guvahati
-
మూడేళ్ల బాలిక.. ఏనుగంటే భయం లేకుండా ఎంత పనిచేసింది!
గువాహటి: సాధారణంగా చిన్నపిల్లలకు ఏనుగంటే మహ సరదా. మావటి వాడు ఏనుగును.. ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దానిమీద ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. ఏనుగుకు ఏదైన తినిపించి తెగ సంబరపడి పోతుంటారు. దాని తొండం చేత ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా, అస్సాంలో ఒక బాలిక ఏనుగంటే ఏ మాత్రం భయం లేకుండా దానితోనే ఫుట్ బాల్ ఆడింది. అంతటితో ఆగకుండా దాని పాలను తాగడానికి ప్రయత్నిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అస్సాంలోని గోలాఘడ్ జిల్లాలో ఒక కుటుంబం ఏనుగును పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అది వారితో ఒక అనుబంధాన్ని కల్గి ఉంది. వారు ప్రతి రోజు ఏనుగుకు మంచి ఆహరం ఇస్తారు. ఈ క్రమంలో.. ఏనుగు కూడా వారితో ప్రేమగా ఉంటుంది. ఆడుకోవడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలో యజమానికి హర్షిత బోరా అనే మూడేళ్ల కూతురు ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి ఏనుగును చూస్తూ పెరిగింది. ఆమెకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు కూడా బాలిక దగ్గరకు వెళ్లి తొండంతో ప్రేమగా నిమురుతుంది. ఈ క్రమంలో మూడేళ్ల బాలిక ఏనుగుతో ఫుట్‌బాల్ ఆడుకుంటుంది. ఆమె ఏనుగువైపు బాల్‌ను విసరగానే.. ఏనుగు తన తొండంతో ఆ బాల్‌ను అందుకుంది. ఆ తర్వత తిరిగి బాలికవైపు విసిరింది. ఈ క్రమంలో... బాలిక మరోక అడుగు ముందుకు వేసింది. ఏనుగు మోకాలంతా పొడవులేని బాలిక.. అసలు భయం లేకుండా.. ఏనుగు కింది నుంచి అటూ ఇటూ దాటూకుంటూ ఆడుకుంది. ఆ తర్వాత.. దాని పొదుగు దగ్గరకు వెళ్లి దాని పాలను తాగడానికి కూడా ప్రయత్నించింది. ఏనుగు, బాలికతో సరదాగా ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. బాలికకు ఎంత ధైర్యం..’, ‘ ఏనుగు మోకాలంతా కూడా లేదు..’, ‘ అయినా.. అప్రమత్తంగా ఉండాలి..’, ‘భలే ఆడుకుంటుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Bikaner Guwahati ExpressTrain Accident:పశ్చిమబెంగాల్లో బికనీర్–గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు. జల్పాయ్గురి జిల్లాలోని దోమోహని సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారీగా మంచు కురుస్తున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
హెల్మెట్‌ను చాక్లెట్లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్
దిస్పూర్: సాధారణంగా ఏనుగంటే అందరికి ఇష్టమైన జంతువే. మావటివారు దాన్ని తీసుకొని నగరాలలో, గ్రామాలలో తిప్పుతుంటారు. ఈ క్రమంలో, పిల్లలు దానిపై ఎక్కడానికి ఇష్టపడతారు. అదే విధంగా, దానికి అరటి పండో.. మరేదైన ఫలమో పెట్టి తెగ సంబర పడిపోతుంటారనే విషయం తెలిసిందే. అయితే, ఏనుగు కూడా, ఆఫలాన్నితిని తన తోండంతో వారిని ఆశీర్వదిస్తుందని తెలుసు. అయితే, అస్సాంలో ఒక ఏనుగు చేసిన వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన గువహతిలోని సత్గావ్ ఆర్మీ క్యాంపులో చోటుచేసుకుంది. ఈ ఆర్మీ క్యాంపు అడవికి సమీపంలో ఉంది. అయితే, ఏలా వచ్చిందో.. కానీ, ఒక గజరాజు అడవి నుంచి ఆర్మీ క్యాంపు వైపు వచ్చింది. అది పార్కింగ్ చేసి ఉన్న బైక్ దగ్గరకు చేరుకుంది. అక్కడ, బైక్‌కు తగిలించి ఉన్న హెల్మేట్ను తోండంతో తీసుకుంది. దాన్ని పట్టుకుని వింతగా చూసింది. ఇదంతా గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు దాన్ని కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఆ ఏనుగు మాత్రం.. తోండంతో ఆ హెల్మేట్ ను అమాంతం నోట్లో వేసుకొని గుటుక్కున తినేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే , దీన్ని చూసిన నెటిజన్లు.. ‘పాపం... గజరాజుకి ఏంత ఆకలేసిందో..’, ‘ బహుషా.. వెలగ పండు అనుకొని ఉంటుంది కాబోలు..’, ‘ హెల్మెట్ లేదు.. ఇక ఎలా బయటకు ఎలా వెళ్తావు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు! -
స్ఫైస్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి,న్యూఢిల్లీ: ఫైలట్ల తప్పిదం వల్ల బెంగళూరులో రెండు విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. మెఘాల అడ్డుపడటంతో ఫైలట్ ల్యాండింగ్ ఎత్తును సరిగా అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బెంగళూరు, గువహాటి మధ్య నడిచే స్పైస్ జెట్ బోయింగ్ 737-800, జెట్ లైనర్ -ఎస్జీ-960 విమానం అత్యవసరంగా సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే సుమారు 1,000 ఫీట్లు తక్కువగా ల్యాండ్ అయింది. 4క్యాబిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం ఇద్దరు ఫైలట్లతో సహా 155 మంది ప్రయాణిస్తున్నారు. డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ (డీజీసీఏ) తెల్పిన వివరాల ప్రకారం.. విమానం రన్‌వే 2 లో సరిగ్గానే ల్యాండింగ్ అయింది. మేఘాల కారణంగా ఎత్తును ఫైలట్లు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ అవగాహన లోపంతో ఫ్లైట్ అధిక ఒత్తిడితో ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదని, అంతా సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజీసీఏ తెలిపింది. -
తలనొప్పులు తెచ్చిన ఫేస్బుక్ పోస్ట్
గువహటి: రెండేళ్ల క్రితం చేసిన ఫేస్బుక్ పోస్ట్ ఓ మహిళకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. గువహటి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నా రెహనా సుల్తానా.. రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. ‘ఈ రోజు నేను బీఫ్ తిని పాకిస్థాన్‌కు మద్దతు తెలపాలనుకుంటున్నాను. నా ఆహార నియమాలను స్వేచ్ఛగా నిర్ణయించుకునే హక్కు నాకుంద’ని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పోస్ట్‌కు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ పోస్ట్‌కు సంబంధించిన ఫొటో బుధవారం ఓ స్థానిక న్యూస్ వెబ్సైట్లో కనిపించడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దీనిపై రెహనాను ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన రెహనా.. ఆ పోస్టు చేసింది తానేనని అంగీకరించారు. కానీ దానిని వెంటనే తొలగించినట్టు తెలిపారు. రెండేళ్ల క్రితం జూన్ 2017లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఆ పోస్టు చేశానని అన్నారు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సున్నా పరుగులకే అవుట్ కావడాన్ని క్రికెట్ అభిమానిగా జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. తర్వాత అలా పోస్టు చేయడం తప్పని తెలుసుకొని కొద్ది నిమిషాలకే తీసేశానని చెప్పింది. అలాగే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బిల్లును ఒక పద్యం ద్వారా విమర్శించారు. అందుకు గానూ పోలీసులు ఆమెతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఎన్ఆర్సీ విధానంలో మార్పులు తీసుకురావాలనే డిమాండ్‌తో తాను పోరాటం చేస్తున్నాని రెహనా చెప్పారు. అందుకోసమే తనపై అక్రమ కేసులు పెడుతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. -
రియల్ జ్యూస్‌కు అదిరే షాక్ ఇచ్చిన బాలిక
న్యూఢిల్లీ: 'రియల్' ఫ్రూట్ జ్యూస్ తెలుసు కదా!. ఆ కంపెనీకి ఓ తొమ్మిదేళ్ల బాలిక ఇచ్చిన షాక్‌తో దిమ్మతిరిగింది. గువాహటికి చెందిన మృంగా కే మజుందార్(9) తన తండ్రితో పాటు బయటకు వెళ్లింది. ఓ షాపు వద్ద కూతురికి రియల్ ఫ్రూట్ జ్యూస్ కొనిచ్చాడు. ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై బాలుడు స్కూల్ యూనిఫాం వేసుకుని ఉండటంతో అది కేవలం అబ్బాయిలకేనా అని తండ్రిని ప్రశ్నించి జ్యూస్ తాగడానికి నిరాకరించింది మృంగా. దీంతో ఈ విషయంపై మృంగా తండ్రి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాశారు. రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్ మహిళపై వివక్ష చూపుతున్నట్లు ఉందని లేఖలో పేర్కొన్నారు. దాంతో వెంటనే చర్యలు తీసుకున్న రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై ఉన్న ఫోటోను మార్చేసింది. మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్షపూరిత ధోరణి లేదని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది. -
క్యాంపస్ అంబాసిడర్ -వి. భానుప్రకాశ్ -ఐఐటీ - గువహటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గువహటి (అసోం).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సెకండియర్) చదువుతున్నారు.. వండాన భానుప్రకాశ్. సీఎస్ఈ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన తన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలను, ఫ్యాకల్టీ విశేషాలను వివరిస్తున్నారిలా.. సీనియర్ల సహకారం ఎంతో ఐఐటీ గువహటి క్యాంపస్ 700 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చటి గడ్డి మైదానాలతో అలరారుతుంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. మొదట్లో అంతా గజిబిజిగా ఉండేది. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయాల్లో సీనియర్లు సహాయం చేసేవారు. కారం ఎక్కువ తినే మన తెలుగు విద్యార్థులకు ఆహారం అంత రుచిగా అనిపించదు. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స చాలా బాగుంటాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులుంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శని, ఆదివారాలు సెలవు. ప్రతి విద్యార్థికీ యూజర్ నే మ్, పాస్వర్డ్ ఇస్తారు. దీని ద్వారా వెబ్‌లో లాగినై ఆన్లైన్ మెటీరియల్ పొందొచ్చు. విద్యార్థులు కోర్సుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. విద్యార్థులకు కోర్సు నచ్చకపోతే దానిని తీసేస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. ఒక్కో సెమిస్టర్లో 5 కోర్సులు, 2 ల్యాబ్ కోర్సులు ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 8.00 సీజీపీఏ సాధించాను. సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయాన్ని బట్టి, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ తెలుగు ఫ్యాకల్టీ 15 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఉగాది. శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు క్యాంపస్‌కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. మూడో ఏడాది వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రెండు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు క్యాంపస్‌కు వస్తాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో రూ.లక్ష వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. రూ.50 కోట్లకు యాహూ కొనుక్కుంది ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. వార్షిక వేతనాలు కనీసం రూ.6 లక్షలు, గరిష్టంగా రూ.1.2 కోట్లు అందుతున్నాయి. ఇటీవల మా సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన బుక్‌పాడ్ అనే స్టార్టప్‌ను.. యాహూ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ముగ్గురూ కూడా మన తెలుగువారే కావడం గర్వించదగిన విషయం. నేను కూడా కోర్సు పూర్తయ్యాక మూడు, నాలుగేళ్లు ఉద్యోగం చేస్తాను. తర్వాత సొంత కంపెనీని ఏర్పాటు చేస్తా. -
శ్రీను, సంతోషిలకు కాంస్యాలు
గువాహటి: జాతీయ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు ఎన్.శ్రీను, మత్స సంతోషి సత్తా చాటారు. ఇద్దరు కాంస్య పతకాలు గెలుపొందారు. గురువారం ఇక్కడ జరిగిన ఈ పోటీల్లో బాలుర 56 కేజీ కేటగిరీలో శ్రీను రెండు కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు. స్నాచ్‌లో 97 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచిన శ్రీను... క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తాడు. మొత్తం 216 కేజీల బరువుతో మరో కాంస్య పతకం గెలిచాడు. బాలికల 53 కేజీ కేటగిరీలో మత్స సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో కాంస్యం నెగ్గింది. స్నాచ్‌లో 69 కేజీల బరువెత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 89 కేజీల బరువెత్తి తృతీయ స్థానంలో నిలిచింది. ఏపీ అమ్మాయి మొత్తం 158 కేజీల బరువెత్తింది. -
4 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖపట్నం మీ దుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే పచ్చజెండా ఊపింది. గువహటి-సికింద్రాబాద్, హైదరాబాద్-షాలిమా ర్, షాలిమార్-యశ్వంత్‌పూర్, సాం త్రగచ్చి-కొచివేలి వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న విశాఖ-కొల్లాం(కేరళ) రైలును మరో రెండు మాసాల వరకూ పొడి గిస్తూ ఆదివారం ప్రకటన జారీ చేసింది. కొల్లాం రైలు పొడిగింపుతో అయ్యప్ప భక్తుల ప్రయాణ సమస్యలు దాదాపు తీరినట్టేనని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొల్లాం రైలును సెప్టెంబర్ నెల వరకూ మాత్రమే ప్రకటించిన రైల్వే తాజాగా అక్టోబర్, నవంబర్ మాసాల చివరి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రయాణికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 17 బోగీలుండే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చెరోబోగీతో బాటు 7 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలుంటాయి. రైలు నంబర్ 08569 విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకూ(మొత్తం 16 ట్రిప్పులు) ప్రతి ఆది, గురువారాల్లో ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, కాట్పడి, జోలార్పేటయ్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం మీదుగా కొల్లాంకు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడకు మధ్యాహ్నం 2.50 గంటలకు, గూడూరుకు రాత్రి 8.28 గంటలకు, కోయంబత్తూర్‌కు ఆ మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు చేరుతుంది. రైలు నంబర్ 08570 కొల్లాం-విశాఖపట్నం బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కొల్లాంలో బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు కోయంబత్తూర్ చేరుకునే ఈ రైలు గూడూరు స్టేషన్‌కు ఉదయం 14.50 గంటలకు, విజయవాడకు రాత్రి 7.10 గంటలకు, చేరుకునే ఈ రైలు అర్థరాత్రి 1.25 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుతుంది. గువహటి-సికింద్రాబాద్ మధ్య 9 ట్రి ప్పులు రైలు నంబర్ 07149 సికింద్రాబాద్-గువహటి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖలో రాత్రి 8.20 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గువహటి చేరుకుంటుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 9 ట్రిప్పులు నడుస్తుంది. రైలు నంబర్ 07150 గువహటి-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు గువహటిలో బయల్దేరి మంగళవారం రాత్రి 7.40 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైలు విశాఖ మీదుగా పరుగులు తీస్తుంది. దువ్వాడ, విశాఖ, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 8 స్లీపర్‌క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి. హైదరాబాద్ -షాలిమర్ మధ్య సూపర్‌ఫాస్ట్ రైలు నంబర్ 07128 స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకూ ప్రతి ఆదివారం రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటలకు బయల్దేరి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07127 షాలిమర్-హైదరాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11.05 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖ నుంచి ప్రతి బుధవారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 4 జనరల్ బోగీలుంటాయి. యశ్వంత్‌పూర్‌కు స్పెషల్ యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే ఉంటాయి. అందుకే దసరా సీజన్లో మరో ప్రత్యేక రైలును ఈ మార్గంలో నడుపుతున్నారు. షాలిమర్ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య ఈ ప్రత్యేక రైలు 8 ట్రిప్పులు నడుస్తుంది. విశాఖకు రాకుండానే ఈ రైలు దువ్వాడ మీదుగా ప్రయాణిస్తుంది. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విజయనగరం, బరంపూర్, కుర్దారోడ్, భువరనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్ల మీదుగా ప్రయాణించే ఈ రైలులో ఫస్టు, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో బాటు 11 స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. జనరల్ బోగీలు ఈ రైల్లో ఉండవు. రైలు నంబర్ 02863 షాలిమర్-యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్7 వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 11.43 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుతుంది. రెండు నిమిషాల హాల్టు అనంతరం బయల్దేరి మంగళవారం సాయంత్రం 4 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 02864 యశ్వంత్ పూర్-షాలిమర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ ప్రతి బుధవారం ఉదయం 11.15 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ప్రతి గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి దువ్వాడలో 3.32 గంటలకు బయల్దేరి ప్రతి గురువారం సాయంత్రం 4.20 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. సాంత్రగచ్చి(హౌరా) నుంచి కేరళకు మరో స్పెషల్ కేరళలోని త్రివేండ్రం సమీపంలో ఉన్న కొచువేలి స్టేషన్ నుం చి హౌరా దరి సాంత్రగచ్చి స్టేషన్‌కు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ రైలు విశాఖ మీదుగా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 02851 సాంత్రగచ్చి-కొచువేలి స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ ప్రతి శనివారం సాయంత్రం 4.05 గంటలకు సాంత్రగచ్చిలో బయల్దేరి ఆదివారం తెల్లవారు జామున 4.40గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకుంటుంది. విశాఖలో తెల్లవారు జామున 5 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 10.30 గంటలకు కొచువేలి చేరుకుంటుంది. రైలు నంబర్ 02852 కొచువేలి నుంచి హౌరా స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 3వ తేదీ మధ్య ప్రతి మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు కొచువేలిలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 11.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖలో 11.35 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాంత్రగచ్చి చేరుతుంది. ఈ రైలులో రెండు థర్డ్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి.