డబ్బాతో ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు..! | Playful Elephant's 'Football' Game Halts Traffic In Assam. See Video | Sakshi
Sakshi News home page

డబ్బాతో ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు..!

Published Mon, May 22 2017 4:09 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

డబ్బాతో ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు..! - Sakshi

డబ్బాతో ఫుట్‌బాల్‌ ఆడిన ఏనుగు..!

న్యూఢిల్లీ: పక్కన పడి ఉన్న చిన్న డబ్బాతో ఓ గున్న ఏనుగు నడిరోడ్డుపై ఫుట్‌బాల్‌ ఆడింది. డబ్బాను రోడ్డుకు ఇరువైపులా అటూఇటూ తన్నుతూ ఏనుగు తిరుగుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నాలుగు కాళ్లతో డబ్బాను అటూ ఇటూ తన్నుతున్న గున్న ఏనుగును చూస్తూ దాదాపు 100 మీటర్ల దూరంలో ఆగిపోయారు వాహనదారులు.

కొందరికి ఏనుగు ఆటను ఇప్పట్లో ఆపేలా కనిపించలేదేమో వాహనాలను వెనక్కు తిప్పుకుని వెళ్లిపోయారు. ఈ సరదా వీడియోను ఓ సారి చూడండి గున్న ఏనుగు ఫుట్‌బాల్‌ ఆటను ఎంత అందంగా ఆడిందో తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement