తాగి కేంద్రమంత్రి ఇంట్లోకి క్యాబ్‌తో దూసుకెళ్లాడు | Cab Rams Wall Of Minister Kiren Rijiju's Home | Sakshi
Sakshi News home page

తాగి కేంద్రమంత్రి ఇంట్లోకి క్యాబ్‌తో దూసుకెళ్లాడు

Published Tue, May 16 2017 12:00 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

తాగి కేంద్రమంత్రి ఇంట్లోకి క్యాబ్‌తో దూసుకెళ్లాడు - Sakshi

తాగి కేంద్రమంత్రి ఇంట్లోకి క్యాబ్‌తో దూసుకెళ్లాడు

న్యూఢిల్లీ: తాగిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఏకంగా ఓ కేంద్ర మంత్రి ఇంట్లోకి కారుతో దూసుకెళ్లాడు. ఆయన ఇంటి ప్రహరీని ఢీకొట్టి కాపలా కాసే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులను గాయపరిచాడు. దీంతో ప్రహరీ కూడా దెబ్బతిన్నది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని లూటైన్స్‌లోగల క్రిష్ణ మీనన్‌ మార్గ్‌లో కేంద్రమంత్రి కిరెణ్‌ రిజీజుకి అధికారిక నివాసం ఉంది. ఈ ఇంటి ముందు ప్రహరీ మీదకు వేగంగా క్యాబ్‌ దూసుకొచ్చింది.

దీంతో ఇంటిని కాపలా కాస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు గాయపడ్డారు. ఈ క్యాబ్‌ నడిపిన వ్యక్తిని నోయిడాకు చెందిన అభిషేక్‌గా గుర్తించారు. కారు ప్రహరీని ఢీకొట్టిన సమయంలో అతడితో ఒక మహిళ కూడా ఉంది. డ్రైవర్‌కు మెడికల్‌ పరీక్షలు చేయగా అతడి మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. గాయపడిన సౌరబ్‌ కుమార్‌ గౌతమ్‌ అనే సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement