రైలు ఢీకొని ఏనుగు, దాని బిడ్డ మృతి | Assam Train Rams Into Elephant Herd Mother Calf Dead | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఏనుగు, దాని బిడ్డ మృతి

Published Mon, Oct 10 2022 9:35 PM | Last Updated on Mon, Oct 10 2022 9:36 PM

Assam Train Rams Into Elephant Herd Mother Calf Dead - Sakshi

అస్సాం జోర్హాట్‌ జిల్లాలో రైలు ఢీకొని ఏనుగు దాని 10నెలల బిడ్డ చనిపోయాయి. ఆదివారం రాత్రి 10:50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న ఓ ఏనుగల మందను నాగినిమోరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఏనుగు దాని పిల్లను రైలు 50 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలై అవి చనిపోయినట్లు సమాచారం. ఏనుగు వయసు 21 ఏళ్లు, దాని బిడ్డ వయసు 10నెలలు అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్‌, ఇంటికో బైక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement