మూడేళ్ల బాలిక.. ఏనుగంటే భయం లేకుండా ఎంత పనిచేసింది! | Watch: Assam 3 Years Girl Plays Football With Elephant | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలిక.. ఏనుగంటే భయం లేకుండా ఎంత పనిచేసింది!

Published Sun, Jan 30 2022 7:37 PM | Last Updated on Sun, Jan 30 2022 7:37 PM

Watch: Assam 3 Years Girl Plays Football With Elephant - Sakshi

గువాహటి: సాధారణంగా చిన్నపిల్లలకు ఏనుగంటే మహ సరదా. మావటి వాడు ఏనుగును.. ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దానిమీద ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. ఏనుగుకు ఏదైన తినిపించి తెగ సంబరపడి పోతుంటారు. దాని తొండం చేత ఆశీర్వాదం కూడా తీసుకుంటారు.

ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా, అస్సాంలో ఒక బాలిక ఏనుగంటే ఏ మాత్రం భయం లేకుండా దానితోనే ఫుట్​ బాల్​ ఆడింది. అంతటితో ఆగకుండా దాని పాలను తాగడానికి ప్రయత్నిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వివరాలు.. అస్సాంలోని గోలాఘడ్​ జిల్లాలో ఒక కుటుంబం ఏనుగును పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అది వారితో ఒక అనుబంధాన్ని కల్గి ఉంది. వారు ప్రతి రోజు ఏనుగుకు మంచి ఆహరం ఇస్తారు. ఈ క్రమంలో..  ఏనుగు కూడా వారితో ప్రేమగా ఉంటుంది. ఆడుకోవడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలో యజమానికి హర్షిత బోరా అనే మూడేళ్ల కూతురు ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి ఏనుగును చూస్తూ పెరిగింది.

ఆమెకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు కూడా బాలిక దగ్గరకు వెళ్లి తొండంతో ప్రేమగా నిమురుతుంది.  ఈ క్రమంలో మూడేళ్ల బాలిక ఏనుగుతో ఫుట్​బాల్​ ఆడుకుంటుంది. ఆమె ఏనుగువైపు బాల్​ను విసరగానే.. ఏనుగు తన తొండంతో ఆ బాల్​ను అందుకుంది. ఆ తర్వత  తిరిగి బాలికవైపు విసిరింది. ఈ క్రమంలో... బాలిక మరోక అడుగు ముందుకు వేసింది. ఏనుగు మోకాలంతా పొడవులేని బాలిక.. అసలు భయం లేకుండా.. ఏనుగు కింది నుంచి అటూ ఇటూ దాటూకుంటూ ఆడుకుంది.

ఆ తర్వాత.. దాని పొదుగు దగ్గరకు వెళ్లి దాని పాలను తాగడానికి కూడా ప్రయత్నించింది. ఏనుగు, బాలికతో సరదాగా ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. బాలికకు ఎంత ధైర్యం..’, ‘ ఏనుగు మోకాలంతా కూడా లేదు..’, ‘ అయినా.. అప్రమత్తంగా ఉండాలి..’, ‘భలే ఆడుకుంటుంది..’ అంటూ కామెంట్​లు చేస్తున్నారు. 

చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్​ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement