rameshwar
-
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్‌నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Rahul Gandhi: రామేశ్వర్ ముఖంలో నవ్వులు పూయించిన రాహుల్
రామేశ్వర్.. అడ్డగోలుగా పెరిగిన టమాట ధరలు.. వాటి వల్ల తాను ఎలాంటి కష్టాలు అనుభవిస్తోంది చెబుతూ కన్నీటి పర్యంతమైన ఓ కూరగాయల వ్యాపారి. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. ‘‘నాకు ఈ సమాజంలో బతకాలని లేదు’’ అంటూ భార్యా, కూతురు పక్కన ఉండగానే రామేశ్వర్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి తన కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. ఆ సమయంలో అలా మాట్లాడొద్దంటూ ఆయనకు ధైర్యం చెప్పడమే కాదు.. ఆయన ముఖంలో చిరునవ్వులూ పూయించారు రాహుల్. వీడియో వైరల్ అయిన తర్వాత ఢిల్లీలోని ఆజాదీ మండీ కూరగాయల మార్కెట్‌ను రాహుల్ గాంధీ స్వయంగా సందర్శించి.. అక్కడి వ్యాపారుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ టైంలో రామేశ్వర్‌ను ఆయన కలవలేకపోయారు. దీంతో ఆయన్ని ఇంటికి రప్పించుకున్న రాహుల్ గాంధీ.. లంచ్ తానే స్వయంగా వడ్డించాడు. ఆయన భార్య ఉపవాసం అని తెలుసుకుని.. కావాలంటే పండ్లు తీసుకొస్తానంటూ రాహుల్ అనడమూ ఆ వీడియోలో ఉంది. ఆపై అతని కష్టాలను సావధానంగా విన్నారు కూడా. అంతేకాదు.. అతనికి ధైర్యాన్ని అందించారు కూడా. ‘‘రామేశ్వర్‌జీ గొంతు.. ఆయన ఒక్కరిదే కాదు. దేశంలో ఆయనలా బాధలు, సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్న ఎంతోమంది గొంతుక. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చర్చల్లో కూడా లేకుండా పోయింది. వాళ్ల గొంతుకను వినడమే కాదు.. సమస్యతో పోరాడుతున్న వాళ్లకు సాయం అందించడం కూడా మన నైతిక బాధ్యత అంటూ రాహుల్ గాంధీ ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీకి చెందిన రామేశ్వర్ పెరిగిన కూరగాయల ధరలు తన మనుగడకు ఎలాంటి అవాంతరం కలిగిస్తుందో చెబుతూ.. రామేశ్వర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పలువురు రాజకీయ నేతలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎతున సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. रामेश्वर जी उस भारत की आवाज़ हैं जिसकी पीड़ा, मुद्दे और चुनौतियां आज मुख्यधारा की बहस से बहुत दूर हैं। उस भारत की आवाज़ सुनना और संघर्षों का मुकाबला करने में साथ निभाना हम सब की नैतिक ज़िम्मेदारी है। उनकी सच्चाई और सादगी से भरी बातचीत का पूरा वीडियो: https://t.co/OL3hB2rQVQ pic.twitter.com/JTwUulQ4aF — Rahul Gandhi (@RahulGandhi) August 18, 2023 -
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V — ANI (@ANI) June 4, 2023 -
ఉచిత వ్యాక్సినేషన్ వల్లనే పెట్రో మంట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు. -
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్‌న్యూస్
సాక్షి, న్యూడిల్లీ: కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్‌ను అందించేందుకు ఈఎస్ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2020 మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించిన ఈఎస్ఐసీ కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్ రెండేళ్లపాటు అమలులో ఉంటుందని తెలిపారు. ఈఎస్ఐసీ వద్ద ఇన్సూర్ అయిన కార్మికులపై ఆధారపడిన కుటుంబసభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద మరణించిన కార్మికుడు లేదా ఉద్యోగిపై ఆధారపడిన అర్హులైన కుటుంబసభ్యులకు ఉద్యోగి పొందే వేతనంలో సగటున 90 శాతం మొత్తాన్ని పింఛన్ కింద చెల్లిస్తామని మంత్రి రామేశ్వర్ తేలి వివరించారు. ఈ పింఛన్ పొందడానికి రూపొందించిన అర్హతలు ఇవే. కోవిడ్ సోకినట్లుగా గుర్తించిన రోజు నుంచి మూడు నెలల ముందు సదరు కార్మికుడు లేదా ఉద్యోగి తప్పనిసరిగా ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. కోవిడ్ బారిన పడటానికి ముందు కనీసం 70 రోజుల పాటు ఆ ఉద్యోగి తరఫున ఈఎస్ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మహిళ ఉంటే పింఛన్ ప్రయోజనం భర్తకు లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్ నిబంధనల ప్రకారం కార్మికుడు మరణానంతరం అతడి భార్య తిరిగి వివాహం చేసుకునే వరకు పింఛన్‌కు అర్హురాలు. అయితే ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద పింఛన్‌కు అర్హురాలైన మహిళకు ఈ నిబంధన వర్తించదు. ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు కూడా ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పింఛన్‌కు అర్హులైన కుటుంబసభ్యుల్లో భర్త లేదా భార్య వారి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఉంది. లబ్ధిదారుడు కుమారుడైతే అతడికి 25 ఏళ్లు నిండే వరకు, కుమార్తె అయితే వారికి వివాహం జరిగే వరకూ పింఛన్ పొందడానికి అర్హులు. -
మంత్రి కుమారుడి అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్‌ను మెండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పచ్చల వ్యాపారిపై దాడి కేసులో గురువారం రామేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.