స్ఫైస్‌ జెట్‌ ‌క్రాష్‌ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | Spicejet Crash Landing All Are Safe | Sakshi
Sakshi News home page

స్ఫైస్‌ జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌.. ప్రయాణికులు సురక్షితం

Published Sat, Dec 5 2020 8:02 PM | Last Updated on Sat, Dec 5 2020 8:26 PM

Spice Jet Crash Landing All Are Safe - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఫైలట్ల తప్పిదం​ వల్ల బెంగళూరులో రెండు విమానాలు క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యాయి. మెఘాల అడ్డుపడటంతో ఫైలట్‌ ల్యాండింగ్‌ ఎత్తును సరిగా అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బెంగళూరు, గువహాటి  మధ్య నడిచే స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737-800, జెట్‌ లైనర్‌ -ఎస్‌జీ-960 విమానం అత్యవసరంగా సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే సుమారు 1,000 ఫీట్లు తక్కువగా ల్యాండ్‌ అయింది.

4​క్యాబిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం  ఇద్దరు ఫైలట్లతో సహా 155 మంది ప్రయాణిస్తున్నారు. డెరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవిగేషన్‌ (డీజీసీఏ) తెల్పిన వివరాల ప్రకారం.. విమానం రన్‌వే 2 లో సరిగ్గానే ల్యాండింగ్‌ అయింది. మేఘాల కారణంగా ఎత్తును ఫైలట్లు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్‌ అవగాహన లోపంతో ఫ్లైట్‌ అధిక ఒత్తిడితో ల్యాండింగ్‌ అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదని, అంతా సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజీసీఏ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement