ప్రేక్షకుల ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆటగాళ్లు... కరచాలనం వద్దు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తి నేపథ్యంలో అథ్లెట్లు కరచాలనానికి దూరంగా ఉండాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. కరచాలనానికి బదులుగా నమస్కారం చేయాలని అన్నారు. ఇతరులతో మాట్లాడే సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ‘సామాన్యులు, క్రీడాకారులకు నాదో సలహా. వీలైనంత వరకు కరచాలనం చేయకండి. అదేం తప్పనిసరి చర్య కాదు. కరచాలనానికి బదులుగా నమస్కరించండి’ అని రిజిజు సూచించారు. విదేశీ టోర్నీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే భారత అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యటనల షెడ్యూల్ చేయాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు సూచించారు. త్వరలో ప్రపంచ మెగా ఈవెంట్ ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది పోటీలు ఆటగాళ్లకు ఎంత కీలకమో తాము అర్థం చేసుకోగలమని ‘సాయ్’ పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనలను జాతీయ సమాఖ్యలు బేఖాతరు చేయకూడదని హెచ్చరించింది. కరోనా కారణంగా ఈనెల 15న జరగాల్సిన షూటింగ్ ప్రపంచ కప్‌తో పాటు, ఫిబా 3–3 బాస్కెట్‌బాల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు భారత్‌లో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. -
కంబాళ: మరి ఈ జాకీని ఏమని పిలవాలో!
-
కంబాళ: మరి ఈ జాకీని ఏమని పిలవాలో!
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబాళలో 30 ఏళ్ల రికార్డు తిరగరాసిన శ్రీనివాస గౌడను ఉసేన్ బోల్ట్‌తో పోల్చాం. మరి శ్రీనివాస గౌడ రికార్డు తిరగరాసిన నిశాంత్ శెట్టీనీ ఏమని పిలవాలో..! అవును, వేనూర్లో ఆదివారం జరిగిన కంబాళ క్రీడలో బజగోళి జోగిబెట్టుకు చెందిన ఈ నయా కంబాళ జాకీ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకండ్లలో పరుగెత్తాడు. దీనిని 100 మీటర్లకు లెక్కించినపుడు.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డు వేగాన్ని మించిన వేగం నమోదైనట్టే. అంటే బోల్ట్ కంటే 0.07 సెకండ్లు వేగంగా నిశాంత్ పరుగు పూర్తి చేశాడు. (చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!) ఇక కన్నడనాట వారం క్రితం జరిగిన ఇదే ‘కంబాళ’ క్రీడలో శ్రీనివాస గౌడ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు వేగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. పంట పొలాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీనివాస్ గౌడకు ట్రైనింగ్ ఇస్తే గొప్ప అథ్లెట్ అవుతాడని ఆనంద్ మహింద్రా ట్వీట్ చేయడం.. దానికి క్రీడల మంత్రి కిరన్ రిజుజు స్పందించి అతనికి సాయ్ నుంచి ఆహ్వానం పంపుతామని బదులివ్వడం తెలిసిందే. ఇక శ్రీనివాస గౌడ రికార్డును తిరగరాసిన నిశాంత్‌కు ఎలాంటి ఆహ్వానం అందుతుందో చూడాలి..! (చదవండి : కంబాల రేసర్‌కు సాయ్ పిలుపు!) వాటి వల్లే ఈ విజయం.. శ్రీనివాస గౌడపై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి యడియూరప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షల నదగు బహుమతి కూడా అందించడం విశేషం. అయితే, సీఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాడ్లాడిన శ్రీనివాస్ గౌడ తన విజయంలో దున్నపోతుల పాత్రే కీలకమని అన్నాడు. అవి వేగంగా పరుగెత్తడం వల్లే తాను అంతే వేగంగా దూసుకెళ్లానని చెప్పుకొచ్చాడు. చెప్పులు లేకుండా.. పంట పొలాల్లో పరుగెత్తడం తెలిసిన తనకు వేరే ఆటలేవీ వద్దని అన్నాడు. అనుభవం లేని కారణంగానే పెద్దల సూచనల్ని కాదంటున్నానని పేర్కొన్నాడు. -
'నాకు న్యాయం కావాలి'
రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్తో మరో యువ బాక్సర్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలతో స్టార్ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ సమయంలో మేరీ కోమ్ పక్షాన నిలిచిన ఫెడరేషన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్ జట్టులో మణిపూర్ సీనియర్ బాక్సర్ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో యువ బాక్సర్ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్ దిగ్గజమైన మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం. నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్ ట్రయల్స్ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ అవకాశమని బీఎఫ్ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్ బెర్తు కట్టబెట్టింది. నిఖత్ డిమాండ్ సబబే: బింద్రా భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా బాక్సర్ నిఖత్ జరీన్ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్ కెరీర్లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు. -
‘భయ్యా.. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది’
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మాంసం వ్యాపారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా వదిలేయడమే కాక తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు మాంసాన్ని కవర్ల బదులు ఆకుల్లో ప్యాక్ చేసి ఇస్తూ.. సామాన్యులతో పాటు.. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు దృష్టిని కూడా ఆకర్షించాడు. దాంతో అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు కిరెణ్ రిజిజు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లేపా రాడా జిల్లాకు చెందిన స్థానిక మాంసం దుకాణదారుడు.. తన షాప్‌కు వచ్చి మాంసం తీసుకునే వారికి ప్లాస్టిక్ కవర్లకు బదులు ఆకుల్లో పెట్టి సరఫరా చేస్తున్నాడు. "PM @narendramodi has told us not to use plastics so we are using local leaves because plastics are no more available" A local meat vendor at remote Tirbin, Lepa Rada Dist, Arunachal Pradesh. pic.twitter.com/Z1vuB2K8fK — Kiren Rijiju (@KirenRijiju) October 6, 2019 ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేం ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం లేదు. దాని బదులు స్థానికంగా లభించే ఆకులను ఉపయోగిస్తూ.. పర్యావరణహితంగా మెలుగుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మాంస దుకాణదారునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బాల్యంలో మాంసాన్ని ఇలానే ఆకుల్లో పెట్టి ఇచ్చే వారని గుర్తు చేసుకుంటున్నారు. 2022 నాటికి ఒకసారి మాత్రమే వినియోగించే వీలున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
‘ఆ కోచ్‌కు ఎక్కడా జాబ్ ఇవ్వొద్దు’
న్యూఢిల్లీ: ఓ మైనర్ గర్ల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గోవా స్మిమ్మింగ్ కోచ్ సురజిత్ గంగూలీపై వేటు పడింది. తనపై సురజిత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మైనర్ బాలిక ఫిర్యాదుకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. అతనిపై చర్యలకు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు రిజుజు ఆమెకు హామీ ఇచ్చారు. అదే సమయంలో సురజిత్‌కు భారత్‌లో ఎక్కడా కూడా స్విమ్మింగ్ కోచ్‌గా పదవి ఇవ్వొద్దంటూ స్విమ్మింగ్ ఫెడరేషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇప్పటికే గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దేశంలో ఎక్కడా అతనికి ఉద్యోగం లేకుండా స్విమ్మింగ్ ఫెడరేషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇది అన్ని ఫెడరేషన్లకు వర్తిస్తుంది. క్రమశిక్షణా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు’ అని రిజుజు తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. రెండున్నరేళ్ల క్రితం సురజిత్ గంగూలీని స్విమ్మింగ్ కోచ్‌గా గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ నియమించింది. సురజిత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉన్న కారణంగానే అతన్ని కోచ్‌గా ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో సురజిత్ 12 పతకాలు సాధించారు. 1984లో హాంకాంగ్‌లో జరిగిన ఆసియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో సురజిత్ తొలి పతకం గెలుచుకున్నారు. అయితే తాజాగా మైనర్ బాలికపై సురజిత్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతనిపై వేటు పడింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సురజిత్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. I've taken a strong view of the incident. The Goa Swimming Association has terminated the contract of coach Surajit Ganguly. I'm asking the Swimming Federation of India to ensure that this coach is not employed anywhere in India. This applies to all Federations & disciplines. https://t.co/q6H1ixZVsi — Kiren Rijiju (@KirenRijiju) September 5, 2019 -
క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును కేంద్ర మంత్రి అభినందించారు. మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. -
‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను!’
సాక్షి, హైదరాబాద్: తేనె అంటే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ ఇష్టమే. ప్రస్తుత జీవనశైలిలో తేనె వాడకం చాలా పెరిగి పోయింది. ఎక్స్ట్రా హనీ కావాలంటూ అడగటం మనం వింటూనే ఉంటాం. అయితే కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియో చూశాక జీవితంలో తేనె వాడమని అంటున్నారు పలువురు నెటిజన్లు. తేనెపట్టు సాధారణంగా చెట్లకు లేదా ఇంటి కప్పులకు వేలాడుతూ ఉండటాన్ని చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తిపై ఉండరాని చోట ఉండటం చూసి అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి బ్యాక్ సీట్‌పై తేనెపట్టు ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి షేర్ చేసిన వీడియో కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. భారత షట్లర్ గుత్తా జ్వాలాతో సహా అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు. ‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను’అని ఓ నెటిజన్ సరదాగా పేర్కొనగా.. ‘ఇంకా నయం జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి బతికిపోయావ్, లేదంటే? అంతే సంగతి’ అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. అయితే మరికొంత మంది ఆ వ్యక్తిపై జాలి చూపించారు. తరువాత ఏమయిందని ఉత్సుకతతో అడుగుతున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో నాగాలాండ్ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. -
ఆ యువకుడి పరుగుకు క్రీడా మంత్రి ఫిదా!
భోపాల్: ఉసేన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్‌లో దిగాడంటే చిరుత కంటే వేగంగా దూసుకుపోతాడు ఈ జమైకా అథ్లెట్. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బోల్ట్ అంటే చాలామంది అథ్లెట్లకు ఆదర్శం. కాగా, మనకు ఓ బోల్డ్ దొరికినట్లే కనబడుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్(19)కు పరుగు అంటే విపరీతమైన ఆసక్తి. అదే సమయంలో పరుగులో మంచి నైపుణ్యం కూడా ఉంది. ఇప్పుడు అతనే పరుగే ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడం, అక్కడి నుంచి అది కాస్తా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు వరకూ వెళ్లడం జరిగాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామేశ్వర్ అనే యువకుడికి రన్నింగ్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ క్రమంలో అతడు కనీసం చెప్పులు కూడా లేకుండా 100మీటర్ల పరుగును 11 సెకన్లలో చేధించే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో చౌహాన్ ఆ వీడియోను ట్విటర్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌రిజుజుకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘ భారత్‌లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదు. వారికి సరైన వేదిక దొరికినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. పరుగుపందెంలో ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఒకవేళ మంచి సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే దేశానికి పేరు తీసుకురాగలడన్నా నమ్మకం ఉంది’ అని పేర్కొటూ రిజుజుకి ట్యాగ్ చేశారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌ను చూసిన కిరణ్‌రిజుజు ఫిదా అయిపోయారు. అందుకు కిరన్ రిజుజు స్పందిస్తూ.. ‘అతడిని ఎలాగైనా నా వద్దకు పంపించండి, తప్పకుండా అతడిని అథ్లెటిక్స్ అకాడమీలో చేర్పించి ఇంకా మెరుగయ్యేలా మంచి శిక్షణ ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారు. అతనికి మంచి శిక్షణ దొరికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం. India is blessed with talented individuals. Provided with right opportunity & right platform, they'll come out with flying colours to create history! Urge @IndiaSports Min. @KirenRijiju ji to extend support to this aspiring athlete to advance his skills! Thanks to @govindtimes. pic.twitter.com/ZlTAnSf6WO — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 16, 2019 -
‘అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన పని లేదు’
గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన అక్షయ్.. తన పౌరసత్వం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జూ అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్. ఈ మేరకు ‘అక్షయ్.. మీ దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. సాయుధ దళాల సిబ్బంది చనిపోయినప్పుడు మీరు స్పందించిన తీరు.. వారిని ఆదుకోవడం కోసం ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం ద్వారా మీరు విరాళాలు సేకరించిన విధానం దేశభక్తి కలిగిన ఓ భారతీయుడికి అసలైన ఉదాహరణగా నిలుస్తుందం’టూ కిరెన్ రిజ్జూ ట్వీట్ చేశారు. దాంతో అక్షయ్ ట్విటర్ ద్వారా కిరెన్ రిజ్జూకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ధన్యవాదాలు తెలపడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి కిరెన్ రిజ్జూ సర్. నా పట్ల మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు. భారత ఆర్మీ పట్ల, ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందం’టూ అక్షయ్ రీట్వీట్ చేశారు. Thank you so much @KirenRijiju Sir, and I apologise for the delayed response. I am grateful for your kind words. Please be assured, my commitment to #BharatKeVeer and to the Indian armed forces would remain steady, no matter what 🙏🏻 https://t.co/W1298prsEQ — Akshay Kumar (@akshaykumar) May 7, 2019 బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా పౌరసత్వం విషయంలో అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. తన పౌరసత్వం వివాదం గుర్చి స్పందిస్తూ అక్షయ్ తన దగ్గర కెనడా పాస్‌పోర్ట్ ఉందన్నారు. కానీ గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని తెలిపారు. ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అక్షయ్. -
నాన్న కూతురు ఓ వీడియో
-
‘మీ బాస్‌తో చెప్పు నా కూతురి స్కూల్‌కి వెళ్లానని’
న్యూఢిల్లీ : భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లలో సాధరణంగా పిల్లల నుంచి వచ్చే కంప్లైంట్ తల్లిదండ్రులు తమ స్కూల్ ఫంక్షన్స్‌కి హాజరవ్వడం లేదని. ఉద్యోగుల ఇళ్లలోనే ఇలా ఉంటే ఇక ప్రజా ప్రతినిధుల పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటే పరిస్థితే ఎదురయ్యింది బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. మంత్రి కుమార్తె ఢిల్లీలోని ఓ పాఠశాలలో చదువుతుంది. ఈ క్రమంలో స్కూల్లో ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిల్లలు తమ నానమ్మ, తాతలను తీసుకెళ్లాలి. కానీ కిరణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. అతని తల్లిదండ్రులు తమ సొంత ఊరిలో ఉంటున్నారు. దాంతో కిరణ్ కూతురు తన తండ్రిని పాఠశాలలో జరిగే ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ప్రోంగ్రాంకి రావాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణని కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేశారు. దీనిలో కిరణ్ కూతురు ‘పప్పా..! రేపు మా స్కూల్లో ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ఉంది. నువ్వు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా డ్యాన్స్ ప్రోగ్రాంని చూడాలి’ అని కోరింది. అంతేకాక ‘నువ్వు ఎప్పుడు నా స్కూల్‌కి రాలేదు.. ఇలా అయితే ఎలా పప్పా..? ఇప్పుడు నాతో పాటు రావాడానికి నానమ్మ వాళ్లు కూడా ఇక్కడ లేరు కదా..?!’ అంటూ ముద్దు ముద్దుగా అడిగింది. అందుకు కిరణ్ ‘ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను.. రాలేను ఎలా..? సరే.. ప్రయత్నిస్తాను.. కుదిరితే వస్తాను’ అన్నారు. అందుకు కిరణ్ కూతురు ‘నీకు ఆఫీస్ ఉందని నాకు తెలుసు పప్పా. అందుకే నువ్వు నీ బాస్‌తో నా కూతురి పాఠశాలకు వెళ్లాను అని చెప్పు. అప్పుడు నీ బాస్ నిన్ను క్షమిస్తాడు’ అంటూ సమాధానం చెప్పింది. This is how my little daughter convinced me to attend her school's "Grandparents Day" for the first time. pic.twitter.com/ZaIt3y658D — Kiren Rijiju (@KirenRijiju) September 30, 2018 దాదాపు 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ ముద్దు ముద్దు మాటల వీడియోని కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 500 మంది రిట్వీట్ చేశారు. వీడియోతో పాటు కూతురుతో కలిసి స్కూల్లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు కిరణ్. ఈ ఫోటోను కూడా దాదాపు 2000 మంది రిట్వీట్ చేశారు. -
‘ఘర్షణలు రెచ్చగొట్టేవారిని వదిలిపెట్టం’
షిల్లాంగ్: మేఘాలయలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలను కొందరు కావాలనే ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆరోపించారు. గురువారం షిల్లాంగ్‌లో ఖాసీ పిల్లాడిపై ఒక సిక్కూ మహిళ దాడి చేయడంతో ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే. పంజాబ్ వాసులు నివాసముంటున్న మావ్‌లాంగ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, ఘర్షణలను అదుపు చేయడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులకు కొంతమంది డబ్బులు, మద్యం అందిస్తున్నారని సీఎం సంగ్మా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను ప్రోత్సహిస్తున్న పంజాబీలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయలో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవడానికి తమ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పంపుతామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కమిటీ నివేదిక ఆధారంగా పంజాబ్ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. మేఘాలయలోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. షిల్లాంగ్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయని, గురుద్వారపై ఎవరూ దాడి చేయలేదనీ, వదంతులు నమ్మొద్దని ట్వీట్ చేశారు. Beware of rumour-mongers & troublemakers. There was no damage to any Gurdwara or other institutions belonging to the Sikh Minority in Meghalaya. Law & Order situation is under control and the State Govt is extremely vigilant & settling the case. — Kiren Rijiju (@KirenRijiju) June 3, 2018 -
అన్నంత పని చేసేసిన రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నంత పని చేసేశారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ‘శూర్పణక’ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతర కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్బుక్లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్లోని శూర్పణక పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోదీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తన నవ్వుపై మోదీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. ‘‘ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను..’’ అని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేణుక నవ్వడంపై ప్రధాని మాట్లాడుతూ.... ‘‘రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..’’ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక తాను ఎందుకలా నవ్వాల్సి వచ్చిందో ఆమె కూడా వివరణ ఇచ్చుకున్నారు. ‘గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారు. అలాంటాయన ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా’ అంటూ రేణుకా చౌదరి వివరించారు. -
‘అడ్డదారిలో ఆధార్’
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా ముస్లింలు కొందరు ఆధార్, పాన్, ఓటరు కార్డులు సంపాదిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అక్రమ పద్ధతుల్లో వారు ఈ పత్రాలను పొందుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనలను గుర్తించిన వెంటనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులు కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ఆయా పత్రాలను రద్దు చేస్తారని మంత్రి పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రోహింగ్యా ముస్లింలు ఆధార్, పాన్ కార్డులు సంపాదిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నా..వారికి కొందరు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తున్న ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. -
శాంతి భద్రతలే ప్రగతిపథ వారథులు
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సాక్షి, హైదరాబాద్: దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగ నోట్ల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన భద్రత ఉండాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకే)ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘జాతీయ భద్రతపై యువ సమ్మేళనం’అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఎంతో కాలం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండబోదని, దేశం పురోగమించడానికి ఇదే మంచి సమయమని పేర్కొన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనని, ఈ యువత వృద్ధాప్యం పొందేలోపు మన దేశం సంపన్న దేశంగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడిని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తోందని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. నెహ్రూ యువక కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ శేఖర్‌రావు, యువకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గడ్డు పరిస్థితి.. 24 జిల్లాలు వరదల్లో..
లకీంపూర్: అసోంలో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు పలు జిల్లాలను జలమయం చేశాయి. వందల సంఖ్యలో ఊర్లు నీళ్లలో నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల వారిని పల్లపు ప్రాంతాలవైపునకు తరలిస్తున్నారు. దాదాపు 24 జిల్లాలకు చెందిన 15 లక్షలమంది ఈ వరదల ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్న నేపథ్యంలో గురువారం కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు ఏరియల్ సర్వే నిర్వహించారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ పోర్స్, నీతి ఆయోగ్, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటికీ చెందిన అధికారులతో కలిసి ఆయన ఈ సర్వే నిర్వహించారు. అంతకంటే ముందు ఆయన లకీంపూర్‌లోని జిల్లా అధికారులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితిపై వాకబు చేశారు. అలాగే, బాగా దెబ్బతిన్న పస్నోయి బాలిడాన్ అనే గ్రామాన్ని సందర్శించారు. ఒక్క లకీంపూర్ జిల్లాలోనే మూడు లక్షలమంది వరదల భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లోని నదులన్నీ కూడా నీటి మట్లాలు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. -
కేంద్రమంత్రికి తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
ఈటానగర్: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేశారు. వాతావరణం సహకరించకపోవడంతో అప్రమత్తమైన పైలట్ ఓ చిన్న ప్రాంతంలో దానిని ఉన్నపలంగా దింపేశారు. హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఏడుగురు ప్రయాణీకులు, కేంద్రమంత్రి రిజిజు ఎంఐ 17 హెలికాప్టర్లో గువాహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జైరో ప్రాంతానికి బయల్దేరారు. అయితే, పెద్ద మొత్తంలో పొగలుకమ్ముకోవడంతోపాటు వర్షం తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఇంకాస్త ముందుకు వెళితే ప్రమాదం అని గుర్తించిన పైలట్ ఈటానగర్‌లోని ఓ చిన్న బీడు భూముల్లో నిలిపారు. ‘సురక్షితంగా దిగాను నేను చాలా అదృష్టవంతుడ్ని. ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్న బీఎస్ఎఫ్ పైలట్లకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను’ అని ఆయన పీటీఐకి చెప్పారు. -
తాగి కేంద్రమంత్రి ఇంట్లోకి క్యాబ్‌తో దూసుకెళ్లాడు
న్యూఢిల్లీ: తాగిన ఓ క్యాబ్ డ్రైవర్ ఏకంగా ఓ కేంద్ర మంత్రి ఇంట్లోకి కారుతో దూసుకెళ్లాడు. ఆయన ఇంటి ప్రహరీని ఢీకొట్టి కాపలా కాసే సీఐఎస్ఎఫ్ అధికారులను గాయపరిచాడు. దీంతో ప్రహరీ కూడా దెబ్బతిన్నది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని లూటైన్స్లోగల క్రిష్ణ మీనన్ మార్గ్‌లో కేంద్రమంత్రి కిరెణ్ రిజీజుకి అధికారిక నివాసం ఉంది. ఈ ఇంటి ముందు ప్రహరీ మీదకు వేగంగా క్యాబ్ దూసుకొచ్చింది. దీంతో ఇంటిని కాపలా కాస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారులు గాయపడ్డారు. ఈ క్యాబ్ నడిపిన వ్యక్తిని నోయిడాకు చెందిన అభిషేక్‌గా గుర్తించారు. కారు ప్రహరీని ఢీకొట్టిన సమయంలో అతడితో ఒక మహిళ కూడా ఉంది. డ్రైవర్‌కు మెడికల్ పరీక్షలు చేయగా అతడి మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. గాయపడిన సౌరబ్ కుమార్ గౌతమ్ అనే సీఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. -
2000 నోట్ల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ
న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలనకు, బ్లాక్ మనీపై ఉక్కుపాదానికి 500, 1000 రూపాయి నోట్లను రద్దు చేసి కొత్తగా మార్కెట్లోకి 2000 కరెన్సీ నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త 2000 కరెన్సీ నోట్లలో కూడా నకిలీవి రూపొందుతుండటంతో, ఏ క్షణంలోనైనా ఈ నోటును రద్దు చేయనున్నారంటూ మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్లను ప్రభుత్వం కొట్టిపారేసింది. కొత్త 2000 రూపాయి కరెన్సీ నోట్లను రద్దు చేసే ఆలోచనేమి లేదని స్పష్టం చేసింది. నకిలీ కరెన్సీని తాము సీజ్ చేశామని, దీంతో కొత్త 2000 రూపాయి నోట్లను రద్దు చేయబోతున్నట్టు రూమర్లు వస్తున్నాయని హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు. కానీ అలాంటి ఉద్దేశ్యాలేమీ లేవని చెప్పారు. ఆ రూమర్లకు అనుగుణంగా తామేమి వెళ్లమని స్పష్టీకరించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలియజేశారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో నకిలీ కరెన్సీని ఎక్కువగా పట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. కానీ నకిలీ కరెన్సీలు గుర్తించలేకపోతున్నామన్నది కరెక్ట్ కాదని తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం తక్కువ క్వాలిటీ పేపర్ తో రూపొందిన నకిలీ కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చాయని, ఆ తర్వాత మరింత క్వాలిటీ పేపర్ తో ఇవి మార్కెట్లోకి వస్తున్నాయని రిజిజూ పేర్కొన్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో కొత్త నోట్లను కాఫీ చేయడం వారికి కుదరదని తెలిపారు. చాలా కొత్త సెక్యురిటీ ఫీచర్లతో కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చాయని, 100 శాతం కాఫీ చేయడం ఎవరికి సాధ్యం కాదని తాము హామీ ఇస్తున్నట్టు వివరించారు. నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని, నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని హెచ్చరించారు. -
ఆ అమ్మాయి రాజకీయాలు మానేస్తే మంచిది
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ రాజకీయాలు మానేసి చదువుపై దృష్టిపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు హితవు పలికారు. గుర్‌మోహర్ తీరుతో ఆమె తండ్రి, కార్గిల్ అమరవీరుడు మణ్‌దీప్ సింగ్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలను నెటిజెన్లు, కొందరు సెలబ్రిటీలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. గుర్మెహర్ ఫిర్యాదుపై కేసు నమోదు: తనను రేప్ చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గుర్మెహర్ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏబీవీపీకి భయపడనని, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినినంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఏబీవీపీ నాయకులు తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. -
ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. గుర్మెహర్ కౌర్ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కౌర్ ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. ఏబీవీపీని విమర్శించినందుకు కొందరు తనను రేప్ చేస్తామని హెచ్చరించారని ఆ తర్వాత ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గుర్మెహర్ మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని అన్నారు. -
'సిగ్గుమాలిన పని చేసినవారిని వదలొద్దు'
న్యూఢిల్లీ: బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలపై జరిగిన కీచకపర్వంపై ఏమిపట్టనట్లు వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోమంత్రి జీ పరమేశ్వరపై కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యం అవుతుందని హోంశాఖ సహాయమంత్రి కిరెణ్ రిజీజు అన్నారు. నేరస్తులను తప్పకుండా శిక్షించాల్సిందేనని చెప్పారు. (బెంగళూరు ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు) 'ఇలాంటి సిగ్గుమాలిన పని చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేందుకు మేం అంగీకరించం. బెంగళూరు చాలా వైబ్రంట్ సిటీ. అక్కడ మహిళలకు కచ్చితంగా రక్షణ కల్పించాల్సిందే' అని ఆయన అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక హోంశాఖ మంత్రి స్పందిస్తూ ఇలాంటి సందర్భాలు అలాంటి ఘటనలు సహజం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. -
ఆనంద్ శర్మ ప్రశ్నతో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: కేంద్రంలోని పెద్దల సభ మరోసారి మార్మోగింది. రెండుసార్లు వాయిదా పడిన రాజ్యసభ కాంగ్రెస్‌పార్టీ నేత ఆనంద్ శర్మ కేంద్ర మంత్రి కిరెన్ రిజీజుపై తలెత్తిన ఆరోపణలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని హైడ్రో ప్రాజెక్టు విషయంలో రిజీజు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని, పదవిలో నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్‌చేయడంతో రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య దుమారం రేగింది. ఉభయ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. -
మంత్రి కిరెన్ రిజిజుపై అవినీతి ఆరోపణలు
-
‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందిస్తామని చెప్పారు. తమిళనాడు ఎన్నికోరితే అన్ని అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా తమను కోరలేదని వెల్లడించారు. తమిళనాడులో సరిపడా కేంద్ర బలగాలు ఉన్నాయని తెలిపారు. తమిళనాడు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ‘రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు కేంద్రం బంగాలను పంపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కనీస కర్తవ్యం. సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అదనపు బలగాలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని రిజిజు చెప్పారు. -
‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’
-
పాక్ స్పందనపై ఆందోళన వద్దు..
న్యూఢిల్లీః పాకిస్తాన్ స్పందనపై భారత్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. జరిగేదంతా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని, పాకిస్తాన్ స్పందనను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని రిజిజు వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ లోని సైనిక శిబిరంపై దాడిచేసి 17 మంది సైనికుల హత్యకు.. 'తీవ్రవాద రాష్ట్రం' పాకిస్తాన్ కారణమన్న భారత్ ఆరోపణలను పాక్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రిజు సదరు వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ యూరీ పట్టణంలోని సైనిక శిబిరంపై దాడిఘటన విచారకరమని, అయితే జాగ్రత్తగా తమపని తాము చేసుకుపోతామని మంత్రి వెల్లడించారు. -
అదంతా...కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకే సారి ముఖ్యమంత్రితో సహా 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాకివ్వడానికి సిద్ధమయ్యారు. వీరంతా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీఏ)లో చేరడానికి రంగం సిద్ధమైంది. పీపీఏ, బీజేపీ ఇటీవలే ఒక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ విమర్శలపై స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు తమ అభిష్టం మేరకే అక్కడి ప్రాంతీయ పార్టీలో చేరుతున్నారని.. ఈ విషయంలో బీజేపీ చేసేదేంలేదని రిజిజు అన్నారు. కాంగ్రెస్ స్వీయ వైఫల్యానికి బీజేపీని నిందించొద్దని సూచించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కలవడానికి కూడా కొన్ని రోజులవరకు ఆగాల్సివస్తే వారు అలాంటి పార్టీలో ఎలా కొనసాగుతారని రిజిజు ప్రశ్నించారు. -
ఆప్ నేతలకు పనీపాట లేదు: కిరణ్ రిజుజు
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నిప్పులు చెరిగారు. సదరు పార్టీ నేతలకు పనీపాట లేదని ఆయన ఎద్దేవా చేశారు. నాటకాలాడటం వాళ్లు అలవాటైందంటూ ఆప్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కాదని ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని ఆప్ నేతలకు కిరణ్ రిజుజు సూచించారు. ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రిజుజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రిజాజు మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్డీఏ రెండేళ్ల పాలన సాగిందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ప్రజలకు చేరువ కావడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం అందిస్తున్న నిధులతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి వరకూ అందలన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపి... ఎమర్జెన్సీని విధించిన రోజును ఎవరూ మరవరన్నారు. ఎమర్జెన్సీలోని వాస్తవాలు ఈ తరం వారికి తెలియాల్సిన అవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అప్పటి ఎమర్జెన్సీలో పాల్గొన్న వారిని కిరణ్ రిజుజు సత్కరించారు. -
గూగుల్‌కు భారత్ ఝలక్
న్యూఢిల్లీ: గూగుల్ స్ట్రీట్ వీక్షణంలో భారత్‌లోని పలు ప్రదేశాలు చేర్చాలనే ఆలోచనలకు భారత ప్రభుత్వం బ్రేకులు వేసింది. గూగుల్‌కు అనుమతులు ఇస్తే రక్షణ పరమైన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఈ ప్రతిపాదనను హోం శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2008లో జరిగిన ముంబై దాడులు ఇలానే చోటుచేసుకున్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జియోస్పాటికల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్ 2016 అమలు అయితే ఇంటర్నెట్ సంబంధిత పలు సమస్యలకు చిక్కుముడులు విప్పొచ్చని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. గూగుల్ స్ట్రీట్ ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలు 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ఇది అమెరికా, కెనడా, యూరప్‌లలో వినియోగంలో ఉంది.