
కేంద్రమంత్రికి తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేశారు.
అయితే, పెద్ద మొత్తంలో పొగలుకమ్ముకోవడంతోపాటు వర్షం తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఇంకాస్త ముందుకు వెళితే ప్రమాదం అని గుర్తించిన పైలట్ ఈటానగర్‌లోని ఓ చిన్న బీడు భూముల్లో నిలిపారు. ‘సురక్షితంగా దిగాను నేను చాలా అదృష్టవంతుడ్ని. ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్న బీఎస్‌ఎఫ్ పైలట్లకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను’ అని ఆయన పీటీఐకి చెప్పారు.