Guwahati airport
-
వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
గౌహతి: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా(Aftab Uddin Mollah)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గౌహతిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌదరి నివాసం నుంచి మొల్లాను అరెస్టు చేశారు. Assam Police has arrested Congress MLA Aftabuddin Mollah for allegedly making derogatory remarks about the priests, namgharias and saints. A case has been registered at Dispur police station under sections 295(a)/ 153A(1)(b)/505(2) IPC), confirms DGP GP Singh More details… — ANI (@ANI) November 8, 2023 గోల్పారా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హిందువులు, పూజారులపై మొల్లా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మొల్లాకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చింది. మొల్లా అభ్యంతకర వ్యాఖ్యలపై డిస్పూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V — ANI (@ANI) June 4, 2023 -
అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు అధికారులు. అసోంలోని గువాహటి లోక్ప్రియా గోపినాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. త్రిపురలోని అగర్తలాకు వెళ్లున్న హోంమంత్రి అమిత్ షా విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. విమానం అత్యవసర ల్యాండింగ్ చేపట్టిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుని బుధవారం రాత్రి బస చేశారు అమిత్ షా. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత గురువారం ఉదయం అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపట్టనున్న రథయాత్రను ప్రారంభించేందుకు వెళ్తున్నారు షా. ఈ రథయాత్రతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
స్ఫైస్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి,న్యూఢిల్లీ: ఫైలట్ల తప్పిదం వల్ల బెంగళూరులో రెండు విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. మెఘాల అడ్డుపడటంతో ఫైలట్ ల్యాండింగ్ ఎత్తును సరిగా అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బెంగళూరు, గువహాటి మధ్య నడిచే స్పైస్ జెట్ బోయింగ్ 737-800, జెట్ లైనర్ -ఎస్జీ-960 విమానం అత్యవసరంగా సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే సుమారు 1,000 ఫీట్లు తక్కువగా ల్యాండ్ అయింది. 4క్యాబిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం ఇద్దరు ఫైలట్లతో సహా 155 మంది ప్రయాణిస్తున్నారు. డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ (డీజీసీఏ) తెల్పిన వివరాల ప్రకారం.. విమానం రన్‌వే 2 లో సరిగ్గానే ల్యాండింగ్ అయింది. మేఘాల కారణంగా ఎత్తును ఫైలట్లు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ అవగాహన లోపంతో ఫ్లైట్ అధిక ఒత్తిడితో ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదని, అంతా సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజీసీఏ తెలిపింది. -
విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు
సాక్షి, కోలకతా: గో ఎయిర్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ద సమయానికే సాంకేతిక లోపం తలెత్తడంతో గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న మొత్తం 157 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోవహతి-కోల్‌కతా గోఎయిర్ జి 8546 విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని విమానాశ్రయంలోఉన్నవారు చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్ అయినట్టుగా పెద్ద శబ్దం వినగానే తాను షాక్ అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో జలపాతం.!
గువాహటి: అస్సాంలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్పోర్ట్) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్పోర్ట్ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్‌లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు చేరడం వల్ల లగేజ్ స్ర్కీనింగ్ మెషీన్లు పాడయ్యాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి వర్షపు నీరు చేరడం వల్ల పలువురు ప్రయాణికుల లగేజ్ తడిసిపోయింది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గువాహటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన ప్రయాణికుల లాంజ్‌లో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని నెటిజన్లు పౌరవిమానాయాన శాఖ మంత్రి జశ్వంత్ సిన్హాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నారు. -
జలపాతాన్ని తలపించిన గువాహటి ఎయిర్పోర్ట్
-
గాలిలో ఢీకొనబోయిన ఇండిగో విమానాలు !
గువాహటి: ఇండిగోకు చెందిన రెండు విమానాలు ఆకాశంలో దాదాపు ఢీకొనే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. గువాహటిలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చిన ఈ విమానాలు వెంటుక్రవాసిలో ఢీకొనేముప్పును తప్పించుకున్నాయి. అయినప్పటికీ ఒకదానికొకటి రాపిడి చేసుకోవడంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు బెదిరిపోయారు. దాదాపు నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించినట్టు అధికారులు తెలిపారు. గగనతలంలో సంభవించిన ఈ ఊహించిన ప్రమాదంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు తమ కళ్లు తిరిగి.. అస్వస్థతకు గురైనట్టు అనిపించిందని ఫిర్యాదు చేశారని, క్యాబిన్ సిబ్బందికి వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. గువాహటి లోకప్రియ గోపీనాథ్ బర్దోలై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి గువాహటికి ఇండిగో విమానం వస్తుండగా.. అదే సమయంలో చెన్నై వెళ్లే మరో ఇండిగో విమానం టేకాప్ తీసుకుంది. రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే, వాతావరణం బాగాలేకపోవడంతో గువాహటి వస్తున్న ఇండిగో విమానం రూట్ మార్చుకుందని, దీనివల్ల రెండు ఎదురెదురుపడ్డాయని అధికారులు తెలిపారు. -
విమానాశ్రయాల ప్రైవేటీకరణ గడువు పెంపు
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అభివృద్ధి చేసిన ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ మళ్లీ వాయిదా పడింది. చెన్నై, కోల్‌కత, లక్నో, గౌహతి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని వచ్చే నెల 17కు, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు వచ్చే నెల 12కు పొడిగించామని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిమిత్తం కంపెనీలను ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేయగలదని ఉన్నతాధికారొకరు వెల్లడించారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవడం, తాజాగా గడువు పొడిగింపు తదితర కారణాల వల్ల మొత్తం ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులంటున్నారు. కాగా వేల కోట్ల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.