శాం పిట్రోడాకు కీల‌క‌ బాధ్యతలు.. ప్ర‌ధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్‌ రిజిజు | PM Modi had predicted: Rijiju targets Congress after party reinstates Sam Pitroda | Sakshi
Sakshi News home page

శాం పిట్రోడాకు కాంగ్రెస్ కీల‌క‌ బాధ్యతలు.. ప్ర‌ధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్‌ రిజిజు

Published Thu, Jun 27 2024 2:45 PM | Last Updated on Thu, Jun 27 2024 3:24 PM

PM Modi had predicted: Rijiju targets Congress after party reinstates Sam Pitroda

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ భార‌తీయుల చ‌ర్మ రంగుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శాం పిట్రోడాకు కాంగ్రెస్ ఓవ‌ర్సీస్ అధ్య‌క్షుడిగా తిరిగిబాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై బీజేపీ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించింది. దీనిపై కేంద్రమంత్రి కిర‌ణ్ రిజుజు స్పందిస్తూ.. శాం పిట్రోడాకు కాంగ్రెస్ మ‌ళ్లీ కీల‌క బాధ్య‌తలు అప్ప‌గిస్తుంద‌ని  ప్రధాని మోదీ గ‌తంలోనే చెప్పారని అన్నారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో పోస్టు పెట్టారు. 

‘ప్రధాని మోదీ ఊహించినట్లే.. రాహుల్ గాంధీ స‌ల‌హాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్‌లుగా , ఈశాన్య ప్రజలు చైనీస్‌గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా క‌క‌నిపిస్తార‌ని వ్యాఖ్య‌లు చేసిన  వ్య‌క్తికి మ‌ళ్లీ కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు. ఈ చ‌ర్చ మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు. ఎందుకంటే దీనిని ప్ర‌ధాని మోదీ ముందుగానే ఊహించారు’. అని పేర్కొన్నారు.

ఈ మేర‌కు గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన‌ వీడియోను జత చేశారు. ‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్‌తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. 
కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు.

అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’ అని మోదీ ఆ వీడియోలో అన్నారు.

కాగా లోక్‌స‌భ‌ ఎన్నికల సమయంలో ఓ అంత‌ర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శామ్ పిట్రోడా  చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భార‌త్‌లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా పార్టీ నియ‌మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement