కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | Dibrugarh Bound IndiGo Flight diverted to Guwahati After Technical Snag | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Published Sun, Jun 4 2023 5:15 PM | Last Updated on Sun, Jun 4 2023 5:19 PM

Dibrugarh Bound IndiGo Flight diverted to Guwahati After Technical Snag - Sakshi

గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్‌ బోర్డోలోయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌ ఫుకాన్‌, తెరష్‌ గోవాలా ఉన్నారు

ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్‌ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. 
చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement